17 April 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు

Written By news on Saturday, April 23, 2016 | 4/23/2016


'ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, సంతలో గొర్రెల మాదిరిగా విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. శనివారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలసి  రాజ్ భవన్ కు వెళ్లిన  వైఎస్ జగన్.. టీడీపీ ప్రభుత్వం అవినీతి, విపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 • చంద్రబాబు అవినీతి సొమ్ము, బ్లాక్ మనీతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు
 • ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం
 • రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నివేదించాం
 • రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది
 • జీవో 20 పేరిట కాంట్రాక్టులకు మేలు చేస్తున్నారు
 • కాంట్రాక్టుల నుంచి డబ్బులు తీసుకుని వాళ్లకు మేలు చేస్తున్నారు
 • అన్ని రేట్లు తగ్గుతున్న సమయంలో అంచనాలను విపరీతంగా పెంచారు
 • నీటిని నిల్వచేసే సామర్థ్యం లేకపోయినా డబ్బులు గుంజుకునేందుకు పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు
 • పట్టిసీమ ప్రాజెక్టు పనులను 22 శాతం ఎక్సెస్ రేటుకు కట్టబెట్టారు
 • ఇసుక మాఫీయాలో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు
 • చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు పంచుకుంటున్నారు
 • రాజధాని ప్రాంతంలో ఎన్నో అక్రమాలు జరిగాయి
 • రైతులకు అన్యాయం చేసిన విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం
 • రాజధానికి సంబంధించి చంద్రబాబు తన వాళ్లకు ముందే చెప్పారు
 • వాళ్లు భూములు కొనుగోళ్లు చేసిన తర్వాతే రాజధానిని ప్రకటించారు
 • రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారు
 • చంద్రబాబుపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలను గవర్నర్ కు నివేదించాం
 • విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతిని వివరించాం
 • ఈ అవినీతి కార్యకలాపాల్లో వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇస్తున్నారు
 • అంతేగాక మంత్రి పదవుల ఆశ చూపి విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు
 • వైఎస్ఆర్ సీపీ తరపున పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా ఎలా టీడీపీలోకి తీసుకుంటారు
 • వీరి రాజీనామాలు కోరకుండా ఎలా మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపుతారు?  ఇది జరగకుండా చూడాలని గవర్నర్ ను కోరాం
 • చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. ప్రజా స్వామ్యంపై గౌరవం ఉన్నా, మీకు సిగ్గు, శరం ఉన్నా పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
 • అధికారం ఉంది. పోలీసులు ఉన్నారు. మీడియాలో కొన్ని పత్రికలు, ఛానెళ్లు మీకు వంతపాడుతున్నాయి
 • ప్రజలు మళ్లీ ఎవర్ని ఎన్నుకుంటారో తేల్చుకుందాం
 • అధికారం, డబ్బు, మద్దతు ఉన్న చంద్రబాబు ఆ 12 మందితో ఎందుకు రాజీనామా చేయించడం లేదు?
 • వీరితో రాజీనామా చేయిస్తే మళ్లీ గెలుస్తామనే నమ్మకం లేదు. అందుకే వారు అనర్హులు కాకుండా కాపాడుతున్నారు
 • చంద్రబాబు తీరుకు నిరసనగా ఈ రోజు సాయంత్రం కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహిస్తాం
 • ఈ నెల 25న ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రపతి, ప్రధాని  అపాయింట్ మెంట్ కోరాం

నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అనైతిక రాజకీయ వ్యవహారాలపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారు.

ఏపీలో అధికార టీడీపీ అవినీతి, విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కోనుగోలు చేస్తున్న వ్యవహారంపై వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు తీరును గర్హిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.  ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ రోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. బహిరంగ సభలు నిర్వహించి బాబు నీచ రాజకీయాలను ప్రజలకు వివరిస్తారు.

రాంరెడ్డి కుటుంబ సభ్యులకే మా మద్దతు

Written By news on Friday, April 22, 2016 | 4/22/2016


'రాంరెడ్డి కుటుంబ సభ్యులకే మా మద్దతు'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయమని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాంరెడ్డి కుటుంబ సభ్యులకే తమ మద్దతు అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఆయన ఈ సందర్భంగా పాలేరు ఉప ఎన్నికలో భాగంగా వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరారు.

ఈ భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భట్టి విక్రమార్క...పరిస్థితిని తమ అధ్యక్షుడికి వివరించారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎమ్మెల్యే మరణించినా...వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయటం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన పార్టీకలు కూడా అదే విధానాన్ని అనుసరించాలని పొంగులేటి సూచించారు.

అనంతరం మల్లు భట్టి విక్రమార్క...వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని, అందరి మద్దతుతో పాలేరు ఉప ఎన్నికలో గెలుస్తామన్నారు. టీఆర్ఎస్ అహంకారంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ ఎస్ కు పాలేరు ఉప ఎన్నికలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మరోవైపు పాలేరు ఉప ఎన్నిక‌లో భాగంగా ముందుగా అన్నిపార్టీల‌ను సంప్ర‌దించి ఎన్నిక ఏక‌గ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. కాగా దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితనే పోటీకి దింపాలని యోచిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా ఆ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును పోటీకి నిలపనుంది.

రోజాకు సుప్రీంకోర్టులో ఊరట


రోజాకు సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం తాము మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిచ్చింది. అంతేకాకుండా.. చిన్న సమస్యను పెద్దదిగా చేయవద్దని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సమచారం. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. 

సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి


సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
 సాక్షి ప్రతినిధి, చెన్నై: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా కమలాపురం లక్ష్మీ శ్రీదేవిరెడ్డిని నియమించినట్లు సేవాదళ్ జాతీయ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. సేవాదళ్ మహిళావిభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు సేవాదళ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సైకం రామకృష్ణారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 సేవాదళ్ బలోపేతంపై చర్చ
 తమిళనాడులో వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ బలోపేతంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తమతో చర్చించినట్లు సేవాదళ్ తమిళనాడు విభాగం ఉపాధ్యక్షులు జకీర్‌హుస్సేన్, ప్రముఖనేత శరవణన్ తెలిపారు. సేవాదళ్ కార్యక్రమాలపై చర్చించేందుకు గురువారం తిరుపతికి వెళ్లి చెవిరెడ్డిని కలుసుకున్నట్లు వారు తెలిపారు. సేవా కార్యక్రమాలతో సేవాదళ్ ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారని అన్నారు. ముఖ్యంగా తమిళనాడులోని

 సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
 తెలుగు కుటుంబాలకు సేవాదళ్ కార్యకర్తలు చేరువ కావాలని చెప్పారని తెలిపారు. తమిళనాడు సేవాదళ్ విభాగంలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారని అన్నారు. తమతోపాటు సేవాదళ్ తమిళనాడు నేత ప్రకాష్ సైతం చెవిరెడ్డిని కలిసినట్లు వారు తెలిపారు.

 శ్రీదేవి కృతజ్ఞతలు:
 వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా తనను నియమించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని శ్రీదేవిరెడ్డి చెప్పారు. అలాగే తన పేరును సిఫారసు చేసిన ఉపాధ్యక్షులు జకీర్‌హుస్సేన్, శరవణన్‌లకు ధన్యవాదాలని అన్నారు. 2019 నాటి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించే వరకు అవిశ్రాంతంగా పాటుపడతానని అన్నారు. అధికార ప్రతినిధిగా పార్టీకి వన్నెతెచ్చేట్లుగా వ్యవహరిస్తానని తెలిపారు.

ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం

Written By news on Thursday, April 21, 2016 | 4/21/2016


ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం
విజయనగరం మున్సిపాలిటీ: ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడే మనుషులం తాము కాదని, పదవులకు, పచ్చనోట్లకు లొంగే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తన భార్యతోపాటు కుటుంబం, నియోజకవర్గ ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా శత్రుచర్ల కుటుంబమంతా వైఎస్సార్‌సీపీలోనే ఉంటుందన్నారు. అవసరమైతే పదవులైనా వదులుకుంటాం గానీ, జగన్‌మోహన్‌రెడ్డిని వీడేది లేదన్నారు.
తమపై విశ్వాసముంచి కురుపాం ఎమ్మెల్యే సీటిచ్చిన జగన్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారుతున్న నేపథ్యంలో తమపై వస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఫ్యాన్‌గుర్తుపై పోటీ చేసి గెలిచినవారు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికారపార్టీలోకి చేరటం దారుణమన్నారు. భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకొస్తే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా పార్టీ మారిపోతారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రతిపక్షం ఎక్కడుంటుందని, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అర్థం ఏముంటుందని ఆవేదన వెలిబుచ్చారు.
రోజుకొక మాట, పూటకొక అబద్ధం చెప్పే చంద్రబాబు మాటల్ని ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదన్నారు. వచ్చేఎన్నికల్లో కురుపాం నుంచి గతంలో సాధించిన మెజార్టీకన్నా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వెలిబుచ్చారు. స్వయానా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి, జిల్లాలోని ఎమ్మెల్సీలు తిష్టవేసినా నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేరన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు తమకు అత్యంత సన్నిహితులని, వారు పార్టీ మారటం బాధకలిగించిందనీ శత్రుచర్ల చెప్పారు. వారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సంగంరెడ్డి బంగారునాయుడు, ఎం.ఎల్.ఎన్.రాజు పాల్గొన్నారు.

నేడు ఒంటిమిట్టకు వైఎస్ జగన్నేడు ఒంటిమిట్టకు వైఎస్ జగన్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో కడపకు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు వెళ్లి కోదండరాముని రథోత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బళ్లారికి వెళతారని తెలిపారు.

బోస్‌ను పరామర్శించిన జగన్


బోస్‌ను పరామర్శించిన జగన్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

గుండె రక్తనాళాల్లో సమస్య ఉండడంతో బోస్‌కు మంగళవారం నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు బృందం శస్త్ర చికిత్స నిర్వహించి రెండు స్టెంట్‌లు వేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్ వెంట పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి,  అప్పిరెడ్డి, సునీల్‌లు ఉన్నారు.

టీడీపీకి చుక్కెదురు


టీడీపీకి చుక్కెదురు
కార్పొరేషన్ ఎన్నికల నాడిపై సర్వే
  36 వార్డుల్లో నిఘా    బృందాల పరిశీలన
  వైఎస్సార్‌సీపీకే  అనుకూలం
  ప్రభుత్వానికి సర్వే  తొలి నివేదిక
  కొనసాగుతున్న  మలి సర్వే
ఇప్పటికిప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఆధిక్యం వస్తుంది? ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయా? పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా? ఎవరికి ప్రాతినిధ్యం వెళ్తుంది? ఏఏ వార్డుల్లో ఎవరి హవా ఉంది? అధికార తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఎలా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రజల తరఫున పోరాడే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశాలపై నిఘా బృందాలు సర్వే చేపట్టాయి. హైదరాబాద్‌లోని అదనపు డీజీపీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే తొలి నివేదిక ప్రభుత్వానికి అందజేసిన సిబ్బంది రెండో దశ సర్వేకు సిద్ధమయ్యారు.

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రానున్న ఎన్నికల్ని ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో జరుపుతుందా. పరోక్ష పద్ధతి వైపే మొగ్గు చూపుతుందా? యువత ఏం కోరుకుంటోంది. మహిళలు ఏం అంటున్నారు, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పుడున్న 36 వార్డుల్లోనే ఎన్నికలు జరిపిస్తారా? మునిసిపాలిటీ కార్పొరేట్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

 రెండు నెలల క్రితం వార్డుల వారీ జరిపిన సర్వే ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు, సిబ్బంది బృందం, తాజా గా రెండో నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తొలి సర్వే టీడీపీకే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మారుతున్న పరిస్థితులు వైఎస్సార్‌సీపీకే పూర్తి మెజార్టీతెచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం తీరు పట్ల నిర్వేదంలో ఉన్న జనం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకే మొగ్గుచూపిస్తున్నారు.

 ఇసుకలో భారీగా సొమ్ములు వెనకేసుకున్న టీడీపీ తమ్ముళ్లపై జనం గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయింది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లతో పనిచేస్తున్నారు. వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తమ వారికే సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారు. నగరంలో 36వార్డులదీ అదే పరిస్థితి.


 కేసీఆర్ వ్యూహంతోనే
 తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్వకంగా వ్యవహరించి, సర్వే ఫలితాల్ని ముందే తెప్పించుకుని ఎన్నికలకు వెళ్లింది.  జనం భావాల్ని అర్థం చేసుకుని దూసుకుపోయి మేయర్ పీఠం దక్కించుకుంది. అదే వ్యూహాన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వ్యవహరించి ఫలితాలు తెచ్చుకునేందుకు టీడీపీ ఆరాటపడుతున్నట్టు తెలిసింది. దీంతో సర్వే చేయాలంటూ పోలీసుశాఖ ద్వారా వివరాలు రప్పించుకుంటున్నట్టు సమాచారం. ఓటర్ల మనోభావాలు ఏ రోజుకారోజు మారిపోతున్నాయి. టీడీపీ పట్ల జనం పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరూ సంక్షేమ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాలపై నిఘా బృందాలు ఆరా తీస్తే వైఎస్సార్‌సీపీకే మెజార్టీ ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని తేలింది.

 వార్డుల్లో ఇదీ పరిస్థితి
 నగరంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ లభించే అవకాశాల్లేవని నిఘా బృందాలు తేల్చాయి. టీడీపీ పట్ల కేవలం 17వార్డులకే ప్రజలు మొగ్గు చూప్తున్నారని, మిగతా 19వార్డులూ వైఎస్సార్‌సీపీయే కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ ఫీఠం దక్కించుకుంటుందని వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ వైఎస్సార్‌సీపీకి మరింత మెజార్టీ వస్తుందని, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వైఎస్సార్‌సీపీకి దగ్గర చేస్తుందని నిఘా బృందాలు తేల్చినట్టు తెలిసింది. వార్డుల్లో 1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో దాదాపు వైఎస్సార్‌సీపీనే ఖరారు చేసేసింది. రిజర్వేషన్ల ప్రతిపాదిక, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాల్ని వైఎస్సార్‌సీపీ గుర్తిస్తే మిగతా వార్డుల్లోనూ సునాయాసంగా విజయం సాధిస్తుందని నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.

చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు

Written By news on Wednesday, April 20, 2016 | 4/20/2016


25న ‘సేవ్ డెమొక్రసీ’
April 23 సేవ్ డెమొక్రసీ
చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు

 సాక్షి, హైదరాబాద్: అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తూ రాష్ట్రంలో ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అనే పేరుతో April 23 ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి పిలుపు నిచ్చింది. రాష్ర్టంలో తెలుగుదేశం అధినేత సాగిస్తున్న అనైతిక రాజకీయ కార్యకలాపాలపై ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలోనూ గళం విప్పాలని, రాష్ర్టపతికి, ప్రధానమంత్రికి నివేదించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మే 2వ తేదీన నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా అధ్యక్షుల, పరిశీలకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో కరువు పరిస్థితులు, టీడీపీ అధికార దుర్వినియోగం, ప్రతిపక్ష నేతలపై వేధింపులు, జన్మభూమి కమిటీల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగతమైన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అధికార  పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి పోరాటం దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఈ సందర్భంగా జగన్ దిశానిర్దేశం చేశారు.

పార్టీ నేతలందరితోనూ విసృ్తతంగా చర్చలు జరిపి, ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పార్టీని మరింత పటిష్టంగా నిర్మించి మరింత ముందుకు తీసుకు పోవడమే లక్ష్యంగా ఆయన జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో ఆయా జిల్లాల వారీగా చర్చించారు. పలువురు నేతలు ఆయనతో ముఖాముఖిగా కూడా మాట్లాడారు. పార్టీ శ్రేణులను క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా జగన్ పలు సూచనలు చేశారు. టీడీపీ అభివృద్ధి అని ఓవైపు చెబుతూనే తీవ్రమైన అవినీతికి, దోపిడీకి పాల్పడుతుండటాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది.

 బాబు అనైతిక చర్యలు, వైఫల్యాలపై ఉద్యమం
 సాక్షాత్తూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి కొనుగోలు చేయడాన్ని సమావేశం తీవ్రంగా గర్హించింది. సమావేశానంతరం పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. చంద్రబాబు అనైతిక చర్యలు, ఫిరాయింపుల గురించి ప్రజలకు తెలియ జెప్పడానికి ఏప్రిల్ 23న సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.  ప్రదర్శన అనంతరం ఆయా కేంద్రాల్లో  బహిరంగ సభలు కూడా జరుగుతాయన్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలను చేపట్టడంలో ఘోరంగా విఫలం కావడాన్ని ప్రశ్నిస్తూ మే 2న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న మంచి నీటి కటకటను ప్రతిబింబించేలా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరుతున్నామన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటుగా ఆయా జిల్లాల్లోని నాయకులు తప్పనిసరిగా మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియ జెప్పాలన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటారని, అయితే ఎక్కడ పాల్గొనేది త్వరలో తెలియ జేస్తామని వారన్నారు. ఈ సమావేశంలో ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఫిరాయింపులపై సమీక్షలా!
 గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండ దెబ్బకు తాళలేక వృద్ధులు, చిన్న పిల్లలు మరణిస్తున్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితులపై సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షం నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు? ఎంత మందిని ఎలా లాగగలం అనే అంశాలపై సమీక్షించడం దారుణమని పార్థసారథి, వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేయడం గాని, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం పొందడం గానీ చేయకుండా ఈ ప్రభుత్వం ఫిరాయింపులకే ప్రాధాన్యం ఇస్తోందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిపారు.

ఈ దఫా వేసవి తీవ్రంగా ఉండబోతోందని ముందస్తు హెచ్చరికలున్నా ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పశువులకు గ్రాసం లేక రైతులు వాటిని ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నారని, పశువులకు తాగే నీరు కూడా లేక కబేళాలకు తరలిస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు వచ్చినపుడు రైతులకు ఇబ్బందులు కలక్కుండా ఉండేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుక్రాంతి పథకాన్ని ప్రవేశ పెట్టి పేదవారికి వాటిని పంపిణీ చేశారని వారు గుర్తు చేశారు. మంచి నీటి కటకట ఉన్న గ్రామాలకు తాగునీటిని తరలించాలన్న ఆలోచన లేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ పాలిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితిని, ఎండ తీవ్రతను ప్రభుత్వం గుర్తించక పోవడం సిగ్గు చేటని వారన్నారు.

 ఫిరాయింపులు, ప్రలోభాలపై రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు

 అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు ఇస్తామని, మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు కొనుగోలు చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఈ నెలాఖరున గాని, మే మొదటి వారంలో గాని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నందున ఆ అవకాశాన్ని వినియోగించుకుంటామని, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరమూ ఢిల్లీ వెళతామని  పార్థసారథి, వెంకటరామిరెడ్డి మీడియాకు వివరించారు. ఫిరాయింపు నిరోధక చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో వివరిస్తామన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు మాత్ర మే పోతున్నారని, ఇతర నాయకులు, కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినపుడు సంతలో పశువుల్లాగా కొంటున్నారని విమర్శించిన చంద్రబాబు ఏపీలో తానేం చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దమ్ముంటే తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాలు విసిరిన చంద్రబాబు ఏపీలో కూడా తాను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళతారా అనే అంశాన్ని ఆయన విచక్షణకే వదలి వేస్తున్నామన్నారు. పోయిన ఏడాది మంచి నీటి సరఫరాకు కేటాయించిన నిధులనే ఇప్పటికీ విడుదల చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తోందో అర్థం అవుతోందని వారు అన్నారు.

అది లోకేష్ మజ్జిగ స్రవంతి


కరువు పేరుతో కూడా దోపిడీనా?
చంద్రబాబుపై అంబటి ధ్వజం.. అది లోకేష్ మజ్జిగ స్రవంతి అని ఎద్దేవా

 సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలను ఆ దుకోవాలని సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం లేదని, రాష్ట్రంలో ఏర్పడే ప్రతి సంక్షోభాన్ని ఆయన తన దోపిడీకి వినియోగించుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంచినీటి సరఫరా కోసం రూ 200 కోట్లు, మజ్జిగ పంపిణీ కోసం జిల్లాకు రూ 3 కోట్లు చొప్పున రూ 39 కోట్లు విడుదల చేయడం టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టడానికేనని అనుమానం వ్యక్తం చేశారు.

దాహార్తితో ఉన్న ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉచిత మజ్జిగ పథకం ప్రవేశ పెట్టడం విడ్డూరమన్నారు. బాబు తన తొలి సంతకాల్లో ఒకటైన ఎన్టీఆర్ సుజల స్రవంతి (రూ.2కే రోజుకు 20 లీటర్ల మినరల్ వాటర్) పథకాన్ని అమలు చేయకుండా ఇపుడు లోకేష్ మజ్జిగ స్రవంతి పథకాన్ని ప్రవేశ పెడుతున్నారన్నారు. చంద్రన్న కానుక పథకంలో పుచ్చిన శనగలు, బెల్లం, నెయ్యి వంటివి హెరిటేజ్ నుంచి కొనుగోలు చేసి దోపిడీ చేసినట్లుగానే ఈ మజ్జిగ పథకం తెచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

పార్టీని వీడేది లేదు


'పార్టీని వీడేది లేదు'
బాలినేని స్పష్టీకరణ
ఆ వార్తలు అభూత కల్పనలు 
మేం వైఎస్సార్ అభిమానులం 
జగన్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంది
 
సాక్షి, హైదరాబాద్: తామంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీని వీడబోమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను, కొంత మంది ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ వీడిపోతున్నట్లు జరిగిన ప్రచారం పూర్తిగా తప్పు అని అన్నారు.
 
 వైఎస్సార్‌సీపీని స్థాపించే రోజున తాను మంత్రిగా ఉన్నానని, మంత్రి పదవిని వదులుకుని పార్టీలోకి వచ్చానని బాలినేని గుర్తు చేశారు. పార్టీ మారుతున్నానన్న వార్తలన్నీ అభూత కల్పనలేనన్నారు. తనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. 2014 ఎన్నికల తరువాత వ్యక్తిగత విషయాల వల్ల పార్టీ కార్యకలాపాలకు తాను కొంత దూరంగా ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. జగన్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని శ్రీనివాసరెడ్డి అన్నారు. 
 
 నాకు ప్రాధాన్యత ఇస్తున్నారు
 పార్టీ వ్యవహారాల్లో జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారని విలేకరులు ప్రశ్నించగా ‘అదేమీ లేదు. నాకు జగన్ తొలి నుంచీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల తరువాత నేనే కొంత దూరంగా ఉన్నాను, తప్ప మరేమీ లేదు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అని జగన్ అన్నారు. నా వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నేనే దూరంగా ఉండటం జరిగింది’ అని బాలినేని అన్నారు. బాలినేనితో పాటుగా ఒంగోలు సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వరికూటి కొండారెడ్డి, కొండెపి అసెంబ్లీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 
 
 పార్టీని వీడను: ముత్తుముల
 తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, జగన్ నాయకత్వంలోనూ, జిల్లా స్థాయిలో బాలినేని నాయకత్వంలోనూ పని చేస్తానని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాను తొలి నుంచీ వైఎస్సార్‌సీపీలో ఉన్నానని తమపై అభూత కల్పనలు, అసత్యపు ప్రచారాలు జరుగుతున్నాయని, అవి తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 బాబుకు పబ్లిసిటీ పిచ్చి: కొడాలినాని
 ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రజల సంక్షేమానికి చేసే పనులకన్నా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని విమర్శించారు. అసలు పనులకు పిసరంత ఖర్చు చేసి పబ్లిసిటీకి మాత్రం భారీగా ఖర్చు చేస్తారన్నారు. మజ్జిగ పథకం కూడా అలాగే ఉండబోతోందన్నారు. గుడివాడలో చలివేంద్రాల ఏర్పాటులోనూ ఇలాగే చేశారన్నారు. చలివేంద్రంలో అమర్చిన సామగ్రికి రూ.2,000 ఖర్చయితే దాని చుట్టూ చంద్రబాబు బొమ్మలు, ఫ్లెక్సీలకు రూ 10,000 ఖర్చు చేశారని విమర్శించారు. ఈ దఫా ఎండలు మండిపోతోంటే చంద్రబాబు ఇప్పటికింకా సహాయక పనులకు దిగలేదని ఆయన విమర్శించారు. 

మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా

Written By news on Tuesday, April 19, 2016 | 4/19/2016


మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా
హైదరాబాద్ :
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రిపదవిని కూడా వదులుకుని వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు. తాను అసలు టీడీపీ నేతలతోనే మాట్లాడనప్పుడు.. వాళ్లకు ఆ పార్టీలోకి వస్తానని హామీలు ఎవరిచ్చారో తెలియదని చెప్పారు.

ఇక తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. తామంతా శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని ఆయన అన్నారు.

కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కాను

జిల్లా ప్రకాశించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే
 మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి


దర్శి: తాను కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కానని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. రాజంపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లలో పొదిలి మండలం కుంచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దర్శి మండలం లక్ష్మీనారాయణపురం ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిందేనన్నారు. ప్రస్తుత పాలనలో బాబు వచ్చాడు జాబు పోయిందని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి వచ్చింద ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులు పక్కదారి మళ్లించడంతో కనీసం బోర్లు ఎండిన చోట మరమ్మతులు చేయించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు తిరుగుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
అవినీతి సొమ్ముతో శాసనసభ్యులను కోట్లు ఇచ్చి కొంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు వద్దకు రావడం.. వెళ్లడం తప్ప.. చేసింది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం కరువు వచ్చి రైతులు కన్నీరు పెడుతున్నారని, పల్లెలు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నాయని, యువత ఉద్యోగాలు, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారని, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లేసి గెలిపించామని బాధపడుతున్నారని చెప్పారు. యువకుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రజల కోసం ఎంతో తపిస్తుంటారని, అటువంటి యువ నాయకుడికి అందరూ ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్ రామరాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిందేనని జంకె పునరుద్ఘాటించారు.

రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్

Written By news on Monday, April 18, 2016 | 4/18/2016


రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్
విశాఖపట్నం :
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఉద్యమం ఆగలేదని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రైల్వేజోన్ కోసం విశాఖపట్నంలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌కు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...

ఐదు రోజులుగా అమర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించలేదు.
నిజానికి ఫలానా తేదీలోపు కచ్చితమైన ప్రకటన చేయాలని, లేకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని నెల రోజుల క్రితమే అమర్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖ రాశారు
లేఖ రాసిన నెల రోజుల తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అంబేద్కర్ జయంతి రోజున అమర్ నిరాహార దీక్ష ప్రారంభించారు
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు
ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పడం, తర్వాత ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు విశ్వసనీయత
ఎన్నికలకు ముందు రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నారు.
ఇప్పుడు ఆయన చేసిన రుణమాఫీ కార్యక్రమం రైతులకు వడ్డీలలో మూడోవంతు కూడా సరిపోవడం లేదు
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానన్నాడు
ఎన్నికలు అయిపోయాక రుణాల మాఫీ దేవుడెరుగు, రెండు రూపాయల వడ్డీ కట్టే దుస్థితికి తీసుకొచ్చాడు
జాబు రావాలంటే బాబు సీఎం కావాలంటూ పెద్దపెద్ద పోజులు కొట్టాడు, ప్రకటనలు చేశాడు
ఎన్నికలు అయిపోయాయి బాబు సీఎం జాబులో కూర్చున్నాడు, ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే కార్యక్రమం చేస్తున్నాడు
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నాడు, ఈవాళ కొన్ని శాఖల్లో ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు
వీళ్లందరికీ ఉద్యోగాలు ఊడబీకే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది
ఉద్యోగాలు రాకపోతే ఇంటికొకరికి 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, అందరినీ మోసం చేశాడు
చదువుకున్న పిల్లలకు ఉపయోగపడేది ప్రత్యేక హోదా. అది వస్తే, ఆ హోదా వల్ల జరిగే మేలు వల్ల ప్రతి పారిశ్రామిక వేత్తకు పన్ను రాయితీలు వస్తాయి కాబట్టి పారిశ్రామిక వేత్తలు బయటి నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తారు, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి
ఆ ప్రత్యేక హోదాను సైతం ఆయన పణంగా పెట్టినా అడిగే నాథుడు లేడు
రైల్వేజోన్ కూడా అంతే. నిజంగా రైల్వే జోన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు మనకున్న ఒకే రైల్వేజోన్ తెలంగాణకు వెళ్లిపోయింది.
మనకు నాలుగు డివిజన్లు ఉన్నాయి గానీ, ఒక్క జోన్ కూడా రాలేదు
మనకు రావల్సిన జోన్ ఒడిసాలో ఉంది. జోన్ ఉన్నచోటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ఉంటుంది
మొన్న ఆర్ఆర్‌బీ పరీక్షలు నిర్వహిస్తే, మనవాళ్లు ఒడిషాకు వెళ్లినప్పుడు వీళ్లను రానివ్వకుండా తరిమికొట్టారు
ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది?
ప్రత్యేక హోదా తేరు, ఉద్యోగాలు ఇవ్వరు, కనీసం రైల్వే జోన్ కూడా తెప్పించడం లేదు
బిహార్‌లో రైల్వే జోన్ ఉంది.. మనవాళ్లు అక్కడకు పోయి ఉద్యోగాలు చేయరు
ఇదంతా తెలిసినా దాన్ని పట్టించుకునే నాథుడు లేడు
ఒకసారి రైల్వేజోన్ వస్తే 16 హెచ్‌ఓడీలు వస్తారు. వాళ్లందరూ ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
జోన్‌కు సంబంధించిన రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి వెళ్తాయి.
కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా కూడా మనకకు ఒక జోన్ రావాలి
ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు
అడగాల్సిన వాళ్లు అడగడం లేదు
చంద్రబాబు సీఎం అయి రెండేళ్లయిపోయింది. ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వనరులు, రైల్వేజోన్.. ఇలాంటి హామీలు రాకపోతే మీరు కేంద్రంలో మీవాళ్లను ఎందుకు మంత్రులగా కొనసాగిస్తున్నారు?
కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు పట్టించుకునే పరిస్థితిలో లేడు
గట్టిగా నిలదీసి అడిగితే.. ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న విషయంపైన, పక్క రాష్ట్రంలో ఆడియో వీడియో టేపులతో బయటపడ్డ విషయంపైన ఎక్కడ విచారణలు జరుగుతాయోనని భయపడి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాడు
చంద్రబాబుకు, తన పాలనకు పైనుంచి దేవుడు, కిందనుంచి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
ప్రజలు బాబును రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది
నువ్వు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన మా ఎమ్మెల్యేల చేత రాజీనామా ఎందుకు చేయించడం లేదు, వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు?
ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్లండి.. ప్రజలు మీకు ఓటేస్తారో, మాకు ఓటేస్తారో తేలిపోతుంది
తాను అవినీతి సొమ్ముతో ప్రలోభపెట్టిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయరు, రాజీనామా చేయించరు, ఎన్నికలకు వెళ్తే మళ్లీ గెలుస్తానో లేదోనన్న అపనమ్మకం ఆయనకుంది
అమర్ వయసులో చిన్నవాడు.. యువకుడు. అతడి నుంచైనా నేర్చుకుని చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నా
ఈ ఉద్యమంలో అమర్‌కు, వైఎస్ఆర్‌సీపీకి సంఘీభావంగా ఉంటున్న వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ.. అందరికీ కృతజ్ఞతలు.
ఈ పోరాటానికి మద్దతిచ్చిన కార్మిక సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, జర్నలిస్టు సంఘాలు, మహిళా సంఘాలు, బార్ అసోసియేషన్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో శిబిరం మీద దాడిచేసి, దీక్ష కొనసాగనివ్వకుండా ఎలా చేశారో చూశాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు, రాబోయేకాలంలో దీనిపై ప్రణాళికలు రచించి, ఉద్యమం కొనసాగిస్తాం. అందరం కలసికట్టుగా దీనిపై పోరాడతాం

Popular Posts

Topics :