28 February 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గవర్నర్ తోనూ బాబు అబద్ధాలు చెప్పించారు

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016


'గవర్నర్ తోనూ బాబు అబద్ధాలు చెప్పించారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరు అని వైఎస్ఆర్ సీపీ నేత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని పేర్కొన్నారు. గవర్నర్ తోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. సిగ్గు, లజ్జా లేని ప్రభుత్వం చంద్రబాబుది.. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయమేనని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

పయ్యావుల సోదరులవి హత్యా రాజకీయాలు


'పయ్యావుల సోదరులవి హత్యా రాజకీయాలు'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. హత్యారాజకీయాలకు కేంద్ర బిందువులు పయ్యావుల సోదరులు అని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బెదిరించి, మభ్యపెట్టి వారి నుంచి అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులు వేల ఎకరాలను హస్తగతం చేసుకున్నారని తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

రైతులను బెదిరించి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పయ్యావుల భూములను కూడబెట్టారని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినందునే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూకంభకోణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్ నారాయణ విజ్ఞప్తి చేశారు.

ముగిసిన బీఏసీ సమావేశం, 16 రోజులే అసెంబ్లీ


ముగిసిన బీఏసీ సమావేశం, 16 రోజులే అసెంబ్లీ
హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 16 పనిదినాల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 30వ తేదీ వరకు సమావేశాలు ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ కార్యకలాపాల షెడ్యూలును నిర్ణయించేందుకు బీఏసీ సమావేశం అసెంబ్లీలో శనివారం జరిగింది. ఈనెల 10వ తేదీనే సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు రెండూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 9వ తేదీన సమాధానం ఇస్తారు. బడ్జెట్‌పై చర్చకు ఈనెల 17న ఆర్థికమంత్రి సమాధానం ఇస్తారు. సమావేశాలు ఈనెల 30 వరకు ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాలని స్పీకర్ సూచించారని ఆయన చెప్పారు.

వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టారు. 25 ప్రధానాంశాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్‌సీపీ సూచించింది. తాము 40 రోజులు అసెంబ్లీ ఉండాలని సూచించినా అధికారపక్షం పట్టించుకోలేదని సమావేశం అనంతరం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే వాయిదా తీర్మానాల ప్రతిపాదన సమావేశాల మొదట్లోనే ఉండాలని తాము పట్టుబట్టామన్నారు. రూల్స్ కమిటీలో సవరణలు ఏవీ జరగలేదు కాబట్టి, మునుపటిలాగే వాయిదా తీర్మానాలను చేపట్టాలని కోరామన్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

నిస్సిగ్గుగా అవినీతి, నిరంకుశ పాలన: వైఎస్ జగన్


నిస్సిగ్గుగా అవినీతి, నిరంకుశ పాలన: వైఎస్ జగన్
హైదరాబాద్ :
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నిస్సిగ్గుగా అవినీతి, మోసాలకు పాల్పడుతున్నారని, నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తున్నారని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా మెడలో నల్ల కండువాలు ధరించారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో మంత్రులు, టీడీపీ నేతలు సాగిస్తున్న దందా గురించిన నినాదాలు, పత్రికా కథనాలను ప్లకార్డులుగా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఆయనేమన్నారంటే.. ''అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశ వైఖరితో చంద్రబాబు నాయుడు పట్టపగలు అవినీతితో తాను సంపాదించిన సొమ్మును ప్రదర్శిస్తూ, ఒక్కో ఎమ్మెల్యేకు 20-30 కోట్లు ఆశ చూపించి నిస్సిగ్గుగా తాను చేసిన కార్యక్రమానికి నిరసన తెలుపుతున్నాం.

ఫలానా చోట రాజధాని పెడుతున్నట్లు ముందే ప్లాన్ చేసి, రైతులను మోసం చేసి వాళ్ల దగ్గర భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధానిని అక్కడ ప్రకటించారు. మొదట రాజధాని నూజివీడు ప్రాంతంలోను, నాగార్జున వర్సిటీ ప్రాంతంలో అని మిస్‌లీడ్ చేశారు. తనవాళ్లు భూములు కొన్న తర్వత రాజధాని అక్కడ పెట్టి రైతులను మోసం చేశారు. ఎస్సీలను సైతం మోసం చేశారు. తన బినామీలకు లాభం చేకూర్చేందుకు జోనింగ్ పద్ధతిని అమలుచేశారు. ఆయా భూములకు మాత్రమే డిమాండు ఉండేలా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేస్తున్న అవినీతి, మోసాలకు నిరసనగా ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం'' అని ఆయన అన్నారు.

ప్రసంగం అంతా అర్ధసత్యాలు, అసత్యాలే: ఉమ్మారెడ్డి


ప్రసంగం అంతా అర్ధసత్యాలు, అసత్యాలే: ఉమ్మారెడ్డి
హైదరాబాద్ :
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర ప్రగతి, ఎజెండా గురించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, కానీ ప్రసంగం పూర్తిపాఠం చూస్తే అర్ధసత్యాలు, అసత్యాలు, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు తప్ప వాస్తవాలు ప్రతిబింబించలేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వాస్తవ విరుద్ధమైన ప్రసంగం చేశారన్నారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకోవాలన్నా.. గతంలో కేబినెట్ సమావేశంలోనే సీఎం ఓ విషయం చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రగతి రెండంకెల్లో సాధించాలని అనుకున్నామని, కానీ అవినీతి రెండంకెల్లో సాధించామని ఆయన కేబినెట్ భేటీలోనే ఒప్పుకున్నారన్నారు. కానీ ప్రసంగంలో మాత్రం అవినీతిని సమూలంగా తుడిచిపెట్టినట్లు చెప్పడం చూస్తే ఆత్మను చంపుకోవడమేనన్నారు.

జాతీయ వృద్ధిరేటు 7.31 శాతం ఉంటే ఇక్కడ మాత్రం 10.99 శాతం సాధించామని చెబుతుంటే అది ఎంతవరకు వాస్తవం, ప్రజలు ఎంతవరకు నమ్ముతారని ప్రశ్నించారు. ఓవైపు జీతాలు కూడా ఇవ్వలేకుండా ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, మరోవైపు జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేన్నారు. వ్యవసాయ రంగంలో దిగుబడి ఎంత తగ్గిందో చెప్పలేదని మండిపడ్డారు. సాగు విస్తీర్ణం, రైతుల ఆదాయం అన్నీ తగ్గాయని, నిత్యావసరాల రేట్లు పెరిగినా అవేవీ చెప్పలేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో తామిచ్చేది కేవలం లక్ష రూపాయలేనని, మిగిలినది రుణంగా అందజేస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. కరువు లేదని చెబుతున్నారు గానీ, అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది ఎందుకు వలస వెళ్లారని ప్రశ్నించారు. రుణమాఫీల గురించి ఎక్కడైనా మాట్లాడారా అని నిలదీశారు. కాబట్టి గవర్నర్ ప్రసంగం అర్ధసత్యాలు, అసత్యాలతోనే ఉందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.

మంత్రి రావెల కొడుకు సుశీల్‌పై నిర్భయ కేసు


హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్ కొడుకు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు నిర్భయ కేసు నమోదుచేశారు. ఈ మేరకు మంత్రి రావెల క్వార్టర్స్‌కు వెళ్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. 41 (ఏ) సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై మంత్రి రావెల కొడుకు సుశీల్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అతని కీచక పర్వంపై మీడియా వరుస కథనాలతో బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. మంత్రి కొడుకు సుశీల్‌ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. సుశీల్‌ బాధిత మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని అభియోగాలు మోపారు. తప్పతాగి అతను తనను వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొడుకును అప్పగిస్తానన్న రావెల!
ఈ కేసులో తన కొడుకు సుశీల్‌ను పోలీసులకు అప్పగిస్తానని మంత్రి రావెల తెలిపారని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉదయం నుంచి ఈ విషయమై మంత్రి రావెలను సంప్రదిస్తున్నామని, అయితే మంత్రి రావెల ఇంతవరకు అందుబాటులో రాలేదని చెప్పారు. రాలేదని తెలిపారు.

అసెంబ్లీకి పాదయాత్రగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్‌, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రవీంద్రభారతి సర్కిల్‌కు చేరుకొనున్నారు. ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వారు అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్‌ సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి.

స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి


'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చర్చలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరినట్లు  వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. వారిపై తక్షణమే వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. స్పీకర్ ను కలిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విధివిధానాల బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారని జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలపై చర్యలతో ప్రజాస్వామ్యాన్ని స్పీకరే రక్షించాలని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. అలా జరిగితే రాజకీయాల్లో  నీతి, నిబద్ధత అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు కనువిప్పు కలుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుందని జ్యోతుల నెహ్రు అన్నారు.  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రజల మనోభావాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి (వాయిస్, వీడియో రికార్డులు, ఫోటోలు) అన్ని ఆధారాలను స్పీకర్ కు అందచేశామన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పీకర్ న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యే బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళతామన్నారు. ముందుగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టి ఆయనపై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తామన్నారు.

స్పీకర్ కోడెలను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వారు ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి, డేవిడ్ రాజు, జయరాములు, మణిగాంధీ, కలమట వెంకటరమణ తదితరులు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17  ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు.

వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ఫోనులో పరామర్శ


హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఫోన్ లో పరామర్శించారు. అలాగే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలలోని రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పాత లింగాలలో నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు.

ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో


వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరోజైన  శుక్రవారం  నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో భారీ బైక్ ర్యాలీ  నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని డివిజన్‌ల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ప్రచార రథం ద్వారా ప్రజలకు పరిచయం చేశారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. బల్లేపల్లిలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బైక్ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, గట్టయ్య సెంటర్, రాపర్తినగర్, మయూరి సెంటర్, ముస్తఫానగర్, గాంధీచౌక్, మార్కెట్ గుండా ఎఫ్‌సీఐ గోడౌన్ వరకు కొనసాగింది.

భారీ సంఖ్యలో బైక్ లతోర్యాలీ నిర్వహించడంతో ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో నిండిపోయాయి. ర్యాలీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, నేతలు ఎం.నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి,  బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, భీమా శ్రీధర్, దారా యుగంధర్, నాగేంద్ర పాల్గొన్నారు.

డ్రెయిన్ల పనుల్లో దోచేశారు


డ్రెయిన్ల పనుల్లో దోచేశారు
 జాఫర్ సాహెబ్ కెనాల్ డ్రెయిన్ల పనుల అవినీతిపై విచారణ జరపాలి
 విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అసెంబ్లీలో ప్రస్తావించనున్న
► సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
► నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెల్లడి ఇందుకూరుపేట: డ్రెయిన్ల పనుల్లో టీడీపీ నేతలు దోచేశారని, తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో ఉన్న జాఫర్‌సాహెబ్ కెనాల్ డ్రెయిన్ల పనుల్లో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని మొత్తలు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాఫర్ సాహెబ్ కెనాల్ కింద ఇందుకూరుపేట మండలంలో 35 డ్రెయిన్లు రూ.1.02 కోట్లు, తోటపల్లి గూడూరు మండలంలో 32 డ్రెయిన్లు రూ.95 లక్షలు కలిపి మొత్తం రూ.1.97 కోట్ల పనులు జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో  జరిగాయన్నారు.

కొన్ని పనులకు ఇప్పటికే బిల్లులు పెట్టారని, నామమాత్రంగా చేసిన ఈ పనులకు సంబంధించి బిల్లులు చేసుకొనే ప్రక్రియలో టీడీపీ నేతలు ఉన్నారన్నారు. ఆ అవినీతిపై బాగోతంపై తాను, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చర్చించుకున్నామన్నారు. పనుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్‌కు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి లెటర్ పెట్టారన్నారు. విజిలెన్స్ విచారణ జరపాలని కోరామన్నారు. బిల్లులు చెల్లించిన అధికారులు బలవుతారన్నారు. ఇప్పటికే బిల్లులు చెల్లించి ఉన్న వాటిని రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీనిపై మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.

 పేదోళ్ల కడుపుకొట్టి పసుపుకోటరీకి భూముల అప్పగింత
 భూమిపై ఆధారపడి జీవించే రైతులు, పేదల కడుపుకొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పసుపుకోటరీకి వేల ఎకరాలు దోచిపెట్టారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. భూములు కొంటే తప్పా, సంపాదించుకొంటే తప్పా, సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వేయాలని విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడడం అతని అవినీతికి నిదర్శనమన్నారు. జిల్లా మంత్రి పి.నారాయణ కొన్న  3,120 ఎకరాల్లో సైతం అసైన్డ్, పేదల  భూములు ఉన్నాయన్నారు. భూములు ఇవ్వనన్న వారిని బెదిరించి మరీ టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. సాక్షాత్తు రాష్ర్ట మంత్రి భార్యపేరు మీద భూములు కొనుగోలు చేశారని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడితే సీబీఐ ఎంక్వయిరీ అవసరమా అని అనడం చంద్రబాబునాయుడు లెక్కలేనితనానికి నిదర్శనమన్నారు.

అమరావతి భూముల అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని అడిగితే చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నాయకులు కూడా ఈ భూములపై విచారణ కోరడం అభినందనీయమన్నారు. విచారణ చేయమన్న బీజేపీ నాయకులను చంద్రబాబు బెదిరించడం దారుణమన్నారు. పోలవరానికి ఇచ్చిన రూ.100 కోట్లు పట్టిసీమకు, అమరావతికి ఇచ్చిన రూ.850 కోట్లు ఇరిగేషన్ పనులకు దారి మళ్లించారని మండిపడ్డారు.

భూమి లేని షెడ్యూల్ట్ కులాలకు భూములు, ట్రైబల్ సంస్థ ద్వారా గిరిజనులకు భూములు ఇస్తానన్న ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు పెట్టుబడి పెట్టిన వారే అమరావతిలో భూములు కొన్నారన్నారు. ప్రజాసేవకే రాజకీయాల్లో వచ్చానన్న మంత్రి నారాయణ తొలుత తన మెడికల్ కళాశాల్లో డొనేషన్లు లేకుండా సీట్లు ఇచ్చి మాట్లాడాలని ప్రసన్న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెట్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, నాయకులు గూడూరు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మంత్రులే అసైన్డు భూములు కొంటారా?


రాజధాని ప్రకటనకు ముందే ఆ భూములెలా కొన్నారు?
♦ రాజ్యాంగంపై ప్రమాణం చేసి రహస్యాలు బయటపెడతారా?
♦ దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందా? లేదా?
♦ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన బొత్స
 సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రభుత్వ విషయాలు ఎవరికీ తెలియజేయనని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పకపోయి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రాజధాని ప్రాంతం ప్రకటించడానికి మూడు నెలల ముందే అక్కడ భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు. భూములు కొన్న నేతల పేర్లు, రిజిస్ట్రేషన్ తేదీలతో సహా బహిర్గతమవుతుంటే.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? అంటూ బొత్స ధ్వజమెత్తారు. ‘‘మీ తాబేదారులకు, మంత్రులకు, అనుకూలురకు చెప్పి వారితో వేల ఎకరాలు సామాన్య రైతుల నుంచి కొనిపించి ఆ భూముల ధరలు పెంచుకోవడం ద్వారా రూ.లక్షల కోట్ల దోపిడీ చేయడం లేదా? దానిపై సీబీఐ విచారణ కోరుతున్నాం. మీ నిజాయితీ నిరూపించుకోవాలంటున్నాం. సాధారణంగా భూములు కొన్న వారి గురించి మేం మాట్లాడటం లేదు. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్లు అనంతపురం నుంచో.. నెల్లూరు నుంచో.. హైదరాబాద్ నుంచో వెళ్లి అక్కడ భూములు కొనడాన్నే ప్రశ్నిస్తున్నాం’’ అని అన్నారు.
 మంత్రులే అసైన్డు భూములు కొంటారా?
నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డు భూములను కొనడమే పెద్ద నేరమని బొత్స అన్నారు. అందులోనూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక మంత్రి.. భార్య పేరుమీద కొనడం ఇంకా తప్పు అన్న ఆయన.. అసైన్డు భూములు కొన్న వారిపై చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తన సంస్థలో ఉద్యోగుల పేరుతో భూములు కొన్న మరో మంత్రి తాను రూ. 200 కోట్లు ట్యాక్స్ కడుతున్నానని, దోపిడీకి ఇంకా అవకాశమిస్తే వెయ్యి కోట్లు కూడా కడతామని ఆ మంత్రి చెబుతారని ఎద్దేవా చేశారు. భూ లూటీపై న్యాయ విచారణకు ఆదేశిస్తారా లేదా అని బాబును మరోసారి డిమాండ్ చేశారు.
 బీజేపీ స్వచ్ఛమైన పార్టీ అయితే..
స్థానిక బీజేపీ నాయకులు తమది స్వచ్ఛమైన పార్టీ అని ప్రజలకు చెప్పుకోవాలంటే.. ఈ భూ లూటీపై విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బొత్స అన్నారు. కనీసం ఇక్కడి ప్రభుత్వాన్నైనా విచారణ జరిపించుకోనెలా కోరాలన్నారు. ఇప్పటి వరకు ఇసుకను దోచుకున్నారని.. ఇప్పుడు విధివిధానాలు లేకుండా ఉచితమంటూ డ్రామా మొదలు పెట్టారన్నారు. ఉచితం వెనుక ఉద్దేశం కొద్దిరోజుల్లో తెలిసిపోతుందన్నారు

రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమా?


రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమా?
టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని 18 నెలల తరువాత కూడా అమలు చేయట్లేదని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తుంటే.. ఆయన వెనుక జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడమేమిటని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా దానివెనుక జగన్ ఉన్నారని ప్రచారం చేయడమే పాలసీగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములివ్వని రైతులపంటను, పంట సామాగ్రిని దహనం చేసి, జగనే ఆ మంటలు పెట్టారని ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు.
‘కాపు గర్జన సందర్భంగా టీడీపీకి చెందినవారే తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులపెట్టి, ఇది కూడా రాయలసీమ నుంచి వచ్చిన జగన్ మనుషులే చేశారని ఆరోపణలు చేశారు.. కానీ కేసులు మాత్రం కాపులపై పెట్టారు. మంద కృష్ణ తిరిగి ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటిస్తే.. దానివెనుకా జగన్ ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమనడమేంటి’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడిచ్చిన హామీలనేగాక.. గత నెలలో తన నిరాహార దీక్ష సందర్భంగా ఇచ్చిన హామీల్నీ నెరవేర్చే సూచనలు కనిపించనందువల్లే ముద్రగడ.. సీఎంకు ఉత్తరం రాసి ఉంటారని, దానివెనుక జగన్ ఉన్నారని ఆరోపణలు చేయడమేంటన్నారు. పార్టీ నేతలతో ముద్రగడపై తీవ్రస్థాయి విమర్శలు చేయించి, ఆయన్ను రెచ్చగొడుతుంది చంద్రబాబు కాదా? అని అంబటి నిలదీశారు.

ఊపిరున్నంత వరకూ జగన్ వెంటే


ఊపిరున్నంత వరకూ జగన్ వెంటే
 వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి

అనంతపురం  : ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని 1989లో రాజకీయాల్లోకి  అడుగుపెట్టాం. అప్పటి నుంచి వైఎస్ వెన్నంటే ఉన్నాం. విలువలతో కూడిన రాజకీయాలు వైఎస్ కుటుంబం నుంచే నేర్చుకున్నాం.  రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాం’ అని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బి. ఎర్రిస్వామిరెడ్డి స్పష్టం చేశారు.

 తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వైఎస్సార్‌సీపీని వీడుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన నివాసంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీని మార్చాల్సిన దుస్థితి తమకు లేదన్నారు.

 మిస్సమ్మ స్థలంపై  అనవసర రాద్ధాంతం
మిస్సమ్మ స్థలంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎర్రిస్వామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా, అక్రమంగా ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేదని,  వేలం ద్వారామ దక్కించుకున్నట్లు తేల్చిచెప్పారు.  ఈ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చినా... కొందరు పనికట్టుకుని పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రైవేట్ పాపర్టీ అని స్వయంగా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు.  ఇప్పటికైనా మిస్సమ్మ స్థలంపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

మా సీట్లెక్కడ బాబూగారూ..!

► పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వింత పరిస్థితి

విజయవాడ: అభివృద్ధి సాకుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురైంది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుతో ప్రజల్లో పరువు పలచబడి.. మరోవైపు చేరిన పార్టీలో ఇమడలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. దీనికితోడు శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమకు చోటెక్కడ అనే మీమాంస వారిని వెంటాడుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రస్తావించడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

రెండు రోజుల క్రితం సీఎంను కలిసిన వీరు అసెంబ్లీలో ఎక్కడ కూర్చోమంటారు అని అడిగారు. మీరు ఎక్కడ కూర్చోవాలో నేను చూస్తాను, ఆ విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండని సీఎం వారికి బదులివ్వడం గమనార్హం. పార్టీలో చేరిన వారిని అసెంబ్లీలో ఎక్కడ కూర్చోబెట్టాలనే విషయంలో సీఎంకు స్పష్టత లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైఎస్సార్ సీపీ టిక్కెట్‌పై గెలిచి, టీడీపీ తీర్థం పుచ్చుకొని పదవులకు రాజీనామా చేయకుండా అసెంబ్లీలో కూర్చునేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై అధికార పక్షం మల్లగుల్లాలు పడుతోంది.

అసెంబ్లీలోనే కాదు టీడీపీ సమావేశాల్లోనూ వీరు ఎక్కడ కూర్చోవాలనే మీమాంస వెంటాడటంతో చివరి వరుసకే పరిమితం కావాల్సి వస్తోంది. విజయవాడలో ఈ నెల 1వ తేదీన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి చివరి వరుసల్లో కూర్చోవడంపై టీడీపీలో చర్చ సాగింది. గెలిచిన పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారి చివరి వరుసకే పరిమితం కావాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చర్చించుకోవడం గమనార్హం.

పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా?

Written By news on Friday, March 4, 2016 | 3/04/2016

ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి

వి.కోట (చిత్తూరు): వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తారా? అని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం వి.కోటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయుంగా రావాల్సిన వాటిని రాబట్టలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని  విమర్శించారు. సీఎం అసమర్థ పాలనతో కొత్త రాష్ట్రంలో సమస్యలు తీవ్రతరమయ్యాయన్నారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై రానున్న బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం విప్ జారీ చేస్తామన్నారు.

ఒక పార్టీ ముద్రతో గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ మారే సమయంలో రాజీనామ చేయడం సంప్రదాయమని చెప్పారు. 2012లో తాను టీడీపీని వీడినప్పుడు రాజీనామ చేసి ప్రజల ముందు నిలిచానన్నారు. ప్రజావిశ్వాసం చూరగొనలేని వారు ఎన్ని పార్టీలు మారినా దండగన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు.

తప్పతాగి మంత్రి తనయుడు హల్ చల్!


తప్పతాగి మంత్రి తనయుడు హల్ చల్!
హైదరాబాద్: :
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి తనయుడు రావెల సుశీల్ పై వేధింపుల కేసు నమోదైంది. మంత్రి రావెల కిశోర్ బాబు కారును పోలీసులు సీజ్ చేశారు. గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బంజారాహిల్స్ ప్రాంతంలో తప్పతాగి సుశీల్ కారు నడుపుతూ కాసేపు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కారు డ్రైవర్ అప్పారావు తో కలిసి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్నవారు వెంటనే స్పందించారు.
మంత్రి తనయుడు సుశీల్ సహా ఆ కారు డ్రైవర్ ను చితకబాదినట్లు సమాచారం. ఫోన్ లో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును సీజ్ చేశారు. బాధితురాలు ఓ టీచర్ అని తెలుస్తోంది. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారని ఆ మహిళను చేయి పట్టి లాగి అల్లరి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని, ఆ వ్యక్తులను స్టేషన్ నుంచి త్వరగానే వదిలిపెట్టారని బాధితురాలు వాపోయింది. తన చేయి పట్టుకుని లాగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. మంత్రి తనయుడే ఈ పోకిరి పని చేశాడని బాధితురాలు మీడియాతో స్పష్టం చేసింది. ప్రత్యక్ష సాక్షులు కూడా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులు రావెల సుశీల్, అతని డ్రైవర్ అని కచ్చితంగా చెబుతున్నారు. కారుపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉందని కూడా పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స


చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేకపోతున్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తేలు కుట్టిన దొంగలా సీఎం బేలగా మాట్లాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ఈ భూ దందా సమాధానం చెప్పకపోగా, పై పెచ్చు భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించడం దారుణమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు.

 'చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్టీఆర్ అల్లుడో, నారా లోకేశో తండ్రో కాదు...  రాష్ట్ర ముఖ్యమంత్రి. సీఎంగా రాజ్యాగంపై ప్రమాణం చేసిన విషయం గుర్తు తెచ్చుకోండి. అలాంటి మీరు రాజధాని కడతానని రైతులను బెదిరించి మీ తాబేదార్లుకు, మంత్రులకు, మీ వాళ్లకు భూములు ఇప్పించుకున్నారు. ఆ భూముల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయిలు లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారే. దాని గురించి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. సీబీఐ విచారణ జరిపి న్యాయం జరగాలని కోరుతున్నాం. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నవారి గురించి మేం మాట్లాడటం లేదు. డబ్బుంటే భూములు కొని వ్యాపారాలు చేసుకుంటే తప్పా అంటున్నారు. మీరు చేస్తున్న లూటీపై మాత్రమే మేం ప్రశ్నిస్తున్నాం.

ఆ వ్యాపారాల గురించి అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. రాజధాని ప్రాంతంలో భూ దందా వాస్తవం అవునా?...కాదా?. రాజధాని ప్రకటన 3 నెలలకు ముందే ఎలా భూములు కొన్నారు. మీరు నంగనాచిలా మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి.  అనంతపురం నుంచో నెల్లూరు నుంచో వెళ్లి రాజధాని ప్రాతంలో భూములు కొంటున్న వ్యక్తులు  13 జిల్లాల్లో ఎక్కడా కొనకుండా అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది. అమాయక రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారు.
 
భూములు లూటీపై న్యాయవిచారణకు మీరు సిద్ధమైనా? అసైన్డ్ భూములు కొనడం చట్ట విరుద్ధమని మీకు తెలియదా?. మీ ఆస్తుల ప్రకటన వెనుక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీ ఆస్తులు, మీ బినామీల గురించి అన్ని బయటకు వస్తున్నాయి. ఒక మంత్రి తన భార్య పేరు మీద భూములు కొనడం మరీ తప్పు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు మీ పనయిపోయింది. భూ లూటీ వెనక వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలి'....అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు


పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు
♦ సీఎం కేసీఆర్‌పై ఎంపీ పొంగులేటి విమర్శ
♦ 29,48,36,34,26 డివిజన్లలో రోడ్‌షోలు
 ఖమ్మం : సీఎం కేసీఆర్‌కు పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు.. రాత్రి మాట్లాడింది మరునాడు గుర్తుండదు.. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా గుర్తుంటాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 29వ డివిజన్ ఖిల్లా మసీద్ సెంటర్‌లో గురువారం ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల్లో 29వ డివిజన్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రఫీబాయ్(షేక్ రఫీయుద్దీన్)ను అధికారులు విజేతగా ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఖిల్లాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేందుకు ఇక్కడి ముస్లింలు పడుతున్న కష్టం అభినందనీయమన్నారు. ఏ ముఖ్యమంత్రి కట్టి వ్వనన్ని ఇళ్లను వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే కట్టించారని గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూసే టీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
 డిప్యూటీ సీఎం ఖిల్లాకు వచ్చారా..? : మాజీ ఎమ్మెల్సీ రెహమాన్
మహమూద్ అలీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఖమ్మం ఖిల్లాకు వచ్చారా అని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ ప్రశ్నించారు. పదవి కోసం.. పెత్తనం కోసం.. కుర్చీల కోసం తానెప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. ఇప్పటికే చాలాసార్లు తాను ఖిల్లాకు వచ్చానని.. సాటి ముస్లింల కష్టాలు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. ఖిల్లాలో ముస్లింలు చేసే జై జగన్ నినాదాలు గోల్కొండ ఖిల్లాకు వినిపించాలన్నారు. ముస్లింల బాగోగులు చూసుకున్న ఏకైక నాయకుడు వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదు.. ఖమ్మంలో సరైన రోడ్లు, డ్రెయిన్లు, మౌళిక సదుపాయాలే లేవు.. కేవలం కేసీఆర్ మాటలతోనే ప్రజలను పరేషాన్ చేస్తున్నారన్నారు. మీకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్ని విధాల అండగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి రఫీయుద్దీన్‌ను గెలిపించి.. అల్లాహ్ ఆశీస్సులు అందించాలని వేడుకుంటున్నానన్నారు.
 ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయండి..
ఖిల్లావాసులు, కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని పినపాక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. ముస్లింల అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. పేద ముస్లిం పిల్లలు చదువుకుని ఉన్నత స్థితిలో ఉండి.. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నారంటే అది వైఎస్సార్ చలవేనని అన్నారు. ప్రచారంలో నాయకులు శివకుమార్, ఫెరోజ్, వసీం, ఇమ్రాన్, షకీల్, సలీం, రవి, జాకీర్, షాబిర్, షౌకత్ అజుం, నిరంజన్ సాధు తదితరులు పాల్గొన్నారు.
 48వ డివిజన్‌లో.. 
48వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిత్తలూరి నర్సయ్యగౌడ్ ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. 48వ డివిజన్ దానవాయిగూడెం పార్కు, సారధి నగర్, బ్రిడ్జి ఏరియాల్లో ఎంపీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ చిత్తలూరి నర్సయ్యగౌడ్ ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, డాక్టర్ చిత్తలూరి రవి, డాక్టర్ చిత్తలూరి లక్ష్మణ్‌కుమార్, సింగరపు యాగలక్ష్మి, సురభి లింగయ్య, కొంపెల్లి రాములు, చంద్రమ్మ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
 36వ డివిజన్‌లో...
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేడవరపు ఆదినారాయణను గెలిపించాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. 36వ డివిజన్ పరిధిలోని బస్ డిపో రోడ్, మయూరి సెంటర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రోడ్ ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన విధంగానే.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఆదినారాయణను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.నిరంజన్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్, నారుమళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 34వ డివిజన్‌లో...
34వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ దోరేపల్లి శ్వేతను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేయాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. 34వ డివిజన్‌లోని రాపర్తి నగర్, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, జర్నలిస్టు కాలనీల్లో రోడ్‌షో, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. సమస్యలు పరిష్కారం కావాలంటే శ్వేతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కే.శివకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 26వ డివిజన్‌లో...
26వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎండీ.ముస్తఫాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని డివిజన్‌లో గురువారం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. డివిజన్‌లో ఆక్రమణకు గురైన వికలాంగుల భూములను తిరిగి ఇప్పించేం దుకు పోరాటాలు చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా రానున్న 30 గంటల్లో ఏమైనా జరగొచ్చని అన్నారు. వైఎస్సార్ సీపీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ ఒక్కసారి ముస్తఫాను ఓటుతో ఆశీర్వదిస్తే.. జీవితాంతం అన్ని వర్గాలకు సేవ చేసుకుంటాడన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక సీఎం వైఎస్సార్ అని గుర్తు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముస్తఫాను గెలిపించుకుని మీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అభ్యర్థి ముస్తఫా మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఎంపీ సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పార్టీ ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నీ మొఖానికి జగన్ అవసరం లేదు.. మా కార్యకర్త చాలు


చర్చకు మీ ఊరికే వస్తాం.. సిద్ధమా కేశవ్
నీ మొఖానికి జగన్ అవసరం లేదు.. మా కార్యకర్త చాలు
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావులపై అంబటి ఫైర్

సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ దురాక్రమణపై చర్చకు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విసిరిన సవాలుకు వైఎస్సార్‌సీపీ గట్టిగా ప్రతిస్పందించింది. కేశవ్ సవాలును స్వీకరించిన వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు.. ప్రకాశం బ్యారేజీ వద్ద అవసరం లేదని చర్చకు తాము కేశవ్ ఊరు ఉరవకొండకే వస్తామని బదులిచ్చారు. గురువారం అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురానికి చెందిన కేశవ్ రాజధాని ప్రాంతంలో ఎందుకు భూములు కొన్నారో చెప్పాల్సింది పోయి జగన్‌పై విరుచుకు పడటం ఏమిటని ప్రశ్నించారు.

జగన్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే రాయలసీమ రక్తం ప్రవహిస్తూ ఉంటే చర్చకు ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని కేశవ్ రంకెలు వేశారన్నారు. ‘‘కేశవ్.. నీ మొఖానికి జగన్ రావాలా.. నీ అవినీతిని నిరూపించడానికి మా నాయకుడి అవసరమే లేదు. మా కార్యకర్త చాలు... నీ ఉరవకొండకే చర్చకు వస్తాం. నీకు సిగ్గు, శరం, చీము నెత్తురు ఏ మాత్రం ఉన్నా నిజంగా రాయలసీమ రక్తంతో మండే వాడివే అయితే చర్చకు రా’’ అని అంబటి ప్రతి సవాలు విసిరారు.

భూ కుంభకోణంలో తన వ్యవహారం గురించి సాక్షి పత్రికలో వార్త వస్తున్నదని తెలుసుకున్న కేశవ్ బుధవారం రాత్రి 11 గంటల వరకూ సాక్షి కార్యాలయం వాచ్‌మన్ దగ్గరి నుంచీ స్టింగర్ వరకూ కాళ్ల బేరానికి వచ్చి బతిమిలాడారని అంబటి వెల్లడించారు. రాత్రి కాళ్లబేరానికి వచ్చిన కేశవ్ పగలు జగన్‌పై ఘీంకరిస్తూ మాట్లాడారన్నారు. రాజధాని ప్రకటనకు ముందే కేశవ్ ఆ ప్రాంతంలో భూమికి అడ్వాన్సు ఇచ్చి ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నారని తెలిపారు. సీబీఐ దృష్టికి రాని జగన్ అంశాలను కూడా ఇపుడు తెస్తానని బెది రిస్తున్నారని అయితే ఆయన వీటిని ఇంత కాలం ఎందుకు దాచారో చెప్పాలని నిలదీశారు.  
 
సాక్షి కథనాలకు కోతుల్లా ఎగురుతున్నారు
అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోతానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇపుడు లింగమనేని కట్టిన అక్రమ భవనంలో నిద్ర పోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సాక్షిలో వచ్చే కథనాలకు సమాధానం చెప్పలేక నిప్పు తొక్కిన కోతిలాగా ఎగరడం దేనికన్నారు. అవినీతికి సమాధానం చెప్పుకోవాలి గానీ జగన్‌పై బురద జల్లి తప్పుకు పోవాలంటే కుదరదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐ చేత గానీ విచారణకు చంద్రబాబు సిద్ధం కాకపోతే టీడీపీ నేతలంతా అవినీతికి ప్పాడినట్లేనని అంబటి పేర్కొన్నారు.

ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ వెనుక జగన్ హస్తం ఉందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. వాస్తవానికి ముద్రగడ పోరాడుతున్నది చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కోసమేనన్నారు. రాజధాని భూదందాపై బీజేపీ స్పందించాలని కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని అంబటి కోరారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచం ఆశ్చర్యపోయే కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.

అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి


అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి


  వెంకటాచలం(మనుబోలు): ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో మాత్రం అంతర్జాతీయ ఖ్యాతి సాధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన  వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయం విశ్రాంతి మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజులుగా రాజధాని నిర్మాణం పేరుతో మంత్రులు, వారి బినామీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు కాజేశారో, ప్రస్తుతం వాటి విలువెంతో పత్రికల్లో వార్తలొస్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే వారు, ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న వారు రాజధాని నిర్మాణంలో కోట్లు పోగేసుకుంటున్నారన్నారు.

పేద రైతుల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కున్నారన్నారు. ఆ భూముల్లో కోర్ క్యాపిటల్ అని చెప్పి వ్యాపారానికి అనుగుణంగా ఉండే విధంగా వాటిని నమోదు చేయించారన్నారు. మిగిలిన వాటిని మాత్రం గ్రీన్ జోన్ అని చెప్పి వ్యాపారం చేయడం ఇంత కన్నా ఘోరం ఉండదన్నారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడ్ని చరిత్రలో చూడలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో బినామీల పేరుతో వేల కోట్లు పోగేసుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ను న్యాయస్థానాలే తప్పుపట్టినా దోషులను శిక్షించడంతో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ప్రశ్నించారు. వారికి చెందిన హాయ్‌ల్యాండ్‌ను చినబాబు లోకేష్ నొక్కేయడంతో వారిపై ఈగ వాలనీయడం లేదన్నారు. ప్రజలను, రైతులను మోసం చేసి రాజధాని నిర్మాణం పేరుతో వేల ఎకరాలు కాజేసి వాటితో వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి ముసుగులో ఇంత దారుణమైన దోపిడీని ఎక్కడా చూడలేదన్నారు.

రైతులను మోసం చేసిన వారు ఎవరూ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సం పాదించుకున్న దాఖలాల్లేవన్నారు. దీనికి చంద్రబాబు అతీతుడు కాదన్నారు. తాను నిప్పునని, తనంత నీతిమంతుడు లేడని డబ్బా కొట్టుకునే చంద్రబాబు వేల కోట్ల అవినీతిలో చిక్కుకున్నారు కాబట్టి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. బాబు నిజాయితీపరుడైతే రాజధాని భూకుంభ కోణంపై సుప్రీం కోర్టు జడ్జి, సీబీఐలచేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ఎంపీపీ అరుణమ్మ, నాయకులు చెంచుకృష్ణయ్య, శ్రీధర్‌నాయుడు, రజనీకాంత్‌రెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)


కబ్జా చక్రవర్తి లింగమనేని  (సీఎంగారికి వెరీక్లోజ్)లింగమనేని గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు..
ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా..
⇒ 300 ఎకరాల కబ్జా భూములు..
వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే...
సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు
⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు

 
ఎవరీ లింగమనేని?...
జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతిhttp://img.sakshi.net/images/cms/2016-03/71457038883_Unknown.jpgకట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది...
 
రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు  ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే.  ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో..  లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది.

చంద్రబాబు అధికారంలోకి రాగానే..
పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని  ఈ 300 ఎకరాల విలువైన భూములను
 
ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.  ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్‌లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్  హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది.
 
పేదల వద్ద పక్కా ఆధారాలు...
లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు.  సర్వే నెంబరు  191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్‌లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్‌ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది.

http://www.sakshi.com/news/district/capturing-king-of-lingamaneni-319726?pfrom=home-top-story

పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016


‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’
బాపట్ల : తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న తన తండ్రి కోన ప్రభాకర్‌రావు మాదిరిగా తాను కూడా చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉండి పూర్తి స్థాయిలో సేవలందిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను రంగులు మార్చే రాజకీయ నాయకుడున్నికానని, పార్టీలు మారే సంస్కృతి తన రక్తంలోనే లేదని చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరటం దురదృష్టకరమని, పార్టీ మారకుండానూ ప్రజాసేవ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తాను కూడా పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకప్పడు రఘుపతి సేవలు తమ పార్టీకి అవసరం లేదని చెప్పిన పాలక పక్ష నే తలే ఇప్పుడు తనపై బురద చల్లడం ఎంత వరకు సబబో వారి విజ్ఞతకే వదలి వేస్తున్నానని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఎమ్మెల్యేగా తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తాను జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు.

కేశవ్ కు సిగ్గు శరం, చీము,నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు సిద్దం కావాలని ...

జగన్ మగాడైతే,రాయలసీమ రక్తం కలిగినవాడైతే తనతో చర్చకు రావాలని టిడిపి నేత కేశవ్ అనడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు మండిపడ్డారు.కేశవ్ బతుక్కి తమ నేత జగన్ చర్చకు రానవసరం లేదని, తాము ఎవరిమైనా సరిపోతామని, ఉరవకొండలో చర్చకు సిద్దమని ఆయన అన్నారు.కేశవ్ కు సిగ్గు శరం, చీము,నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు సిద్దం కావాలని అంబటి అన్నారు.వాళ్లకు దమ్ముంటే సిబిఐ విచారణకు, లేదా సిటింగ్ జడ్జితో విచారణకు సిద్దపడాలని ఆయన అన్నారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల అంటున్నారని, ఆయన మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి, వాళ్లు మగాళ్లు కారా అని అంబటి వ్యాఖ్యానించారు.వీరంతా ముందుగానే అక్కడ ఎలా కొన్నారన్నది ప్రశ్న అని ఆయన అన్నారు. తనపై కధనాలు వేయవద్దని రాత్రి పొద్దుపోయేదాకా ఎందుకు కేశవ్ సాక్షిని బతిమలాడుకున్నారో చెప్పాలని ఆయన అన్నారు.రాయలసీమలో పుట్టినవాడివి.. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని, అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మగాడినని ప్రగల్భాలు పలకడం కాదు, చేతల్లో చూపించుకోవాలని హితవు పలికారు. మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చాక, మీ పెదబాబు, చినబాబు, పరివారం మొత్తాన్ని తీసుకురావాలని అన్నారు. మీ నాయకులు బినామీ పేర్లతో కొన్న స్థలంలోకి వస్తారో.. మీ అబ్బాయి పేరు మీద కొన్న నాలుగెకరాల్లోకి వస్తారో రావాలని సవాలు చేశారు.

అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?


అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో మండిపడ్డారు. నిప్పులాంటి మనిషినని చెప్పకునే మీరు ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఫిరాయింపులు తెలంగాణలో జరిగితే అన్యాయం... అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగితే అభివృద్ధా ? అని అడిగారు. ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా... అధికార పార్టీలోకి చేర్చుకోవడమే చంద్రబాబు విజనా అని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితి గురించి మాట్లాడే బాబుకు అనర్హత చట్టం తెలియదా ? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  సందేహాం వ్యక్తం చేశారు.  

నిప్పు అన్నావుగా... ఇప్పుడు నోరు విప్పు:రోజా

హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహాచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. నేను నిప్పు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న నీవు ... ఇప్పుడు నోరు విప్పు అంటూ చంద్రబాబుపై రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరిగాయనే తాము తొలి నుంచి ఆరోపిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇన్ని రోజులు తమపై బురద జల్లుతూ తప్పించుకుని తిరిగారని రోజా విమర్శించారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాక నోరు మెదపడం లేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రోజా పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ భూమి సీఆర్ డీఏ పరిధిలోకి ఎందుకు రాలేదన్నారు. అలాగే చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడి భూమి వద్ద అలైన్ మెంట్ ఎందుకు మారిందని నిలదీశారు. రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకుండానే ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. దోచుకునేందుకే మంత్రి నారాయణ, పుల్లారావుకు రాజధాని బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.  
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు 5 లక్షల ఎకరాల భూమి ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నా... ఎందుకు విచారణ జరపడం లేదంటూ అధికార పార్టీ నేతలను రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పు చేయకుంటే సిట్టింగ్ జడ్జి లేదా... సీబీఐతో విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదు అని ఆమె నిలదీశారు. అలాగే అకస్మాత్తుగా ఐజీఆర్‌ఎస్ వెబ్ సైట్ ను ఎందుకు బ్లాక్ చేశారన్నారు. మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయమా ? అని ప్రశ్నించారు. మాదంతా సక్రమమేనంటున్న చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లెందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. రెండెకరాల భూమి ఉన్న ఏ రైతు కూడా చంద్రబాబులా వేల కోట్ల హెరిటేజ్ లాంటి సంస్థలకు అధిపతులు ఎందుకు కాలేకపోయారూ అంటు సందేహం వ్యక్తం చేశారు. కేవలం రెండెకరాలు భూమి ఉన్న చంద్రబాబు తల్లి అమ్మణమ్మ రూ. కోట్లు వెచ్చించి జూబ్లీహిల్స్ లో మనవడు లోకేష్ కు భూమి ఎలా కొనిచ్చారని ప్రశ్నించారు.


తనకు వాచీ కూడా లేదంటున్న చంద్రబాబు... రైతులకు గోచీ కూడా లేకుండా దోచుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మంత్రి నారాయణతో కమిటీ వేసి... విజయవాడ వద్ద రాజధాని అని ఎందుకు నిర్ణయించారన్నారు. బినామీలు కొనుగోలు చేసిన భూమి ల్యాండ్ పూలింగ్ లోకి ఎందుకు రాలేదని అడిగారు. ఓ కుట్ర ప్రకారమే సీఆర్ డీఏ పరిధిని నిర్ణయించి రైతులను రోడ్డున పడేశారని రోజా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిలో ఎలాంటి పనులు జరగడం లేదని... అందువల్లే ఉద్యోగులను విజయవాడ రమ్మంటున్నారని ఆరోపించారు. అలాగైనా రియల్ ఎస్టేట్ పెరిగి భూముల ధరలు ఇంకా పెరుగుతాయని ఆశ పడుతున్నారు. నేను ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఓ మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రోజా గుర్తు చేశారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని మంత్రిని ఎలా చేశారన్నారు. ఇద్దరు కలిసి క్విడ్ ప్రోకోకు పాల్పడి రూ. వేల కోట్లు సంపాదించారన్నారు. రాజధానిలో భూములు కోల్పోయిన పేద రైతుల విద్యార్థుల్లో ఒక్కరికైనా నారాయణ కాలేజీలో సీటు ఇచ్చారా ? అన్ని ప్రశ్నించారు.  ఒక్క నారాయణ కాలేజీలో పని చేసిన సిబ్బంది మాత్రమే వేల కోట్లు విక్రయించి భూములు ఎలా కొన్నారన్నారు. రూ. 6 వేల జీతం తీసుకుంటూ ఉద్యోగం చేసే ప్రమీలా15 ఎకరాలు ఎలా కొన్నారన్నారు.
అలాగే మంత్రి నారాయణ బావమరిదికి 29 ఎకరాల భూమి ఎలా వచ్చిందని...రాజధానికి రూ. 10 విరాళం ఇవ్వాలని విద్యార్థులను కోరిన ఆయన ఒక్క రూపాయి అయినా విరాళంగా ఇచ్చారా అని అడిగారు. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నాలుగు ఎకరాలు ఎందుకు కొన్నారు... ఆయన కొడుక్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. దళితుల అసైన్డ్ భూములను పథకం ప్రకారం దోచుకున్నారన్నారు. రకరకాలుగా వారిని భయపట్టి ఎకరా రూ. 5 లక్షలకు కొట్టేశారన్నారు. ఇప్పుడు ఆ భూముల ధరలు రూ. కోట్లకు చేరిందన్నారు.
సాక్షి మీడియాపై చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారని... కానీ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ఎందుకు ప్రకటించడం లేదంటూ రోజా సూటిగా ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరన్న అసలైన అహంకారి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడవటమే కాకుండా స్పీకర్ కోడెల తనయుడు పీఏ పేరుతో 17 ఎకరాలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడిదన్నారు.  పత్తి రైతుల కడుపుకొట్టి రూ. 600 కోట్లు దోచుకున్న మంత్రి పుల్లారావు.. నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను భార్య వెంకాయమ్మ పేరుతో మార్చుకున్న పుల్లారావు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే తుళ్లూరు ప్రాంతంలోనే భూములెందుకు కొన్నారని సందేహం వ్యక్తం చేశారు.
నారాయణ, రావెల కిశోర్, సుజనా చౌదరి రాజకీయాలతో సంబంధం లేకపోయినా మంత్రలెలా అయ్యారని, అప్పుడు చంద్రబాబుకు వేల కోట్లు ఇచ్చిన వారు రాజధానిలో దోచుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా భూ దందాపై సిట్టింగ్ జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు ప్రభుత్వానికి రోజా సవాల్ విసిరారు.

రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారు?

రాజధానిలో రైతుల భూములు తీసుకుని ,టిడిపి నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారని ఆమె ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఆయన నానమ్మ హైదరాబాద్ మదీనాగూడలో ఐదెకరాల బూమి ఎలా ఇచ్చిందని రోజా అన్నారు.మంత్రి నారాయణపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఏనాడైనా ఆయన టిడిపి జెండా మోశారా అని ప్రశ్నించారు.ఆయన తన కాలేజీలలో పనిచేసే చిరుద్యోగుల తో భూములు కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు.సాక్షిపత్రికపై దావా వేస్తామని మంత్రులు చెప్పారని, ఇప్పుడు మరిన్ని ఆధారాలతో వార్తలు వచ్చాయని, వీటిపై విచారణ కు మంత్రులు సిద్దం అవుతారా అని రోజా ప్రశ్నించారు.లాండ్ పూలింగ్ లో రెవెన్యూ మంత్రిని ఎందుకు బాగస్వామిని చేయలేదని ఆమె అడిగారు. స్పీకర్ కోడెల కుమారుడు పిఎ 17 ఎకరాల బూమి ఎలా కొన్నారని ఆమె అన్నారు.చంద్రబాబు అక్రమ భవనంలో ఉన్న మాట వాస్తవం కాదా అని రోజా అన్నారు.మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య పేరుతో అగ్రిగోల్డ్ సంస్థ భూమిని కొన్నారని , ఆయన స్నేహితులు ఎలా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని అన్నారు.చంద్రబాబు తనకు నిజాయితీ ఉందని, తాను నిప్పు అని చెప్పుకోవడం కాదని, రాజధాని భూములపై నోరు విప్పాలని రోజా డిమాండ్ చేశారు. దమ్ముదైర్యం ఉంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి


'భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ...ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ నాయకులు బినామీ పేర్లతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు..

♦ ప్రజల ఆశీస్సులే విజయ రహస్యం కాంగ్రెస్ విమర్శ అర్థరహితం
♦ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో దోస్తీ కట్టినందుకే పోటీలో నిలిచాం
♦ కార్పొరేషన్ ఎన్నికలొస్తే తప్ప సీఎంకు జిల్లా గుర్తురాలేదు
♦ మీట్ ది ప్రెస్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం : ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల గుండెల్లో ఆయన నిలిచే ఉన్నారు. ఆయన ఆశయసాధన కోసం ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీకి ప్రజల అండదండలు ఉన్నాయి. మాటల గారడీతో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే.. హెచ్143, టీయూడబ్ల్యూజే.. ఐజేయూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందని, రైతు రుణమాఫీ ఇప్పటికీ అందలేదని, డబుల్‌బెడ్రూం ఇళ్లు అడ్రస్ లేవని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడుతూ పాలిస్తారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, పింఛన్లు అందజేస్తామని హామీలు ఇస్తూ ఓట్లు అడుగుతున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ నాయకులను నమ్మరన్నారు. సీఎం కేసీఆర్‌కు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే తప్ప ఖమ్మం జిల్లా గుర్తుకు రాలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పడం, నిధుల విడుదలకు జీఓ జారీ చేయడం శోచనీయమన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థిని బరిలో దింపుదామనుకున్నామని, అయితే కాంగ్రెస్.. టీడీపీతో దోస్తీ కట్టడంతో వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిని బరిలో దింపి తమ సత్తా ఏమిటో నిరూపించామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని, టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. జిల్లాలో తమ పార్టీ బలంగా ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు దీటుగా తమకు ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ప్రజల మద్దతు తమకుందని, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.  ఖమ్మం అభివృద్ధి కోసం ఎంపీ నిధులు వెచ్చించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తానని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, జాతీయ రహదారుల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తామని వివరించారు. జిల్లాలో ఐటీ పరిశ్రమ లేని లోటు ఉందని, ఇందుకోసం పలు ఐటీ కంపెనీల యజమాన్యంతో మాట్లాడానని, తొలి దశలో 150 నుంచి 180 మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టు తీసువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ వివరించారు.
తనకు ప్రజాశీస్సులు ఉన్నాయని, వారి అభిమతానికి విరుద్ధంగా ఏనాడు నడుచుకోలేదని, మునుముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పారు. మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, ఏనుగు వెంకటేశ్వరరావు, టెమ్‌జూ అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్, ఖదీర్, ఐజేయూ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకట్రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు బొల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు.

బాబుది అంతర్జాతీయ దొంగలముఠా


బాబుది అంతర్జాతీయ దొంగలముఠా
కేంద్రం నిధులనుపక్కదారిపట్టిస్తున్న సీఎం
జన్మభూమి కమిటీలతోబ్యాంకులు దివాలా
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికోవూరు: సీఎం చంద్రబాబునాయుడు తనతో పాటున్న తొమ్మిది మంది అంతర్జాతీయ దొంగల ముఠాగా మారారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. గంగవరంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు సన్న, చిన్నకారు రైతులను ఈ దొంగలముఠా బెదిరించి భూముల్ని కారుచౌకగా కొనుగోలు చేసిందన్నారు.అమరావతి చుట్టూ వేలాది ఎకరాల్ని బినామీ పేర్లతో ఈ ముఠా కొనుగోలు చేసిందన్నారు. భూములు ఇచ్చేది లేదంటూ రైతులు అడ్డం తిరిగితే వారిని బెదిరించి లాక్కున్నారన్నా రు. జిల్లా మంత్రి నారాయణ ఒక్కరే 3,500 ఎకరాలు కొన్నారంటే ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అర్థమ తోందన్నారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపైన సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాల న్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను రాష్ట్ర ఖజానాలోకి మార్చి చంద్రబాబునాయుడు పంచాయతీల మౌలిక వసతులకు అడ్డుకట్టవేశారన్నారు. గంగవరం గ్రామంలో తిరుపతిరెడ్డి నివాసంలో ప్రసన్న మాట్లాడారు. పంచాయతీల్లో మౌలిక వసతులకు ఉపయోగించాల్సిన నిధులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను చంద్రబాబు పక్కనపెట్టి జన్మభూమి కమిటీల హవా సాగించేలా చేయ డం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజాప్రతినిధులకు విలువలేకుండాపోయిందని,ఆ కమిటీల కారణంగా బ్యాం కులు దివాలా తీస్తున్నాయని బ్యాంకు అధికారులే బహిరంగంగా చెబుతున్నారన్నారు.

కమిటీ సభ్యులు క్యాన్సర్  కన్నా ప్రమాదంగా తయారయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా సమావేశంలో అక్కడి లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పడం అందుకు నిదర్శనమన్నారు. రుణాలు సక్రమంగా కట్టని వారికి తిరిగి మంజూరు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇలాగే ఉంటే    కొద్ది రోజులకు బ్యాం కులు దివాలా తీస్తాయని  సుబ్రహ్మణ్యం చెప్పడాన్ని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు.
పెంచిన వేతనాల అమలేదీ?

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు  2015  జూన్ 8వ తేదీ న గౌరవ వేతనాలు పెంచుతూ విడుదల చేసిన జీఓ నేటికీ అమలుకాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచుల్లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ మైనార్టీ, ఓసీలు అధికంగా ఉన్నారన్నారు. వీరిలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు ఎంతోమంది ఉన్నార ని, కార్యక్రమాలు చేసి అప్పులు పాలవుతున్నారన్నారు. జిల్లా కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, అనుబంధాల సంఘాల నాయకులు మల్లిఖార్జునరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, మధురెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుబ్బరాయుడు  ఉన్నారు.

ఎమ్మెల్యే పదవులు తాకట్టు పెట్టారు


ఎమ్మెల్యే పదవులు తాకట్టు పెట్టారు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి  

వెంకటాచలం(ముత్తుకూరు) :  వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులను తాకట్టుపెట్టి టీడీపీలో చేరారని, భవిష్యత్తులో ఇటువంటి ఫిరాయింపుదారులకు పుట్టగతులు ఉండవని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలంలోని కంటేపల్లి ఎస్టీకాలనీ, గంగిరెద్దులకాలనీల్లో రూ.16 లక్షలతో నిర్మించిన రెండు సిమెంట్ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీకాలనీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేస్తున్నందున టీడీపీలో చేరామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చేసే పార్టీలో ఏం అభివృద్ధి కనిపించి చేరారని ఎద్దేవా చేశారు. ప్రతిష్ట కలిగిన పార్టీలో ఉండలేక ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు తూట్లు పొడిచి టీడీపీలో చేరి పరువు పోగొట్టుకుంటున్నారన్నారు. పార్టీ మారి చేరే ఎమ్మెల్యేలకు టీడీపీలో కనీస గౌరవం ఉండదన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీ మునిగిపోయే నావన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఛీత్కరించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ శాంతి, ఎంపీటీసీ సభ్యులు వెంకమ్మ, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్, నాయకులు కనుపూరు కోదండరామిరెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, కరియావుల చెంచుకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
 

బిట్టు బిట్టుకో బినామి


బిట్టు బిట్టుకో  బినామివీడియోకి క్లిక్ చేయండి
 పెద్దల ‘భూ’మాయకు ఆధారాలెన్నో..
⇒ ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా..? 15 ఎకరాలు కొన్న ప్రమీల ఎవరు?
⇒ బావమరిది పేరుతో 29 ఎకరాలు కొన్నదెవరు?
 నారాయణ భూ దందాలో పాత్రధారులెందరో...
 రూ. 425 కోట్ల హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసిన ‘చినబాబు’
  పీఏ పేరుతో 17.3 ఎకరాలు కొన్న కోడెల కుమారుడు
 వాగు పోరంబోకును బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ధూళిపాళ్ల
 సమీకరణ నుంచి ఎమ్మెల్యే ‘వెంచర్’ తప్పించినందుకు ‘చినబాబు’కు వాటాలు
 రాజధాని ఉప్పందుకున్న పయ్యావుల కేశవ్ కొన్నది 4.09 ఎకరాలు..

 
రాజధాని ‘భూమాయ’లు ఒకటో రెండో కాదు. తవ్విన కొద్దీ బైటపడుతున్నాయి. రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతన్న పొట్టగొట్టి వేల ఎకరాలను కాజేసిన పెద్దల ‘ఘన’కార్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు వేలమంది రైతులు బలైపోయారు. రాజధాని ఎక్కడ అనే దానిపై గందరగోళం సృష్టించడంతో అమాయక రైతులు అయినకాడికి భూములు అమ్మేసుకున్నారు. రైతులను మోసగించి కారుచౌకగా కొట్టేసిన భూములు ఇపుడు పెద్దలకు కోట్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడిన ‘బినామీ’ నాటకాలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం..
 
► రాజధానిగా ప్రకటించనున్న ప్రాంతంలో మంత్రి నారాయణ బిట్లు బిట్లుగా దొరికినచోట దొరికినట్లు భూములు కొనేశారు. అరెకరం, 45 సెంట్లు, 87 సెంట్లు ఇలా ముక్క దొరికితే చాలు కారుచౌకగా స్వాహా చేశారు. పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందరి పేర్లను వాడేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మంత్రిగారు బినామీ పేర్లతో పాగా వేశారు. మంత్రిగారి దూకుడు, పనితనం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యతలను ఆయన భుజస్కం ధాలపైనే పెట్టేశారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ రాజధానిలో ఆయనే పెద్దదిక్కు అయ్యారు.

 స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు తన వ్యక్తిగత కార్యదర్శి పేరుతో 17.3 ఎకరాలు కొన్నారు..

 ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి రూ. 5 కోట్ల విలువైన వాగు పోరంబోకును కబ్జాచేసి బంధువు పేర రిజిస్ట్రేషన్ చేయించారు..

 రైతుల భూములు బలవంతంగా లాక్కున్న పెద్దలు.. అధికారపార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రియల్‌ఎస్టేట్ వెంచర్‌ను పూలింగ్ నుంచి తప్పించేశారు.

► రాజధాని ఎక్కడ వస్తుందో ముందే ఉప్పందుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... తన కుమారుడి పేరుతో భూములు కొన్నారు...
 
ఆ ఇంద్రుడి రాజధాని అమరావతి.. ‘అమృతం’, ‘ఐరావతం’ ‘పారిజాతం’ నిలయం.. కాగా ఈ చంద్రుడి రాజధాని అమరావతి ‘బినామీలు’, భూబకాసురులు, దొంగ జీపీఏలు, రైతుల పొట్టగొట్టి కారుచౌకగా కాజేసిన వేల ఎకరాల రిజిస్ట్రేషన్ పత్రాల వలయం...
 
నారాయణ.. నారాయణ!
 కొనుగోలు 3,129 ఎకరాలు
 చెల్లించినది 432 కోట్లు
 ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైగా...

రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రెండేళ్ల కిందటి వరకు విద్యాసంస్థల అధిపతిగానే తెలిసిన నారాయణ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులందించారనీ, అందుకు ప్రతిఫలంగానే ఎమ్మెల్సీ, మంత్రి పదవీ అందుకున్నారనేది జగమెరిగిన సత్యం. అది నిజమేనన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రిని కాదని రాజధాని ప్రాంతంలో భూసమీకరణ బాధ్యతలను తన ప్రధాన బినామీ నారాయణకే అప్పగించారు. భూసమీకరణలో భాగంగా ఆయన రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతున్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల చొప్పున 3,129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో కమతాలు చిన్న చిన్నవి కావడంతో కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి  గరిష్టంగా 1.5 ఎకరాల వరకూ బిట్లు బిట్లుగా కొనుగోలు చేశారు.  

3,129 ఎకరాలు కొనుగోలు
భూముల కొనుగోలులో నారాయణ తన తెలివిని జాగ్రత్తగా ఉపయోగించారు. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పి.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. సమీప బంధువులు, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు బయటకు పొక్కకుండా  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, రిప్రజెంటేటివ్ విధానాన్ని అనుసరించారు. దీనితో భూమిని విక్రయించిన రైతు కొనుగోలుదారుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.
 
బినామీల పేరుతో భారీ కొనుగోళ్లు...
మంత్రి నారాయణ బినామీ వ్యవహారానికి ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల తదితరుల భూముల కొనుగోళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన మునిశంకర్ కోర్ కేపిటల్‌కు అతి సమీపంలో ఉన్న మందడం గ్రామంలో  సర్వే నెంబరు 126లో నూతక్కి నరసింహనాయుడుకు చెందిన 1.50 ఎకరాల భూమిని రూ.2.25 కోట్లు చెల్లించి 1.50 ఎకరాలు కొన్నాడని గ్రామస్తులు తెలిపారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరం ధర రూ.6 లక్షలు ఉండగా.. మార్కెట్ విలువను కేవలం రూ.తొమ్మిది లక్షలుగా చూపించారు. అలాగే లింగాయపాలెంలో సర్వే నెంబరు 109/1లో బోడిపూడి వెంకటరమణ నుంచి 0.56 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 15/1లో బోరుగడ్డ రాంప్రకాష్ నుంచి 0.37 ఎకరాలు, లింగాయపాలెంలో సర్వే నెంబరు 140/ఏలో కొత్తపల్లి రాధారాణి నుంచి 0.45 ఎకరాలు, సర్వే నెంబరు 188లో కొండెపాటి వెంకాయమ్మ నుంచి 0.28 ఎకరాలు, రాయపూడిలో సర్వే నెంబర్లు 119/ఏ, 119/ఎఫ్‌లలో షేక్ హస్రఫ్ ఉన్నీసా తదితరుల నుంచి 0.75 ఎకరాలు, సర్వే నెంబరు 354/1ఏ, 354/1బీలలో లంబు వెంకటేశ్వర్లు తదితరుల నుంచి 0.87 ఎకరాలు, సర్వే నెంబరు 360/1లో వెలగలేటి రమాదేవి నుంచి 0.25 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా ఆకుల మునిశంకర్ 30 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు.

మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబరు 465/3బీలో 0.32 ఎకరాలు.. బిట్లు బిట్లుగా 29 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు. మంత్రికి సన్నిహితురాలైన పోతూరి ప్రమీల తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సర్వే నెంబరు 51/బీ, 51/సీల్లో 0.98 ఎకరాలు, సర్వే నెంబరు 95/సీలో 0.45 ఎకరాలు, లింగాయపాలెంలో 157/2లో 0.9 ఎకరాలు, సర్వే నెంబరు 118/ఏలో 0.5 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 26/1లో 0.88 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా 15 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. ఆర్థిక స్థోమత రీత్యా రావూరు సాంబశివరావు, పోతూరు ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పదుల ఎకరాల్లో భూమి కొనుగోలు చేసే తాహతులేదని చెబుతున్నారు. వీరే కాక, ఇలాంటి చాలామంది బంధువులు, సన్నిహితుల పేరుతో నారాయణ రాజధాని గ్రామాల్లో 3,129 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

400 ఎకరాలు ఖాయం...
తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నెంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నెంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ  వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉందని సమాచారం. అలా రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతం లో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.
 
మంత్రి నారాయణ బినామీల్లో మచ్చుకు ముగ్గురు
ఆవుల మునిశంకర్ మంత్రి నారాయణకు దూరపు బంధువు. వరుసకు బావమరిది అవుతారు. నాలుగేళ్లపాటు నెల్లూరులో వీఆర్సీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేశారు. నారాయణ మంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలల తర్వాత తన మెడికల్ కాలేజీలో విద్యుత్ మరమ్మతుల బాధ్యతలను మునిశంకర్‌కు అప్పగించారు. అయితే అతని వేతనానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని.. మునిశంకర్‌కు అవసరమైనప్పుడు మంత్రి నారాయణ వద్ద కొంత మొత్తం తీసుకుంటుంటారని ఆ కాలేజీ వర్గాలు తెలిపాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మునిశంకర్ నారాయణ మెడికల్ కాలేజీకి సమీపంలోని ప్రైవేటు అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసే స్థోమత మునిశంకర్‌కు ఉంటుందా?
 
రాపూరు సాంబశివరావు
మంత్రి నారాయణకు స్వయాన బావమరిది. మంత్రి నారాయణకు చేదోడువాదోడుగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు సంబంధించిన వ్యవహారాలను సాంబశివరావే చక్కదిద్దుతుంటారు. రాపూరు సాంబశివరావు పేరు మంత్రి నారాయణ భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు నెల్లూరు వాసులు చెబుతున్నారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలోనూ ఆయన పేరుతో భూములు కొన్నారు.
 
పొత్తూరి ప్రమీల
మంత్రి నారాయణకు సన్నిహితురాలు. కర్ణాటక, తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమే. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి రాజధానిలో భూములు కొనుగోలు చేసే ఆర్థికస్థోమత ఉంటుందంటారా?
 
రామకృష్ణార్పణం
 రియల్ వెంచర్ 179.54 ఎకరాలు
 అసైన్డ్ భూములు 54 ఎకరాలు

రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కవడంతో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో రియల్ వెంచర్ వేసిన సంస్థనుంచి భారీగా ముడుపులు అందుకున్న సర్కారు పెద్దలు అక్రమాన్ని సక్రమం చేసేశారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో పెదకాకాని మండలం  నంబూరు గ్రామ పరిధిలో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి పక్కనే, నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 179.54 ఎకరాల్లో ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రణాళిక రచించింది. కాజా గ్రామం లోని సర్వే నెంబర్లు 78 నుంచి 107 వరకు 94 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయగా మిగతా 76 ఎకరాలను నంబూరు గ్రామానికి చెందిన దళిత, పేద రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 54 ఎకరాలకుపైగా అసైన్డ్ భూ ములు ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్టర్ అయిన భూముల్లో లే అవుట్లు వేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వీజీటీఎం నుంచి అనుమతి లభించింది. భారీ ప్రచారం, మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో అనతికాలంలోనే స్థలాలు, విల్లాల విక్రయానికి తెర తీసింది.
 
చినబాబుకు భారీ వాటాలు
రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల్లో అసైన్డ్ భూములున్నాయనీ, ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామంటూ యాజమాన్యాన్ని బెదిరించారు. ఆ తర్వాత ఓ కేంద్ర మంత్రి మధ్య వర్తిత్వంతో రాయబేరాలు కుదరడంతో.. రియల్ దందాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలిచారు. దీంతో ఆ వెంచర్‌లో చదరపు గజం రూ. 4 వేలకు ప్రారంభించి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా రూ. 25 వేల వరకు విక్రయిస్తూ సంస్థ సొమ్ము చేసుకుం టోంది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమను మోసం చేసి అసైన్డు భూములు కొనుగోలు చేసిందని నంబూరుకు చెందిన డేవిడ్ ఆధ్వర్యంలో దళిత పేద రైతులు  గుంటూరు జిల్లా అధికార యం త్రాంగానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చినబాబుకు భారీ ఎత్తున వాటాలు దక్కడంవల్లే గుంటూరు జిల్లా కలెక్టరు విచారణను అటకెక్కించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంగళగిరి తహశీల్దార్ విజయలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా కాలువలు పోరంబోకు భూములు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పడం గమనార్హం.
 
పయ్యావుల వాలారు!
• కొనుగోలు 4.09 ఎకరాలు
• చెల్లించినది 12.27 లక్షలు
• ప్రస్తుత విలువ 8 కోట్లు

ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు రాజధాని ప్రాంత రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భూముల కొనుగోళ్లే మరో ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ నిర్మిస్తారో స్పష్టంగా చెప్పకుండా ముచ్చటగా మూడు పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ తన అనుయాయులకు మాత్రం రాజధాని ప్రాంతం విషయంలో ముందుగానే స్పష్టతనిచ్చారు. ఇంకేం అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో వాలిపోయారు. ఎక్కడ భూములు తక్కువ ధరకు లభిస్తాయో, ఏ భూములు కొంటే ఎక్కువ లాభం చేసుకోవచ్చో దగ్గరగా పరిశీలించారు. కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న  కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. ప్రజారాజధాని నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు ఓర్వలేకనే ప్రతిపక్షం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు గుప్పిస్తోందని పదేపదే గగ్గోలు పెట్టే పయ్యావుల కేశవ్ మరి రైతుల భూములను మభ్యపెట్టి కొని వారికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి.
 
ధూళిపాళ్ల  ‘పోరంబోకు’ కథ!
• అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు
• రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు

రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చివరకు వాగు, డొంక, చెరువు పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. కన్పించిన భూమినంతా కబ్జా చేసి.. రెవెన్యూ రికార్డులను తిరగరాయించి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అనుచరుల తీరే తార్కాణం. రాజధాని ప్రకటనతో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాగు పోరంబోకు భూములపై ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కన్ను  పడింది.
 
ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్
నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్  చేసేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కొడుకు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రిజిస్ట్రేషన్‌లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్‌లు పుట్టించారు. ఆ తరువాత ఈ ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవర పుల్లయ్యకు విక్రయించినట్లు సృష్టించారు.  ఎమ్మెల్యే ధూళిపాళ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బి6, బి7, బి8 సబ్ డివిజన్లుగా విభజించి దేవర పుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.  ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది.

మొత్తం 50 ఎకరాల పోరంబోకు కబ్జా
ఈ భూమిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ భూమిలో బోర్లు వేసి, సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోరు వేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వీఆర్వోకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఈ భూమి వాగు పోరంబోకు అని గ్రామ ప్రజలందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుతగిలితే తప్పుడు కేసులు పెట్టించడం, లేదా దాడులు చేయించడం వంటివి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొమ్మాలపాటి  కుచ్చుటోపీ!

 కొనుగోలు 42 ఎకరాలు
• చెల్లించినది రూ. 1.26 కోట్లు
• ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు

 రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి.. టీడీపీ ప్రజా ప్రతినిధుల రౌడీయిజానికి ఇదో తార్కాణం. ఏడేళ్ల కిందట మంగళగిరికి సమీపంలో నెలసరి కంతులపై మూడువేల మందికి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వినియోగదారులకు టోపీ పెట్టారు. ప్లాట్లు ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా చినబాబుకు భారీ ఎత్తున వాటాలు అందినట్లు సమాచారం.

సభ్యులకు కుచ్చుటోపీ

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్‌షిప్‌ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది.  సభ్యుడిగా చేరేందుకే రూ.25 వేల వంతున చెల్లించి, తదుపరి వాయిదాలు చెల్లించారు. 2009లో ప్లాట్ల విక్రయాలు ప్రారంభించిన సంస్థ 2012 నాటికే సభ్యుల నుంచి పూర్తి వాయిదాలను వసూలు చేసింది. ఒక్కనెల వాయిదా కట్టకపోయినా డిఫాల్టరుగా మార్చి మెజారిటీ సభ్యులకు శఠగోపం పెట్టారు. పూర్తిగా డబ్బు కట్టిన వారికి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంతలో యర్రబాలెం గ్రామం సైతం భూ సమీకరణలోకి చేరడంతో వెంచర్‌కు అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పూర్తిగా నగదు చెల్లించిన సభ్యులు సంస్థను సంప్రదించగా అధికార పార్టీ అండ ఉండడంతో సభ్యులకు నయానోభయానో విషయం బయటకు పొక్కకుండా కొంతమందికి వేరే వెంచర్‌లో ప్లాట్లను కేటాయిస్తామంటూ నమ్మబలికి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఈ విధంగా ఒక్క యర్రబాలెం వెంచర్‌లోనే సంస్థ సుమారు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిందని తెలిసింది.
 
సమీకరణ నుంచి తప్పించేశారు..
యర్రబాలెం గ్రామంలో అధిక శాతం మంది రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ..    అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌లో సైతం వదిలేసింది. సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడే ఇందుకు కారణమని  అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ భూములకు అన్ని మినహాయింపులు ఇచ్చి.. రాజధానిలో మెగా సిటీ రూపొందించడానికి ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. తుది మాస్టర్ ప్లాన్ విడుదలైన  వెంటనే రాజధానిలో తొలి ప్రైవేటు రియల్ మెగా సిటీని ప్రకటించేందుకు సంస్థ సిద్ధమవుతుండగా, అందుకు సీఆర్‌డీఏ నుంచి అనుమతులు ఇప్పించేందుకు చినబాబు చక్రం తిప్పుతున్నారు. ఆ మేరకు ఆ వెంచర్‌లో చినబాబు వాటాలు పొందినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే అంశంపై సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితకుమారి వివరణ కోరగా... 485 నుంచి 500 సర్వే నంబర్ల వరకు 42 ఎకరాలు భూసమీకరణలోనే ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు ఆ భూములను సమీకరణకు ఇవ్వలేదన్న అంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపామంటూ దాటవేశారు. ఇదే విషయంపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.
 
కోడెల తనయుడా? మజాకా?
• కొనుగోలు 17.3 ఎకరాలు
• చెల్లించినది రూ. 93 లక్షలు
• ప్రస్తుత విలువ 18.4 కోట్లు

రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.  రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడా నికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం.. అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత. తన వద్దకు వచ్చిన వారిని బతిమాలో బెదిరించో.. నయానో భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని తన బినామీల పేర్లతో కొట్టేయడం రివాజుగా మారింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్‌ఫ్రా పేరుతో  ఎకరం రూ.ఎనిమిది లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ.. అదేమీ పట్టని రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని గుత్తా నాగప్రసాద్‌కు కట్టబెట్టేసింది. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ఆ నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నారు.
 
ఎవరీ గుత్తా నాగప్రసాద్?
గుత్తా నాగ ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు. సాధారణ కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్ బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. కోడెల పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రమాదం మరణించినపుడు నాగప్రసాద్‌కు ఆ కుటుంబంతో సన్నిహిత బంధం ఏర్పడింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ కోడెల వ్యవహరించే సమయంలో నాగ ప్రసాద్‌ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులను నాగ ప్రసాద్‌తో చేయించేవారని సమాచారం. కేడెల క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాగప్రసాద్ ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కోడెల స్పీకర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన తనయుడు కోడెల శివరామ కృష్ణకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూనే.. గుంటూరు లో హోండా షోరూంలో ప్రైవేటు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చిలుకలూరిపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగ ప్రసాద్.. కోడల తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట నియో జకవర్గాల్లో పనులు చక్కబెడుతుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్‌కు కోట్లాది రూపాయలు వెచ్చించి.. భూములు కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా?
 
హాయ్‌ల్యాండ్.. హాంఫట్!
బేరం కుదిరింది.. రూ.425 కోట్ల విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములు చినబాబు వశమయ్యాయి 
రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. కోల్‌కోత-చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్ ల్యాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకూ పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న మందస్తు ఎత్తుగడలో భాగంగా.. వాటిని రాజధాని భూసమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్‌దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా రూ.425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్‌ను చినబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించినా సీఐడీ విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేనన్నది పోలీసు వర్గాల అభిప్రాయం.  క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం గమనార్హం.
 
హైకోర్టు ఆగ్రహించినా...
అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లోని 32 లక్షల ఖాతాదారుల నుంచి సుమారు రూ.6850 కోట్లను డిపాజిట్లను ఈ సంస్ధ సేకరించింది. ఆ డబ్బులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. గడువు తీరిపోయినా అధిక శాతం మంది డిపాజిట్‌దారులకు నగదు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఏడు రాష్ట్రాలతోపాటూ మన రాష్ట్రంలోనూ 2014 నవంబర్ నుంచి  ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలకు దిగారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆగస్టు, 2015లో హైకోర్టులో బాధితులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వ కీలక నేత.. తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన  మొత్తం సుమారు 16 వేల ఎకరాల భూమికి సంబంధించి కొనుగోళ్లూ, అమ్మకాలు స్థంభించిపోయాయి.

సీఐడీ దర్యాప్తు నత్తనడకన సాగుతోండటంతో ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టు జోక్యం చేసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆ సంస్థ, అనుబంధసంస్థల్లో ఉన్న డెరైక్టర్లు, భాగస్వాముల వివరాలు, వారి ఆస్తులు వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థను అదేశించింది. ఒకానొక సందర్భంలో దర్యాప్తు తీరు ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. పక్షం రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. కానీ.. కేసు విచారణను నీరుగార్చుతూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కోసం 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం.

Popular Posts

Topics :