24 January 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఆనం సోదరులకు ఎదురుదెబ్బ!

Written By news on Saturday, January 30, 2016 | 1/30/2016


ఆనం సోదరులకు ఎదురుదెబ్బ!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ తగలనుంది. ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. శనివారం వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలను కలసి ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు.

అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు తనకు నచ్చాయని, ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అనుచరులతో మాట్లాడి త్వరలో పార్టీలో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆనం సోదరులు నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీలో చేరడం పట్ల విజయ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.

కృష్ణారావు, నాయని కృష్ణకుమారి మృతికి జగన్ సంతాపం


సాక్షి, హైదరాబాద్ : భారత ఆర్మీ మాజీ చీఫ్,  మాజీ గవర్నర్ జనరల్ కేవీ కృష్ణారావు(93), ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి  నాయని కృష్ణకుమారి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతమాత ఒక గొప్ప ముద్దుబిడ్డను కోల్పోయిందని, కృష్ణారావు మరణం తనను ఎంతగానో బాధించిందని జగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సైన్యాధిపతిగా కృష్ణారావు ఎనలేని సేవలందించారని, పదవీ విరమణ తరువాత గవర్నర్‌గా మెప్పించారని జగన్ కొనియాడారు. 1942లో భారత సైన్యంలో చేరిన కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధంలోనూ, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలోనూ మన దేశానికి ఎన్నో సేవలందించారని, 1971 యుద్ధంలో చిరస్మరణీయ విజయాలు సాధించి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తం చేయడంలో ఆయన పాత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతుందన్నారు. కృష్ణారావు అందించిన సేవలు, ఆయన జీవితం తెలుగువారికి, భారతదేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమనని జగన్ పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సాహితీ రంగానికి తీరని లోటు

సాహితీవేత్త నాయని కృష్ణకుమారి మృతి సాహితీరంగానికి తీరని లోటని జగన్ సంతాపం తెలిపారు. జానపద సాహిత్యంలోనూ, మహిళా సాహిత్యంలోనూ ఆమె విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఆమె తెలుగు సాహితీరంగ అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్నారు. ఆమె కృషికి గుర్తింపుగా సాహితీ అకాడమీతో పాటు అనేక అవార్డులు ఆమెను వరించాయని జగన్ గుర్తు చేసుకుంటూ కృష్ణకుమారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సా

సెక్షన్-8 డిమాండ్ ఇప్పుడేమైంది?


సెక్షన్-8 డిమాండ్ ఇప్పుడేమైంది?
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత బొత్స
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు సమయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రుల రక్షణకు సెక్షన్- 8 అమలు చేయాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ విషయమే ప్రస్తావనకు తీసుకురాకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రులు గవర్నర్‌పై విమర్శలు చేయకూడదని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ పెడచెవిన పెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొత్స విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నేతల ప్రచారం నాటకీయంగా, తమాషాగా ఉందన్నారు. టీడీపీ సహా మిగిలిన పార్టీ నేతల హావభావాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి మహా నటుల నటననే మించిపోయాయని తెలిపారు.
సొంత సమస్యల నుంచి బయటపడడం కోసం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్న 50- 60 లక్షల మంది ఆంధ్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘నేను ఇక్కడే ఉంటాన’ని చంద్రబాబు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్తున్నారని, ఆయనేమైనా ద్విపాత్రాభినయం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ వద్ద ఓటుకు కోట్లు కేసును ప్రస్తావిస్తే... గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామన్నారని గుర్తు చేశారు. ప్రజలు అమయాకులనుకుంటూ ఏ సమయానికి ఆ మాటలు చెబుతున్నారా? అని దుయ్యబట్టారు.
కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే జీవోలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తట్టెడు మట్టి తీసే పనులు జరగడం లేదు కానీ, ఆ కాంట్రాక్టరుకు వందల వేల కోట్లు లబ్ది చేకూర్చుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబరు-13ని జారీ చేసిందని బొత్స దుయ్యబట్టారు. ఈ జీవో ద్వారా కాంట్రాక్టరు అదనపు ప్రయోజనం చేకూర్చిన రూ. 2000 కోట్లలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని ప్రశ్నించారు.
  కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగే కాపు గర్జన సభలో తాను పాల్గొంటానని.. కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశంలో పాల్గొనాలని తాను కోరుకుంటున్నట్టు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చె ప్పుకుంటున్న ప్రభుత్వం ఆ కార్యక్రమ నిర్వహణకు ఎందుకు అటంకాలు కల్పిస్తోందని ప్రశ్నించారు

అసలా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వగలదా?


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలోని ఒక యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందుకుంటారా? డౌటే... ఎందుకంటే ఆ యూనివర్సిటీకి అంత సీన్ లేదని తేలిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. లాబీయింగ్ చేసి నిధుల కోసం డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. అనేక ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు, నిధుల సమస్య కారణంగా ఆ యూనివర్సిటీ ఇప్పుడు మూసివేత దిశగా పయనిస్తోంది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తేమిటని తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.

విషయమేంటంటే... అమెరికా ఇల్లినాయిస్‌లోని చికాగో స్టేట్ యూనివర్సిటీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గత డిసెంబర్‌లో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు స్వయంగా విజయవాడకు వచ్చి ఆ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబును కలిసి తామిచ్చే డాక్టరేట్ స్వీకరించాలని కోరారు. ఇదంతా డిసెంబర్ మూడోవారంలో జరిగింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అనగానే టీడీపీ నేతలు ఆర్భాటం చేశారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం అంటూ తెగ ప్రచారం చేశారు. దానిపై అప్పట్లో చంద్రబాబు స్పందిస్తూ, అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్లు ఇస్తామన్నా... కాదన్నానని, ఎంతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ కావడం వల్లే చికాగో యూనివర్సిటీ కి ఉన్న చరిత్రను చూసి ఆ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను స్వీకరించాలని నిర్ణయించానని చెప్పుకొచ్చారు.

ఆ యూనివర్సిటీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి స్వయంగా చంద్రబాబును కలిసిన సందర్భంగా... మీకు వీలైనప్పుడు వచ్చి గౌరవపురస్కారాన్ని స్వీకరించాలని కోరారు. అందుకు అంగీకరించిన చంద్రబాబు ఆ విషయంపై అప్పట్లో హర్షం వ్యక్తంచేశారు. తనకు చికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా  ప్రకటించారు. కానీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కాదని, అది చికాగో స్టేట్ యూనివర్సిటీ అని ఆ తర్వాత బయటపడటంతో నవ్వులపాలు కావలసివచ్చింది. (చంద్రబాబు తన ట్విట్టర్‌లో మాత్రం చికాగో యూనివర్సిటీగానే చెప్పుకొన్నారు). ప్రమాణాల విషయంలో ఆ రెండు వర్సిటీల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు వెల్లడైంది. పైపెచ్చు ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఒకరు స్థానిక టీడీపీ నేత ఒకరికి సన్నిహితుడు కావడం వల్లే డాక్టరేట్ ప్రకటన వెలువడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

ఇంత చేసి ఏదో ఒక యూనివర్సిటీ... ఏదో ఒక డాక్టరేట్ అనుకుందామా.. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోందని చంద్రబాబు సన్నిహితులు తెగ బాధపడిపోతున్నారట. యూనివర్సిటీ తన గుర్తింపు కోసం ప్రతి ఏటా తంటాలు పడుతోందని అప్పట్లోనే వార్తలు వెలువడగా, ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతోంది. ప్రతి ఏటా 30 శాతం స్టేట్ ఫండింగ్‌పై ఆధారపడి నడుస్తున్న ఆ యూనివర్సిటీ ఇప్పుడు నిధులు లేక నడిపించే పరిస్థితి కూడా లేదు. అరకొర నిధులతో 2016 మార్చి నాటికి ఏదో రకంగా స్ర్పింగ్ సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ ప్రకటించింది. నిధుల కోసం లామేకర్స్ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు యూనివర్సిటీ ప్రెసిడెంట్ థామస్ జె. కల్హాన్ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కష్టకాలం నుంచి బయటపడతామని ప్రకటించారు.
అసలా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వగలదా?
ఇంతటి దయనీయ పరిస్థితులు యూనివర్సిటీలో ఉన్నప్పుడు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితి ఉండదని టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐప్రతినిధులు చెబుతున్నారు. మార్చిలో జరిగే  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సమయాన్ని బట్టి డాక్టరేట్ అందుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారని, కానీ అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత ఆలోచించాలని టీడీపీ నేత ఒకరు చెప్పారు. రేపటి రోజున యూనివర్సిటీ పరిస్థితులు బాగుపడినా డాక్టరేట్ తీసుకోవడం వల్ల తాము ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా విమర్శల పాలవుతామన్న అనుమానాలను ఆ నేత వ్యక్తం చేశారు.

Popular Posts

Topics :