మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం

మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం

Written By news on Wednesday, December 7, 2016 | 12/07/2016


మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం
బూరుగుపూడి :
తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్దామని, ఒక్క రెండేళ్లు ఓపిక పట్టాలని వారికి తెలిపారు. 
 
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయడం లేదంటూ కాంట్రాక్టు లెక్చరర్లు వైఎస్ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనను వాళ్లు బూరుగుపూడి గ్రామం వద్ద కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ జగన్ వారికి హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత గుమ్మలూరు గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 
Share this article :

0 comments: