29 May 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?: వైఎస్ జగన్

Written By news on Saturday, June 4, 2016 | 6/04/2016


చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?: వైఎస్ జగన్
అనంతపురం : ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శనివారం కదిరిలో బహిరంగ సభలో మాట్లాడారు.
'యాత్రలో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 80 కుటుంబాల వద్దకు వెళ్లడం జరిగింది. చనిపోయినవారిలో దాదాపుగా 15మంది చేనేత కార్మికులు ఉంటే మిగతావారు రైతులే. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు?.ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు...బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా?. రుణాలు కట్టొద్దంటు రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు.

రుణాలు కట్టకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడింది. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారు.  చంద్రబాబు  ఎంసీ అయిన తర్వాత డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడింది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు హామీ ఏమైంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోయారు. పట్టపగలే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేను రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ను ఎందుకు నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికినందుకే కేసీఆర్ ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు. నిలదీస్తే చంద్రబాబును జైలుకు పంపుతారు. అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?. రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టాలంటారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలి. ముఖ్యమంత్రిని ఏమీ అనకూడదంట. కానీ ఆయన మాత్రం మోసాలు చేయొచ్చు... అబద్దాలు ఆడొచ్చు. మనమంతా కలిసికట్టుగా ఒకటై వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం' అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

కదిరి నుంచి ప్రారంభమైన జగన్ రైతు భరోసా యాత్ర


ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజు శనివారం ఉదయం కదిరిలో ప్రారంభమైంది.

అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి ఎన్‌పీ కుంట దిశగా సాగిపోయారు. ఎన్‌పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో జగన్ సమావేశం కానున్నారు.

వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స

Written By news on Friday, June 3, 2016 | 6/03/2016


వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు బాధలు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. రాజధాని భూములను బినామీలకు అమ్ముతున్నారని బొత్స అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారి మానసిక స్థితి బాగుందా? లేదా అన్నారు.
ప్రజల అభిప్రాయమే వైఎస్ జగన్ చెప్పారని, ప్రభుత్వ అవినీతిపై ప్రజలు కడుపు మంటతో ఉన్నారన్నారు. ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని, వైఎస్ జగన్ అన్న మాటలపై అంత ఉలికిపాటు ఎందుకని బొత్స అన్నారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారన్నారు.  వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడరని, అడ్డుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తున్న యనమల రామకృష్ణుడి మానసిక స్థితి బాగుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్నారని, మరి అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు.

రాజ్యసభ సీటును అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలు పుష్పరాజ్, కేఈ ప్రభాకర్ లు నిలదీయలేదా అని బొత్స ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలను కూడా వ్యాపార దృష్టితో చూస్తున్నారని, స్వయంగా టీడీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని అనుకుంటే నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ నేతలు మాట్లాడం లేదన్నారు. వారికి వ్యవస్థలపై గౌరవం లేదని బొత్స వ్యాఖ్యానించారు. అన్నారు.
ఇక కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పేషీ నుంచి ఫోన్స్ కాల్స్ పై ఏం బాధ్యత వహించారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజుపై సీబీఐ విచారణను ఎందుకు అడగటం లేదన్నారు. ఆయన ఓఎస్డీ అప్పారావు, లోకేశ్ ల మధ్య ఉన్న లాలూచీ ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికే వైఎస్ జగన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని బొత్స అన్నారు.

ఎవరికీ భయపడలేదు...భయపడం


'ఎవరికీ భయపడలేదు...భయపడం'
అనంతపురం: టీడీపీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి  అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...'మేం అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటాం. మాకు డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు అవసరం లేదు. పరిటాలకు భయపడి బెంగళూరుకు పారిపోయిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డి సోదరులది. మేం ఎప్పుడు ఎవరికీ భయపడలేదు...భయపడం' అని అన్నారు.

నువ్వా దీక్ష చేసేది


నువ్వా దీక్ష చేసేది
నిండా అవినీతిలో మునిగిన
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
‘అనంత’లో రెండోరోజు రైతుభరోసా యాత్ర

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ నిర్మాణ దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీక్ష చేయాలని చెబుతున్నారు. దీక్షపై పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చదివితే, చంద్రబాబు ప్రజలను ఎంత ఘోరంగా అవహేళన చేస్తున్నారో అర్థమవుతోంది. అవినీతిరహిత రాష్ట్రం కోసం అంతా పాటుపడాలని ఆయన చెబుతున్నారు.

నిండా అవినీతిలో మునిగి, ఆ సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. అయినా ఆ మనిషి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమంటే ప్రజలను అవహేళన చేయడమే. చంద్రబాబు కంటే దారుణమైన ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండరు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా రెండోరోజు గురువారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పర్యటించారు. యాడికి మండలం నగరూరులో ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాలను జగన్ పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు
‘‘నవ నిర్మాణ  దీక్షపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? సూట్‌కేసులను నల్లడబ్బుతో నింపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇంతకంటే దారుణమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రజలు గమనిస్తున్నారనే జ్ఞానం లేకుండా ఏపీలో కూడా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్ల దాకా ఇచ్చి ఇప్పటివరకూ 17 మందిని కొనుగోలు చే శారు. ఇంకా కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు కూడా ఇస్తారని  వింటున్నాం.

ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనేస్తున్న మనిషి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా... కాంట్రాక్టుల నుంచి రాజధాని భూముల వరకూ ప్రతిదీ అవినీతే. చివరకు దేవుడి భూములను సైతం తక్కువ రేట్లకు బినామీలకు ఇచ్చి రూ.వందల కోట్లు జేబులోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను రూ.22 కోట్లకే దారాదత్తం చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారు. ఇలాంటి మనిషి నవ నిర్మాణ దీక్ష పేరుతో అందరూ ప్రమాణం చేయాలని చెబుతున్నారు. నిజంగా నవ నిర్మాణ దీక్ష జరగాలంటే... చంద్రబాబు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలి. అప్పుడే ఆయనకు తెలిసొస్తుంది’’ అని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు.

రెండేళ్లలో చేయని మోసం లేదు
‘‘ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేయని మోసం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. మాఫీ మాట మరిచారు. రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పారు. మాఫీ చేయకపోవడంతో రూ.87 వేల కోట్లకు వడ్డీనే రూ.25 వేల కోట్లు అయ్యింది.

ఈ వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోని విధంగా మాఫీ వర్తింపజేశారు. మాట తప్పిన మనిషికి నవ నిర్మాణ దీక్ష చేసే హక్కు ఉందా? పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో నాగరాజు అనే చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పరామర్శించా. వారికి రూ.40 వేలుఅప్పుంది. మాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కష్టపడి పనిచేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి డ్వాక్రా మహిళలది. వీరి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. కానీ చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ముష్టి వేసినట్లు రూ.3 వేల రుణం ఇస్తానంటున్నారు. ఇలాంటి వ్యక్తికి నవ నిర్మాణ దీక్ష పేరిట ప్రతిజ్ఞ చేయించే నైతిక హక్కు ఉందా?’’ అని విపక్ష నేత నిలదీశారు.

నిలదీస్తే అరెస్టు తప్పదని బాబు భయం
‘‘ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగమూ ఇవ్వలేదు, భృతీ చెల్లించలేదు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధాలు తప్ప ఏమీ లేదు. చంద్రబాబు దగ్గరుండి ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పట్లో ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగారుస్తున్నారు. కేంద్రంలోని తన మంత్రులతో ప్రత్యేక హోదాపై అడిగించడం లేదు.

ప్రధాని మోదీకి అల్టిమేటం జారీ చేస్తే.. రెండేళ్లలో జరిగిన తన అక్రమాలతోపాటు కేసులను బయటికి తీసి అరెస్టు చేయిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. అలాగే కృ ష్ణా, గోదావరి నదులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అ డ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు. అవి పూర్తయితే మనకు నీళ్లు రావని తెలిసినా కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు. గట్టిగా నిలదీస్తే ఓటుకు కోట్లు కేసును బయటికి తీసి జైల్లో పెట్టిస్తారనే భయంతోనే కేసీఆర్‌ను చంద్రబాబు పల్లెత్తు మాట అనడం లేదు. ఇలాంటి వ్యక్తికి ప్రజలతో ప్రమాణం చేయించే హక్కు లేదు’’ అని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు.

చంద్రబాబు పాలనపై ఆయనకే నమ్మకం లేదు
‘‘చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదు. ఉంటే.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 17 మంది ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదు? ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ప్రజాతీర్పు కోరడం లేదు? మరోపార్టీ బీ-ఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన చంద్రబాబు తిరిగి ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారంటే ఆయన పాలనపై ఆయనకే నమ్మకం లేదనే విషయం తెలుస్తోంది’’ అని జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నేతలు తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు తీసుకున్నారు కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా... ‘‘సీపీఐతోపాటు అన్ని పార్టీల్లో కాంట్రాక్టర్లు ఉన్నారు. వారే వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేస్తుంటారు. నేను ప్రాజెక్టులు కట్టొద్దన్నానంటే, వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా! ప్రాజెక్టులు నిర్మించకపోతే కాంట్రాక్టర్లకు నావల్ల మేలు కాకుండా నష్టమే జరుగుతుంది. పది మందికి మేలు జరగడం ముఖ్యం, ఒకరికి నష్టం వస్తుందని వెనకడుగు వేయకూడదు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి బదులిచ్చారు.

అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్

Written By news on Thursday, June 2, 2016 | 6/02/2016


అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్
అనంతపురం : ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల దగ్గరకు వెళితే ఎవరేంటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ గురువారమిక్కడ మాట్లాడుతూ వేరే పార్టీ బీఫామ్ లపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొంటున్నారని మండిపడ్డారు. ఈ చర్య చూస్తుంటే చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేదనిపిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇక నవ నిర్మాణ దీక్ష పేరుతో ఆయన ప్రజలను హేళన చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత రాష్ట్రమని చెబుతున్న ఆయన నిండా అవినీతిలో మునిగారన్నారు.

ఓటుకు కోట్ల కేసు భయంతోనే  తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజక్టుల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. సీబీఐ విచారణ జరుపుతుందేమోననే శంకతో  అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ మోదీని కూడా నిలదీయలేకపోతున్నారన్నారు. అందువల్లే కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

ఎమ్మెల్యేలను కొనడమే రాష్ట్రాభివృద్ధా ?


ఎమ్మెల్యేలను కొనడమే రాష్ట్రాభివృద్ధా ?
రైల్వేకోడూరు: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడమే రాష్ట్రాభివృద్ధా అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సీఎం చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు. రైల్వేకోడూరులోని వైఎస్ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు, పనులకు ఆశ పడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కొన్నా ప్రజలను కొనలేం అనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు 198 హామీలు ఇచ్చారని, వాటిలో పింఛను ఒక్కటే అదీ అరాకొర మాత్రమే అమలు చేశారని విమర్శించారు. టీడీపీ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని, ఆ పార్టీ నాయకులకే అంతా కట్టబెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో మాఫియాల పర్వం కొనసాగుతోందని కొరుముట్ల అన్నారు. ఇసుక, మైనింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మాఫియా చాలానే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ హయాంలో గాలేరు-నగిరి పనులకు శ్రీకారం చుడితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాటి పనులకు రూ. 10 వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అవినీతి, అక్రమ సంపాదనతో అడ్డుగోలుగా ఎమ్మెల్యేలను కొన్న విషయం పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరికి వివరించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి అశోక్ ఓఎస్డీకి భండారీ నుంచి 355 కాల్స్


మంత్రి అశోక్ ఓఎస్డీకి భండారీ నుంచి 355 కాల్స్
- నెంబరు పెద్దగా గుర్తుపెట్టుకోలేదన్న ఓఎస్డీ అప్పారావు
- ఏడాదిన్నరలో 3-4 సార్లు కలిశాడని ప్రకటన

 న్యూఢిల్లీ:  కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లుగా భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొత్త మలుపు తిరిగింది. భండారీతో కేంద్ర విమానయాన మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అప్పారావు ఫోన్‌కాల్స్‌పై ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చకు తెరలేసింది. భండారీ ఇంట్లో విచారణ సంస్థల సోదాల్లో దొరికిన ఆధారాల్లో.. గతేడాదిగా అప్పారావుతో 355 సార్లు భండారీ మాట్లాడినట్లు వెల్లడైంది. అయితే తనకు భండారీ ఫోన్ చేసిన మాట వాస్తవమేనని అయితే.. చాలా తక్కువసార్లు చేసినందున ఆ నెంబరును గుర్తుపెట్టుకోలేదని అప్పారావు తెలిపారు.

మంత్రిని కలిసేందుకు భండారీ ఏడాదిన్నర కాలంలో మూడు, నాలుగు సార్లు ఇంటికొచ్చారని.. అయితే విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్నందుకే మంత్రి ఈయనతో మాట్లాడారాన్నారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్‌షోలో అశోక్ గజపతి రాజును భండారీ కలిసినట్లు వెల్లడించారు. కాగా, భండారీతో తనకు వ్యక్తిగత పరిచయమే తప్ప వృత్తిపరమైన సంబంధాల్లేవని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 2009లో వాద్రాకు చెందిన లండన్ ఇంటిని భండారీ కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. కాగా, బ్యాంకు అకౌంట్లు, ఆస్తులకు సంబంధించిన వివరాలివ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) భండారీకి నోటీసులు  జారీ చేసింది.

http://www.sakshi.com/news/national/minister-ashok-to-osd-355-calls-from-bhandari-347573

నేటి యాత్ర ఇలా..


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర  రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలవుతుంది. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదుగా కిష్టిపాడు చేరుకుని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత రాయలచెరువు మీదుగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు.

జనవడుగూరు


జనవడుగూరు
► తాడిపత్రి నియోజకవర్గంలో మొదలైన ఐదోవిడత
► రైతు భరోసా యాత్ర పెద్దవడుగూరుకు భారీగా
► తరలివచ్చిన రైతులు, మహిళలు  రైతులు, డ్వాక్రా మహిళల
► సమస్యలపై వైఎస్ జగన్ ముఖాముఖి
► ప్రతిపల్లెలోనూజగన్‌పై పూలవర్షం
► తొలిరోజు నాలుగు కుటుంబాలకు భరోసా(సాక్షిప్రతినిధి, అనంతపురం) పెద్దవడుగూరు జనసంద్రమైంది. తమ అభిమాననేతను చూసేందుకు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. పెద్దవడుగూరుతో పాటు జగన్‌యాత్ర సాగిన ప్రతీపల్లెలోనూ మహిళలు అభిమానహారతి పట్టారు. నుదుట విజయతిలకం దిద్దారు. యువకులు పూలవర్షం కురిపించారు. పల్లె    ప్రజల అభిమానానికి జగన్ కూడా తడిసిముద్దయ్యారు.


అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసాయాత్రలో భాగంగా ఐదో విడతయాత్ర బుధవారం మొదలైంది. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా జగన్ మధ్యాహ్నం 12.10 గంటలకు అనంత, కర్నూలు జిల్లా సరిహద్దులోని బాట సుంకులమ్మ దేవస్థానం సమీపానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్‌రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డిలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మిడుతూరు మీదుగా పెద్దవడుగూరు చేరుకున్నారు.

పెద్దవడుగూరులో డప్పువాయిస్తూ, పూలవర్షం కురిపించారు. ఇక్కడ రచ్చబండ వద్ద రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల తామెలా నష్టపోయామో రైతులు, మహిళలు జగన్‌తో ఏకరువు పెట్టారు. మరోసారి చంద్రబాబు ప్రభుత్వానికి ఓటేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నాగసంజీవప్ప కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడి నుంచి దిమ్మగుడి చేరుకున్నారు. అక్కడ జగన్‌పై పూలవర్షం కురిపించారు. బ్యాండ్, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. మహిళలు దిష్టితీసి హారతి పట్టారు.

అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు. అక్కడి నుంచి కండ్లగూడూరు చేరుకున్నారు. గ్రామస్తులు రోడ్డుపై జగన్‌కోసం వేచి ఉన్నారు. ఈ గ్రామం దాటేందుకు జగన్‌కు 1.30 గంటల సమయం పట్టింది. రైతులు, మహిళలు, వృద్ధులు జగన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రతి ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ‘బాగున్నావా అవ్వా...పేరేంటి?’ అని పలకరించారు. జగన్ ఆప్యాయతను చూసి వృద్ధులు, మహిళలు పట్టరాని సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చారు. అక్కడి నుంచి ఆయన చింతలచెరువు చేరుకున్నారు. అక్కడ కూడా దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న వెంకటనారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత అక్కడి నుంచి తెలికి చేరుకున్నారు. రాత్రి 9గంటల సమయంలో కూడా జగన్‌ను చూసేందుకు రైతులతో పాటు వృద్ధులు, మహిళలు రోడ్డుపై వేచి ఉన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు.

అటు నుంచి మేడిమాకులపల్లి చేరుకుని జెడ్పీటీసీ సభ్యుడు చిదంబరరెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు. మొదటిరోజు యాత్రలో నియోజకవర్గ సమన్వయ కర్తలు, నాయకులు తిప్పేస్వామి, ఆలూరు సాంబశివారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బోయ సుశీలమ్మ, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మీసాలరంగన్న, నదీమ్ అహ్మద్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, జయరాంనాయక్, రవీంద్రనాథరెడ్డి, విఘ్నేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి యాత్ర ఇలా..

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర  రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలవుతుంది. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదుగా కిష్టిపాడు చేరుకుని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత రాయలచెరువు మీదుగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు.

అమరులను విస్మరించిన కేసీఆర్


అమరులను విస్మరించిన కేసీఆర్
రెండేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కొండా రాఘవరెడ్డి

 సాక్షిప్రతినిధి, ఖమ్మం:
‘రాష్ట్ర ఏర్పాటు కోసం 1,100 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పటివరకు గుర్తించింది 300 మం దినేనా? పార్టీలో చేర్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్రస్‌లు దొరుకుతాయి. కానీ.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల అడ్రస్‌లు దొరకవా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాటల గారడీతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదెంతో కాలం సాగదని అన్నారు. కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు రిజర్వేషన్ హామీలన్నీ అటకెక్కాయన్నారు. వైఎస్సార్‌సీపీ అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజలకు అండగా పోరుబాట పడుతుందని అన్నారు.

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆనం

Written By news on Wednesday, June 1, 2016 | 6/01/2016


హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియమాలు జరిగినట్టు పార్టీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్ లో సంబురాలు


విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్ లో సంబురాలు
కువైట్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కువైట్‌లోని మలియా ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి. హెచ్ మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన నైతిక విలువలకు కట్టుబడి నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్న విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి దగ్గడం సంతోషకరమైన విషయమని అన్నారు. కువైట్ కమిటీ, గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున పత్రికా ముఖంగా విజయసాయిరెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర దేశ రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అని నిరూపిస్తూ మాట తప్పని మడమ తిప్పని మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి అని యం.బాలిరెడ్డి కొనియాడారు. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడం అభినందనీయమని తామంతా వైఎస్‌ఆర్‌సీపీలో పనిచేస్తుందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహా కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రేహామాన్ ఖాన్, యన్. మహేశ్వర్ రెడ్డి, యం. చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు  నాగిరెడ్డి చంద్ర, పి. సురేష్ రెడ్డి, రమణ యాదవ్, లాజరస్, మర్రి కళ్యాణ్ దుగ్గి గంగాధర్ జి. ప్రవిణ్ కుమార్ రెడ్డి, షా హుస్సేన్, షేక్ గఫార్, సయ్యద్ సజ్జద్, రఫీఖ్ ఖాన్, మహాబూబ్ బాషా, అబుతురాబ్, వాసుదేవ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, హనుమంతు రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం


మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, రుణమాఫీ చేస్తామని తమను మోసం చేశారని అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయమని స్పష్టం చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెదవడుగూరులో రైతులు, డ్వాక్రా మహిళలతో  వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు.

కేంద్రానికి సంబంధించి 4500 కోట్ల రూపాయల నిధులతో రైతులకు ఉపాధి కల్పిస్తే రైతులు బాగుపడతారని వైఎస్ జగన్ అన్నారు. ఉపాధి పనులు దొరికితే రైతులు స్థానికంగా ఉంటారనుకుంటే, చంద్రబాబు ఆ డబ్బును తన ఇష్టం వచ్చినట్లు వేరే చోటకు మళ్లించారని ఆరోపించారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమాట్లాడారంటే..
 • చంద్రబాబు సీఎం అయ్యేసరికి బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు
 • ఇప్పుడు ఆయన మాఫీ చేయకపోవడంతో 2 రూపాయల వడ్డీ కడుతున్నారు
 • పంట బీమా రావడం లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ అంతంతమాత్రమే
 • చివరకు నీళ్లొస్తాయని చూస్తుంటే బాబు పుణ్యాన నీళ్లు రాకపోగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేసి, పంపులు పెట్టి నీళ్లు తన్నుకుపోతుంటే కనీసం అడిగే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి చూస్తున్నాం
 • రైతుల బాధలు అర్థం కావాలి. ఆయన అక్కడెక్కడో బంగారు మేడలో కూర్చుని అంతా బాగున్నారు, రైతు రుణాలన్నీ మాఫీ చేశాను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆనందంతో ఉన్నారని అబద్ధాలు చెబుతున్నారు
 • ఇక్కడి రైతులు చెప్పిన మాటలైనా ఆయనకు అర్థమైతే కాస్తో కూస్తో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం
 • రుణాలు రెన్యువల్ అయి ఉంటే కాస్తో కూస్తో క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది
 • మాఫీ కాక, రెన్యువల్ కాక, బీమా రాక అన్యాయం అయిపోతున్నారు
 • కనీసం ఇప్పటికైనా రైతులు ఎలా బాధపడుతున్నారో చంద్రబాబుకు అర్థం కావాలి
 • రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, చేనేత కార్మికుల అవస్థలు తెలియాలి
 • కనీసం ఈ మీటింగ్ ద్వారానైనా చంద్రబాబు గారు రైతుల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు తోడుగా నిలబడేందుకు ఆయనకు జ్ఞానోదయం కావాలి
 • ఈ విషయమై ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తాం

అనంతరం వైఎస్ జగన్ ఎదుట రైతులు, డ్వాక్రా మహిళలు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఏం చెప్పారంటే వారి మాటల్లోనే..కృష్ణారెడ్డి, చిన్నవడుగూరు

నాకు 11 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి రుణమాఫీ చస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదని చెప్పారు. కానీ ఇంతవరకు 1.5 లక్ష గోల్డ్ లోన్, 75 వేల రూపాయలు క్రాప్ లోన్ ఉంది. కేవలం 8వేల రూపాయలే మాఫీ అయింది. రెండింటికీ కలిపి 56800 రూపాయల వడ్డీ అయింది. రెండేళ్ల పాటు మేం క్రాప్ లోన్, గోల్డ్ లోన్ రెన్యువల్ చేయలేదు.. చివరకు అన్నీ కోల్పోయాం. నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. వైఎస్ ఉన్నప్పుడు మా కాలవకు 1.5 టీఎంసీ కేటాయించారు. చంద్రబాబు పుణ్యాన వర్షాలు లేక, డ్యాముల్లో నీళ్లు లేక అవీ రావడం లేదు. చివరకు జేసీ బ్రదర్స్ కలిపి అన్యాయం చేస్తున్నారు. 70 రోజులు ఇస్తామన్నారు, కనీసం 50 రోజులు కూడా రావడం లేదు. జగనన్న సీఎం అయితేనే మన రైతుల సమస్యలు తీరుతాయి

మల్లయ్య, ముత్యాల

నాకు 4 ఎకరాల భూమి ఉంది. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బ్యాంకులో 25 వేల రుణం ఉంది. అది కూడా మాఫీకాలేదు. వడ్డీలకే సరిపోతోంది. రూపాయి కూడా రాలేదు వడ్డీ భారం కూడా పడింది. అది కూడా కలిపి కట్టమంటున్నారు. పంటబీమా కూడా రాలేదు. ఈ సంవత్సరం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వబోమని అంటున్నారు. పబ్లిగ్గా బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఏం చెబుతాం.
రామచంద్రరాజు, మేడిమాకులపల్లె

నాకు 8 ఎకరాల భూమి ఉంది. గోల్డ్ లోన్ 80 వేలు, క్రాప్ లోన్ 80 వేలు ఉంది. అందులో 12వేలు పోయిందన్నారు. మళ్లీ 8వేలు ఎదురు వడ్డీ కట్టాం. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటున్నామన్నారు. ఆ పొద్దు ఆయన కట్టొద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఇప్పుడు వాళ్ల పుణ్యాన అధిక వడ్డీ కట్టాల్సి వస్తోంది. బంగారం వేలం వేస్తామని నోటీసులు వస్తే భూములు తాకట్టు పెట్టి బంగారం విడిపించుకున్నాం. రైతుకు చక్రవడ్డీ పడుతోంది. పంటబీమా రూపాయి కూడా రాలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రాదన్నారు. విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. ఈయనొస్తే మళ్లీ వర్షాలు రావు. మేం బతికుంటే మళ్లీ ఆయనకు మాత్రం ఓటు వేయం.

చంద్రావతి, డ్వాక్రా మహిళ

 మా గ్రూపులో 15 మంది ఉన్నాం. 5 లక్షల రుణం తీసున్నాం. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెబితే టీడీపీకి ఓట్లు వేశాం. చంద్రబాబు చెప్పినందుకు అప్పుకట్టలేదు. అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మూడు నెలలకే 30 వేల వడ్డి వచ్చింది.

అనంతరం వైఎస్ జగన్.. రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. ప్రజలను ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజులు వస్తాయని, దేవుడు పైనుంచి చూస్తున్నాడని చెప్పారు.

Popular Posts

Topics :