31 January 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సీఆర్ డీఏ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే ఆర్కే ఆందోళన

Written By news on Saturday, February 6, 2016 | 2/06/2016

గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం సీఆర్ డీఏ ఆఫీసు ఎదుట వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఆందోళనకు దిగారు. ఏడున్నర ఎకరాల ఎసైన్డ్ భూమిని ఇతరుల పేర్లతో నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారని ఆర్కే మండిపడ్డారు. వివాదాస్పద భూమి వివరాలను పది రోజుల్లో ఇస్తామని ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.

ఎవరి మాటలు నమ్మాలి?

Written By news on Thursday, February 4, 2016 | 2/04/2016

రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. తూర్పుగోదావరి జిల్లాకు బయటి వ్యక్తులు ఎవరూ రావొద్దని ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు.

చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాచరిక పాలనను తలపిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని సభకు అనుమతి ఇచ్చామని సీఎం, ఇవ్వలేదని పోలీసులు అంటున్నారని.. ఎవరి మాటలు నమ్మాలని ఆయన నిలదీశారు. తెలంగాణలో 23 కులాలను బీసీ జాబితా నుంచి తొలిగిస్తే ఆర్. కృష్ణయ్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాపులకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం


ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  పోరాడుతుందని.. కమలాపురం  ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కమలాపురం పరిధిలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన కొంత మంది రైతులకు 2012 సంవత్సరానికి గానూ పంట బీమా అందలేదు. దీంతో రైతులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కలిసి విషయం వివరించారు.
ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకూ పంట బీమా వచ్చేంతవరకూ పోరాడతామన్నారు. వీలైతే హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేసి ధర్నా నిర్వహిస్తామన్నారు

ఎమ్మెల్యే వెలగపూడికి వంశీకృష్ణ సవాల్


ఎమ్మెల్యే వెలగపూడికి వంశీకృష్ణ సవాల్
విశాఖపట్టణం: విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...'కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా హత్యకేసులో వెలగపూడి మూడో ముద్దాయివి కాదా అని ప్రశ్నించారు. వెలగపూడి నీకు దమ్ముంటే రాజీనామా చేయి, మనమిద్దరం పోటీ చేద్దాం. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నీవు ఓడిపోతే ఏం చేస్తావన్నారు.  విశాఖను మరో విజయవాడగా చేస్తున్నారన్నారు. మద్యం, బెల్టు షాపులతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని' అన్నారు.

కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు


టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో బీసీ ఉద్యమం
చంద్రబాబుపై అంబటి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, కాపు నేత అంబటి రాంబాబు దుయ్యబట్టారు. బీసీలకు, కాపులకు శత్రుత్వం లేనేలేదని, అయితే చంద్రబాబు కావాలని సమాజంలో చీలిక తెచ్చే యత్నం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కాపుల రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ద్వారా బీసీల ఉద్యమానికి తెరలేపారని తెలిపారు.

కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి చర్చ జరగాలని చంద్రబాబు చెప్పగానే టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య ఈ అంశంపై చర్చకు పెట్టడాన్ని ఆయన గుర్తు చేశారు. అంబటి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు నష్టం కలుగజేసి తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపులు కోరుకోవట్లేదని చెప్పారు. బీసీల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినకుండా చేయాలని కోరుతున్నారన్నారు. బీసీలకు హానిచేసి కాపులకు మేలు చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుకోవట్లేదన్నారు. అయితే ఒకపక్క కాపులకు రిజర్వేషన్ ఇస్తానని బాబు చెబుతూనే మరోపక్క బీసీల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అదే సమయంలో కాపు ఉద్యమంలో చీలికతెచ్చి దాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే చౌకబారు ఎత్తుగడతో బాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఉద్యమిస్తున్న ముద్రగడను మినహాయించి.. కొం దరు కాపు నేతలతో సీఎం సమావేశమవడాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానంటున్న బాబు తుని కాపు గర్జనలో పాల్గొన్న 27 మంది కాపు నేతలపై కేసులు పెట్టించడాన్ని ప్రశ్నించారు.

 తుని ఘటనల్లో ‘తుళ్లూరు’ దుండగులు..
 తునిలో కాపు ఉద్యమానికి చెడ్డపేరు తేవాలన్న తలంపుతోనే రైలు దగ్ధం, విధ్వంసం వంటి ఘటనలకు అధికార పార్టీకి చెందినవారు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్నది తుళ్లూరు దుండగులేనని అంబటి ఆరోపించారు. తుళ్లూరులో ఎవరైతే దుండగులు రైతుల్ని భయభ్రాంతులను చేయడానికి పంటల్ని తగులబెట్టారో వారే తునిలో ఈ చర్యలకు  పాల్పడ్డారన్నారు. తుళ్లూరులో నేరస్తులు టీడీపీవారేనని చిత్తశుద్ధి గల అధికారులు నిజాలు తేల్చినా ప్రభుత్వం వారిని అరెస్టు చేయలేదన్నారు. టీడీపీలో విధ్వంసాలకు పాల్పడే గ్యాంగ్‌ను ఏర్పా టు చేసుకున్నారని.. వారే ఇలాంటివి చేస్తుంటారన్నారు.

తుని ఘటనలకు జగనే బాధ్యుడని, రాయలసీమ నుంచి వచ్చిన దుండగులే రైలును తగులబెట్టారని చెప్పడం చంద్రబాబు విడ్డూరమని, మరైతే ఈ ఘటనలకు సంబంధించిన కేసుల్లో రాయలసీమ వారిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జగన్‌పై ఆరోపణలు చేయడమంటే.. బట్ట కాల్చి ముఖాన వేయడం తప్ప మరొకటి కాదన్నారు. ‘కాపులు చాలా శాంతిపరులంటూనే కాపు నేతలపై చంద్రబాబు ఎందుకు కేసులు పెట్టారు? మొత్తం 13 జిల్లాల్లో కాపులున్న పల్లెల్లో పోలీసు పికెట్లు ఎందుకు పెట్టారు? స్థానిక కాపు నేతల్ని పోలీసులు పిలిచి ఎందుకు బెదిరించారు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టుకుని కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరేది లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేవారెవ్వరూ లేరన్నారు.

 బీసీ కమిషన్ జీవో జారీలో పచ్చి మోసం
 కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి జారీ చేసిన బీసీ కమిషన్ జీవోలో చంద్రబాబు పచ్చి మోసానికి పాల్పడ్డారని, ఇంతవరకూ కమిషన్‌కు పరిశీలనాంశాలు కూడా తెలియజేయలేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపుల్ని బీసీల్లో చేర్చడానికి నియమించిన మంజునాథ కమిషన్‌లో నాన్ జ్యుడీషియల్ సభ్యుల్నే నియమించలేదన్నారు. 9 నెలల వ్యవధిలో నివేదికను సమర్పించాలని ఓవైపు పేర్కొంటూనే కమిషన్ గడువును మూడేళ్లపాటు నిర్ణయించడమంటే పచ్చి మోసమేనన్నారు. కమిషన్ విచారణాంశాలేమిటో తనకింకా తెలపలేదని, అవి చూస్తేగానీ ఏమీ చెప్పలేనని చైర్మన్ మంజునాథ ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్యూలో అన్నారని, నిర్దేశించిన 9 నెలల గడువులోపు నివేదికిచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారేతప్ప కచ్చితంగా ఏమీ వెల్లడించలేదన్నారు.

కాపుల్ని బీసీల్లో చేర్చడానికి అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికే సుదీర్ఘకాలం పడుతుందని మం జునాథ చెప్పడాన్ని అంబటి ప్రస్తావించారు. ప్రభుత్వ జీవోను, మంజునాథ ఇంటర్యూను చూసిన ఏమాత్రం జ్ఞానమున్న వారికైనా కాపులకు మేలు చేస్తానని బాబు చెప్పేదంతా శుద్ధ అబద్ధమని తేలిపోతుందన్నారు. ముద్రగడ తునిలో కాపు గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించగానే హడావుడిగా చంద్రబాబు జీవో ఇచ్చినట్లుగా ఉంది తప్ప కాపులకు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆయనలో కనిపించట్లేదని దుయ్యబట్టారు.

తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది

Written By news on Tuesday, February 2, 2016 | 2/02/2016


'తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది'
కాకినాడ : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాపుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  కాపులను బీసీల్లో చేర్చాలంటూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న వెంకట రమణమూర్తి కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తన చావు ద్వారా అయినా చంద్రబాబు కళ్లు తెరుస్తారని వెంకట రమణమూర్తి ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఇప్పటికైనా కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం తాత్సారం చేయకుండా వారిని బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో చంద్రబాబు అధ్యయనం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.

చంద్రబాబు తెలిసీతెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని, తమిళనాడుకు వెళితే అక్కడ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయో జ్ఞానోదయం కలుగుతుందని ఆయన అన్నారు. మార్గదర్శకాలు చెప్పకుండా కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేయడం సరికాదన్నారు. 1953లో కాకా కలేల్కర్ ఇచ్చిన నివేదికలో కాపులను బీసీలుగా గుర్తించారన్నారు. రిజర్వేషన్ల కోసం వెంకట రమణమూర్తి ప్రాణత్యాగం చూసైనా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రమణమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. చావుల వల్ల సాధించేది ఏమీ లేదని, అంతా ఒకటిగా పోరాడి సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కొంచెం తిక్క అని, అది కాస్త ముదిరిందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.

సభాపతి గౌరవం మంటగలిపిన కోడెల


‘సభాపతి గౌరవం మంటగలిపిన కోడెల’
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ సభా గౌరవాన్ని, సభాపతికి ఉన్న గౌరవాన్ని మంటగలిపిన ఏకైక స్పీకర్ కోడెల శివప్రసాద్ అని వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాయచోటిలో విలేకరులతో మాట్లాడారు. ఎంతో గౌరవ ప్రదమైన స్పీకర్ స్థానంలో ఉంటూ ప్రతిపక్ష నేతను విమర్శించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఎప్పుడూ విలువల గురించి మాట్లాడే కోడెల.. బాధ్యతను మరిచి తన నైజం బయటపెట్టారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని తప్పుడు ప్రకటనలిస్తున్న స్పీకర్.. ఈ ప్రభుత్వాన్ని రోడ్డున పడేయండని అనేక పర్యాయాలు పలువురు ఎమ్మెల్యేలకు చెప్పారన్నారు. స్పీకర్ పదవిలో ఉండటం వల్ల ఆయన గత చరిత్ర గురించి మాట్లాడకూడదనుకున్నా, ఆయన ఏ రకంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారో, తన ఇంటిలో బాంబులతో ఎంత మందిని చంపారో తదితర ఘటనలతో ఎలాగూ గౌరవాన్ని కోల్పోయారని చెప్పారు. అయితే తాము మాత్రం ఆ కుర్చీ గౌరవాన్ని పోగొట్టదలచలేదన్నారు.

కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కరక్టేనని ఆయన రుజువు చేసుకున్నారన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే వెంటనే సభను సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. విలువల గురించి చెప్పే తమరి బాగోతం ఏమిటో ఇటీవల జాతీయ మీడియా బయట పెట్టిందన్నారు. విమాన ప్రయాణంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌తో ఏ విధంగా ప్రవర్తించారో, టీవీ చానళ్లలో స్పష్టంగా ప్రసారం అయ్యిందన్నారు. ఆ ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేస్తే రాజకీయ పలుకుబడితో కేంద్ర విమానయాన శాఖా మంత్రి ఆశోక్ గజపతి రాజు ద్వారా ఒత్తిడి చేయించి కేసు లేకుండా చేయించుకున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

స్పీకర్ పదవికి ఎలాగూ వన్నె తేలేరని, కనీసం ఆ పదవికి ఉన్న స్థాయిని దిగజార్చవద్దని హితవు పలికారు. ఆ సీటులో ఉన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలే కానీ అవాస్తవాలు మాట్లాడుతూ పత్రికలకు ఎక్కి నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకోవడం తగదని సూచించారు. వంగవీటి మోహన్ రంగ హత్య సమయంలో.. హోం మంత్రిగా ఉన్న కోడెల అరాచకాలు ఏమిటో ప్రపంచానికి తెలుసన్నారు. అప్పట్లో స్వయాన మంత్రిగా ఉన్న హరి రామజోగయ్య తను రాసిన పుస్తకంలో అనేక అంశాలను పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాల్సిన స్పీకర్.. ఎంత మాత్రం పారదర్శకంగా ఉంటున్నారో ఒకసారి తనకు తానుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ


వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కాకినాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కాకినాడ డైయిరీ ఫామ్ సమీపంలోని వెంకట రమణమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన... కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ  అండగా ఉంటుందని  వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం ఎదురైనా తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్ జగన్ కోరారు.  ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా  శ్రీకాకుళం జిల్లాలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ను అప్పులపాలు చేసి చంద్రబాబు సింగపూర్ కు వెళ్లిపోరని గ్యారెంటీ ఏమిటి?


'సింగపూర్‌లో బాబు ఇల్లు కట్టుకున్నాడట'
శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరును యువత ఎండగట్టింది. శ్రీకాకుళం టౌన్ హాల్లో మంగళవారం యువభేరీ సదస్సులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు.. చంద్రబాబు ప్రభుత్వం పనితీరును, మోసపూరిత వాగ్దానాలపై గళమెత్తారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. చంద్రబాబు సర్కార్ ను విద్యార్థులే బంగాళాఖాతలో కలుపుతారని వైఎస్ జగన్ అన్నారు. యువభేరీలో విద్యార్థుల ప్రశ్నలకు జగన్ సమాధానాలు... 


యోగి, విద్యార్థి: బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరచిపోయారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా మరచిపోయారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులపాలు చేసి చంద్రబాబు సింగపూర్ కు వెళ్లిపోరని గ్యారెంటీ ఏమిటి?

జగన్: చంద్రబాబు సింగపూర్ కు పోతాడని నాకూ సందేహంగా ఉంది. సింగపూర్ లో బాబు ఇల్లు కట్టుకున్నాడని ఈ మధ్యే ఎవరో చెప్పారు.

హిమలక్ష్మి, ఎంకామ్: చంద్రబాబు స్మార్ట్ సిటీలు అంటున్నారు. ఆ మాట పక్కన పెడితే కనీసం విద్యార్థుల్లో ఉన్న స్మార్ట్‌నెస్‌ను గుర్తించే ప్రయత్నం అయినా చేయాలి. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా కనీసం కాలేజీలు, యూనివర్సిటీల్లో సౌకర్యాల గురించి పట్టించుకోలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలి. చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. మీరు అండగా ఉండి పోరాడాలి.

జగన్: ఈ విషయమై చంద్రబాబును నిలదీద్దాం. అందరం కలసి పోరాడుతాం.

దేవి, డిగ్రీ ఫైనలియర్: రుణమాఫీ  చేస్తామని చెయ్యలేదు. దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. డ్వాక్రా రుణం తీసుకున్న మా అమ్మ చాలా కష్టపడుతోంది.

జగన్: నీ మాటలు ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతాయి. జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నా. ఈ విషయంపై పోరాడుతాం.

సౌజన్య, బీడీఎస్ విద్యార్థిని: మేకిన్ ఇండియా అంటున్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఎందుకు? ఏపీలో ఇంజనీర్లు లేరా?

జగన్: మీరడిగిన ప్రశ్నలతో బాబుకు జ్ఞానోదయం కావాలి. మన దేశంలో ఎందరో గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. భూములను అడ్డగోలుగా కంపెనీలకు ఇస్తున్నారు.

గాయత్రి: ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. జగనన్నా.. ఇలాంటి వ్యక్తికి నైతికంగా పాలించే అర్హత ఉందా?

జగన్: చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. లేకుంటే ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నిలదీస్తున్నారు. మీ మాట నిజమే తల్లీ. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. చంద్రబాబుకు పాలించే నైతిక హక్కులేదు. ఆయన రాజీనామా చేయాలి.

సాయి సందీప్, ఇంజనీరింగ్ విద్యార్థి: ఎన్నికల సమయంలో ఉద్యోగాలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లయినా నోటిఫికేషన్ రాలేదు.

జగన్: రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా చంద్రబాబు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక హోదా అన్నది మరచిపోలేని విషయం. ప్రభుత్వాలపై గట్టిగా ఒత్తిడి తీసుకువస్తాం.

క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు?

Written By news on Monday, February 1, 2016 | 2/01/2016


క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కాపులకు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడడం లేదని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీయిచ్చి మాట తప్పారని ధ్వజమెత్తారు. సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. కాపుల డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
  • చంద్రబాబు నాయుడు నిన్న చాలా సుదీర్ఘమైన ఆత్మస్తుతి.. పరనింద కార్యక్రమం కొనసాగించారు. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు మాట్లాడిన తీరుచూస్తే, ఇంత చీప్‌గా ఒక సీఎం మాట్లాడటం ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. సీఎం రాజకీయాల కోసం ఇంత దిగజారగలరా?
  • తాను తప్పులు చేసి, ఆ తప్పులు వేరేవాళ్లమీద మోపడానికి ఆయన ఇంత దిగజారుతారా అనిపించింది
  • అలా మాట్లాడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
  • రకరకాల ఆరోపణలు చేశారు
  • కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు అన్నారు
  • దానికి కారణం వైఎస్ఆర్‌సీపీయేనంటారు
  • ఆరు మీడియా ఛానళ్లకే ముందెలా తెలిసిందంటారు
  • ఇదంతా చేసింది వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలేనంటారు
  • పట్టిసీమ నుంచి రాయలసీమ, కాల్ మనీ వరకు అన్నీ మాట్లాడారు
  • నేరస్తులు అంటారు, కరప్షన్ అంటారు
  • కాపులు కేవలం 5-10 శాతం మందే పాల్గొన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు
  • పులివెందులలో ఇలా జరిగినా పర్వాలేదు, తూర్పుగోదావరి జరగడం ఆశ్చర్యం అంటారు
  • ఈ నెల జీతాలు ఇవ్వడానికే కష్టంగా ఉందని, అప్పులు తెచ్చే పరిస్థితి కూడా లేదని అంటారు
  • కమిషన్ ఒప్పుకోకపోతే కాపుల రిజర్వేషన్ ఇవ్వడానికి మేమేం చేయలేం అని చెప్పారు
  • అంతసేపు మాట్లాడినా.. కాపులకు తానేం చేస్తానో, ఎప్పుడు చేస్తానో మాత్రం ఎక్కడా లేదు
  • తనమీద తప్పు రాకుండా చూసుకోడానికి అవతలివాళ్ల మీద అభాండాలు వేస్తున్నారు
  • ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో, కాపులకు సంబంధించి ఒక లావు పేజీ పెట్టారు
  • కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి, నిర్ణీత కాలవ్యవధిలో సమస్య పరిష్కరిస్తా అన్నారు
  • ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చుచేస్తానని చెప్పారు
  • 22 నెలలు అయిపోయింది, ఆ పనులు ఎందుకు చేయట్లేదని, ఎప్పుడు చేస్తావని ఉద్యమబాట పట్టారు
  • కాపు సామాజిక వర్గం వాళ్లు లక్షల్లో కదిలి అడిగారు
  • దానికి సమాధానం చెప్పకుండా అవతలి వాళ్లమీద అభాండాలు వేస్తున్నారు
  • అసలీయన నిజంగా ముఖ్యమంత్రేనా
  • ఇదే చంద్రబాబు తన మాటల్లో రకరకాల ఆరోపణలు చేశారు
  • ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, మోసం చేసినందువల్ల ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది
  • వాళ్లు ఫలానా జిల్లా, ఫలానా ప్రాంతం, ఫలానా కులం అని లేదు
  • అన్ని కులాల్లో, మతాల్లో, జిల్లాల్లో, ప్రాంతాల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది
  • రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పలేదా?
  • డ్వాక్రా అక్క చెల్లెళ్ల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పలేదా?
  • బాబు వస్తే జాబు వస్తుందని, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని అనలేదా?
  • వాళ్లందరినీ మోసం చేసినందుకు నువ్వు క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు?
  • బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీలలో చేరుస్తానని చెప్పావు
  • ఎన్నికలప్పుడు చెప్పి, ఇప్పుడు చేయడం లేదు
  • ప్రతి విషయంలోను మాట ఇచ్చింది నువ్వే..
  • అనంతపురంలో బోయలను ఎస్టీలుగా చేస్తానని మేనిఫెస్టోలో పెట్టావు, ఇప్పుడు చేయలేదు
  • ప్రతి కులాన్నీ, వర్గాన్ని, ప్రాంతాన్ని మోసం చేశావు
  • అమరావతిలో రాజధాని పెట్టడానికి మేం వ్యతిరేకమని అభాండం వేస్తారు
  • రైతుల నుంచి బలవంతంగా భూముల సేకరణనే మేం ప్రశ్నించాం
  • మీ బినామీలు మురళీమోహన్, నారాయణ లాంటివాళ్ల భూములు ముట్టుకోవు
  • ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డీకేటీ భూములను కూడా లాక్కుంటావు
  • పోలవరం కట్టాలని అడిగితే.. కమీషన్ల కోసం పట్టిసీమ కడతావు
  • అది కూడా కమీషన్లు తీసుకుని 22 శాతం ఎక్సెస్‌కు ఇస్తావు
  • గట్టిగా నిలదీస్తే రాయలసీమకు వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకి అని ప్రచారం చేస్తావు
  • కాల్‌మనీలో నీకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమేయం ఉంది, అరెస్టు చేయాలని అడిగితే.. స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి పంపిస్తావు
  • ఆడవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావని ప్రశ్నిస్తే.. కాల్ మనీ మీద వైఎస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది, వీళ్లు విజయవాడకు వ్యతిరేకం అంటావు
  • పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కాపుల రిజర్వేషన్ కోసం కదిలారు
  • వాళ్ల మీద కూడా అభాండాలు వేస్తారు
  • అదే సమావేశానికి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరైనా ఆయన పేరు చెప్పరు
  • అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు.. మీటింగ్ ను ఆపాలని చూశారు
  • నాలుగైదు నెలల కింద వాళ్లు చెబితే, దాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నం చేశావు
  • మీ పార్టీ వాళ్లందరినీ హైదరాబాద్ పిలిపించుకుని ఆపేశావు
  • బస్సులు అడిగినా కూడా అరకొరగా మాత్రమే ఇచ్చి.. అది కూడా సమావేశ స్థలానికి 7-8 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశావు
  • చివరకు వాళ్ల ఫ్రస్ట్రేషన్‌తో ఆడుకున్నావు
  • అయినా కూడా ఆ మీటింగ్ సక్సెస్ అయితే.. దానివల్ల ఉద్యమకారులకు, ప్రతిపక్షాలకు మంచిపేరు వస్తుందని, అది రాకూడదని, వాళ్లకు చెడ్డపేరు రావడం కోసం నువ్వు అలజడి క్రియేట్ చేసి చెడ్డపేరు వీళ్లకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు
  • ముద్రగడ పద్మనాభం మాట్లాడిన కొద్దిసేపటికే భావోద్వేగాల మధ్య రైల్ రోకోకు పిలుపునిచ్చారు
  • ఆయనతో పాటే మీడియా వాళ్లు అందరూ కూడా అక్కడకు వెళ్లారు
  • ఆరు ఛానళ్లే అంటున్నారు.. రాష్ట్రంలో ప్రతి ఛానల్ దాన్ని ప్రసారం చేసింది
  • ఎవరైనా దాన్ని కవర్ చేస్తే అది కూడా కుట్రలో భాగం అని అభాండాలు వేస్తున్నారు.
  • జరిగింది ఏంటి, నువ్వు ఎందుకు చేయలేకపోయావని ప్రశ్నిస్తే, వాళ్లమీద ఆరోపణలు చేస్తున్నావు
  • ఇదే క్రిమినల్ బుర్ర నీది కాదా?
  • 1988లో ఇదే మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది.
  • అదే సంవత్సరంలో వంగవీటి రంగాను హత్య చేయించావు
  • హరిరామ జోగయ్య తన పుస్తకంలో లేఖ రాశారు.. అందులో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు.
  • ముద్దాయిల్లో ఒకరు స్పీకర్ స్థానంలోను మరొకరు మంత్రి (ఉమా) ఉన్నారు. ఇంకొకరు ఎమ్మెల్యే
  • అన్నీ దుర్మార్గపు ఆలోచనలు, క్రిమినల్ బుద్ధి ఉన్నది చంద్రబాబుకే
  • ఇవా రాజకీయాలంటే? రాజకీయాలు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి
  • మేనిఫెస్టోలో పెట్టావు కాబట్టే అడుగుతున్నారు
  • బీసీలు ఎందుకు ఒప్పుకోరు.. వాళ్లకు నష్టం జరగనివ్వకుండా చేస్తే ఎందుకు ఒప్పుకోరు?
  • నీ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తావు
  • అదే కృష్ణయ్య నీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నీ పార్టీ తరఫున పోటీ చేయలేదా?
  • ప్రతి వర్గానికి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు
  • గతంలో ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి మాలలు, మాదిగల మధ్య చిచ్చు పెట్టావు
  • అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అని నీకు తెలియదా?
  • నువ్వు పెట్టిన చిచ్చు ఎస్సీల మధ్య ఇప్పటికీ ఉంది
  • రాజకీయాల కోసం ప్రాంతాలు, కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టడం నీకే అలవాటు
  • తనంత గొప్ప నాయకుడు ఎవరూ లేరని మాటిమాటికీ ఆయన అబద్ధాలు చెబుతుంటారు
  • సెల్‌ఫోన్ తానే తెచ్చానంటాడు, మా ఖర్మ.. వినాల్సి వస్తోంది
  • ఇదే చంద్రబాబు హయాంలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ షేర్ 8.66 శాతం ఉంటే, వైఎస్ హయాంలో 14.93 శాతానికి పెరిగింది.
  • ఐటీ ఉద్యోగులు చంద్రబాబు హయాంలో 85 వేల మంది ఉంటే, వైఎస్ హయాంలో 2 లక్షలకు పైగా ఉన్నారు
  • వాస్తవాలు ఇవైతే.. వాటిని వక్రీకరించడంలో, అబద్ధాలు చెప్పడంలో ఆయనను మించినవాళ్లు లేరు
  •  
  • కాపులకు సంబంధించిన విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు?
  • కాపుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం
  • బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరేవాళ్లలో మా పార్టీ ముందుంటుంది
  • 1910 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. 1956 వరకు కాపులు బీసీలలోనే ఉన్నారు
  • 1953లో తొలి బీసీ కమిషన్ ఖలేల్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కాపులు బీసీలే
  • ఆ తర్వాత 1956 నుంచి నిర్దాక్షిణ్యంగా కాపులను ఒక జీవో ద్వారా బీసీల నుంచి తొలగించారు
  • ఆ అన్యాయాన్ని సరిచేయాలని వాళ్లు అడడగం సహేతుకం
  • అలా అడగడంలో తప్పేమీ లేదు
  • తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లున్నాయి
  • మరి ఎందుకు ఆ పద్ధతిలో మీరు చేయలేకపోతున్నారు?
  • 1994లో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, షెడ్యూలు 9లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయించారు
  • అందుకే అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి
  • ఇక్కడ నువ్వు మద్దతు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి, ఇక్కడ తీర్మానం చేసి షెడ్యూలు 9లో చేర్చేలా ఒత్తిడి తెస్తే 50 శాతం సీలింగ్ దాటి.. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించొచ్చు
  • కానీ అలా ఎందుకు చేయడం లేదు?
  • మేం ఎవరితోనూ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోమని, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వాళ్లు మామీద ఆధారపడితే మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లపై ఒత్తిడి తెస్తామని చెప్పాం
  • కానీ కనీసం కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు
  • అవి చేయించలేకపోతే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారు?
  • నోరు తెరిస్తే మోసాలు.. అబద్ధాలు.. ఇదీ ఆయన చరిత్ర
  • జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన మాట్లాడుతున్నారు
  • ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు ఉన్నాయని, అప్పులు తేలేనని అంటారు
  • ఈయన చెప్పే మాటలకు ఎక్కడా పొంతన లేదు
  • గ్రోత్ రేటు 11.76 శాతం ఉందని, వచ్చే సంవత్సరం 15 శాతానికి తీసుకెళ్తామంటారు
  • కేంద్రం గత ఆరు నెలల కాలానికి 7.3 శాతం జీడీపీ గ్రోత్ రేటు చూపిస్తోంది
  • దానికే రెవెన్యూలో గ్రోత్ రేటు 23 శాతం, పరోక్ష పన్నులు మరింత ఎక్కువ చెబుతోంది
  • మనకు ప్రధానంగా ఆదాయం వచ్చేది పరోక్ష పన్నుల ద్వారానే
  • ఆ లెక్కన 11.76 శాతం గ్రోత్ రేటు ఉంటే ఇక్కడ రెవెన్యూ గ్రోత్ రేటు ఇంకెంత ఉండాలి
  • ఇంత గ్రోత్ రేటు చూపిస్తే జీతాలకు డబ్బులెందుకు లేవు?
  • ఇదే చంద్రబాబు కబడ్డీ పోటీలకు వెళ్లి తొడగొడతారు
  • అక్కడకు వెళ్లి.. అమరావతికి ఒలింపిక్స్ తెస్తామంటారు
  • మొన్న చైనాలో ఒలింపిక్స్ జరపడానికి ఆ ప్రభుత్వం 42 బిలియన్ డాలర్లు.. అంటే 3.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది
  • మన మనిషి కబడ్డీ కబడ్డీ అంటూ తొడగొట్టి అమరాతిలో ఒలింపిక్స్ అంటారు
  • సింగపూర్ వెళ్లొచ్చి, అమరావతిని సింగపూర్ చేస్తానంటారు
  • చైనా వెళ్లొచ్చి, అమరావతిని బీజింగ్ చేస్తానంటారు
  • ఇంత కంటే దారుణమైన మనిషిని జీవితంలో ఎప్పుడూ చూడలేదు
  • ఈవాళ ఒకే ఒక్క విషయంలో మాత్రం కాపు సామాజిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తున్నా
  • మన పోరాటం పూర్తి సమంజసం
  • మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాం.. తప్పు కాదు
  • అందరం కలిసికట్టుగా సాధించే దిశగా అడుగులు వేస్తాం
  • సంయమనం పాటించండి. ఎక్కడైనా విధ్వంసం చేస్తే మాత్రం మనకు చెడ్డపేరు ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారు

ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్


ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన వివరించనున్నారు.

తునిలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్య గర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని విపక్ష నాయకులు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు.

చంద్రబాబే ఉద్యమంలోకి దుష్ట శక్తులను జొప్పించారు


చంద్రబాబే ఉద్యమంలోకి దుష్ట శక్తులను జొప్పించారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కాపు ఉద్యమంలోకి దుష్టశక్తులను జొప్పించి తుని దౌర్జన్యకర సంఘటనలకు కారకులయ్యారని, ఇందుకు ఆయనదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు తుని ఘటనలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమాల్లోకి దుష్టశక్తులను జొప్పించి దానిని నీరుగార్చడం ఆయనకు అల వాటేనన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారన్నారు. ఎక్కడ ఏం జరిగినా జగన్‌పై అభాండాలు వేయడం ఏ మాత్రం సరికాదని చెప్పారు. జీతాలు చెల్లించడానికే నిధులు లేనందువల్ల రూ.100 కోట్లే కేటాయించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.

విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడానికే ప్రత్యేక విమానాల కోసం వందలాది కోట్లు వెచ్చించారని, ఇష్టానుసారం ఆడంబరాలకు ఖర్చు చేస్తూ కాపులకు ఇవ్వడానికే నిధులు లేవని చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక పేరుతో వందల కోట్లు తగలేసిన ముఖ్యమంత్రికి కాపులకు ఇవ్వడానికే నిధులుండవా అని ప్రశ్నించారు. తునిలో జరిగిన సంఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు. కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయిస్తానని చెప్పి గత 20 నెలల పాలనలో రూ.100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. పెపైచ్చు ముఖ్యమంత్రితో సహా అందరూ రెచ్చగొట్టేలా మాట్లాడ్డమే తప్ప.. మేమున్నామంటూ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ కాపుల కు నచ్చజెప్పి వారిలో స్థైర్యం నింపే యత్నం చేయలేదన్నారు. తునిలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్నారు.

సంయమనం పాటించాలని తమ పార్టీ అందరినీ కోరుతోందని చెప్పారు. కాపు గర్జన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ప్రాంతం ఎక్కువగా వ్యవసాయాధారితమైనదని, చంద్రబాబు విధానాలపై అక్కడి రైతులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అన్ని రకాల అసంతృప్తులూ తుని సంఘటనలకు కారణమన్నారు. తుని సంఘటనలకు తన వైఖరే కారణమనే విషయం గుర్తించకుండా ఇంకా ఈ ఘటనలను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న వారు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి డబ్బులున్నాయా?:అంబటి రాంబాబు
కాపులకు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్న చంద్రబాబునాయుడుకు.. పారిశ్రామికవేత్తలకు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు చె ల్లించడానికి మాత్రం డబ్బులున్నాయా అని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి ఇపుడు వంద కోట్లే కేటాయించి జీతాలకు డబ్బు లేవని చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి తెలియకుండానే చంద్రబాబు హామీలు ఇచ్చారా అని అడిగారు. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ బకాయిలు చెల్లించి 400 కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపన కోసం రూ.400 కోట్లు దుబారాగా ఖర్చు చేయడానికి, ప్రత్యేక విమానాల్లో తిరగడానికి మాత్రం డబ్బులున్నాయా అన్నారు. విచ్చలవిడిగా అయిన దానికీ కాని దానికీ వేల కోట్లు తగలేస్తున్న చంద్రబాబు కాపుల వద్దకు వచ్చేటప్పటికే నీతులు చెబుతారా అని విమర్శించారు. తునిలో జరిగిన సంఘటనలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనలకు అధికారపక్షం అందరిపైనా ఆరోపణలు చేసే బదులు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అంబటి హితవు పలికారు.

ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం


ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి..
 పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి


 ఖమ్మం అర్బన్: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం ఖిల్లాపై పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నగరంలోని 15, 17, 31 డివిజన్ల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ పనిచేసినా దృఢ సంకల్పంతో ముందుకు సాగేవారన్నారు.

ఆయన బతికున్నంతకాలం పది మందికి మేలు చేశాడని, కృషి పట్టుదల ఉంటే ఎలాంటి వారినైనా విజయం వరిస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. నగరంలోని 17వ డివిజన్‌లో వడ్డెబోయిన శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులతోపాటు సుమారు 70 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి పొంగులేటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోఆర్డినేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిర ంజన్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు తోట రామారావు, ప్రధాన కార్యదర్శి మలీదు జగన్, తుమ్మా అప్పిరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, ఇస్లావత్ రాంబాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు


'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు'
తుని: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే తూర్పు గోదావరి జిల్లా తుని కాపు గర్జనలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు బాధ కలిగిస్తున్నాయని, హింస వల్ల ఉద్యమం, ఉద్యమ లక్ష్యం దెబ్బతింటాయన్నారు. హింసాత్మక ధోరణిని విడిచి పెట్టాలని అంబటి పిలుపునిచ్చారు.

ఉద్యమంలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, నేటి ఘటనకు టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంబటి డిమాండ్ చేశారు. బహిరంగ సభ జరుగుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రతిపక్ష పార్టీపై బురదజల్లడం ఎందుకు అన్నారు. గతంలో రైతుల ప్రయోజనాలను కాపాడమంటే రాజధానికి వ్యతిరేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందకు కట్టరని అడిగితే పట్టిసీమకు వ్యతిరేకం అన్నారు.. ఇప్పుడు అలాంటి ప్రేలాపనలనే పేలుతున్నారంటూ టీడీపీ సర్కార్ పై అంబటి మండిపడ్డారు.

ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ

Written By news on Sunday, January 31, 2016 | 1/31/2016


శ్రీకాకుళం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ జగన్ యువభేరీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 2వ తేదీన జరుగనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం జరుగనున్నట్టు చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ఏ రంగంలో విజయం సాధించారని చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి బిరుదు ఇచ్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం


ఇది పచ్చి మోసకారి ప్రభుత్వం
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

 సాక్షి ప్రతినిధి, కడప:   ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు.. అదీ కాలేదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలన్నాడు.. మా పిల్లగాళ్లకు ఎలాంటి ఉద్యోగమూ రాలేదు. చంద్రబాబు మమ్మల్ని మోసగించాడు సార్..’ అంటూ వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన ఎస్టీ మహిళలు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ‘నిజమే తల్లీ.. పచ్చిమోసకారి ప్రభుత్వమిది.. చంద్రబాబు ప్రజల్ని నిలువునా వంచించాడు. రుణమాఫీ అని చెప్పి బ్యాంకర్ల వద్ద రైతులను డీఫాల్టర్స్‌గా మార్చారు.

వడ్డీకి సరిపడా మొత్తం కూడా మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ అక్క చెల్లెళ్లకూ అన్యాయం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నాడు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ వర్తించే పరిస్థితే లేదు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వం మరెక్కడా ఉండదు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండవ రోజు శనివారం నాటి పర్యటనలో ప్రజలకు, వైఎస్ జగన్‌కు మధ్య సంభాషణ ఇది. ఇటీవల మృతి చెందిన వేంపల్లె మాజీ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి స్మృతికి వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.

ఆయన కుమారుడు, ప్రస్తుత వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో ప్రతిపక్షనేతను చూసేందుకు, ఆయనకు తమ కష్టాలు తెలుపుకునేందుకు బక్కన్నగారిపల్లె మహిళలు బారులుతీరారు. వారిని చూడగానే వాహనం ఆపిన జగన్ ‘బాగున్నారా అమ్మా..’ అని పలుకరించారు. ప్రతిపక్షనేత ఆప్యాయంగా పలుకరించడంతో వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంది. తమ కష్టాలన్నిటినీ ఏకరువుపెట్టారు. దీంతో ప్రజల పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జగన్ హెచ్చరికతో తాగునీరు సరఫరా
 తాగునీటి సరఫరా నిలిచిపోయి మూడువారాలుగా  ఇక్కట్లు పడుతున్న 100 గ్రామాలు  జగన్ జోక్యంతో ఊరటచెందాయి. పులివెందుల నియోజకవర్గంలోని పార్నపల్లె సీపీడబ్ల్యు స్కీం నుంచి  బంద్ చేశారు. ఈ విషయం తెలుసు  జగన్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులుతో మాట్లాడి  నీటి సరఫరా వెంటనే చేయించారు.

Popular Posts

Topics :