10 April 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సీతారాముల ఆశీస్సులతో శుభం కలగాలి

Written By news on Friday, April 15, 2016 | 4/15/2016


సీతారాముల ఆశీస్సులతో శుభం కలగాలి
తెలుగువారికి వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

 సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులతో తెలుగువారందరికీ సకల శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టతోపాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ పండుగను వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.

తక్షణం విశాఖకు రైల్వే ప్రత్యేక జోన్ ను కేటాయించాలి

Written By news on Thursday, April 14, 2016 | 4/14/2016


'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం'
విశాఖ :  రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి విజయం సాధించాం. ఇప్పుడు అదే తరహాలో రైల్వే ప్రత్యేక జోన్ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
రైల్వే జోన్ డిమాండ్ కొత్తది కాదని, దశాబ్ధాలుగా ఉందని గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోనూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ చట్టబద్ధ హక్కు కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం విశాఖకు రైల్వే ప్రత్యేక జోన్ ను కేటాయించాలని విజయ్ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.

కరువు సహాయక చర్యల కోసం పోరుబాట


కరువు సహాయక చర్యల కోసం పోరుబాట
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్షం విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని శాసనమండలిలో ఆపార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకే తాము ఆందోళన బాట పడుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ శ్రేణులు ధర్నాలు చేపడతారన్నారు. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ షెడ్యూలును ప్రకటిస్తామని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆందోళనలలో పాల్గొంటారన్నారు.

 90 శాతం గ్రామాల్లో కరువు..: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఏప్రిల్‌లోనే అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడిందని, సాగు, తాగునీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం గ్రామాలు కరువు బారిన పడ్డాయన్నారు.   306 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఉపాధి హామీ నిధులను 4, 5 నెలలైనా విడుదల చేయని పరిస్థితులు దాపురించాయన్నారు.

 నిధులు రాబట్టడంలో వైఫల్యం : కరువు పరిస్థితులను వివరించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. కరువు నష్టాన్ని రూ.2,443 కోట్లుగా అంచనా వేసి నివేదిక పంపితే కేంద్రం ఇచ్చిన సాయం రూ.433 కోట్లేనన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ సాయం ఎందుకు తెచ్చుకోలేక పోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా?


రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా?
చంద్రబాబుపై అంబటి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగానికి నిత్యం తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల  విగ్రహాన్ని ప్రతిష్టించే నైతిక అర్హత ఉందా? లేదా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని దళితులను కించ పర్చేలా మాట్లాడటమే కాకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అసలు అంబేడ్కర్‌ను స్మరించుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందే ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయన్ను ఎవరూ క్షమించరని అంబటి అన్నారు. మహనీయుల ఆశయాలు ఎపుడూ చంద్రబాబు అమలు చేయరని విమర్శించారు. మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని చంద్రబాబు నిర్వహించారని అయితే బీసీల సంక్షేమానికి ఏటా రూ. 10,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి ఈ రెండేళ్లలో ఐదారు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇపుడు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో సగం కూడా వారి కోసం ఖర్చు చేయలేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రోజూ ఎన్టీఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేస్తున్నారన్నారు.

 రేటు బాగా ఉంది...
 వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు అంబటిని ప్రశ్నించగా.. ‘‘ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లి పోయారు, ఇంకో ఇద్దరు వెళితే వెళ్లొచ్చు... రేటు బాగా ఉంది’’ అని అంబటి సమాధానమిచ్చారు. నిన్నటిదాకా ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 30 కోట్ల వరకూ రేటు ఉండేదని అదిపుడు రూ. 30 కోట్లు నుంచి రూ. 40 కోట్లకు పెరిగిందన్నారు. ‘చంద్రబాబు చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో వీళ్లందరినీ కొంటున్నారు.. పాపం ఆయన అసలు అవినీతే చేయడం లేదు. లోకేశ్‌బాబూ అవినీతి చేయడం లేదు’ అని వ్యంగ్యంగా చెప్పారు. ఆ ఎమ్మెల్యేలతో ఏంచేస్తారో అని అన్నారు.

వైఎస్ జగన్ ను కలసిన ఆర్.కృష్ణయ్య

Written By news on Wednesday, April 13, 2016 | 4/13/2016


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కలిశారు.

బుధవారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో కలసిన కృష్ణయ్య.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు 

ఆలయ ఆస్తులనే అమ్మేసిన టీడీపీ నేత

Written By news on Tuesday, April 12, 2016 | 4/12/2016


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల దోపిడికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేతలు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా రూరల్ మండలానికి చెందిన స్థానిక టీడీపీ నేత ఏకంగా ఆలయ ఆస్తులనే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నరసింహస్వామి ఆలయ భూముల్లో ఉన్న టేకు చెట్లను సదరు టీడీపీ నేత అక్రమంగా విక్రయించాడు. దీనిపై ఆలయ ఈవో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ పాలనే ఆదర్శం


వైఎస్ పాలనే ఆదర్శం
సాక్షితో పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్

 సాక్షి, చెన్నై: ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందరికీ ఆదర్శనీయుడు. అందుకే తమిళనాడు రైతులకూ అటువంటి పాలనను అందించేందుకు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీకి పోటీ చేస్తున్నా’ అని పాట్టాలిమక్కల్ కట్చి (పీఎంకే) యువజన విభాగ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో రాందాస్‌ను ‘సాక్షి’ కలిసింది. ఐదు దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్బుమణి అన్నారు.

ఈ రెండు పార్టీలు ఎంతటి దుర్భరమైన పాలన అందించినా భరించాల్సిందేనా, తమకు మరో గత్యంతరం లేదా అనేంతగా ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పీఎంకే ముందుకొచ్చిందన్నారు. రైతన్నలను అక్కున చేర్చుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఆదర్శమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఏపీ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పీఎంకే అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని అనుసరిస్తానని రైతులకు చెప్పినట్లు పేర్కొన్నారు.

బాబువన్నీ మాయమాటలే


బాబువన్నీ మాయమాటలే
♦ బడుగుల సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయింపులేవి?
♦ వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ మాయమాటలేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. బీసీలను మోసగించేందుకు సీఎం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ధర్మాన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

బీసీల అభ్యున్నతి కోసం ప్రతి ఏటా రూ.10,000 కోట్లు కేటాయిస్తామన్నారు, తొలి బడ్జెట్ 2014-15లో రూ.2500 కోట్లు కూడా వారి కోసం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్‌లో రూ 6,460 కోట్లు కేటాయించామని చెప్పి రూ.4,120 కోట్లే విడుదల చేశారని తెలిపారు. అందులోనూ రూ.3,975 కోట్లను సవరించిన అంచనాలుగా చూపారన్నారు. వాస్తవిక వ్యయానికి వచ్చేటప్పటికి రూ.2,800 కోట్లో, లేదా రూ.3,000 కోట్లో ఖర్చవుతాయన్నారు. బీసీ సంక్షేమం కోసం మూడేళ్లలో రూ .30 వేల కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5,500 కోట్ల కంటే ఎక్కువ  ఖర్చు చేయలేదని వెల్లడించారు.

 ఒక్క హామీనైనా నెరవేర్చారా?
 బీసీలకు ఎప్పటికపుడు తియ్యని కబుర్లు చెప్పి మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మహాత్మా జ్యోతీరావ్‌పూలే జయంతి సభలో ముఖ్యమంత్రి గొప్పగా ఒక ప్రసంగం చేసినంత మాత్రాన బీసీలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. బడ్జెట్‌లో నిధులను కేటాయించి, ఖర్చు చేస్తేనే బీసీల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. బీసీలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఏటా రూ.వెయ్యి కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తీరప్రాంతాల్లో దుర్భరమైన జీవితం గడుతుపున్న మత్స్యకారుల కుటుం బాల్లో ఏ ఒక్కరైనా చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్ల బాగుపడ్డారేమో చెప్పగలరా? అని ధర్మాన నిలదీశారు. ప్రజలంతా జ్యోతీరావ్ పూలేను ఆదర్శంగా తీసుకుని హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?

Written By news on Monday, April 11, 2016 | 4/11/2016


ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ సవాల్

 సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కోసమే టీడీపీలోకి వెళ్లామని చెబుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్తేమీ కాదని, ఆ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత పార్టీ ఫిరాయిస్తే సమంజసంగా ఉండేదన్నారు. బొత్స సత్యనారాయణ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రజలు ఏవగించుకుంటున్నారని చెప్పారు. చట్టాలు చేసే చట్టసభల్లోనే చట్టాలు అమలు కావడం లేదని అన్నారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ అసలు పట్టించుకోవడం లేదన్నారు. చేతిలో చట్టం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో జాప్యం చేయవచ్చు గానీ పూర్తిగా తిరస్కరించలేరని, ఎప్పటికైనా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చేతులతో మరో పార్టీ ఎమ్మెల్యేలు పసుపు కండువాలు కప్పించుకుంటున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తమ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు.

 జేజమ్మ దిగొచ్చినా రాజ్యసభ సీటు దక్కకుండా చేయలేరు
 తల్లో జేజమ్మ దిగొచ్చినా తమ పార్టీకి రాజ్యసభ సీటు దక్కకుండా టీడీపీ చేయలేదని బొత్స పేర్కొన్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

 కుటుంబ కార్యానికి కలెక్టర్లతో ఆహ్వానాలా?
  చంద్రబాబు తన మనవడి పుట్టిన రోజును వైభవంగా జరుపుకోవడంలో తప్పులేదని, అయితే ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడానికి జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బొత్స సత్యనారాయణ ఆరోపించా రు. తనయుడు లోకేశ్‌బాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబు అతిగా ఆర్భాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటివరకు చినబాబు బయట ఉండి కలెక్షన్ చేస్తే ప్రభుత్వంలో ఉన్న పెదబాబు శాంక్షన్ చేస్తారనే మాట ఉండేదని, ఇపుడు చినబాబు కూడా మంత్రివర్గంలో చేరితే కలెక్షన్, శాంక్షన్ తేలికవుతుందని బొత్స ఎద్దేవా చేశారు.

Popular Posts

Topics :