03 January 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు

Written By news on Saturday, January 9, 2016 | 1/09/2016


'ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కొంటోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. శనివారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు.

ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదని తమ్మినేని విమర్శించారు. రాజధాని పేరుతో తాబేదారులకు భూములు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల పొట్టకొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది


గ్రేటర్‌లో ఓటడిగే హక్కు మాకే ఉంది: పొంగులేటి
♦ హైదరాబాద్ అభివృద్ధి ముమ్మాటికీ వైఎస్సార్ ఘనతే: పొంగులేటి
♦ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు తమ పార్టీకే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా హైదరాబాద్‌కు దేశంలోనే మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. శుక్రవారమిక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, బి.సాయినాథ్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్.. నగరాభివృద్ధికి ముందుచూపుతో బాటలు వేశారని, ప్రజలకు ఎనలేని సేవలందించారని చెప్పారు.

ఆయన హయాంలోనే ఎంసీహెచ్‌ను జీహెచ్‌ఎంసీగా మార్చి శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను విలీనం చేశారని, పెద్దఎత్తున మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించారన్నారు. నగరాన్ని ఐటీ రంగంలో అగ్రభాగానా నిలిపారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత ముమ్మాటికీ వైఎస్‌దేనన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రోరైలు వంటి అనేక ప్రతిష్టాత్మక పనులను చేపట్టారని, నగరానికి కృష్ణా, గోదావరి జలాలు వచ్చేలా చేశారన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గోదావరి నీళ్లను తెప్పించిన ఘనత తమదిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఓవైపు అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే నీళ్లు తెచ్చామని చెబు తూ.. మరోవైపు ఇతర సమస్యలపై మొన్ననే అధికారానికి వచ్చామంటూ దాటవేయడం హాస్యాస్పదమన్నారు.  వైఎస్ కలలు సాకారం చేసేందుకు, రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి చేసేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 ఒకట్రెండు రోజుల్లో మేనిఫెస్టో
 జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీగా మరింత బలపడేందుకు, భవిష్యత్‌లో సుస్థిర స్థానం సాధించుకునేందుకు తమ పార్టీ పోటీ చేస్తోందన్నారు. దొడ్డిదారిలో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమ పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయమని జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో ఏకంగా 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయన ఇక్కడికి వస్తే బ్యాలెన్స్ కోల్పోతున్నారని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తేలేద ని శుక్రవారం.. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సంక్రాంతిలోగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని.. దీనిని ప్రజలు నమ్మబోరన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని...వైఎస్ కు టుంబం వెంటే ఉంటామని స్పష్టం చేశా రు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
 
తలి పాలు తాగి రొమ్ము గుద్దే రకం..!
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారని, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని.. ఇటువంటి పరిస్థితులల్లో జన్మభూమి సభలో ప్రజలు నిలదీస్తున్నారని.. ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లిం చేందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం చేస్తున్నారన్నారు.

అధికార పార్టీకి బాకాలూదుతున్న ఒక మీడియా.. ప్రజా సమస్యలపై వార్తలు రాయాలని సూచించారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందని.. అందుకే వలసలను ప్రోత్సహించేందుకు సీఎం కు యుక్తులు పన్నుతున్నారన్నారు. అయితే ఆయన చేష్టలు తమ వద్ద ఉడకబోవన్నారు. చంద్రబాబు నైజం తమకు తెలుసునని.. ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకమని మండిపడ్డారు. త్వరలో క ర్నూలు కార్పొరేషన్ ఎన్నిక లు ఉన్నాయని..  ప్ర జలు తగిన బు ద్ధి చెబుతారన్నారు.
 
వైఎస్సార్సీపీలోకి వస్తున్నామంటున్నారు..
వాస్తవానికి ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారన్నారు. అందుకే వైఎస్సార్సీపీలోకి వస్తామని..వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెప్పాలని అసెంబ్లీలో అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితి ఉంటే.. వైఎస్సార్సీపీని బలహీనం చేసే ఉద్దేశంతో అబద్ధపు ప్రచారానికి దిగుతున్నారన్నారు. అది జన్మలో సాధ్యమయ్యే పని కాదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. వ్యక్తిగత పనులతో  తన తండ్రి భూమా నాగిరెడ్డి సమావేశానికి రాలేకపోయారని, అయితే కొన్ని పత్రికలు.. పార్టీ మారాలనే ఉద్దేశంతోనే భూమా హాజరు కాలేదని రాస్తాయేమోనని భూమా అఖిలప్రియ చమత్కరించారు.

మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు


మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు
♦ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆత్మబంధువులను కలుసుకున్నాం   
♦ తెలంగాణలో పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా షర్మిల
♦ నిజామాబాద్ జిల్లా పోతంగల్ కలాన్‌లో పైలాన్‌కు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పావురాల గుట్టలో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మాట తప్పని, మడప తిప్పని వైఎస్ కుటుంబం.. ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు. ‘‘ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతృప్తి, సంతోషం మా సొంతం. ఎంత దూరమైనా, ఎంత మారుమూలన ఉన్నా ప్రతి గడపను వెతుక్కుంటూ వెళ్లాం. ప్రతి కుటుంబాన్ని పరామర్శించాం..’’ అని పేర్కొన్నారు.

వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 750 మంది మృతి చెందగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 494 కుటుంబాలను పరామర్శించారు. అనంతరం తెలంగాణలో షర్మిల 55 రోజులపాటు 8,510 కిలోమీటర్లు పరామర్శ యాత్ర చేపట్టి 256 కుటుంబాలను కలిశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్ర ముగించా రు. ఈ సందర్భంగా షర్మిల.. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొండా రాఘవరెడ్డితో కలసి వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి స్మారకార్థం ఇడుపులపాయలో నిర్మించిన తరహాలో నిర్మించనున్న పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

ఆ మాటకు కాంగ్రెస్ రాజకీయ రంగు
‘‘వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాటిచ్చారు. అది వైఎస్‌కు కొడుకు హోదాలో ఇచ్చిన మాట. కానీ దానికి కాంగ్రెస్ రాజకీయ రంగు పూసింది’’ అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా కుటుంబమంతా స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలసి.. ఓదార్పు యాత్ర చేస్తామని వేడుకొన్నాం. కానీ వీల్లేదన్నారు.. బెదిరించారు. అయినా చనిపోయిన వారి కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న మా  కుటుంబ సంకల్పం చెక్కుచెదరలేదు. అందుకు కాంగ్రెస్ వాళ్లు టీడీపీతో కలసి జగనన్న మీద కేసులు పెట్టారు. చార్జిషీట్లు వేశారు. 16 నెలలు జైల్లో పెట్టారు.

ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుకొంటూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కుటుంబాలను పరామర్శించాం. వారి బాధలో పాలుపంచుకొని, వారి త్యాగాన్ని, అభిమానాన్ని గుర్తించాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను వెళ్లిన ప్రతి పల్లె, ప్రతి వాడలో ఆప్యాయంగా స్వాగతం పలికారు’’ అని షర్మిల వివరించారు.

 వైఎస్ ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు
 దివంగత రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని షర్మిల చెప్పారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 పథకాల్లో ఆయన జీవించే ఉంటారన్నారు. దళితులకు 23 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. జలయజ్ఞం ద్వారా 25 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. పేదలకు 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. ‘‘వైఎస్ చనిపోయి ఆరేళ్లు అయినా ఈనాటికీ  ఆయన పథకాలను అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే ఆ పథకాల్లో  ఎంతో గొప్పతనం ఉంది. అందుకే అంటున్నా.. వైఎస్‌కు మరణం లేదు’’ అని చెప్పారు.

 వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
 వైఎస్ మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను కలుసుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ‘‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక 750 మంది చనిపోయారు. అది సామాన్యమైన విషయం కాదు. నాన్నను ప్రాణం కంటే మిన్నగా అభిమానించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ కుటుంబం శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది’’ అని షర్మిల అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, నాయుడు ప్రకాశ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మెరక శ్రీధర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సాయినాథ్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, డాక్టర్ కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ముగిసిన పరామర్శ యాత్ర
వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. 2014 డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ నుంచి మొదలైన పరామర్శ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. 55 రోజులపాటు 8,510 కిలోమీటర్ల మేర ప్రయాణించి 256 కుటుంబాలను కలిసిన ఆమె.. శుక్రవారం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్రను ముగించారు. యాత్ర చివరి రోజున జిల్లాలో షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. కోటగిరి మండలం పోతంగల్‌లో గౌరు నడిపి వీరయ్య, గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నీరడి పోచయ్య, పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కలాన్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ కోసం చనిపోయినవారి  స్మారకార్థం పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఒక మొక్క నాటారు. ఆ ప్రాంతాన్ని చక్కటి ఆహ్లాదకరమైన పార్కుగా మలుస్తామని చెప్పారు.

షర్మిలకు అభినందనలు: పొంగులేటి
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పరామర్శ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి షర్మిలకు అభినందనలు తెలిపారు. మండుటెండలు.. చలి.. జోరువానలు సైతం లెక్కచేయకుండా ఇచ్చిన మాట కోసం షర్మిల తమ ఆత్మబంధువులను కలిశారన్నారు. తెలంగాణలో మొదటిసారి ఓదార్పు యాత్ర కోసం వరంగల్ వెళ్తే.. వైఎస్ దయాదాక్ష్యిణ్యాలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల సూచనలతో కొన్ని శక్తులు అడ్డుకున్నాయని పొంగులేటి దుయ్యబట్టారు. ఐదు సంవత్సరాలైనా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబాన్ని పరామర్శించారన్నారు. మహానేత కుటుంబానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు

అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

అనంతపురం:  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2016 డైరీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్ కి వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులాపతి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసం నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం నాలుగో రోజుకు చేరుకుంది.

ఒక్కటై పోరాడుదాం!


ఒక్కటై పోరాడుదాం!
బాబు మోసాలపై వైఎస్సార్ సీీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

 అనంతపురం రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎన్నికలప్పుడు ఏ హామీలనైతే ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చేలా ఆయనపై గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బుద్ధిరావాలంటే అందరూ ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. నాలుగో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజున బత్తలపల్లి జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల, చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో, మూడు మాటల్లో చెప్పాలంటే మోసం..మోసం..మోసం అని హర్షధ్వానాల మధ్య జగన్ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 ‘అనంత’లోనే 100కు పైగా రైతుల ఆత్మహత్యలు
 అనంతపురం జిల్లాలో ఇప్పటికే మూడు విడతల రైతు భరోసా యాత్రలు చేశా. ఇప్పుడు నాలుగో దఫా యాత్ర చేస్తున్నానంటే కారణం ఈ ఒక్క జిల్లాలోనే వంద మందికి పైగా మరణించారు. తన పాలనలో రైతులు ఎలా బతుకుతున్నారనేది చంద్రబాబుకు అర్థం కావాలని, చేనేతలు ఎలా జీవిస్తున్నారనేది అర్థం కావాలని ఈ యాత్ర చేస్తున్నా. ఎన్నికలప్పుడు ఇంట్లో ఎప్పుడు టీవీని ఆన్ చేసినా ఏ గోడపై రాతలు చూసినా ఒక్కటే కనిపించేవి.. ఆనాడు చంద్రబాబు మైక్ పట్టుకుని సభల్లో మాట్లాడింది కూడా ఒక్కడే. అదేమిటంటే.. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి..బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఏ అడ్వర్టైజ్‌మెంట్ చూసినా ఈ మాటలే వినిపించేవి. గ్రామాల్లో పెద్దపెద్ద ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి ఇవే మాటలు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని ఆ ఫ్లెక్సీలపై కనిపించేవి. కానీ ఎన్నికల తర్వాత ఇవన్నీ అమలయ్యాయా అని ప్రశ్నిస్తున్నా.. (లేదు..లేదు..అనే కేరింతలు)

 బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు..
 ఈ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారమ్మా అని అంటే ‘బాబు వచ్చాడన్నా.. గెలిచాడన్నా..మాకు మూడు పంగనామాలు పెట్టాడన్నా’  అని అంటున్నారు. చదువుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే ‘బాబు వచ్చాడన్నా..ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడన్నా.. కానీ మాకు మాత్రం పోస్టింగులు లేవన్నా’ అని అంటున్నారు. డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటుతున్నా పోస్టింగులు ఇవ్వడం లేదని ఆ పిల్లలు వాపోతున్నారు అని జగన్ ఆవేదనగా అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికలప్పుడు టీడీపీ నాయకులు, చంద్రబాబు స్వయంగా మైకులు పట్టుకుని ప్రచారం చేసుకున్నారు.

కానీ బాబు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడమేమో కానీ ఉన్నవి పీకేస్తున్నారని అందరూ వాపోతున్నారు. ‘బాబొచ్చాడు..35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించాడు. బాబొచ్చాడు.. దాదాపు 40 వేల మంది ఆదర్శ రైతులను ఇంటికి పంపాడు. బాబొచ్చాడు.. 40 వేల మంది అంగన్‌వాడీ కార్మికులు సమ్మె చేస్తావున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాడు’ అని జగన్ అన్నారు. బాబేమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు గానీ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోయారు.

 ఇన్‌పుట్‌సబ్సిడీపై మాటమార్చిన సీఎం..
 ఎన్నికల సమయంలో 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తానని జిల్లాలన్నీ తిరిగి చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే జిల్లాల్లో రైతులందరినీ ఆదుకుంటా.. ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తా అని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యా క మాత్రం మాట మార్చారు. సాక్షాత్తూ అసెం బ్లీ వేదికగా 2013-14 ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వ ను అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారు. 2013-14 ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకపోగా 2014-15 ఇన్‌పుట్ సబ్సిడీని కూడా బాగా తగ్గించివేశారు. ఈ సంవత్సరంలో రూ.736 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే రైతులకు మాత్రం రూ.224 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

2015-16 సంవత్సరానికి కరువు మండలాలను ప్రకటించండి. రైతులంతా అల్లాడిపోతున్నారు అని కోరితే చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు ఆయా జిల్లాలన్నీ తుపాను వచ్చి అతలాకుతలం అయిన తర్వాత వర్షాలు బాగా పడిన తర్వాత మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. వర్షాలు పడిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబే. అంతటి దారుణంగా చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అర్థమవుతోంది. రైతులతోనే కాదు చేనేత కార్మికుల జీవితాలతో కూడా తాను ఎలా చెలగాటమాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావాలని మరణించిన వారి ప్రతి ఇంటికి మనం వెళ్తున్నాం.  ఆ కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని ఎలుగెత్తిచాటుతున్నాం. చని పోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహా రంగా ఇస్తామని ప్రకటించారు కదా ఇచ్చారా అని అడిగితే ఇవ్వలేదనే అన్ని చోట్లా చెబుతున్నారు. అలా చనిపోయిన వారి కుటుంబాల జీవితాలతో కూడా బాబు ఆడుకుంటున్నాడు.

 మూడో వంతు వడ్డీ కూడా మాఫీ కాలేదు..
 రుణమాఫీ కాదు కదా రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ.87,612 కోట్ల మేర రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల్లో ఆ రుణాలపై 14 శాతం వడ్డీ పెరిగింది. రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి చెల్లించని నేరానికి ఈ రోజు ఆ రైతులపై ఈ అపరాధపు వడ్డీ భారం రూ.20 వేల కోట్లు పడింది. ఆ 20 వేల కోట్లను బ్యాంకులు వసూలు చేస్తామంటున్నాయి. అయితే రెండేళ్లకు కలిపి చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం రూ.7,300 కోట్లు మాత్రమే.

అంటే వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని విధంగా చంద్రబాబు గారి రుణమాఫీ పథకం అమలుజరుగుతోంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇళ్లను కట్టిస్తామని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీలేమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి అని నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాను. రైతులు, చేనేత కార్మికుల జీవితాలను వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చారని చెప్పాను. నేనలా మాట్లాడినప్పుడు రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు చెప్పా రు. అందుకే అలా చనిపోయిన వారి ప్రతి కుటుంబం వద్దకు నేను వెళ్తాను. అప్పటికైనా వారి కష్టాలు నీకు అర్థమవుతాయేమో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి అని అసెంబ్లీలో ఆరోజు చెప్పాను.’’ అని జగన్ పేర్కొన్నారు.

 ఐదు కుటుంబాలకు పరామర్శ: అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన నాల్గోవిడత రైతు- చేనేత భరోసా యాత్ర మూడో రోజు శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఐదు కుటుంబాలను పరామర్శించారు.

ప్రాణం ఉన్నంతవరకూ జగన్ తోనే

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016


కర్నూలు : నీతిమాలిన రాజకీయాలకు తెర తీస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం  నిప్పులు చెరిగారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని.. ఈ నేపథ్యంలో పార్టీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని వారు ఆరోపించారు.
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నుంచి ఎవరూ మరో పార్టీలోకి వెళ్లరని వారు తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకూ తాము వైఎస్ జగన్ తోనే ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని వారు తెలిపారు.

Popular Posts

Topics :