14 February 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఏ ఒక్కరూ పార్టీని వీడరు

Written By news on Saturday, February 20, 2016 | 2/20/2016


'ఆ పార్టీ.. మునిగిపోయే పడవ'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సీనియర్ నాయకుడని... ఆయన పార్టీలోనే ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో భూమా నాగిరెడ్డి నివాసం వద్ద పార్టీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డితోపాటు ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ మునిగిపోయే పడవ అని ఆయన ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాలంలో ఒక్క ఎమ్మెల్యే అయినా తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లారా అని ఈ సందర్భంగా విలేకర్లను సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథనాలన్నీ మీడియా సృష్టించినవే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు కేసు నేపథ్యంలో భూమా నాగిరెడ్డి శుక్రవారం నంద్యాల వెళ్లారని చెప్పారు. ఇప్పటికే మీడియాలో వస్తున్న కథనాలపై ఆయనతో చర్చించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ నేతల వేధింపుల అంశం చర్చకు వచ్చిందన్నారు. కుమార్తె పెళ్లి కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని... అలాంటి సమయంలో ఇలాంటి వన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదని భూమా నాగిరెడ్డి తమతో వెల్లడించారని వారు చెప్పారు.
మీడియాలో ప్రసారమైన వార్తలు చూసి తాము భూమాను కలిసేందుకు వచ్చామని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తెలిపారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.... ఏ ఒక్కరూ పార్టీని వీడరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

టీడీపీ నేతలకు ఇప్పుడు అర్థమైంది


'టీడీపీ నేతలకు ఇప్పుడు అర్థమైంది'
విజయవాడ: మాస్టర్ ప్లాన్ వల్ల రైతుల జీవితాలు నాశనం అవుతాయని మొదట నుంచీ చెబుతున్నా పట్టించుకోలేదని  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కాగా రైతుల్లో ఎంత వ్యతిరేకత ఉందో టీడీపీ నేతలకు ఇప్పుడు అర్థమైందన్నారు. కాగా సీఆర్ డీఏ రాజధాని మాస్టర్ ప్లాన్ పై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆ పార్టీ.. మునిగిపోయే పడవ



హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సీనియర్ నాయకుడని... ఆయన పార్టీలోనే ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో భూమా నాగిరెడ్డి నివాసం వద్ద పార్టీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డితోపాటు ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ మునిగిపోయే పడవ అని ఆయన ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాలంలో ఒక్క ఎమ్మెల్యే అయినా తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లారా అని ఈ సందర్భంగా విలేకర్లను సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథనాలన్నీ మీడియా సృష్టించినవే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు కేసు నేపథ్యంలో భూమా నాగిరెడ్డి శుక్రవారం నంద్యాల వెళ్లారని చెప్పారు. ఇప్పటికే మీడియాలో వస్తున్న కథనాలపై ఆయనతో చర్చించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ నేతల వేధింపుల అంశం చర్చకు వచ్చిందన్నారు. కుమార్తె పెళ్లి కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని... అలాంటి సమయంలో ఇలాంటి వన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదని భూమా నాగిరెడ్డి తమతో వెల్లడించారని వారు చెప్పారు.
మీడియాలో ప్రసారమైన వార్తలు చూసి తాము భూమాను కలిసేందుకు వచ్చామని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తెలిపారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.... ఏ ఒక్కరూ పార్టీని వీడరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని.....


చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు...బుడ్డా రాజశేఖరరెడ్డి
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ...' చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి' అని అన్నారు.

మాపై ఎందుకు అభాండాలు

పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు.


సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్


కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.... వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారన్న వార్తలను ఖండించారు.

చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మణిగాంధీ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించకోక తప్పదన్నారు.

నేటి నుంచి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ


నేటి నుంచి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ
అనంతపురం: వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి రెండురోజులపాటు జలజాగరణ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే హంద్రీనీవా పథకం ద్వారా చెరువులను నింపడంతో పాటు మొదటి దశ ప్రతిపాదిత అయకట్టుకు సాగునీటిని పోరాడి తెచ్చుకుందాం అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.

జలజాగరణ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు హాజరు కానున్నారు. జలజాగరణకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని వివిధ మండలాలనుంచి రైతులు తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు జలజాగరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జలజాగరణను విజయవంతం చేయాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వారంరోజులుగా నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో విసృతంగా పర్యటించి రైతులు, మహిళలు, యువకులు తదితరులను కలుసుకుని జలజాగరణకు సంఘీభావం తెలపాలని కోరారు.
తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు అందించే పైపు లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న డిమాండ్లతో జలజాగరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బెళుగుప్ప మండలంలో 26,500 ఎకరాలకు సాగునీటిని మొదటిదశలోనే అందించాల్సి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అనంత కరువును శాశ్వతంగా నివారించాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు ఐదు టీఎంసీలతో తాగునీటి పథకంగా రెండుసార్లు శంఖుస్థాపన చేసి వదిలేసిన  హంద్రీనీవా పథకాన్ని  40 టీఎంసీలకు పెంచారన్నారు.  రెండుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు  నీటిని కూడా తీసువచ్చారని గుర్తుచేశారు.

కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సర్కారు వైఖరి దారుణం: జగన్


కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సర్కారు వైఖరి దారుణం: జగన్
25న ‘చలో విజయవాడ’ ధర్నాకు హాజరవుతానని హామీ
వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడి


 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 25న తాము తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా సంఘం ప్రధాన కార్యదర్శి బి.జె.గాంధీ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.సంతోషరావులు శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ధర్నా కార్యక్రమానికి తప్పక వస్తానని, తనతోపాటు పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరవుతారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును పొడిగిస్తూ ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో.. ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం సరికాదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయనీ సందర్భంగా హామీఇచ్చారు.

అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం!


అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం!
కాసులు కురిపిస్తాం... మంత్రి పదవిస్తాం
♦ ప్రతిపక్ష శాసనసభ్యులకు పదవుల ఎర
♦ భారీగా ముడుపులు ఇస్తానంటూ ప్రలోభాల పర్వం
♦ ఇసుకనుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకూ అడ్డగోలు అవినీతితో రూ.వేల కోట్ల దోపిడీ.. ఆ సొమ్ముతో పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు యత్నాలు
♦ ఓటుకు రూ.ఐదు నుంచి రూ.20 కోట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు
♦ ఇప్పుడు సొంత రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు భారీ రేంజ్‌లో ఆఫర్‌లు

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అవహేళనచేస్తూ అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం నేడు ప్రజాతీర్పునూ ఎగతాళి చేస్తూ సంతబేరాలకు నడుం కట్టింది. అలవిమాలిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన నేపథ్యంలో పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను, ప్రజల దృష్టినీ పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. పదవులు, పనులు, ముడుపులను ఎరగా చూపుతూ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు టీడీపీ అధినేత సిగ్గెగ్గులు లేనిరీతిలో వ్యవహరిస్తున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినీతి, అక్రమాలతో సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న  బాబు, ఆయన కోటరీ... ఇప్పుడు ఆ డబ్బులను వెదజల్లి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమాలను  చేపడుతోంది. తెలంగాణలో పార్టీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో... పరువు కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే రీతిలో దుస్సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారని పరిశీలకులు దుయ్యబడుతున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీలపై వలవేసిన బాబు తాజాగా ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. జిల్లాల్లోని ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేయిస్తూ, తన వర్గీయుల ద్వారా మంతనాలను నెరుపుతూ, తాయిలాల ఆశలు చూపుతూ  ఏదోవిధంగా టీడీపీ దరిచేర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అందులో భాగంగా అనుంగు పత్రికలు, మీడియా ద్వారా అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రజలకు హామీలు ఇచ్చిన రీతిలోనే నేతలను మభ్యపెడుతూ మంత్రి పదవుల ఆశలు చూపుతున్నారనే సమాచారం పొక్కుతోంది.

 బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...
 సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని రైతన్నలను మోసం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను ముంచేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ వాగ్దానం చేసి వారిని వీధుల్లోకి లాగారు. ఇదే అంశంలో మరోవైపు బీసీలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అశాంతి పరిస్థితులను కల్పించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఆశలు చూపి నిరుద్యోగ యువతకు ఏమీ చేయకుండా వారిని ఎగతాళి చేశారు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలనుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

టీడీపీ నేతలు ఏ ఊరు వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేతలూ దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ పనులను తాత్కాలిక పద్ధతిలో చేపట్టి అక్రమాలను కొనసాగిస్తూ అందులో నుంచి వందలు, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. ఏపీకి వరప్రదాయినిగా భావించే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి తాత్కాలిక ప్రయోజనాల పేరిట పట్టిసీమలో రూ.500 కోట్లకు పైగా నొక్కేశారు. గోదావరి పుష్కరాల పేరిట  1600 కోట్లతో తాత్కాలిక పనులు  చేపట్టి, ఏమాత్రం శాశ్వత ప్రయోజనాలు కల్పించకుండా అభాసుపాలయ్యారు. తన ప్రచార్భాటం కోసం తొక్కిసలాటకు కారకులై భక్తుల మృతికి బాధ్యులయ్యారు. ఆయా పండుగల సమయాల్లో పేదలకు ‘చంద్రన్న’ కానుకల పేరిట రెండేళ్లలో రూ.750 కోట్ల వరకు ఖర్చుచేశారు.

నాసిరకం వస్తువులను కూడా సరిగా పంపిణీ చేయలేక తన పరువు తీశారని బాబు మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలు రెండు వేల కోట్లు దాటాయని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి యనమల  ప్రకటించారు. ఇక రాజధానిప్రాంతంలో చంద్రబాబు సర్కారు చేయని అరాచకం అంటూ లేదు. అమరావతిని టీడీపీ రియల్‌ఎస్టేట్ ప్రాంతంగా మార్చేసి భారీ దోపిడీకి ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములను తనకు, తన కోటరీకి దక్కేలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు చేపట్టిన ప్రతి పనిలోనూ జనానికి రోత పుట్టించే రీతిలో వేల కోట్ల అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం వాటిని మరుగుపరిచేందుకు అనైతిక రాజకీయాలను కొనసాగిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించకపోతే పార్టీ మట్టికొట్టుకు పోతుందన్న భయంతో, ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రలోభాలకు వెచ్చించడానికి సిద్ధపడిన బాబు సర్కారు విపక్ష ఎమ్మెల్యేలతో సంతబేరానికి ఒడిగడుతోంది. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారంటూ సాక్షాత్తు కేబినెట్‌లో మంత్రులకు టార్గెట్లు పెట్టడం బరితెగింపునకు పరాకాష్ట అని పరిశీలకులు దుయ్యబడుతున్నారు. నిత్యం రాజకీయాల్లో నైతిక విలువల గురించి ఏకరువు పెట్టే ముఖ్యనేత ఫిరాయింపులను ప్రోత్సహించలేని మీరెందుకని కేబినెట్ భేటీలో  సహచర మంత్రులను ఛీత్కరించుకున్న వైనాన్ని గుర్తుచేసుకుంటూ ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారు.

 తెలంగాణలో తెల్లారిపోవడంతో...
 తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తుడుచిపెట్టుకుపోతుండటంతో దిమ్మతిరిగిన చంద్రబాబుకు ప్రజావ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ పరిస్థితి తలెత్తుతుందనే భయాందోళనలు నిలువెల్లా అలముకున్నాయి. అంతకుముందు తెలంగాణ శాసనమండలిలో ఒక్క స్థానాన్ని దక్కించుకునేందుకు ఓట్ల బేరసారాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయి పరువును బజారున పెట్టుకున్నారు. ఒక్కో ఓటుకు అయిదు నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్మును ఇవ్వజూపి ఆడియో- వీడియో టేపుల్లో ఇరుక్కుపోయారు. పక్కరాష్ట్రంలోనే ఓటుకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు సొంత రాష్ర్టంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేయడానికి ఏ రేంజ్‌లో ఆఫర్లు చేస్తుంటారో ఊహించుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అవినీతి డబ్బులకు లొంగే అవసరం లేని వారికి మంత్రి పదవులను ఎరవేస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది. మరికొందరికి భారీ కాంట్రాక్టులకు కానుకగా ఇస్తామని హామీలిస్తూ ఆకర్షిస్తున్నారని తెలుస్తోంది. శాసనసభలో బలమైన ప్రతిపక్షాన్ని ఎదిరించే సత్తాలేక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుంగు మీడియా ద్వారా ఫిరాయింపు వార్తలను ప్రచారం చేయించుకుంటున్న తీరును చూసి ప్రజాస్వామికవాదులు విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును గౌరవించే సంస్కారం లేని నాయకత్వంతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతుందనే భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఫిరాయింపుల చట్టంపై కనీసం గౌరవం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ మా వాడే, మీ సభ్యత్వానికి ఢోకా ఉండదు... రండి రండంటూ స్వయంగా కీలక నేతే ఫోన్లు చేసి పిలవడాన్ని, మంతనాలు జరుపుతుండటాన్ని పలువురు శాసనసభ్యులు ఛీత్కరించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని సంతబేరంగా మార్చిన చంద్రబాబు చర్యలపై పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అరాచక పాలన అంతమొందిద్దాం


అరాచక పాలన అంతమొందిద్దాం
దోచుకుని దాచుకోవడమే టీడీపీ ప్రధాన అజెండా
సీఎం చంద్రబాబు నైతిక విలువల్లేని పాలన సాగిస్తున్నారు
బాపట్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత బొత్స  

 

బాపట్ల దోచుకో.. దాచుకో అన్నదే ప్రధాన అజెండాగా రాష్ర్టంలో టీ డీపీ పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అరాచకపాలన అంతమొందే రోజులు దగ్గరపడ్డాయని ఆపార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం గుంటూరు జిల్లా బాపట్ల నియోజకర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అబద్దాలతో అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు కనీస నైతిక విలువలులేని పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు టీడీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, ప్రజాస్వామ్య విలువలకు భగ్నం కలిగించేలా జన్మభూమి కమిటీలు వేసి వారి ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అధైర్యపడొద్దని, ప్రజలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఆరాచక పాలనను సమష్టిగాపారద్రోలాని పిలుపునిచ్చారు.


 రాజకీయాలకు అతీతమైన పాలన జగన్‌తోనే సాధ్యం..
జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలని టీడీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందనిఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా పని చేసి చూపిన వైఎస్సార్ పాలన మళ్లీ కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అధికారపార్టీ చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోవుకాలంలో వైఎస్సార్ సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అప్పుడు ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చక్కబెట్టుకుందని సూచించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాలలో రాజకీయ చిచ్చు రేకెత్తిస్తున్న చంద్రబాబు మాటలను ఎవరు నమ్మొద్దని పిలుపునిచ్చారు.

ఈవేదిక ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేద్దామని కోరారు. ఈ సమావేశంలో మాచర్ల, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తాఫా, పార్టీ నాయకులు లేళ్ళ అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, వరికూటి అమృతపాణి, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నరాలశెట్టి ప్రకాశరరావు, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, కోకి రాఘవరెడ్డి, షేక్ బాజీ, జడ్పీటీసీలు వడ్డిముక్కల రత్నమణి, చిరసాని నారపరెడ్డి, గుంపులకన్నయ్య, ఎంపీపీ మాడ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే కోన రఘుపతి నాయకత్వంలో బాపట్ల భారీ ప్రదర్శన నిర్వహించారు.

టీడీపీలో ఎవరూ చేరరు


పోరుమామిళ్ల: తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారని, ఆ పార్టీలోకి బయటి నుంచి వెళ్లి ఎవరు చేరతారని బద్వేలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జయరాములు ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రాభవం తగ్గుతోందన్నారు. అన్నివర్గాల ప్రజులు అసంతృప్తితో రగిలిపోతున్నారని జయరాములు చెప్పారు. మంత్రులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుండటంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో మైండ్‌ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి విలువలకు కట్టుబడి ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ తండ్రిని టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి సర్పంచ్ టీడీపీలో చేరాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ తండ్రి కూడా టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు.

ఎన్నిసార్లు ఖండించాలి

Written By news on Friday, February 19, 2016 | 2/19/2016


కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బలంగా ఉందన్న దుగ్ధతోనే తాము పార్టీ మారుతున్నట్లు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. జిల్లా నుంచి గెలిచినవాళ్లంతా మంచి క్యారెక్టర్, విజన్ ఉన్నవాళ్లని.. అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారని ఆయన చెప్పారు. తమ బలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నట్లుగా ఓ ప్రకటన ఇచ్చారని ఆయన అన్నారు.

ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్లారో ఈవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు ఎన్నికల కౌంటింగ్ ముగిసి.. తాను గెలిచినట్లు తెలిసిన మరుక్షణం నుంచే తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశారని భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రతిరోజూ రాస్తున్నారని... దాన్ని ఎన్నిసార్లు ఖండించాలని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ సీపీపై బురద జల్లేందుకు ఆ నివేదిక


'వైఎస్ఆర్ సీపీపై బురద జల్లేందుకు ఆ నివేదిక..'
హైదరాబాద్: ప్రభుత్వం కావాలనే కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చతోపాటు వీడియో ఫుటేజి లీకేజీ తదితర అంశాలపై  ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. కాగా ఈ కమిటీలో  గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు.

కమిటీ భేటీ అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీపై బురదజల్లే ఎజెండాతో బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక రూపొందించిందని అన్నారు. వీడియో లీకేజ్ అంశంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేద్దామన్నా స్పందించలేదని చెప్పారు. మంత్రులు అధికార సభ్యులకు స్పీకర్ మైకు ఇచ్చి.. ప్రతిపక్ష నేతను దూషించే విధానాన్ని మానుకోవాలని నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

తప్పుడు వీడియోలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొంతమందిపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందని ఇదే విషయం కమిటీలో చెప్పానని శ్రీకాంత్ రెడ్డి  అన్నారు. అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరీ, బోండా ఉమ ఎంత దారుణంగా మాట్లాడినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గెలుపు

పులివెందుల : పులివెందులలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఘన విజయం సాధించింది. పులివెందుల ఆర్టీసీ డిపోలో మొత్తం 466 ఓట్లు ఉన్నాయి. ఇందులో 12 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు. మిగిలిన 454 ఓట్లలో 452 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు 191 ఓట్లు రాగా, ఎంప్లాయీస్ యూనియన్‌కు 148 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 94 ఓట్లు లభించగా, టీడీపీ అనుబంధ యూనియన్ కార్మిక పరిషత్‌కు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఎంప్లాయీస్ యూనియన్‌పై వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ 43 ఓట్ల తేడాతో గెలుపొందింది. యూనియన్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే పులివెందులలో వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ గెలుపొందడం విశేషం. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డిలు ఇందుకు విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు. ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు.

ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి?


ఆ పది వేల కోట్లు ఎవరి జేబుల్లోకి?
టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెంపులో అత్యధికంగా పెరిగిన రూ. పదివేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రూ.11 వేలకోట్ల వ్యయం కాగల సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.24 వేల కోట్లకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని సూటిగా ప్రశ్నించారు.

ప్రాజెక్టు పనుల వ్యయం మీద 40 శాతం పెంపు ఇవ్వడానికే ప్రభుత్వం జీవో-22ను విడుదల చేసిందన్నారు. పెరిగిన ధరల ప్రకారం రూ.11 వేల కోట్ల ప్రాజెక్టుల వ్యయం మహా అయితే రూ.14 వేల కోట్లకు పెరుగుతుంది గానీ ఏకంగా రూ.24 వేల కోట్లకు ఎలా పెరుగుతుందన్నారు. ఇలా అప్పనంగా పెంచేసిన రూ.10 వేల కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఎవరు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నబాబు డెరైక్షన్... పెద్ద బాబు యాక్షన్‌తోనే వ్యయం పెంపుదల జీవోలు జారీ అవుతున్నాయని ధ్వజమెత్తారు.

ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతకాలు చేయడానికి నిరాకరించినా మంత్రివర్గంలో పెట్టి  తీసుకున్న ఈ నిర్ణయం పత్రికల్లో లీకైన తరువాత సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెంచడంలో తప్పేముంది అని సమర్థించుకోవడం చూస్తే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా దోపిడీకి పాల్పడుతోందనేది అర్థం అవుతోందన్నారు. అవినీతి జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
 
టీడీపీ ఎంపీలకు దోచిపెడుతున్నారు : హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని 26, 27, 28 ప్యాకేజీల పనులకు ఇప్పటికే ఉన్న జీవో నెంబరు-22 ప్రకారం ఇచ్చిన పెంపునే వర్తింపజేస్తూ ఒక్క 29 ప్యాకేజీ పనుల వ్యయాన్ని మాత్రం అసాధారణంగా పెంచేశారన్నారు. మైటాస్-ఎన్‌సీసీ సంస్థలు జాయింట్‌వెంచర్‌గా దక్కించుకున్న ఈ 29వ ప్యాకేజీ పనులను టీడీపీ రాజ్యసభ సభ్యుడు,సీఎంకు  సన్నిహితుడు అయిన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ చేస్తున్నదని, ఆయనకు అప్పనంగా దోచి పెట్టేందుకే రూ.12కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.115.4 కోట్లకు పెంచేశారని గోవర్థన్ దుయ్యబ ట్టారు.

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ వ్యయాన్ని కూడా రూ.4000 కోట్ల నుంచి రూ.7000 కోట్లకు పెంచారని, ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని మళ్లీ రూ.16 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్‌కు దోచి పెడుతున్నారని చెప్పారు.
 
అధికారులూ జాగ్రత్త : రాష్ట్రంలో ఇప్పటికే 25 సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారని, ఇంకా 15 ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గోవర్థన్‌రెడ్డి చెప్పారు. జీవో నెంబర్-22 ప్రకారం ఇప్పటికే పెంచింది చాలక అప్పనంగా తన వారికి దోచిపెట్టి తానూ నొక్కేందుకే  చంద్రబాబు అత్యధికంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే అందుకు అధికారులు ఆమోదముద్ర వేస్తే వారు ఇరుక్కు పోతారని హెచ్చరించారు.

అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని, వాటిని పక్కనబెట్టి కనుక నిర్ణయాలు తీసుకుంటే  విచారణ జరిగినపుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు తాము చేయదల్చుకున్నది చేసి వెళ్లి పోతారని, జవాబుదారీగా మిగిలేది అధికారులేనని హెచ్చరించారు. తాము ఎన్ని సార్లు విమర్శించినా ప్రభుత్వం నిస్సిగ్గుగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోందన్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు తమ పార్టీ పోరాడుతుందన్నారు.

కారుచౌక రేటుకు 1,800 ఎకరాలు


దళితుల శోకమే.. రాజధాని శంఖమా?
♦ అధికార పార్టీ నేతల ‘అసైన్డ్’ మాయ
♦ కారుచౌక రేటుకు  1,800 ఎకరాలు కొట్టేశారు
♦ పేద రైతులను వంచించి భూములు కాజేశారు
♦ అసైన్డ్ భూములకు పరిహారం ఉండదని ప్రచారాలు
♦ ముందస్తు పథకం ప్రకారమే లేటుగా అసైన్డ్ ప్యాకేజీ
♦ అప్పటికే చౌకరేట్లకు అమ్ముకున్న రైతులు
♦ ప్యాకేజీతో లాభపడేది ‘పచ్చ’గద్దలే
♦ పలుమార్లు హెచ్చరించిన ‘సాక్షి’
 సాక్షి, హైదరాబాద్/గుంటూరు/విజయవాడ ;అన్యాయం.. దుర్మార్గం.. పేద దళిత రైతులను పట్టపగలు దారుణంగా వంచించారు.. పరిహారం రాదంటూ ప్రచారాలు చేసి వారి అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేశారు. కోట్లు కొల్లగొట్టడానికి పేద రైతుల పొట్ట కూడా కొట్టడానికి వెనుకాడబోమని అధికార పార్టీ నేతలు మరోమారు రుజువు చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేద దళిత రైతులను మోసగించి అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేసిన ‘పెద్దలు’ ఏకంగా రూ. 2,640 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ దన్నుతో ‘పసుపు దళం’ ఒక పథకం ప్రకారం సాగించిన కుంభకోణం ఇది. నాలుగు నెలల వ్యవధిలోనే కోట్లకు పడగలెత్తిన భూబకాసురులు వేసిన పథకాలు, చేసిన కుట్రలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్న రైతులను సామదానభేద దండోపాయాలతో మాయజేసి వారి అసైన్డ్ భూములను కాజేశారు.
వారి నోటికాడ ముద్దను లాగేశారు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూములలో అసైన్డ్ భూములుంటే వాటికి పరిహారం రాదని ముందు ప్రచారం చేశారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగానైనా తీసేసుకుంటుంది కాబట్టి తమకిస్తే ఎంతోకొంత ఇస్తామని నమ్మించారు. ఎకరాకు ఐదారు లక్షలు చేతిలోపెట్టి సొంతం చేసుకున్నారు. వీలైనన్ని భూములను బినామీ పేర్లతో కాజేసిన తర్వాత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రభుత్వం అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం అధికార పార్టీ నేతలకు దక్కుతోంది రూ.2,640 కోట్లకు పైమాటే. కానీ దళిత రైతులకు విదిల్చింది పదికోట్లు కూడా మించదు. రాజధాని ప్రాంతంలో దళితరైతుల అసైన్డ్ భూములను కాజేస్తున్నారంటూ ‘సాక్షి’ పదేపదే చేసిన హెచ్చరికలు ఇపుడు నిజమయ్యాయి. పూటకో అవినీతి వ్యవహారంతో వడివడిగా ‘అభివృద్ధి’ చెందుతున్న ‘పచ్చ’ గద్దలు రాజధాని ప్రాంతంలో చూపిస్తున్న చేతివాటం గురించి ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది.
 దళిత రైతుకు జరిగిన నష్టమేమిటంటే..
రాజధాని పేరుతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న మాయలు అనేకం. బినామీల భూములను వదిలేసి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కున్నారు.  పరిహారంగా నివాస, వాణిజ్య స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. భూములు ఇవ్వని రైతుల పొలాలు తగులబెట్టించి, వారిపైనే ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇపుడు అసైన్డ్ భూమిని సాగుచేసుకుంటూ బతుకులీడుస్తున్న బడుగు రైతులనూ వదలలేదు. ఎకరా సాగుచేసుకుంటున్న ఒక దళిత రైతును ఉదాహరణగా తీసుకుంటే... అధికార పార్టీ నేతలు పరిహారం రాదంటూ రైతును బెదరగొట్టి చేతిలో పెట్టింది రూ. 5 లక్షలు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం వారికి మాత్రం ఎకరానికి 1,000 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం రానున్నాయి. నివాస స్థలంలో గజం విలువ రూ. 10 వేలు ఉంటుందని అధికార పార్టీనేతలే ప్రచారం చేస్తున్నారు.
దాని ప్రకారం వెయ్యి గజాల విలువ కోటి రూపాయలు అవుతుంది. గజం వాణిజ్య స్థలం విలువ రూ. 15 వేలుంటుందని వారు చెబుతున్నదాన్ని బట్టి 200 గజాలకు రూ. 30 లక్షలు అవుతుంది. అంటే ఎకరా అసైన్డ్ భూమికి గాను రూ. 1.30 కోట్లు పరిహారంగా పొందనున్నారు. దీంతో పాటు ఏటా రూ.30వేల చొప్పున పదేళ్లపాటు పరిహారం కూడా లభించనుంది. ఇది మెట్టప్రాంత రైతులకిచ్చే పరిహారం మాత్రమే. జరీబు భూములకు ఈ పరిహారం ఇంకా ఎక్కువ ఉంది. వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని చెబుతున్నారు. అంటే ఎకరా ఇచ్చినవారు రూ. 1.90 కోట్లు పరిహారంగా పొందుతారన్నమాట. దాంతోపాటు ఏటా రూ.50 వేల చొప్పున పదేళ్లపాటు పరిహారం అందనుంది. బడుగు రైతుకు ఐదులక్షలు విదిల్చిన బాబుగారి బినామీలు అలా కోట్లలో కాజేయబోతున్నారు. సాధారణ రైతులకు ఈ పరిహారాలు అందుతాయో లేదో గానీ అధికారపార్టీ నేతలు.. అందులోనూ ‘ముఖ్య’నేతల బినామీలు కాబట్టి వారికి మాత్రం పక్కాగా అందుతాయనే దాంట్లో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. అందువల్ల ఎటు చూసినా రాజధాని పేరుతో సాగుతున్న తంతులో సాధారణ రైతులు, దళితులు మాత్రమే నష్టపోతున్నారు.
 1,800 ఎకరాలు కైంకర్యం..
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు 2,600 ఎకరాలుండగా అధికార పార్టీ నేతలు దాదాపు 1,800 ఎకరాల వరకు కైంకర్యం చేశారు. ఇందులో మెట్ట 1,300 ఎకరాలు, జరీబు భూములు 500 ఎకరాల వరకు ఉంటాయని అంచనా. అందులో ఎకరా మెట్ట భూమికి రూ. 1.30 కోట్ల చొప్పున 1,300 ఎకరాలకు గాను రూ. 1,690 కోట్లు, జరీబు భూములు ఎకరాకు రూ.1.90 కోట్ల చొప్పున 500 ఎకరాలకు రూ. 950 కోట్లు కొట్టేశారు. అంటే మొత్తం రూ. 2,640 కోట్లు. కానీ 1,800 ఎకరాలకు గాను పేద దళిత రైతులకు ఇచ్చింది రూ. 9 కోట్లకు లోపే.
 పేద రైతులను ఇలా మోసగించారు...
‘సీఆర్‌డీఏ’ భూ సమీకరణ విషయంలో టీడీపీ సర్కారు ఆది నుంచి మోసపూరితంగా వ్యవహరించింది. అసైన్డ్ భూములకు పరిహారం ఇస్తామనే విషయాన్ని ప్రకటించకుండా దాచి ఉంచడం ద్వారా పేదలు, ఎస్సీ, ఎస్టీల చేతుల్లో భూములు లేకుండా పోయేలా కుట్రపూరితంగా వ్యవహరించింది. ‘అసైన్డ్ భూములను ప్రభుత్వం సీఆర్‌డీఏ కోసం వెనక్కు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటే పైసా కూడా రాదు. మాకు అమ్ముకుంటే అంతో ఇంతో ఇస్తాం. కుటుంబ అవసరాలకు వస్తుంది... ’ అని చెప్పడం ద్వారా పేదలను అధికారపార్టీ నేతలు భయపెట్టారు. అక్కడి రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు కూడా అసైన్డ్ భూములకు పరిహారం రాదంటూ వారికి వంతపాడారు.
దీంతో పేదలు  ఆందోళనకు గురై దిక్కుతోచక ఊరికే భూమి పోతుందనే భయంతో తమ అసైన్డ్ భూములను నామమాత్రపు ధరకు టీడీపీ నేతలకు రాయించారు. ప్రభుత్వం ఇలా మోసపూరితంగా వ్యవహరించకుండా ముందే అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని (బుధవారం జీవో ఇచ్చిన ప్రకారం) బహిరంగంగా ప్రకటించి ఉంటే పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పప్పు బెల్లాలకు చందంగా భూములు అమ్మేవారు కాదు. ప్రభుత్వ పెద్దలు ఇలా మోసపూరితంగా పరిహారం విషయాన్ని ప్రకటించకుండా రహస్యంగా ఉంచడం వెనుక పేదల నుంచి కారు చౌకగా భూములు కొనాలనే స్వార్థమే కారణం. వారి లక్ష్యం నెరవేరింది. అంతిమంగా పేదలు దారుణంగా నష్టపోయారు.
 చట్టానికి తూట్లు
1954 జూన్ 18వ తేదీ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ (పేదలకు ఇచ్చిన) భూములను వారు లేదా వారి వారసులు అనుభవించి ఫలసాయం పొందాలే గానీ ఎవరికీ బదలాయించడానికి వీలులేదు. అనగా ఈ తేదీ తర్వాత అసైన్‌మెంట్ కింద భూములు పొందిన వారికి విక్రయించే హక్కు లేదు. ఎవరైనా కొనుగోలు చేసినా ప్రభుత్వం స్వాధీనం  చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకుగానీ, వేరే పేదలకు గానీ ఇవ్వాలి. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (పీఓటీ) యాక్టు ఇదే చెబుతోంది.
 చంద్రబాబు సర్కారు చేస్తున్నదేమిటి?
అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు వీలుగా 1988 పీఓటీని సవరించాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఈ చట్ట సవరణకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరింది.  కొన్ని రాష్ట్రాల్లో అసైన్‌మెంట్ భూములను విక్రయించుకునేలా చట్టం ఉందని,  అదే విధంగా సవరించుకోవచ్చంటూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్  ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై స్పష్టమైన సమాచారంతో ప్రతిపాదన పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు మీడియాలో వార్తలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి సమాచారం రావడంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను ఆపి ఉంచాలని మౌఖికంగా ఆదేశించింది.
తాతల కాలం నుంచి సాగులో..
వెలగపూడి గ్రామంలోని సర్వే నంబరు 270లోని 52 సెంట్ల అసైన్డు భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అసైన్డు భూమిని రాజధాని నిర్మాణ నిమిత్తం ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చా. ఇటీవల రాజధాని శంకుస్థాపనకు బట్టలు కూడా పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అసైన్డు భూములకు పరిహారం ఇవ్వరని ప్రచారం చేశారు. దాంతో ఆందోళన చెంది భూమి అమ్ముకున్నాం. అప్పుడే ప్రభుత్వం పరిహారం ప్రకటించివుంటే మాకు బాగుండేది.
                                            - మెండెం ఆదెయ్య, అసైన్డు భూమి రైతు
అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి..

తరాల నుంచి సాగు చేసుకుంటున్న మా భూములు అసైన్డు భూములని,  కనుక చెక్కులు ఇవ్వడం కుదరదని అధికారులు సాకులు చెబుతున్నారు. 50 సెంట్ల భూమిలో వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగుతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. రాజధాని నిర్మాణానికి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చా. రాజధాని భూ సమీకరణ అనంతరం అసైన్డు భూములకు పరిహారం రాదని ప్రచారం నేపథ్యంలో తక్కువ ధరకే భూమి అమ్ముకున్నాం. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించడం వల్ల అమ్ముకున్న మా లాంటి రైతులు నష్టపోయారు కానీ కొనుగోలు చేసిన వారు మాత్రం లాభంపొందారు. అసలైన లబ్ధిదారులు నష్టపోయారు. కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రభుత్వ పరిహారంతో కోట్లు గడిస్తారు. ఇప్పటికైనా అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయంచేయాలి. - మెండెం వెంకటేశ్వర్లు, అసైన్డు భూమి రైతు
చట్టానికి తూట్లు
1954 జూన్ 18వ తేదీ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ (పేదలకు ఇచ్చిన) భూములను వారు లేదా వారి వారసులు అనుభవించి ఫలసాయం పొందాలే గానీ ఎవరికీ బదలాయించడానికి వీలులేదు. అనగా ఈ తేదీ తర్వాత అసైన్‌మెంట్ కింద భూములు పొందిన వారికి విక్రయించే హక్కు లేదు. ఎవరైనా కొనుగోలు చేసినా ప్రభుత్వం స్వాధీనం  చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకుగానీ, వేరే పేదలకు గానీ ఇవ్వాలి. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (పీఓటీ) యాక్టు ఇదే చెబుతోంది.
 చంద్రబాబు సర్కారు చేస్తున్నదేమిటి?
అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు వీలుగా 1988 పీఓటీని సవరించాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఈ చట్ట సవరణకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరింది.  కొన్ని రాష్ట్రాల్లో అసైన్‌మెంట్ భూములను విక్రయించుకునేలా చట్టం ఉందని,  అదే విధంగా సవరించుకోవచ్చంటూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్  ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై స్పష్టమైన సమాచారంతో ప్రతిపాదన పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు మీడియాలో వార్తలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి సమాచారం రావడంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను ఆపి ఉంచాలని మౌఖికంగా ఆదేశించింది.

మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్

Written By news on Thursday, February 18, 2016 | 2/18/2016


మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్
విశాఖ : విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు.  పవిత్ర స్నానానంతరం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు ధరించి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ...వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు.  కుంభాభిషేకం అనంతరం స్వరూపానందేంద్ర స్వామి కొద్దిసేపు వైఎస్ జగన్ తో ముచ్చటించారు.
కాగా గత ఏడాది జనవరి 27న కూడా శారదా పీఠం వార్షికోత్సవాల్లో వైఎస్ జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్ కుమార్ జంటను ఆశీర్వదిస్తారు.

లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్


‘లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్డైరీని ఆవిష్కరిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో వేంపల్లి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎయిమ్ వ్యాప్తి అడ్వర్‌టైజింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూపొందించిన ‘లీడర్ టు లీడర్-2016 డైరీ’ని బుధవారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వేంపల్లి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమరులైన అనంతరం 2010 సంవత్సరంలో తొలిసారిగా ఆయన జీవిత విశేషాలను ఫొటోలతో సహా పొందుపరుస్తూ ఈ డైరీని రూపొందించామని చెప్పారు.

అప్పటి నుంచి ప్రతి ఏటా డైరీని రూపొందిస్తున్నామని, నేటి వరకు ఒక్క ఏడాది మినహా ప్రతి సంవత్సరం జగన్ చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్ జీవిత విశేషాలు, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను ప్రధానాంశంగా తీసుకుని డైరీని రూపొందించామని, కాని ఈ 2016  డైరీలో మహానేత జీవిత విశేషాలతో పాటు యువనేత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, రైతు భరోసా యాత్ర, రైతు పరామర్శ యాత్ర, ప్రజా సమస్యలపై చేసిన ధర్నాలు, దీక్షలు, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన దీక్షలు, మహానేత  తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర, పరామర్శ యాత్ర తదితర విశేషాలన్నింటినీ ఫొటోలతో సహా పొందుపరిచామని తెలిపారు. మహానేత జీవిత విశేషాలు, ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన దీక్షలు, యాత్రలతో డైరీని రూపొందించడం తనకు లభించిన ఒక అదృష్టమైతే, ఆ డైరీని యువనేత చేతుల మీదుగా ఆవిష్కరింపజేయగలగడం మరో అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎయిమ్ వ్యాప్తి సంస్థ క్రియేటివ్ డెరైక్టర్ నాగార్జున, ఉద్యోగులు బాషా, ఆలీ, రాజేష్‌లు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ


వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
ఇదే స్ఫూర్తితో ప్రజలకు చేరువకండి
రాజా, సునీల్, కన్నబాబులకు జగన్ సూచన

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ

 కాకినాడ : వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో రోజురోజుకి ఆదరణ పెరుగుతోందని, నాయకులు కూడా నిత్యం ప్రజల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడాలని ప్రతిపక్షనేత, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. త్వరలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రానున్నందున పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాకు సంబంధించిన మరికొన్ని ఇతర అంశాలపై కూడా ఆయన నేతలతో చర్చించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్

Written By news on Wednesday, February 17, 2016 | 2/17/2016


టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  హెచ్చరికలు జారీ చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో తమ ఎమ్మెల్యేలు 67 మంది వున్నారని....తమ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని..ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు చెబుతానన్నారు. వారి పేర్లు చెప్పిన గంటలోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తరువాత వైఎస్‌ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'నేను మాటలు చెప్పడం ఎందుకు? మీరే చూస్తారుగా. తన కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు చెబుతారు. కేటీఆర్, హరీశ్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదని కేబినెట్ లో మంత్రులకు చెప్పడం దారుణం. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాం. ఇవన్నీ ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి రాగలరా? నువ్వే సీఎం అయితే ఏ సమస్య లేదు. నువ్వు గెలుస్తావో, మేం గెలుస్తామో ప్రజలు తీర్పు చెబుతారు. చంద్రబాబు నాయుడు సంపాదించిన బ్లాక్ మనీ ఎక్కువ ఉంది. ఆయన ఏమైనా చేయగలడు. పై నున్న దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారు.' అని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబుకు ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆయనకు మీడియాలో కొద్దో గొప్పో సపోర్టు ఉంది. దాని ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం ఆయనకు అలవాటు అయిన పని. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారంటూ పేపర్లలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్లు రాయడం... మా ఎమ్మెల్యేలు జిల్లాల వైజ్ గా ప్రెస్ మీట్ లు, మీడియా సమావేశాలు పెట్టి ఎడాపెడా తిట్టడం..అలా తిడుతున్నా అలా అలా దులుపుకుని... నాలుగు రోజులవరకూ ఆగి మళ్లీ ఐదోరోజు మొదలు. అసలు ప్రజల్లో  చంద్రబాబు నాయుడు గురించి ఎంక్వైరీ చేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.  అసలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ టీడీపీలోకి వెళ్లరు. కానీ చంద్రబాబుకి అవన్నీ తెలిసినా దులుపుకుపోవడం అలవాటే.' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ


నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ
హైదరాబాద్ : భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  బలోపేతమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తిగా ఉందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మేకపాటి ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ టీడీపీలో చేరరని మేకపాటి స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ త్వరలో ఖాళీ అవుతుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేరికతో జిల్లా పార్టీకి కొత్త ఉత్సాహానిస్తుందన్నారు.

టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా త్యజిస్తా

Written By news on Tuesday, February 16, 2016 | 2/16/2016


'టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా త్యజిస్తా'
కడప: అధికార టీడీపీ నాయకుల కుయుక్తులు, కుతంత్రాలకు వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ లొంగరని వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో చేరాల్సివస్తే ప్రాణాలైనా త్యజిస్తానని ఘాటుగా స్పందించారు.

కడపలో మంగళవారం జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, చంద్రబాబును పొగడలేదని తెలిపారు. టీడీపీ అంటేనే అసహ్యం వేస్తోందన్నారు. రాజంపేట వైఎస్సార్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడరాదన్నారు.

అలా చేస్తే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెలో ఇటీవల అధికారికంగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా తాను పాల్గొన్నానని తెలిపారు. స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతల జోక్యంతో కొందరు ఆ శిలాఫలకాన్ని పగులగొట్టడమే గాక, తమపై తప్పుడు కేసులు పెట్టించారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపు సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌


రేపు సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపు (బుధవారం) సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని ఘటన, వైఎస్‌ఆర్‌సీపీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.

కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకునేలా ఉంది


కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకునేలా ఉంది
హైదరాబాద్ :
అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై నియమించిన బుద్ధప్రసాద్ కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకునేలా ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నియమించిన ఈ కమిటీ భేటీ ముగిసింది. స్పీకర్‌కు నివేదిక ఇచ్చేందుకు ఈనెల 19న కమిటీ చివరిసారిగా సమావేశం కానుంది. తాము లేవనెత్తిన అంశాలకు కమిటీ నుంచి సరైన సమాధానం రాలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

తమ అభ్యంతరాలను కమిటీ చర్చించలేదని, కేవలం వైఎస్ఆర్‌సీపీనే టార్గెట్‌గా చేసుకుని చర్చించిందని ఆయన అన్నారు. సోషల మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేద్దామని అడిగినా కమిటీ ముందుకు రాలేదని చెప్పారు. బుద్ధప్రసాద్ కమిటీతో తమకు న్యాయం జరిగేలా లేదని అన్నారు. అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీని దారుణంగా విమర్శించిన టీడీపీ నేతలపై కమిటీలో చర్చించకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలతో న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా


గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా
రోజుకూలికెళితే తప్ప పూటగడవని పేదలు వారు.. చిన్న బడ్డీకొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నవారు మరికొందరు.. విజయవాడలో రామవరప్పాడు వద్ద రోడ్డుపక్కన నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు వారి గూడును పీకేసింది.. దీంతో తల్లడిల్లిపోతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  బాధితులు తమ ఆవేదనను జగన్‌మోహన్‌రెడ్డికి వివరించి కన్నీరు పెట్టుకున్నారు.
 
పేదల తరఫున కోర్టులో కేసు వేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం
పోరాటం చేయాలని బాధితులకు పిలుపు
గ్రీన్ జోన్‌పై జననేతకు రైతుల వినతి
నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణికి నివాళి
విజయవాడలో సామినేని ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ

 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడలో రామవరప్పాడు వద్ద ఇళ్లు కోల్పోయిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. రోడ్డు పనులు చేస్తున్న ప్రదేశాన్ని, గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు తమ కష్టాలను ఆయన ఎదుట మొరపెట్టుకున్నారు. ప్రధానంగా మహిళలు తమ గోడు వినిపించారు. ‘అన్నా... ఇటువంటి ప్రభుత్వాన్ని మేమెప్పుడూ చూడలేదన్నా... చంద్రబాబునాయుడు రోడ్డు వెంట వెళ్లేటప్పుడు గుడిసెలు కనిపించకూడదట.. ఇంత దారుణమా’ అంటూ వాపోయారు.
 
పోరాడండి.. అండగా నిలుస్తాం..
అన్యాయం జరిగినప్పుడు పోరాటమే మార్గం... మీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.. అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండని జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే 120 మంది గుడిసెలు తొల గించారని, ఇంకా 600 మంది గుడిసెలు ఉన్నాయని, వాటిని కూడా తొలగిస్తారంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేయగా ‘మీకేం భయం లేదు.. పోరాడండి’ అని భరోసా ఇచ్చారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నానిలతో మాట్లాడుతూ వెంటనే కోర్టులో కేసు వేయించాలని చెప్పారు.

బాధితుల తరఫున మనం పోరాడదామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని, పేదలపై కనీసం కనికరం కూడా చూపకుండా, ప్రత్యామ్నాయం చూడకుండా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
 
ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ...
అనంతరం ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సామినేని ఉదయభాను మాతృమూర్తి పద్మావతిని వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయభానుతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఆమె యోగక్షేమాలను  తెలుసుకున్నారు.
 నూజివీడులో ఎమ్మెల్యే సతీమణికి నివాళి
 నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణి సుజాతాదేవి భౌతికకాయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి విజయవాడ నుంచి నేరుగా చేరుకున్న జగన్.. పలువురు బంధువులు, ఎమ్మెల్యే అప్పారావును పరామర్శించారు. మధ్యాహ్నం తరువాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో జి.కొండూరు మండలంలోని వెంకటాపురంలో స్థానికులు ఆపి జననేతకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ విగ్రహానికి స్థానిక నాయకులతో పూలమాల వేయించారు. అనంతరం జి.కొండూరులో స్థానిక నాయకులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

వైఎస్ జగన్ వెంట పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, జలీల్‌ఖాన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా,  కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్.వెంకటేశ్వరరావు, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ ఉన్నారు.
 
రైతుల వినతి...
ఆ తరువాత ఇబ్రహీంపట్నం వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఇంటి వద్ద కాసేపు ఆగారు.  అక్కడ ఆయనను జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌జోన్ పేరుతో రైతుల పొలాలపై పెత్తనం చేసేందుకు వ్యూహం పన్నారని, దీనిని ఎలాగైనా ఆపాలంటూ రైతులు వినతిపత్రం సమర్పించారు. భూమిని అమ్మేందుకు భూ యజమానికే హక్కు లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. దీనిపై తప్పకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను పరిశీలించి ఆందోళన ఉధృతం చేయాలని పార్టీ వారికి సూచించారు.

Popular Posts

Topics :