
హైదరాబాద్: గుంటూరు జిల్లాకు చెందిన యువ నాయకుడు కాసు మహేశ్ రెడ్డి త్వరలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం లోటస్ పాండ్ లో కాసు మహేశ్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు.. వైఎస్ జగన్ ను కలిసి చర్చించారు. పార్టీలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా కాసు మహేశ్ రెడ్డి ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు అయిన మహేశ్ రెడ్డి ఈ నెల 16న గుంటూరు జిల్లా నరసారావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు వైఎస్ జగన్ ను ఆహ్వానించి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతారు. ఆయన చేరిక వల్ల గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment