27 March 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు

Written By news on Friday, April 1, 2016 | 4/01/2016


రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు
చంద్రబాబు ప్రభుత్వతీరుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

♦ సర్కారు దోపిడీ, వైఫల్యాలపై సభలో నిలదీశాం..
♦ విచ్చలవిడి అవినీతి.. దోపిడీ పాలన..
♦ మేం చెప్పిందే కాగ్ నివేదికలూ నిర్ధారించాయి..
♦ ఎస్సీ, ఎస్టీల జీవితాలతో బాబు చెలగాటం..
♦ సమయం వచ్చినపుడు ప్రజలే బుద్ధిచెప్పాలని పిలుపు

 సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని సీఎం చంద్రబాబు  ప్రజల్లో చులకన అయ్యారు. ప్రజలకు మేలు చేసే ఏ కొత్త స్కీమునూ ప్రవేశపెట్టలేని చంద్రబాబు రాష్ట్రాన్ని స్కాముల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. తమ దోపిడీ, వైఫల్యాలపై ప్రజల్ని మభ్య పెట్టేందుకు అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అవి నీతి, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రజల తరఫున నిలదీసేది విపక్షం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేం అదే చేశాం. అయితే ప్రజల తరఫున నిలదీస్తున్నందుకే మా గొంతు నొక్కా రు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినపుడు చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలను కోరుతున్నా’ అని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అనేక అంశాలను సవివరంగా ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే.....

 సర్కారు దుర్మార్గాలపై నిలదీశాం
 ‘‘మూడు బడ్జెట్‌లు అయిపోయాయి.. ఇక మిగిలింది రెండే రెండు బడ్జెట్‌లు.. ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ దగ్గర నుంచే ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. స్పీకర్ వ్యవహరిస్తోన్న తీరును నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన విధానాలను ఎండగట్టాం. రోజమ్మ విషయంలో కోర్టు తీర్పును అమలు చేయకపోవడం, అప్రాప్రియేషన్(ద్రవ్య వినిమయ) బిల్లులో ప్రభుత్వ తీరును నిలదీశాం.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు, అవినీతిపై ప్రశ్నించాం. తక్కువ రేట్లకే కరెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రైవేటు వ్యక్తులతో లాలూచీ పడి ఎక్కువ ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఏపీఈఆర్‌సీ(ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)కి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్(ఐఈఈ) రాసిన లేఖను చూపిస్తూ అవినీతిని ఎండగట్టాం. ఆదిలోనే చంద్రబాబునాయుడు ఓత్ ఆఫ్ సీక్రసీని నీరుగార్చి రాజధాని భూముల్లో దగ్గరుండి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాల్లో రాజధాని వస్తుందని చెప్పి ప్రజల దృష్టి మళ్లించారు. ఫలానా చోటే రాజధాని వస్తుందని తన బినామీలు, అనుయాయులకు చెప్పారు.

తన బినామీలు, అనుయాయులు తక్కువ రేట్లకే భూములు కొనుగోలు చేసిన తర్వాత, తీరిగ్గా అక్కడే రాజధానిని ప్రకటించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన తీరును అసెంబ్లీలో నిలదీశాం. రైతులను మోసం చేసి తక్కువ ధరలకే బినామీలు, అనుయాయులు కొట్టేసిన భూముల రేట్లు పెరిగేలా జోనింగ్ చేశారు. రాజధాని చుట్టూ ఉన్న భూములను అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించి.. బినామీలు, అనుయాయులు భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనువుగా జోనింగ్ చేశారు. డిమాండ్, సప్లయ్‌ని మిస్ మ్యాచింగ్ చేశారు. రైతులు భూములు అమ్ముకునే స్వేచ్ఛను హరించిన తీరును ఎండగట్టాం.

ఇసుక రీచ్‌ల్లో రూ.రెండు వేల కోట్లు దోచుకున్నారని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఆరోపణ చేశారు. చంద్రబాబునాయుడు ఇసుక మాఫియాతో కలిసి నీకింతా.. నాకింత అనే రీతిలో రూ.రెండు వేల కోట్లు దోచుకున్నాక పతివ్రత అయినట్లు ఇసుకను ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించారు. రెండేళ్లు చంద్రబాబునాయుడు చేసిన పాపాలు, మోసాలను కవర్ అప్ చేసుకోవడానికే ఇసుకను ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించడాన్ని అసెంబ్లీలో ఎండగట్టాం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను సైతం ఖర్చు చేయకుండా రాజ్యాంగ హక్కులను హరించారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగ బద్ధంగా నియమించాల్సిన ట్రైబల్ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేయకపోవడాన్ని నిలదీశాం.

 మేం చెప్పిందే కాగ్ చెప్పింది..:
 చంద్రబాబు అవకతవకలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ మేం చెప్పిందే కాగ్ నివేదికల్లో ప్రస్తావించింది. జీఎస్‌డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో మూడు శాతానికి మించి అప్పులు చేయకూడదని ఎఫ్‌బీఆర్‌ఎం చట్టం చెబుతోంది. కానీ 2014-15లో చంద్రబాబునాయుడు జీఎస్‌డీపీలో 6.10 శాతం అప్పు చేసి.. ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించారని కాగ్ తేల్చింది. జీఎస్‌డీపీలో అప్పులు(లయబులిటీస్) 27.60 శాతానికి మించకూడన్నది ఎఫ్‌బీఆర్‌ఎం చట్టం నిబంధన. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల 2014-15లో అప్పులు ఏకంగా జీఎస్‌డీపీలో 32.03 శాతానికి చేరుకున్నాయని కాగ్ తేల్చి చెప్పింది.

ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా అప్పులు చేస్తూ తప్పులు చేస్తున్నారంటూ ఆది నుంచి మేం చెబుతున్నదే ఇప్పుడు కాగ్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా.. ఆ వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబునాయుడు హరించారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు 2014-15 బడ్జెట్లో రూ.4,779 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.1,504 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.1,886 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 69  శాతం, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన వాటిలో 40 శాతం నిధులను ఖర్చే చేయలేదని కాగ్ తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించి.. ఎస్సీ, ఎస్టీల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబునాయుడుకి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే నైతికహక్కు కూడా లేదు.

 20రోజుల్లో 32 వేల కోట్లు ఖర్చు చేశారా?
 టెక్నాలజీ వినియోగంలో తనను మించిన వారు లేరన్నట్టు చెప్పుకునే చంద్రబాబునాయుడు అదే టెక్నాలజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సీఎం సమీక్షించే కోర్ డ్యాష్ బోర్డు (సీఎం ఆఫీస్ రియల్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ డ్యాష్‌బోర్డు) లో మార్చి 11, 2016 నాటికి 2015-16 బడ్జెట్‌లో రూ.68,104 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సరిగ్గా 20 రోజుల తర్వాత అంటే మార్చి 31, 2016 నాటికి అదే కోర్ డ్యాష్ బోర్డులో 2015-16 బడ్జెట్ మొత్తం వ్యయంలో రూ.1,03,046 కోట్లను ఖర్చు చేసినట్లు చూపారు. అంటే.. 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఖర్చు చేశారా? ఏమన్నా టెక్నాలజీనా ఇది.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఎక్కడ.. ఎలా ఖర్చు చేశారు? ఎవరిని మోసం చేయడానికి ఈ టెక్నాలజీ? 2014-15లో ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసిన చంద్రబాబునాయుడు.. రూ.22,619 కోట్ల పబ్లిక్ డిపాజిట్లు(ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి)ను ఆయన అత్తగారి సొమ్మనుకున్నట్లు వాడుకున్నారు.

అప్పుగా తీసుకుని రూ.22,619 కోట్ల పబ్లిక్ డిపాజిట్లను మళ్లీ చెల్లించినట్లు చూపారు. అసలు పబ్లిక్ డిపాజిట్లను వాడుకోవడం నేరం. ఈ నేరంపై చంద్రబాబును జైల్లో పెట్టాలి.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, ఆర్.కె.రోజా, పీడిక రాజన్నదొర, చిర్ల జగ్గిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లా సూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, వి.వేణుగోపాల కృష్ణయాదవ్, కె.కన్నబాబు పాల్గొన్నారు.

 ప్రజలపై రూ.1,90,513 కోట్ల అప్పుల భారం
 రాష్ట్ర ప్రజలపై బాబు అప్పుల భారాన్ని మోపుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రూ.1,66,522 కోట్ల అప్పు లుండేవి. విభజనలో తెలంగాణ వాటా  69,479 కోట్లు, ఏపీ వాటా రూ.97,123 కోట్ల అప్పు వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ అంచనాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అప్పులు రూ.1,90,513 కోట్లకు చేరుకుంటాయన్నా రు. అంటే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 93,389 కోట్లు అదనంగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? బడ్జెట్‌లో అంకెలు తప్పుగా పేర్కొన్నారని కాగ్ తప్పుపట్టింది.

ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్

Written By Unknown on Thursday, March 31, 2016 | 3/31/2016


ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే ప్రభుత్వం మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టిందని, ఇక రెండు మాత్రమే మిగిలి ఉన్నాయని  ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగిన పరిస్థితులు, బడ్జెట్ సమావేశంలో అంకెలు తదితర విషయాలపై మాట్లాడేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు వైస్ జగన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో  ప్రధానంగా వైఎస్ఆర్ సీపీ తరఫు నుంచి గవర్నర్ స్పీచ్ మొదలుకొని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా కోర్టు తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, కరెంట్ ఛార్జీలు పెంపు తదితర అంశాలను సభలో ఎండగట్టడం, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండటం జరిగిందని ఆయన అన్నారు.  

రాజధాని ప్రాంత భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ అంశాలను సభలో ప్రస్తావించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు ఓత్ ఆఫ్ సీక్రసీని ఎలా ఉల్లంఘించారో సభలో ఎండగట్టామని, నీకెంత-నాకెంత అంటూ ఇసుకలో రూ.2వేల కోట్లు దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రెండేళ్లు ఎడాపెడా దోచుకుని ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటున్నారని ధ్వజమెత్తారు.  సబ్ ప్లాన్ విషయంలో ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు సర్కార్  మోసం చేసిందన్నారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయకపోవటంపై నిలదీయటం జరిగిందన్నారు. తాము అసెంబ్లీలో ఏం చెప్పామో కాగ్ కూడా అవే విషయాలు ధ్రువీకరించిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లీస్తున్నారని, ఎస్టీ నిధులు 69 శాతం ఖర్చు చేయలేదన్నారు. ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పబట్టిందన్నారు. దళితులను మోసం చేసిన చంద్రబాబుకు అంబేద్కర్ విగ్రహం పెట్టే హక్కు లేదన్నారు. అలాగే రాజధాని బినామీ భూదందాపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి, మూడో వంతు వడ్డీ కూడా చెల్లించలేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కోటి 75 లక్షల కుటుంబాలను మోసం చేశారని, కేంద్రంలో మంత్రులు ఉన్నా నిధులు తీసుకు రావటం లేదన్నారు. పైగా ఏపీని స్కాముల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


* ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం రూ.4,778 కోట్లు ఖర్చు చేయాలి
* కానీ రూ.1504 కోట్లు ఖర్చు చేశారు
*ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం రూ.1886 కోట్లు ఖర్చు చేయాలి
* కానీ రూ.1126 కోట్లే ఖర్చు చేశారు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ అప్పులు రూ.97,123 కోట్లయితే 2016-17లో అప్పులు రూ.లక్షా 90వేల 513 కోట్లకు చేరాయి
*కోర్ డాష్ బోర్డు ప్రకారం వ్యయం మార్చి 11న రూ.68వేల 143 కోట్లయితే కేవలం 20 రోజుల్లో రూ.32 వేలకోట్లు ఖర్చు చేశారు

రూ.2,000 కోట్ల కుంభకోణమని సాక్షాత్తూ ఆర్థికమంత్రే చెప్పారు


ఇసుక దోపిడీదారులతో లింకులు
ఇసుక దోపిడీదారులతో లింకులు
♦ దోచుకున్నవారంతా అధికార పార్టీ నాయకులే
♦ రూ.2,000 కోట్ల కుంభకోణమని సాక్షాత్తూ ఆర్థికమంత్రే చెప్పారు
♦ మరి దోషులపై చర్యలేవీ?
♦ శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక దోపిడీదారులంతా అధికార పార్టీ వారేనని, జిల్లాల్లో ఈ వ్యవహారంతో సంబంధం నేతలతో ఇద్దరు బాబులకు సంబంధాలున్నాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇసుక దోపిడీపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.2,000 కోట్ల ఇసుక కుంభకోణం ఈ ప్రభుత్వం హయాంలోనేజరిగిందని ఇదే సభలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారికంగా చెప్పారని గుర్తుచేశారు.

గత ప్రభుత్వ హయాంలో క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.40 ఉండగా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.550 నుంచి రూ.600 వరకూ పెంచారని చెప్పారు. అంటే ధర 12 రెట్లు పెరిగిందన్నారు. దీని ప్రకారం ఇసుకపై ప్రభుత్వ ఆదాయం పన్నెండు రెట్లు పెరగాలి, కానీ అదే దామాషాలో ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఆదాయం ఎందుకు పెరగలేదు అని లెక్కిస్తే.. మిగిలినదంతా దోపిడీకి గురైందని ఎవరు చెప్పినా చెప్పకపోయినా తేలిపోతుందని అన్నారు. మరి ఇంత భారీస్థాయిలో ఇసుక కుంభకోణం జరిగితే దోషులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరిని పట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. నిజంగా ఇసుక దోపిడీ చేసే వారంతా అధికార పార్టీ నాయకులేనని మండిపడ్డారు. ఈ కుంభకోణాల్లో నాకింత.. నీకింత అంటూ జిల్లాల్లో పలుకుబడి ఉన్న నాయకుల నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడికి, చంద్రబాబుకు సంబంధాలున్నాయని దుయ్యబట్టారు.

 అవినీతి కట్టడి ఇలాగేనా?: కాకాణి
 ఇసుక అక్రమ తరలింపు కేసులో తాను పట్టించిన నాలుగు ఇసుక లారీలకు రూ.1.85 లక్షల జరిమానా వేయాల్సి ఉంటే కేసును మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించి రూ.24 వేల జరిమానాతో సరిపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి విమర్శించారు. అవినీతిని కంటిచూపుతో చంపేయడమంటే ఇదేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాల ముసుగులో టీడీపీ నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు ద్వారా వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఉచిత ఇసుకను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. ఇసుక కుంభకోణం అతి పెద్దదని చెప్పారు. ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఇస్తున్నానని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమాలపై మొత్తం ఆధారాలను ఆయన వివరించారు.

 డ్వాక్రా సంఘాలను ముంచారు: దాడిశెట్టి రాజా
 ఇసుక ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇస్తామని ప్రచారం చేసి, ఒక్క సంఘానికి కూడా ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. డ్వాక్రా సంఘాలను ముంచి, ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో మళ్లీ పాత మాఫియాను లేపారని ఆరోపించారు. రిజర్వాయర్లలో యథేచ్ఛగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో నీరు బురదగా మారుతోందని చెప్పారు. తన పొలంలో కూడా మాఫియా గ్యాంగులు ఇసుక తవ్వి తరలిస్తున్నాయని పేర్కొన్నారు.

 ‘ఉపాధి’పై సభను తప్పుదోవ పట్టించిన సీఎం
 అసెంబ్లీ జీరో అవర్‌లో విపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం

 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్)లోని మెటీరియల్, లేబర్ కాంపొనెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్యానల్ స్పీకర్ చాంద్‌బాషా(వైఎస్సార్‌సీపీ) సభాపతి స్థానంలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిన్న(మంగళవారం) ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై సభలో కొన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడారన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ చట్టం 43వ పేజీలో పేర్కొన్న నిబంధనను ఆయన చదివి వినిపించారు.

దానిప్రకారం లేబర్ కాంపొనెంట్ కనీసంగా 60 శాతంగా ఉండాలని, మెటీరియల్ కాస్ట్ మాత్రం 40 శాతానికి మించకూడదని ఉందన్నారు. దీనర్థం లేబర్ కాంపొనెంట్(కూలీల వేతనాలకు చేసే వ్యయం) కచ్చితంగా 60 శాతానికి మించి కూడా ఉండొచ్చని, చట్టం కూడా స్పష్టంగా అదే చెబుతుంటే చంద్రబాబు మాత్రం వాస్తవాన్ని వక్రీకరించారన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద లేబర్ కాంపొనెంట్ 97.54 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను పూర్తిగా కూలీలకే వైఎస్ వ్యయం చేశారని ప్రతిపక్ష నేత తెలిపారు.

ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు


♦ పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకుండా కుట్రలు
♦ అందుకే ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటింగ్
♦ డివిజన్‌కు అనుమతించకపోవడం అన్యాయం కాదా?
♦ స్పీకర్  కోడెల టీడీపీ ఎమ్మెల్యేలా వ్యవహరించారు
♦ రాజ్యాంగపరంగా ఉన్న హక్కునే కాలరాశారు
♦ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ సర్కారు తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులు కాకుండా కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ లేకుండా చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. డివిజన్ జరగాలన్న ప్రతిపక్షం అభీష్టాన్ని వ్యతిరేకిస్తూ ద్రవ్య వినిమయ బిల్లు శాసన సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం వైఎస్ జగన్ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాము పట్టుబట్టినా పూర్తిగా తమ వాదన వినకుండా డివిజన్‌కు అనుమతించకపోవడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మూజువాణి ఓటింగ్‌కు పెట్టే ప్రతి అంశంపై డివిజన్ కోరే హక్కు రాజ్యాంగపరంగా ఉందని చెప్పారు. కౌల్ అండ్ షక్దర్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, (ఆ పుస్తకాన్ని జగన్ చూపిస్తూ) ఇందులోని 917 పేజీలో ఉన్న నిబంధనలను తాను చదివి వినిపిస్తున్నా స్పీకర్ పూర్తిగా వినకుండా మధ్యలోనే ఆపారని అన్నారు.

‘నువ్వు చదివింది చాలు.. మాకు అంతా తెలుసు.. మేమేది చేయాలో అది చేసేస్తాం’ అన్నట్లుగా స్పీకర్ వ్యవహరించారని విమర్శించారు. స్పీకర్‌ను ఉపయోగించుకుని ఈ శాసనసభా సమావేశాల్లో ఇలా చేయడం ఇది మూడోసారి అని పేర్కొన్నారు. స్పీకర్ డివిజన్ ఓటింగ్‌కు అనుమతించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వ చర్యల్లోని అనేక లోపాలను ‘కాగ్’ నివేదిక బయటపెట్టిందని, వాటిపై సర్కారును గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు.

 అది చట్ట ప్రకారం జైలుకు వెళ్లేంత నేరం
 రుణమాఫీ, విద్యార్థుల ఫీజుల చెల్లింపు, పింఛ న్లు, గృహ నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి నందుకే తాము ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించామని విపక్ష నేత చెప్పారు. పద్దులన్నింటిలోనూ ప్రభుత్వం చూపిన ఖర్చులకు, చేసిన కేటాయింపులకు ఏ మాత్రం సరిపోవడం లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘వాస్తవానికి ఈపీఎఫ్ వంటి పబ్లిక్ డిపాజిట్ల నుంచి రూ.22 వేల కోట్లను ప్రభుత్వం వాడేసింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల ప్రకారం జీఎస్‌డీపీలో 3 శాతానికి మించి రుణాలు తీసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతించకపోయినా ఉద్యోగుల డబ్బు మన దగ్గరే ఉంది కదా అని, అత్తగారి సొత్తే అన్నట్లుగా వాడుకున్నారు. ఇది చట్ట ప్రకారం జైలుకు వెళ్లాల్సినంత నేరం. ఇదేదో సాదాసీదా విషయం అయినట్లుగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో దీనిని సమర్థించుకుంటూ మాట్లాడతారు. ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించడానికి ఇంతకన్నా వేరే కారణాలేమైనా కావాలా? అసలు 2014-15 సంవత్సరపు ఆడిటెడ్ అకౌంట్లను ఎందుకు చూపలేదు? 2016-17 బడ్జెట్‌కు వెళుతున్న ఈ సందర్భంలో 2014-2015 సంవత్సరంలో అకౌంట్లను చూపించాలి కదా! అయినా చూపలేదంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.22 వేల కోట్ల మళ్లింపు జరిగింది. ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
 
 ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు
 ‘‘వేరే పార్టీ బీ ఫారంపై ఎన్నికైన ఎమ్మెల్యేలను బాబు ప్రలోభాలు పెట్టి, డబ్బులు ఆశ చూపి, మంత్రి పదవులిస్తామని చెప్పి కొనుగోలు చేశారు. అసెంబ్లీలో ద్రవ్య విని మయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరిగితే.. టీడీపీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లేస్తే వారి పదవులు పోతాయి.(అనర్హులవుతారు) అందుకే డివి జన్ ఓటింగ్‌కు పెట్టలేదు. రాజ్యాంగపర హక్కునే కాలరాశారు. టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం, అనర్హత వేటు వేయించే ధైర్యం బాబుకు లేవు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ గెలిపించుకొని, వెనక్కి తీసుకొస్తామన్న నమ్మకం, విశ్వాసం బాబుకు లేవు. కనీసం ద్రవ్య విని మయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరిపించి,  ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో బాబు ఉన్నారు. ప్రజల్లో తన గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయిందో బాబే అందరికీ చూపిస్తూ ఉన్నారు. అదే వైఎస్సార్‌సీపీ నైతిక విజయం, టీడీపీకి నైతిక పరాజయం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ

Written By news on Wednesday, March 30, 2016 | 3/30/2016


'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ కు అంగీకరించి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు పోయేవని, అందుకే డివిజన్ కు వ్యతిరేకించారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు అవినీతి సొమ్ముతో కొన్న ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారని, వారితో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని విమర్శించారు. 'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ' అని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే..
 
  • ఏపీ ప్రభుత్వం రూ. 22 వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను సేకరించింది
  • ఎఫ్ఆర్ బీఎం ప్రకారం 3 శాతం జీఎస్ డీపీ దాటి డిపాజిట్లు తీసుకునే అవకాశం లేదు
  • కేంద్రం, ఆర్ బీఐ అంగీకరించకున్నా చంద్రబాబు అత్తగారి సొత్తన్నట్టు పబ్లిక్ డిపాజిట్లను వాడుకున్నారు
  • చంద్రబాబు చేసింది చట్టప్రకారం జైలుకు వెళ్లే నేరం
  • ద్రవ్యవినిమయ బిల్లును మేం వ్యతిరేకించడానికి ఇంతకంటే కారణం ఏం కావాలి?
  • 2014-15 ఆడిట్ లెక్కలను బడ్జెట్ లో చూపలేదు
  • రూ.22 వేల కోట్లు పక్కదారిపట్టినందువల్లే ఈ లెక్కలు బడ్జెట్ లో చూపలేదు
  • రుణమాఫీ, ఫించన్లు, హౌసింగ్, ఫీజు రీయింబర్స్ మెంట్ అన్ని పద్దుల్లోనూ ఖర్చులు, కేటాయింపుల్లో వ్యత్యాసం ఉంది
  • అందుకే ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించాం
  • డివిజన్ కు స్పీకర్ అనుమతించకపోవడం అన్యాయం
  • డివిజన్ అడిగితే ఇవ్వాలనేది రాజ్యాంగ నిబంధన
  • నేను నిబంధనలను చదివి వినిపించినా స్పీకర్ పట్టించుకోలేదు
  • స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారు

‘ఉపాధి’ నిధులు పక్కదారి


‘ఉపాధి’ నిధులు పక్కదారి
- అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- పేదవాడికి అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు
- మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారు
- ప్రొక్లెయినర్లతో సిమెంట్ రోడ్ల పనులు చేయిస్తున్నారు
- నిధులన్నీ కూలీలకే ఇవ్వాలి
- సీఎం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్: పేదల ఆకలి తీర్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పేదలకు ఉపయోగపడేలా చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా కూలీలకు వంద శాతం మేలు జరగాల్సి ఉండగా మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లా డుతూ.. ‘‘ఉపాధి హామీ అంటే.. పేదవాడి కడుపు నింపే పథకం. ఈ కూలీల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించింది. నీరు-మీరుతోపాటు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తోంది. సిమెంట్ రోడ్ల పనులను ప్రొక్లెయినర్లతో చేయిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం నిధులు 100 శాతం కూలీలకే చెందేవి. ఇప్పుడు 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ అని, 60 శాతం కూలీలకు అని చెబుతున్నారు.

 చట్టం ప్రకారం 60 శాతానికి పైగా నిధులను కూలీలకు చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నిస్తే 100 శాతం కూలీలకే దక్కేవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రొక్లెయినర్లు పెట్టి పనులు చేస్తే కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుంది? గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీలకు 100 శాతం నిధులను నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో జమచేసే వారు. కేంద్రం ఈ పథకంలో మార్పులు చేస్తున్నా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఎన్టీయేలో భాగస్వామి అయిన టీడీపీ కేంద్రంతో మాట్లాడి 100 శాతం నిధులు ఉపాధి హామీ కూలీలకు దక్కేలా చేయొచ్చు కదా! రాష్ట్రంలో 1.70 కోట్ల మంది ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటే 58 లక్షల మందికే పని కల్పిస్తున్నారు. కడుపునిండా అన్నం పెట్టే ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.

 దళిత జాతికి తీవ్ర అన్యాయం
 ఏ వెనుకబడిన దళితుల కోసమైతే బీఆర్ అంబేడ్కర్ పోరాటం చేశారో ఆ వర్గాన్నే రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంగళవారం అంబేడ్కర్ 125వ జయంతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఏ వర్గం కోసం, ఏ జాతి ఔన్నత్యం కోసం పోరాటం చేశారో ఆ జాతికి ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు క్రిస్టియన్లుగా మారితే వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దళితుల్లోనూ కులాలు, మతాలు ఉంటాయా? అని ప్రశ్నించారు.

 ఉపప్రణాళిక నిధులు రాజ్యాంగ హక్కు
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వారికోసమే ఖర్చు చేయాలని, అది దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఈ నిధుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తోందని విమర్శించారు. ‘‘దళితుల నిధుల్లో రూ.2,500 కోట్లు, ఎస్టీల నిధుల్లో రూ.1,300 కోట్లు కోత వేశారు. ఎస్టీ, ఎస్టీల అభివృద్ధి అంటే ఇదేనా?’’ అని జగన్ నిలదీశారు. రెండేళ్లుగా గిరిజన సలహా మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదనిప్రశ్నించారు.

 విశ్వసనీయత ఉంటేనే హుందాతనం

 ఓ నాయకుడికి వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉన్నపుడే రాజకీయాల్లో హుందాతనం వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఆయన లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ రాజీనామాపై స్పందించాలని కోరగా... ‘‘ఏముంది మేం బాధితులం. ఆయన(చంద్రబాబు) ప్రలోభానికి వారు లొంగిపోయారు’’ అని బదులిచ్చారు. ‘‘రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత రెండూ ఉండాలి, అవి లేనప్పుడు భార్య కూడా గౌరవించదు. ఈ రెండూ ఉన్నాయా లేవా అని చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మా పార్టీని వీడిపోయిన వాళ్లు కూడా వాళ్ల మనస్సాక్షిని ఇదే విషయం ప్రశ్నించుకోవాలి. పార్టీని వీడిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళితే గెలుస్తామన్న ధైర్యం, విశ్వాసం చంద్రబాబుకు లేవు. ఎమ్మెల్యేలను అధికార పక్షం దాదాపు రూ.30 కోట్లతో ప్రలోభాలు పెడుతోంది’’ అని జగన్ పేర్కొన్నారు.

 చంద్రబాబు కాలం చెల్లిన నేత
 గ్రామీణ ఉపాధి పథకం హామీ గురించి చట్టంలో ఏముందో జగన్ తెలియజేశారు. ఒక పనిలో కూలీలకు చెల్లించే వేతనాలు 60 శాతానికి మించి ఎంతైనా పెరగొచ్చని స్పష్టంగా ఉంటే చంద్రబాబుకు మాత్రం అర్థం కాదని అన్నారు. చంద్రబాబు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ (కాలం చెల్లిన రాజకీయవేత్త) ఆయనకు అర్థం కాదు అని జగన్ అన్నారు.

ఇసుక దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్య తీసుకుంది, ఎవరిని పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇసుక దోపిడీపై బుధవారం వాడివేడి చర్చ జరిగింది. గతంతో పోల్చితే ప్రభుత్వం ఇసుక చార్జీలను పెంచినప్పటికీ రెవిన్యూ పెరగలేదంటే.. దానికి కారణం అధికార పార్టీ దోపిడియే అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్య తీసుకుంది, ఎవరిని పట్టుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. దోపిడీకి పాల్పడిన వారిలో అధికార పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

ప్రభుత్వం మా చేతులు కట్టేస్తోంది

నియోజక వర్గ శాసన సభ సభ్యులకు కెటాయించాల్సిన నిధులను స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు కెటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని ఉన్నా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమ చేతులు కట్టేస్తోందన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నియోజక వర్గ శాసన సభ్యలకు నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించం అని ప్రభుత్వం మొండిగా చెబుతుండటం సిగ్గుచేటన్నారు.

ప్రజలకు సేవ చేసేందుకు నిధులు కెటాయించనప్పుడు తనకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం ఎందుకని ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గ శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించకుండా అధికార పార్టీ నేతలు అగ్రగామి రాష్ట్రం పేరుతో నోటికొచ్చిన కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎస్ డీఎఫ్ పై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్(ఎస్ డీఎఫ్)పై తీవ్ర దుమారం రేగింది. ఎస్ డీఎఫ్ పేరుతో టీడీపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఇన్ చార్జ్ లకు నిధులు కేటాయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా టీడీపీ నేతలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కందుల నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుతో ప్రభుత్వం ఎస్ డీఎఫ్ నిధులు కెటాయించిన విషయాన్ని వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు.
ఎస్ డీఎఫ్ విషయంలో ప్రభుత్వ విధానంపై ప్రతిపక్ష వైఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది


నారావారి నదుల అనుసంధానం కత!కృష్ణా-గోదావరి సంగమంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ(ఫైల్)
పట్టిసీమ ప్రచారంపై అన్ని వర్గాల్లో ఆశ్చర్యం
గోదావరి-కృష్ణా అనుసంధానించానని చెప్పుకుంటున్న సీఎం
వైఎస్ హయాంలోనే కుడికాల్వ నిర్మాణం
పోలవరం పనులను ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది

 
సాక్షి, హైదరాబాద్: గోదావరి-కృష్ణా అనుసంధానం ఘనత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్న తీరు పట్ల అన్ని వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నదుల అనుసంధానం సాధించేశామని సీఎం చెబుతున్న మాటలకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని సాగునీటి రంగం నిపుణులు, జల వనరుల శాఖ ఇంజనీర్లు అంటున్నారు. నవ్విపోదురు గాక.. అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... పోలవరం ప్రాజెక్టు పనులను సాహసోపేతంగా ప్రారంభించి, అన్ని అనుమతులు సంపాదించడంతో పాటు కుడి, ఎడమ కాల్వలను దాదాపు పూర్తి చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. 70 శాతం పూర్తయిన కుడికాల్వను ఉపయోగించుకొని, మిగిలిపోయిన 30 శాతం కాల్వను పూర్తిస్థాయిలో నిర్మించకుండా, తూతూమంత్రంగా పిల్లకాలువ తీసి, పట్టిసీమ నుంచి 4 టీఎంసీల నీటిని తెచ్చిన విషయం విదితమే. పట్టిసీమ మోటార్లు ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పని. దానికే.. నదుల అనుసంధానం చేశానని కోతలు కోయడం పట్ల అన్ని వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

వైఎస్ ఘనత ఇదీ..
‘పోలవరం హెడ్‌వర్క్స్‌తో పాటు కుడి, ఎడమ కాల్వ పనులను కూడా ఒకే సారి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. కుడి, ఎడమ కాల్వల పనులు ఆయన ఉన్నప్పుడే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. హెడ్‌వర్క్స్ పనులు చేయడంలో అప్పటి కాంట్రాక్టర్లు జాప్యం చేయడంతో రద్దు చేశారు. ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వేగంగా పూర్తి చేయించాలని భావించారు. అంతలోనే ఆంధ్రప్రదేశ్‌ను దురదృష్టం వెంటాడింది. హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ చనిపోవడంతో పోలవరాన్ని పట్టించుకున్న నాథుడే లేడు’ అని సాగునీటి రంగం నిపుణులు గుర్తు చేస్తున్నారు.

కుడి కాల్వ మీద రాద్ధాంతం చేసిన టీడీపీ
‘హెడ్‌వర్క్స్ పనులు పూర్తి చేయకుండా కాల్వ పనులను వైఎస్ ప్రభుత్వం చేపట్టడాన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం రాద్ధాంతం చేసింది. తీవ్రస్థాయిలో విమర్శలకు దిగింది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులను కూడగట్టి కుడికాల్వ పనులకు అడ్డుపడింది. 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో దాదాపు 150 కిలోమీటర్ల కాల్వను వైఎస్ తన హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడం అంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ పనులు పూర్తి చేయించారు. 150 కిలోమీటర్ల మేర కాల్వకు లైనింగ్ కూడా వేయించారు’ అని పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పారు.

తూతూమంత్రంగా పనులు చేయించిన టీడీపీ..
కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 4 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులనైనా పూర్తిగా చేయకుండా తూతూమంత్రం పనులతో ప్రభుత్వం సరిపెట్టింది.

రామిలేరు, తమ్మిలేరు మీద రెండు ప్రధాన అక్విడెక్టులు, 50కిపైగా చిన్న వంతెనలు, 15 కిలోమీటర్లకుపైగా కాల్వ తవ్వకం.. అన్నీ అరకొరగానే చేశారు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వాల్సి ఉండగా, వేగంగా పూర్తి చేయడానికి 20 మీటర్ల వెడల్పే తవ్వారు. అక్కడ కూడా లైనింగ్ చేయకుండా విడిచిపెట్టారు. ప్రజలు, పశువుల రాకపోకలకు వీలుగా వంతెనలు నిర్మించాల్సిన చోట.. పైపులు పెట్టి సిమెంట్ కాంక్రీట్ వేశారు. అక్విడెక్టులు పూర్తిగా చేయకుండా, నాలుగో వంతు.. ఒక్కో ‘వెంట్’తో మమ అనిపించారు. అది కూడా తూతూమంత్రంగా చేయడంతో.. కొద్దిపాటి నీటి ప్రవాహానికే తెగిపోయిన విషయం విదితమే. ఇవన్నీ తాత్కాలిక పనులేనని, సమయం లేకపోవడంతో ఇలా చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రే స్వయంగా అప్పట్లో చెప్పారు.

హడావుడి పూర్తయిన తర్వాత మళ్లీ కుడికాల్వ పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పనులేమీ చేయకుండా.. ఇప్పుడు మళ్లీ హడావుడిగా మొదలుపెట్టడం గమనార్హం. హడావుడి ఉంటే తప్ప భారీగా సొమ్ము నొక్కేయడానికి వీలు కాదని, అందుకే ప్రభుత్వం ఆఖరు నిమిషం వరకు తాత్సారం చేసి, హడావుడిగా పనులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు.
 
స్వాతంత్య్రానికి పూర్వమే నదుల అనుసంధానం
తెలుగునాట 140 సంవత్సరాల క్రితమే నదుల అనుసంధానం జరిగింది. తుంగభద్ర-పెన్నా అనుసంధానం.. 306 కిలోమీటర్ల  కేసీ కెనాల్(కర్నూలు-కడప కాలువ) ద్వారా జరిగింది. 1863-70 మధ్య కాలంలో డచ్ కంపెనీ.. నావిగేషన్, సాగునీటి అవసరాల కోసం ఈ కాల్వను తవ్వింది. 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కాల్వను డచ్ కంపెనీ నుంచి రూ. 3.02 కోట్లకు కొనుగోలు చేసింది. కాటన్ సూచనల మేరకు.. కేసీ కెనాల్‌లో నావిగేషన్ రద్దు చేసి, పూర్తిగా సాగునీటి అవసరాలకే వాడటం బ్రిటీష్ ప్రభుత్వం ప్రారంభించింది.
 
  • 1953లో తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా తుంగభద్ర-పెన్నా-చిత్రావతి అనుసంధానం పూర్తయింది.
  • తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ద్వారా కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం జరిగింది.

ముడుపుల యావ తప్ప ముందుచూపేదీ?

గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలు పట్టని సీఎం
 
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగితే బేసిన్ మారుతుంది కనుక గోదావరి ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కొన్ని హక్కులు కల్పించింది. 7 (ఇ), 7 (ఎఫ్) క్లాజుల ప్రకారం ఆ హక్కులు సంక్రమిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నమ్మకంగా నీరందించవచ్చు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణాజలాల్లో కర్ణాటక, మహారాష్ర్టకు 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రాజెక్టు అనుమతుల కంటే ముందుగానే కాల్వల పనులను శరవేగంగా పూర్తిచేయడానికి, అనుమతులు రాగానే పోలవరం ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాధాన్యమిచ్చారు. 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే పోలవరం వంటి భారీ ప్రాజెక్టు వల్ల 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోయినా పరవాలేదు కానీ.. పట్టిసీమ వంటి 4 టీఎంసీల పిల్ల ప్రాజెక్టుతో ఇపుడు 35 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదమేర్పడడమే విచారకర అంశం.

ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయ ఫలితమేనని సాగునీటి రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముడుపుల యావలో రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శిస్తున్నారు.

వైఎస్ ముందుచూపు వల్లే వేగంగా కుడికాల్వ పనులు
కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలకు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా పట్టిసీమ లిఫ్ట్ ద్వారా కుడికాల్వకు నీరు మళ్లించడానికి పూనుకొంది.

రెండు నదుల్లోనూ ఒకేసారి వరద.. నిల్వకు లేని అవకాశం
‘ఇటు గోదావరి, అటు కృష్ణా.. రెండు నదుల్లోనూ దాదాపు ఒకే సమయంలో వరదలు ఉంటాయి. కృష్ణాలో వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు మళ్లించడంలో అర్థం లేదు. కృష్ణాలో వరద లేనప్పుడు గోదావరిలో కూడా ప్రవాహం పెద్దగా ఉండదు. ఫలితంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. కుడికాల్వకు నీళ్లు మళ్లించిన తర్వాత.. నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. కృష్ణా డెల్టాలో నీరు అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉన్నంత మేరకే గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గోదావరిలో ప్రవాహం ఉండే అవకాశం లేనందున, కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం సాధ్యం కాదు.

అంటే.. లిఫ్ట్ వల్ల కృష్ణా డెల్టాకు అదనంగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని.. ఎగువ రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడితే.. కృష్ణా జలాల్లో మనకు ఉన్న నికర జలాల నుంచి 35 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ, కృష్ణా డెల్టాకు తీవ్ర నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
7(ఇ) క్లాజ్: ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకువాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంలో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక,మహారాష్ట్రకు ఉంటుంది.
 
7(ఎఫ్)క్లాజ్: 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని కుడికాల్వకుమళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు అదే దామాషాలో వాటా ఉంటుంది.


Popular Posts

Topics :