10 January 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?

Written By news on Thursday, January 14, 2016 | 1/14/2016


విశాఖ సదస్సు ప్రహసనమే..
ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?: బొత్స

 సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం అవసరమే. అయితే, అంతకు ముందు ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేంతగా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా లేకుండా మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ సదస్సు ఓ ప్రహసనమన్నారు.ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టం చేయాలని తమ పార్టీ ఎన్నోమార్లు ప్రశ్నించినప్పటికీ వారి నుంచి సమాధానం రావడం లేదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో ఐదారుసార్లు పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించారు. రూ.లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన హయాంలో వెయ్యి కోట్ల పరిశ్రమ ఒక్కటైనా రాష్ట్రానికి వచ్చిందా? వస్తే దాని పేరు చెప్పమనండి’’ అని అన్నారు. విశాఖపట్నం జరిగిన పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో వంద స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారని.. అది సాధ్యమా అని  బొత్స ప్రశ్నించారు. గత రెండేళ్ల కాలంలో భారతదేశం 7 శాతం వృద్ధి సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11.7 శాతం వృద్ధి సాధించిందని చెబుతున్నారని.. అదెలా సాధ్యమో తమకు అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్


తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని ఆయన అన్నారు.
పాడిపంటలతో, పైరుపచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నానని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే..

Written By news on Wednesday, January 13, 2016 | 1/13/2016


'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. బుధవారం నాడు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. వైఎస్ఆర్ సీపీ సంస్థాగతంగా బలోపేతమయ్యేవరకు వేచిచూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటూనే ప్రజల పక్షాన పోరాడుతామని పొంగులేటి చెప్పారు. ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తోన్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వ మద్ధతుతో కాంగ్రెస్ పార్టీ, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఆ పార్టీలు వెనుకాడటం లేదన్నారు.
ఆ పార్టీలు ఈ పోటీలో డబ్బుతోనే నెగ్గాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయాలని, అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కారణాలతోనే ఫిబ్రవరి 2న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి వివరించారు. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైనప్పుడు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీ క్షణం కూడా వెనుకాడదన్నారు.
దివంగత నేత వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేశారని, సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రైతులను ఆదుకున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్, ఫీ రీయింబర్స్ మెంట్ ద్వారా లక్షల మందికి ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తివిద్యా కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించారని దివంగత ముఖ్యమంత్రి సేవల్ని కొనియాడారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా అవతరించడానికి సంస్థాగతంగా బలమైన యంత్రాంగాన్ని నిర్మించుకుంటోందని అందుకే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర

Written By news on Tuesday, January 12, 2016 | 1/12/2016


ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం ముగిసింది.

ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటించారు. మొత్తం 28 మంది, రైతు చేనేత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో గ్రామాగ్రామాన వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు.

రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్


రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్
హైదరాబాద్‌: నగరి ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన అంశంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. (లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)

నిబంధన 340 ప్రకారం రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారని, కానీ ఈ నిబంధన ప్రకారం సభ్యుడిని ఒక సెషన్ మాత్రమే సస్పెండ్ చేయడానికి వీలు ఉంటుందని ఆయన తెలిపారు. సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే సభలో కచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలను పరిశీలించి రోజాపై సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కితీసుకోవాలని లేఖలో స్పీకర్‌ను వైఎస్ జగన్‌ కోరారు.
ఆంగ్లంలో రాసిన ఈ ఆరు పేజీల లేఖలో నిబంధన 340 గురించి సవివరంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. నిబంధన 340 కింద చేపట్టే ప్రతి తీర్మానంపై స్పీకర్ తప్పనిసరిగా ఓటింగ్ చేపట్టాల్సి ఉంటుందని, ఆ తీర్మానం ప్రకారం సభ్యుడిపై వేసే సస్పెన్షన్ కాలపరిమితి.. ఆ సభ సమావేశాల గడువుకు మించి ఉండరాదని తెలిపారు. బిజినెస్‌ రూల్స్ ప్రకారం ఈ తీర్మానాన్ని చేపట్టాల్సి ఉంటుందని, ఒకవేళ సభలోని 100శాతం సభ్యులు కోరిన సందర్భంలోనూ ఓటింగ్ లేకుండా ఈ తీర్మానాన్ని ఆమోదించడం చట్టవిరుద్ధం అవుతుందని వైఎస్ జగన్‌ లేఖలో స్పష్టం చేశారు. 2015 డిసెంబర్ 18న నిబంధన 340, సబ్‌రూల్ కింద శాసనసభ వ్యవహారాల మంత్రి ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలని తీర్మానం ప్రవేశపెట్టారని, నిజానికి ఈ నిబంధన కింద జరుగుతున్న సమావేశాల గడువు వరకే సస్పెన్షన్ విధించే అవకాశముందని తెలిపారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించాల్సి ఉండాల్సిందని పేర్కొన్నారు. కానీ ఈ తీర్మానాన్ని ఆమోదించడం దురదృష్టకరం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే 'బ్లాక్ డే' అని వైఎస్ జగన్‌ లేఖలో అన్నారు.

ఈ తీర్మానం విషయంలో తాము చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే శాసనసభ వ్యవహారాల మంత్రి అసెంబ్లీయే సుప్రీమని, బిజినెస్ రూల్స్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారని చెప్పారు. 1994-99 మధ్యకాలంలో ఐదేళ్లు ఏపీ స్పీకర్‌గా పనిచేసిన ఆ మంత్రి ఈ విషయంలో నిబంధనలు అసంబద్ధమైనవని ఎలా అనగలరు? అంటూ ప్రశ్నించారు. అలాగైతే నిబంధనలు ఉన్నాయి ఎందుకు? లోక్‌సభలోనూ నిబంధనలు ఎందుకు పెట్టారు? ఉల్లంఘించడానికే నిబంధనలు తీసుకొచ్చారా? అని లేఖలో వైఎస్ జగన్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 లేదా ఆర్టికల్ 118 ప్రకారం బిజినెస్ రూల్స్ మేరకు నడుచుకుంటాయని లేఖలో తెలిపారు. ఈ  సందర్భంగా లోక్‌సభకు సంబంధించిన పలు బిజినెస్ రూల్స్ ను ఆయన లేఖలో ప్రస్తావించారు.

బిజినెస్ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తూ పక్షపాత రహితంగా అసెంబ్లీ సమావేశాలు నడిపించాల్సిన అవసరముందని, ప్రస్తుతమున్న నిబంధనలు సమగ్రంగా లేవని భావిస్తే.. ఆ విషయాన్ని రూల్స్ కమిటీకి నివేదించి.. అవసరమైన సవరణలు తీసుకువచ్చి.. ఆ వివరాలను సభ్యులందరికీ తెలియజేయాలని, నిబంధనలను సమర్థంగా అమలుచేయాలని వైఎస్ జగన్ స్పీకర్‌ను కోరారు. అంతేకాని ఏపీ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ అసంబద్ధమని పేర్కొనడం చట్టబద్ధ పాలనను విస్మరించడమే అవుతుందని, అలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని జగన్ పేర్కొన్నారు.

'ఏపీఎల్ఏ బిజినెస్ రూల్స్‌లోని 340 (2) నిబంధనను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ నేను 2015 డిసెంబర్ 19న మీకు లేఖ రాశాను. ప్రస్తుత లేఖ ద్వారా వెలుగులోకి తెచ్చిన అంశాలన్నింటినీ పరిశీలించి.. బిజినెస్ రూల్స్‌ను గౌరవించి శ్రీమతి రోజాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మరోసారి మిమ్మల్ని కోరుతున్నారు. 340 (2) నిబంధన ప్రకారం రోజాపై విధించిన సస్పెన్షన్ ఆ నిబంధనకే విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం' అని లేఖలో స్పీకర్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

21న కాకినాడలో వైఎస్ జగన్ యువభేరీ


21న కాకినాడలో వైఎస్ జగన్ యువభేరీ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈ నెల 21న కాకినాడలో యువభేరీ నిర్వహించనున్నారు. కాకినాడలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో యువభేరీ ఏర్పాట్లపై సమావేశం జరిపారు. వైఎస్ జగన్ యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన నాయకులను కోరారు.

అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర


అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నేడు ఏడో రోజు కొనసాగుతుంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటిస్తారు. సీకేపల్లి మండలం వెంకటాంపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం బసంపల్లిలో రైతు సోమశేఖర్ కుటుంబాన్ని కలుసుకుని వారిని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. రెండు కుటుంబాలను పరామర్శించడంతో అనంతపురంలో వైఎస్ జగన్ చేపట్టిన నాలుగో విడత రైతు భరోసాయాత్ర ముగియనుంది.

ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం


ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం
► పేదలు చదువుకు దూరం కాకుండా చూస్తాం
►  రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►  ఆరోరోజు 6 కుటుంబాలకు జగన్ భరోసా

 (రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) ‘‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. రైతులు, చేనేతలు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి విద్యార్థులకు నేను అండగా ఉంటా.

  మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చూస్తా’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
 అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా ఇల్లులేని పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఆయన వాగ్ధానం చేశారు.

  రైతు భరోసా యాత్రలో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని కొడిమి, నరసనాయనికుంట, కోనాపురం, కనగానపల్లి, పాత పాళ్యం గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు చిన్నరామాంజనేయులు, రైతులు కేతావత్ లక్ష్మన్ననాయక్, లక్ష్మానాయక్, నరేంద్ర, కరుణాకర్, సుధాకరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోరోజు భరోసాయాత్ర సాగిందిలా..

 ఒక్క పైసా మాఫీ కాలేదు..
 ఒక్క రూపాయీ పరిహారం అందలేదు...

 కొడిమి గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు చిన్న రామాంజనేయులు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘అప్పులు ఎక్కువై నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 80 వేలు అప్పు తెచ్చుకున్నాం. నోటీసులు వస్తే వడ్డీ కట్టాం. చంద్రబాబు చెప్పినట్లుగా రుణమాఫీ ఒక్కపైసా కాలేదు. పెట్టుబడి పెట్టే శక్తి లేక మగ్గం నేయడం ఆపేశా. ఇప్పుడు ఇతరుల కూలీకి వెళ్లి చీరలు నేస్తున్నా. ఐదారు రోజులు కష్టపడితే రూ. 300 కూలీ వస్తుంది.

  నా భర్త చనిపోయి 7 నెలలు అవుతోంది. ఆర్‌డీఓ వచ్చినా ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అందలేదు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేస్తే జన్మభూమి కమిటీ వాళ్లు తిరస్కరించారు’ అని మృతుడి భార్య వరలక్ష్మి జగన్ వద్ద వాపోయింది. ‘వాళ్ల ఇష్టమొచ్చినట్లు చేస్తే ఎలా? చనిపోయింది నిజమా? కాదా? అని తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయం.

  మీకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.’ అని జగన్ అన్నారు. ‘పూటగడవడమే కష్టంగా ఉంది. ఈ సమయంలో పిల్లలను చదివించడం నాకు భారం అవుతోంది’ అంటూ మృతుడి భార్య కన్నీరుమున్నీరయ్యింది. ‘మేం అధికారంలోకి వచ్చాక పేదలు విద్యకు దూరం కాకుండా చూస్తాను. మీ పిల్లల చదువుల బాధ్యత రాప్తాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తీసుకుంటారు’ అని జగన్ హామీ ఇచ్చారు.

 చేతగాని హామీలెందుకు చంద్రబాబూ?
 నరసనాయని కుంట గ్రామంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు లక్ష్మన్న నాయక్, లక్ష్మానాయక్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. రైతు లక్ష్మన్న నాయక్ భార్య ప్రమీలాబాయ్ తాము పడుతున్న కష్టాలను కన్నీళ్లతో వివరించింది.  ‘నా కుమారుడు, కుమార్తె, భర్త చనిపోవడంతో దిక్కులేని దాన్ని అయ్యాను. ఉన్న ఒక్క కుమారుడు డిగ్రీ వరకు చదివాడు. 8 ఎకరాల పొలం ఉన్నా.. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.

  పొలంపై లక్ష రూపాయల అప్పు ఉంది. డ్వాక్రా రుణం కొంత ఉంది. కొత్తగా రుణం తీసుకుందామంటే ఎక్కువ సంఘం సభ్యులకు రూ. 10 వేలకు మించి అప్పులివ్వడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సంఘంలో ఒక్కొ సభ్యురాలికి రూ. 50 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. నా భర్త చనిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు’ అంటూ భోరున విలపించింది. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తాను తల్లీ. ఈ ప్రభుత్వం సాయం చేయకపోయినా మేం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లో మీకు ఆర్థిక సాయం అందిస్తాం’ అంటూ ఆమెను జగన్ ఓదార్చారు.

  అనంతరం అక్కడి నుంచి ఆదే గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మానాయక్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయామని, క్రాప్, డ్వాక్రా, బంగారు రుణాలేవీ మాఫీ కాలేదని జగన్ వద్ద మృతుడి భార్య ఈశ్వరమ్మబాయి వాపోయింది. చేతగాని హామీలు ఎందుకివ్వాలని ఆమె చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వం అంతా మోసం చేస్తోంది. రైతు, డ్వాక్రా, బంగారు రుణాలు మాఫీ అని మోసం చేసింది. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. పింఛన్లన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏదీ చేయలేదు. అంత మోసం.. మోసం.. మోసం..’ అంటూ ప్రభుత్వతీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు...
 కనగానపల్లి మండలంలో కోనాపురం గ్రామంలో అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు నరేంద్ర కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘ఐదు ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు వేసినా.. ఒక్కదాంటో ్లనూ నీళ్లు పడలేదు. రూ. 50 క్రాప్‌లోనుకు గానూ వడ్డీ రూ. 18 వేలు కట్టాల్సి వచ్చింది. కానీ  రూ. 10 వేలు మాత్రమే మాఫీ అయ్యిం ది.

  భర్త చనిపోయి ఆరు నెలలు అవుతోంది. ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓలు వచ్చినా.. ప్రభుత్వ సాయం అందలేదు. జన్మభూమి సమావేశాల్లో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. మీరే ఆదుకోవాలి.’ అంటూ ఆమె జగన్‌ను వేడుకున్నారు. ‘ఈ ప్రభుత్వం చేతనైతే పేదలకు న్యాయం చేయాలి. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. మేం అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని వాళ్లందరికీ పార్టీలకు అతీతంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం’ అని ఆమెకు జగన్ భరోసా ఇచ్చారు.

 ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు..
 కనగానపల్లి మండలం పాతపాళ్యం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎం.సుధాకరరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘అప్పుచేసి పొలంలో బోర్లు వేశాం. నీరు పడలేదు. పంటలు పండలేదు.  బ్యాంకులో రూ.80 వేల రుణం ఉంది. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. డ్వాక్రా రుణం రు. 20 వేలు ఉంది. అది కూడా మాఫీ కాలేదు. అప్పుల భారంతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.’ అని సుధాకరరెడ్డి భార్య  సావిత్రమ్మ జగన్ వద్ద వాపోయారు. బిడ్డల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని జగన్ భరోసా ఇచ్చారు.

 అధైర్య పడకండి అండగా ఉంటా...
 కనగానపల్లెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. ‘20 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్లుగా వర్షాలు లేక బోర్లలో నీళ్లు ఎండిపోయాయి. పంటలు వేయడం లేదు. రెండు లక్షల బ్యాంకు రుణం ఉంది. దీంతోపాటు ప్రైవేటు అప్పులు చేశాం. అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.’ అని కరుణాకర్ తండ్రి నెట్టం కేశన్న వాపోయాడు. ‘మీకు అండగా ఉంటా. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తా. మీరు అధైర్య పడొద్దు’ అంటూ జగన్ ఓదార్చారు.

నాలుగు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, January 11, 2016 | 1/11/2016


అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. నారాయణపురం, తపోవనం, రాచానపల్లి, సిండికేట్ నగర్ మీదుగా వైఎస్‌ జగన్‌ పర్యటన సాగింది.

మామిళ్లపల్లిలో వైఎస్ జగన్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేశారు.    కోనాపురం చేరుకుని రైతు నరేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కనగానపల్లెలో కరుణాకర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. తగరకుంటలో వైఎస్ జగన్ కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పాతపాలెంలో రైతు సుధాకర్‌ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రైతు భరోసా యాత్రకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం


'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం కల్తీ మద్యం తయారీకి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.పార్థసారధి ఆరోపించారు.

విజయవాడలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ మద్యం మరణాలు జరుగుతున్నాయన్నారు. ఎక్సైజ్ మంత్రి ఇంటికి సమీపంలోనే కల్తీ మద్యం సామాగ్రి లభించడంతో... రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుని కల్తీ మద్యం మరణాలను అరికట్టాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

అనంతలో ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర


అనంతలో ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.

తొలుత కొడిమి గ్రామంలో చేనేత కార్మికుడు రామంజనేయులు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం కోనాపురం గ్రామంలో రైతు నరేంద్ర కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. అదేవిధంగా పాతపాలెంలో కూడా రైతు సుధాకర్‌ రెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

వైకాపా కువైట్ సహాకారంతో స్వస్ధలం చేరిన సందిబొయిన చిన్న సుబ్బరాయుడు మృతదేహం

Written By news on Sunday, January 10, 2016 | 1/10/2016


కువైట్: వైయస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం గంగన్న పల్లి పంచాయతి మల్లాయపల్లి కు చెందిన ఎస్. చిన్న సుబ్బరాయుడు (40) కోటిఆశలతో కువైట్ కుగత 8 నెలల క్రితం కువైట్ వెళ్ళారు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. 06-01-16 న ఆరోగ్యం భాగా లేక ఆకస్మికంగా మరణించారు. ఈ విషయన్ని చిన్న సుబ్బరాయుడు బంధువులు కడప శాసన సభ్యులు అంజాద్ బాష గారికి గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారి దృష్టికి తీసుకోని వచ్చిన వెంటనే వైకాపా కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి గారికి టెలిఫోన్ చేసి చిన్న సుబ్బరాయుడు మృతదేహాన్ని తొందరగా ఇండియా పంపాలని ఆభ్యర్ధించిన్నారు. బాలిరెడ్డి గారు వెంటనే స్పందించి 09-01-16న మృతదేహాన్నిపంపడము జరిగిందని ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపిన్నారు.కువైట్ భారత రాయబారి కార్యాలయం ద్వారా చట్టబద్ధమైన పనులన్నీ కో-కన్వీనర్ యం.వి. నరసారెడ్డి గారు పూర్తి చేశారు. మద్రాస్ నుండి స్వస్ధాలం వరకు ఉచితంగా మృతదేహం తెచ్చేందుకు కువైట్ రెడ్డిస్ స్నేహాహస్తం అధ్యక్షులు అర్. శ్రీనివాసులు రెడ్డి కమిటీ ద్వార ఇచ్చారని. టికెట్ డబ్బులు బంధువులు మిత్రులు భరించారని తెలిపారు. కన్వీనర్ యం. బాలిరెడ్డి,
కో కన్వీనర్లు గోవిందు నాగారాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు యన్. మహేశ్వర్ రెడ్ది, యం. చంద్రశేఖర్ రెడ్డి, పి. సురేష్ రెడ్డి, గడికోట రాజ, యన్ చంద్ర, షేక్ గఫార్, సయ్యద్ నియాజ్, సయ్యద్ సజ్జాద్, జి. ప్రవిణ్ కుమార్ రెడ్డి, మరియు ఆర్. శ్రీనివాసుల రెడ్డి, యల్లా రెడ్డి, యం. భాస్కర్ రెడ్డి గార్లు ఎస్. చిన్న సుబ్బరాయుడు పార్ధివ శరీరాన్ని సందర్శించి ఘననివాళిలు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారని ఈ కార్యక్రమాని వచ్చిన వైకాపా సభ్యులు చిన్న సుబ్బరాయుడు కుటుంబానికి 18 వేల ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు ఈ సందర్భముగ శాసన సభ్యులు అంజాద్ బాష బాలిరెడ్డి గారికి. నరసా రెడ్డి గారికి రెడ్డీస్ స్నేహా హాస్తం గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ కువైట్ లో ఉన్న తెలుగు వారిని ఆపన్నహస్తం ఇస్తున్న వైకాపా సభ్యులకు జిల్లా ప్రజల తరపున అభినిందించారు.

బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను మూడు ముక్కల్లో చెప్పవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా మోసం మోసం మోసం పద్దతుల్లోనే జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశారని అన్నారు.

ఆదివారం అనంతపురం జిల్లాలోని బండమీదపల్లిలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటో, ఎన్నికలు పూర్తయ్యి ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న చేతలేమిటో ప్రజలు గమనించి గట్టిగా ప్రశ్నించాలని అన్నారు. మోసపూరిత హామీలు ఇవ్వడం వల్లే వాటిని నమ్మి అమాయక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఓపక్క రైతులంతా ఇబ్బందులు పడుతూ కష్టాల్లో మగ్గుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చంద్రబాబుకు అవేం కానరావడం లేదన్నారు.

సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రైతులు సంతోషంగా ఉన్నారని అబద్దాలు ఆడారని చెప్పారు. ఎన్నికల సమయంలో లైట్లు పెట్టి మరీ ప్లెక్సీలు కట్టారని, పెద్ద పెద్ద అక్షరాలతో మోసపూరిత హామీలు రాశారని గుర్తు చేశారు. రైతుల రుణ మాఫీలు కావాలన్నా, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా బాబు రావాలంటూ ప్లెక్సీలు పెట్టారని తీరా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ హామీలు మరిచారని అన్నారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా చేస్తానని, అన్ని పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, ఒక్క ఇళ్లయినా కట్టించారా అని నిలదీశారు.
            ఇంకా ఏమన్నారంటే..
  • చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పవచ్చు..
  • రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు
  • పావలా వడ్డీలు రద్దు చేసి భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారు.
  • వడ్డీలకు కూడా సరిపోని మాఫీలు చేసి మొత్తం రుణాలు మాఫీ చేసినట్లు మభ్య పెడుతున్నారు.
  • అక్కా చెల్లెళ్ల రుణాల మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేశారు
  • జాబురావాలంటే బాబు రావాలని చెప్పి యువతను మోసం చేశారు.
  • రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారు
  • అందరి ఇళ్లలో కలర్ టీవీలు పెట్టిస్తానని మోసం చేశారు.
  • బాబు పాలన ప్రతి అడుగులో మోసం మోసం మోసం మాత్రమే ఉంది
  • కరువు సమయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేశారు
  • చంద్రబాబు ముందే కరువు మండలాల జాబితా ఇచ్చి ఉంటే ప్రజలకు ఇన్ పుట్ సబ్సిడీ వచ్చి ఉండేది
  • శ్రీశైలంలో కనీస నీటి మట్టం లేకుండానే ఎలా రాయలసీమకు నీళ్లు ఇస్తారో చెప్పాలి.

విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ


విజయసాయిరెడ్డిని కలిసిన ఎన్నారై కమిటీ
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డితో ఆదివారం పార్టీ ఎన్నారై కమిటీ  భేటీ అయ్యింది. ఆదివారం లోటస్ పాంట్ లో విజయసాయిరెడ్డిని వైఎస్సార్ సీపీ ఆస్ట్రేలియా కో-కన్వీనర్ లంకెల రాజశేఖర్, న్యూసౌత్ వేల్స్ పార్టీ కన్వీనర్ బద్దం రాజ్ కుమార్ లు కలిశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో వైఎస్సార్ సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విజయసాయిరెడ్డికి వారు వివరించారు.

రోడ్డుప్రమాద బాధితులకు వైఎస్ జగన్ సాయం


రోడ్డుప్రమాద బాధితులకు వైఎస్ జగన్ సాయం
రాప్తాడు: అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్ లోని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

రైతు కూలీలతో రాప్తాడు వెళుతున్న ఆటో రామునేపల్లిలో బోల్తా పడింది. దీంతో ఆరుగురు మహిళలతో సహా 10 మంది గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించినా స్పందన రాలేదు. రామునేపల్లి మీదుగా రాప్తాడు వెళుతున్న వైఎస్ జగన్ ప్రమాదం గురించి తెలుసుకుని వెంటనే స్పందించారు. బాధితులను దగ్గరుండి అంబులెన్స్ లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డారు. అధికారులను అప్రమత్తం చేసి బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందే ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను రాప్తాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.

కాగా, రామునేపల్లిలో ఆందోళన చేస్తున్న గోపాలమిత్రుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జననేతను గోపాలమిత్రులు కోరారు.

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ


మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
అనంతపురం : రాష్ట్రంలోని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో ఆయన్ని ఆదివారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయించాలని వైఎస్ జగన్ ని సదరు ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. 
అలాగే తమ కులాన్ని బీసీల్లో కలిపేందుకు సహకరించాలని కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు కూడా వైఎస్ జగన్ కలసి విజ్ఞప్తి చేశారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఉప్పరపల్లిలో రైతు మారుతి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పరపల్లిలో వైఎస్ జగన్ ను డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఉపాధ్యాయ నియామకాలను వెంటనే జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ ను కోరారు.

అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర


అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.

ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహిస్తారు.

Popular Posts

Topics :