12 June 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్

Written By news on Friday, June 17, 2016 | 6/17/2016


రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా జక్కంపూడి రాజా ధర్నా చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాజా డిమాండ్ చేశారు.

అద్దంకి వైసిపి ఇన్ చార్జీగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఇన్ చార్జీ గా మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను నియమిస్తూ పార్టీ అధినేత జగన్ ఆదేశాలు ఇచ్చారు.అలాగే కదిరి లో పివి సిద్దారెడ్డిని ఎంపిక చేశారు.నరసాపురంలో  ముదునూరి ప్రసాదరాజుకు ఆచంటతో పాటు అదనపు బాద్యతలు అప్పగించారు.ప్రకాశం జిల్లా పార్టీ అద్యక్షుడుగా బాలినేని శ్రీవివాసరెడ్డి నియమితులు అయ్యారు.పార్టీ అదికార ప్రతినిధిగా విజయవాడకు చెందిన పి.గౌతం రెడ్డి,రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన బుర్రా సురేష్ గౌడ్ లను నియమించారు.

వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి

Written By news on Thursday, June 16, 2016 | 6/16/2016


వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్ నియమితులయ్యారు.

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకం తెలుగులో download

చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకం తెలుగులో

‘ప్రకాశం’ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బాలినేని


‘ప్రకాశం’ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బాలినేని
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా


రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా
► రూ.250కోట్లు విడుదల చేయాలి
► వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని
కోరిన ఎంపీ బుట్టా రేణుక


కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్/టిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. బుధవారం ఏపీ సెక్రటేరియట్ లో ఆమెను కలిసి ఆసుపత్రి, కళాశాల సమస్యలపై విన్నవించారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రికి సంబంధించిన వివిధ ఆధునీకరణ పథకాల నిధుల మంజూరు, స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన మందుల సరఫరా.. తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కర్నూలు బోధనాసుపత్రికి రూ.250కోట్లు కేటాయించి రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీఎంఎస్‌ఎస్‌వై ప్రోగ్రామ్ కింద ప్రతిపాదనలను పంపించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎంపీగా తాను ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కర్నూలు మెడికల్ కాలేజి డైమండ్ జూబ్లి ఉత్సవాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం కర్నూలులో రెండు, మూడురోజులు పర్యటించి ఈ విషయాలపై చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు.

అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి


అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి
గూడూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు  రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నామనీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.  వరిగొండ పంచాయతీలో ఎన్‌డీఆర్ అధినేతలు నిర్మించిన రెండు ఆర్వోప్లాంట్లను, ఎంపీ నిధులతో నిర్మించిన ఓ సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే కాకాణి బుధవారం ప్రారంభించారు.

అనంతరం స్థానిక పంచాయతీ కార్యాయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డుకొంటున్నారనీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేక ప్రజ లకు ఏం సమాధానం చెప్పలేక సీఎం, ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.లక్ష కోట్లు అయి నా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటిం చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీలను కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేకపోయారన్నా రు.

ఇంటింటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయో చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పింఛన్లను, ఇళ్లను, ఇతర పథకాలను సొంత పార్టీ కార్యకర్తలకే దోచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గచర్య అన్నారు.  గతంలో ఎమ్మెల్యేలకు ఏడాదికి రూ.కోటి నిధులు మంజూరు అయ్యేవన్నారు.కాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆ నిధులను సై తం నిలిపి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.  ప్రజా సమస్యలను గాలికొదిలి అక్ర మ సంపాదనే ధ్యేయం తో ముందుకు సాగుతున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హ త ఇక ఎంత మాత్రం లేదన్నారు.ఏరోజు ఎ న్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారాన్ని సాధించడం ఖాయమని కాకాణి స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడుమన్నెం చిరంజీవులగౌడ్, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఎంపీటీసీ సభ్యులు కమతం సునీత, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి సుధీర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దిలీప్‌రెడ్డి, మండల కన్వీనర్  పద్మనాభరెడ్డి,ఎన్‌డీఆర్ అధినేతలు ఆదికేశువులరెడ్డి,  అమృతేష్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి,  శ్యామలమ్మ, సురేష్‌రెడ్డి,  రామ్మూర్తి,  సుబ్బారావు, శంకరయ్యగౌడ్, జితేంద్రరెడ్డి, శేషమ్మ పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ గ్రేటర్ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు

Written By news on Wednesday, June 15, 2016 | 6/15/2016


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.శ్యామల, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బత్తుల నాని, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్.రవికుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి.అజీజ్ అహ్మద్, ఐటీ విభాగం అధ్యక్షురాలిగా పట్టా ప్రియ, వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడిగా సుధాకర్ నియమితులయ్యారు.

నియోజకవర్గం కమిటీల వివరాలివీ..
వైఎస్సార్ సీపీ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శులుగా కేఎల్ రమణారెడ్డి, డి. సురేష్ రెడ్డి, కార్యదర్శులుగా వై.పద్మనాభరెడ్డి, ఎం.శివ ప్రసాద్ రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రధాన కార్యదర్శిగా కె. రాజశేఖర్, కార్యదర్శిగా ఎ.హెచ్. రాజేంద్రసింగ్, సంయుక్త కార్యదర్శిగా ఎ. మహేష్, శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా ఇమాం హుస్సేన్, కార్యదర్శులుగా ప్రసాదరెడ్డి, తొర్రం రాజా, సంయుక్త కార్యదర్శులుగా నాగేశ్వరావు, రమణారెడ్డి, నక్కల రవిబాబు, ముషీరాబాద్ ప్రధాన కార్యదర్శి సత్తి సూరిబాబు, కార్యదర్శిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా రామచందర్, మలక్‌పేట్ ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రశేఖర్, షాహిద్ ఖాన్, సనత్‌నగర్ ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ గౌడ్, కార్యదర్శిగా మణిదీప్, చార్మినార్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి శ్రీనివాసరావు, ఎల్‌బీ నగర్ ప్రధాన కార్యదర్శిగా మామిడి రామచందర్, కార్యదర్శిగా అంజుబాబు గౌడ్, సంయుక్త కార్యదర్శిగా సురగంటి సుధాకర్ రెడ్డి, చంద్రాయణగుట్ట కార్యదర్శిగా మాజీద్‌ఖాన్‌లను నియమించారు.

రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి


'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి'
తిరుపతి: రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే నగరంలోని అనేక సమస్యలు పరిష్కారించామన్నారు.

తిరుపతి నుంచి షిర్డికి ప్రత్యేక రైలు వేయించినట్లు వరప్రసాద్ చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నడికుడి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఆయన అన్నారు.

చంద్రబాబే అసలు విలన్: భూమన


చంద్రబాబే అసలు విలన్: భూమన
హైదరాబాద్ : మొదటి రీల్ నుంచి ఆఖరి రీల్ వరకూ చంద్రబాబే నాయుడే అసలు విలన్ అని వైఎస్ఆర్ సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పిల్లనిచ్చిన మామను గద్దెదించి పరలోకానికి పంపింది చంద్రబాబేనన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దాడి చేయడం తప్ప చేసిన అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం లేదన్నారు.
సంకల్ప దీక్ష అన్నది చంద్రబాబుకు లేదని, ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తోందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని భూమన మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రసంగంపై టీడీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 హామీలను అమలు చేయాలని గుర్తు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడమా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు రాజీ పడ్డారన్నారు. ఇక ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఉమ్మడి రాజధానిని వదిలి విజయవాడకు మకాం మార్చారని భూమన ఎద్దేవా చేశారు. బాబు హామీలు నెరవేర్చేవరకూ ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు.
వైఎస్ఆర్ సీపీ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని భూమన సవాల్ విసిరారు. చంద్రబాబు దుష్ట పాలన ఆపేవరకూ వైఎస్ఆర్ సీపీ యుద్ధం చేస్తూనే ఉంటుందన్నారు. బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఉన్మాద రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, రాజధాని భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుకునే దమ్ముందా అని భూమన సవాల్ విసిరారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్ధేశం


గడప గడపకూ వెళ్లండి: వైఎస్ జగన్
జూలై 8 నుంచి గడప గడపకూ వెళ్లండి, మాట్లాడండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్ధేశం

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి, ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి, ఉత్సాహంగా పనిచేసే వారికి మద్దతు ఇస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలవాలనుకునే వారు,  ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు రాజకీయ కుటుంబం నుంచే రావాల్సిన అవసరం లేదు. వారి తండ్రి, మామ ఎమ్మెల్యే అయి ఉండాల్సిన పని లేదు. గత కుటుంబ చరిత్రకు ఉండాల్సిన పనిలేదు. నాయకుడు కావాలనుకున్న వారికి ఒక సీక్రెట్ చెపుతానంటూ... గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమనేదే ఆ సీక్రెట్ అన్నారు.  ‘‘ప్రజలతో మాట్లాడాలి. వారి తో కొంత సమయం వెచ్చించాలి. సాధకబాధకాలు తెలుసుకోవాలి. వీధి, వాడ, డొంక అన్ని సమస్యలపైనా అవగాహనకు రావాలి.

గ్రామాన్ని వదిలే సమయానికి  ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఇందుకు జూలై 8 నుంచి ప్రారంభమయ్యే  గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం పూర్తిగా ఉపయోగపడుతుంది. నాయకునిగా ఎదగడానికి ఇదొక మహత్తర అవకాశం అవుతుంది’’ అని జగన్ విశ్లేషించారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఉత్సాహంగా వచ్చేవారిని తాను స్వాగతిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అధికార టీడీపీ సాగిస్తున్న అవినీతి, అక్రమ పాలన గురించి  గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలకు విపులంగా వివరిస్తే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని విశ్లేషించారు.

తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపమైన ‘యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ’ విధివిధానాలను వివరిస్తూ.. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి, 1,45,549 కోట్లు’ పుస్తకంలో ప్రచురించిన కుంభకోణాల వివరాలను తెలియజెపితే చాలని పార్టీ శ్రేణులు, నాయకులకు జగన్ ఉద్బోధించారు. వాగ్ధానాల వంచనలతో, అధికారానికి చంద్రబాబు వేసిన అడ్డదారి నిచ్చెనలను తెలియజెప్పి... చంద్రబాబు పాసా? ఫెయిలా? ప్రజా బ్యాలెట్ అనే కరపత్రంలోని వంద ప్రశ్నలకు మార్కులు వేయాలని ప్రజలను కోరితే ఆయనకు  సున్నా మార్కులే వస్తాయని గంటాపథంగా చెప్పారు.

 ప్రతి ఇంటికీ వెళ్లండి...: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8 నుంచి ఐదు నెలల పాటు ప్రతి ఇంటికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ వెళ్లాలని జగన్ సూచించారు. ‘ప్రతి ఇంటి వద్ద కనీస సమయమైనా ఉండాలి. ఆ ఇంట్లో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.  వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందాలి. ఒక్కో గ్రామానికి 4, 5 గంటలు వెచ్చించాలి. ఇలా అయిదు నెలల్లో అన్ని  గ్రామాలను చుట్టాలి. అదే సమయంలో గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించాలి. పార్టీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనే వారిని గుర్తించాలి. బూత్ కమిటీని వేయాలి. ఇలా చేస్తే మీరే లీడర్లు అవుతార’ని భరోసాగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రచ్చబండలా చేయవద్దని కోరారు. సీనియర్ శాసనసభ్యుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రెండేళ్లలో రెండు పర్యాయాలు నియోజకవర్గమంతా తిరిగారు. అలా చేసినవారిని ప్రజలు ఎందుకు ఆశీర్వదించరు? వారు ప్రజాప్రతినిధిగా ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ప్రజల ఆప్యాయతలు, ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయన్నారు.

అవినీతి, అక్రమాలతో రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టారు


అవినీతి, అక్రమాలతో  రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టారు
ఎన్నికల హామీలు గాలికొదిలేశారు
ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు
ముద్రగడ పద్మనాభంపై సర్కారు తీరు అమానుషం
కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలి
సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం తీర్మానాలు

 సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడి, రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టి, అవినీతి సామ్రాట్టుగా ఎదిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని ధ్వజమెత్తింది. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని నెరవేర్చాలని ప్రశ్నించినందునే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేయడం, జన్మభూమి కమిటీలతో స్థానిక ప్రజాప్రతిని ధుల అధికారాలను హరించడం వంటి అప్రజాస్వామిక విధానాలపై నిప్పులు చెరిగింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ మంగళవారం విస్తృతస్థాయి సమావేశంలో 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన నేతలు, కార్యకర్తలు కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఇవీ...

► టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి సామ్రాజ్యంగా మార్చింది. ముఖ్యమంత్రి ఇసుక దందాలు, మట్టి అమ్మకాలు, అక్రమ మద్యం వ్యాపారాలు, బొగ్గు కొనుగోలులో అవినీతి, బినామీ భూ కొనుగోళ్లలో కూరుకుపోయారు. రూ.1,45,549 కోట్ల అక్రమార్జనతో సాక్షాత్తు ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టుగా ఎదిగారు.
► ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రధాన హామీలు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యవంటి వాటిని నెరవేర్చకుండా టీడీపీ సర్కారు ప్రజలను దగా చేస్తోంది.
► వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలను గురిచేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుండడం దారుణం. టీడీపీ విధానాలు అప్రజాస్వామికం. టీడీపీ ప్రభుత్వం అధికారం, డబ్బు, కాంట్రాక్టులు వంటి ప్రలోభాలను ఎరవేస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిం చడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అక్రమం.
► ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలకు గండికొడుతూ జన్మభూమి కమిటీల వంటి అప్రజాస్వామిక సమాంతర వ్యవస్థలను ప్రభుత్వం సృష్టించింది. ప్రతిపక్ష శాసనసభ్యులను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. వారిని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోంది.
► ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపించేలా సాక్షి పత్రిక, టీవీ చానల్ ప్రసారాలపై ఆంక్షలు విధించి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం తక్షణమే తన చర్యను ఉపసంహరించుకొని, సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలి.
► రాజధాని నిర్మాణ ప్రక్రియలో ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతోంది. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టింది. భూములను లాక్కోవడం, భవన నిర్మాణాలు, భూ కేటాయింపుల వరకు అన్నింట్లో ఆశ్రీత పక్షపాతంతో వ్యవహరిస్తోంది.
► విభజన ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిం చిన టీడీపీ తదనంతరం ఏపీ ప్రయోజనాల సాధనలో విఫలమైంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, రైల్వే జోన్ వంటి వాటిని సాధించలేక అసమర్థతను చాటుకుంది.
► రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. కాల్‌మనీ పేరుతో మహిళలను వేధించడం, వారిపై అకృత్యాలు, టీడీపీ అవినీతి-అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్న అధికారులపై యథేచ్ఛగా దాడులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై  దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెరిగిపోతున్నాయి.
► ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పెరిగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు, సాగునీరు లేక ఎండుతున్న పంటలు, సరైన మద్దతు ధర లేకపోవడంతో వ్యవసాయ రంగం నానాటికీ దిగజారుతోంది. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడం దారుణం.
► ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి, ఆయన ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తీరును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడాలని సమావేశం ఆకాంక్షించింది. తుని ఘటన నేపథ్యంలో అమాయకులను అరెస్టు చేస్తూ వేధిస్తున్న ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తదుపరి పరిణామాలపై సీబీఐ విచారణకు ఆదేశించి, వాస్తవాలు వెలికితీయాలని పేర్కొంది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే


సున్నా మార్కుల బాబు.. డబ్బుతో గెలవలేవు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా
విజయవాడలో ముగిసిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం

 (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి)

 ‘ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు. 2004 ఎన్నికలకు ముందు తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా పనిచేశావు. ఆ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 46 సీట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. అవినీతి, అక్రమాలతో కూడబెట్టిన నల్లడబ్బుతో ఓటుకు వేలాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయవచ్చనుకుంటున్నావేమో. ప్రజలతో పనిలేదని భావిస్తున్నావేమో. ప్రజల గుండెల్లో, మనసుల్లో  నిలవాలే తప్ప... ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన గెలవలేవు. గుర్తుంచుకో...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.

అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనను ప్రజలు వద్దంటున్నారని, ఆయన పాలనకు వందకు సున్నా మార్కులు వేస్తారన్నారు. సిగ్గు, లజ్జ లేకుండా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు పాలనను ప్రజల సహకారంతో సాగనంపి రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవడానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దిశా నిర్దేశం చేస్తోందన్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ‘ఎ’ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విసృ్తత స్థాయి సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి దశ దిశ నిర్దేంచారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమం అయిదు నెలల పాటు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా వై.ఎస్.జగన్ ప్రసంగం... ఆయన మాటల్లోనే...

 పార్టీ స్థాపించి ఐదేళ్లయింది. ఈ అయిదేళ్లుగా బాధ్యతగలిగిన ప్రతిపక్షంగా, వెనకడుగు వేయకుండా ప్రజల పక్షంగా నిలుస్తున్నాం. ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా జగన్ అండగా ఉంటున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తోంది. ప్రజల ఆశీస్సులతో రెండు నుంచి 18కి నేడు 67 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాలకు పార్టీ ఎదిగింది.

 గెలవడానికి తినని గడ్డి లేదు...
 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చింది 1.30 కోట్ల ఓట్లు. టీడీపీకి వచ్చింది 1.35 కోట్ల ఓట్లు. అంటే తేడా కేవలం 5 లక్షల ఓట్లు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు తినని గడ్డి లేదు. చేయని మోసం లేదు. చెప్పని అబద్దం లేదు. చంద్రబాబుకు ఆ అబద్ధాలు బాగా సహకరించాయి. టీవీల్లో ప్రకటన లు, గోడలపై రాతలు, పేపర్లు... ఒక్కటేంటి అన్నిం టినీ అబద్దాలు చెప్పడానికి ఉపయోగించుకున్నారు.  వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లోని బంగారు ఆభరణాలను బేషరతుగా ఇప్పిస్తామన్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఆ హామీలన్నీ ఇప్పటికీ చెవుల్లో రింగు రింగుమని మారుమోగుతున్నాయి. ఎన్నికలు కాగానే బాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.

 రైతులకు అందని రుణాలు...
 బాబు సీఎం అయ్యే నాటికి రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉండేవి. ఇప్పటికి ఆ రుణాలపై వడ్డీనే రూ.25 వేల కోట్లు అయ్యింది. చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదు. బాబు అబద్దపు మాటలు విని, హామీలు నమ్మినందున రైతులకు ఇప్పుడు వడ్డీలేని రూ.లక్ష రుణం, పావలా వడ్డీ చొప్పున రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరు కావడంలేదు. డ్వాక్రా మహిళలకు గతం లో వడ్డీలేని రుణాలు అందేవి. చంద్రబాబు మోసం చేసినందున రూ.2, రూ.2.50, చక్రవడ్డీలు చెల్లిం చాల్సి వస్తోంది. కానీ రుణమాఫీలు జరిగిపోయాయని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా, లజ్జ అనేది లేకుండా అబద్దాలు చెపుతున్నారు. రుణాలు కట్టొద్దని బాబు చెప్పిన మాటలు నమ్మినందుకు ఇవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14 నుంచి 18 శాతం కడుతున్నారు.

 ఉన్నవీ ఊడుతున్నాయి...
 చదువుకున్న పిల్లలకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలు ఉంటాయో, ఊడిపోతాయో తెలియడంలేదు. ఆదర్శరైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గోపాలమిత్రలు... ఇలా ఉన్న ఉద్యోగా లు ఊడిపోయాయి. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.రెండు వేలు నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. రూ. 2వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే నేనెప్పుడు చెప్పానంటూ ఇప్పుడు దారుణంగా మోసగిస్తున్నారు.

 ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానంటాడేమో...
 చంద్రబాబు గతంలో ఇచ్చిన రైతులకు వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ, బ్యాంకుల్లో బంగారు వస్తువులన్నీ ఇంటికి చేరేలా చేస్తా, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబును ఇప్పుడు ప్రశ్నించకపోతే... రానున్న ఎన్నికల్లో ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి కారు కొనిస్తా... ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యవస్థలో మార్పు రావాలంటే, రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది.

 రూ.600 కోట్లు నీ అత్తగారి సొత్తా?
 రాష్ట్రంలో, దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటాయి. గతంలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశంలు ఉన్నాయి... పట్టపగలు.. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా  ఒక్కో ఎమ్మెల్యేకి రూ.30 కోట్లు చొప్పున 20 మందికి రూ.600 కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు  ఇచ్చి కొనుగోలు చేశారంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదేమైనా నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే ఈ వ్యవస్థను చూసి బాధేస్తుంది. పట్టపగలు అడ్డగోలుగా తెలంగాణలోనూ ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులలో డబ్బుతో సహా అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అనడానికి సిగ్గుపడాలి.  ఒక ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ర్టంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలి.  ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు. ప్రజలతో పనిలేదు. ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు. అవినీతి విచ్చలవిడిగా చేస్తా.. ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలు చేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారు.

 చంద్రబాబుకు ప్రజలతో పనిలేదు...
 ప్రజాస్వామ్యంతో, ప్రజలతో చంద్రబాబుకు పనిలేదు. ఆయన రూ.1000, 2000, 3000, 4000 చొప్పున ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తానని అనుకుంటాడు. కానీ ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు ఎంత డబ్బులున్నా ఏమీ పనిచేయవు. 2004 ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. అప్పుడు సాక్షి పత్రిక కూడా లేదు.  ప్రజల గుండెల్లో, మనసులో నిలవకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎన్నికల్లో గెలవరు. 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్‌ఆర్ వచ్చారు. పాదయాత్ర చేశారు. నాడు 2004లో ఎన్నికలు అయ్యేనాటికి టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలా చోట్ల ఆ పార్టీ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చు చేస్తే నువ్వు గెలవవు అని సలహా ఇస్తున్నా....

 ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి?
 కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశాం. ఇదే చంద్రబాబును అడుగుతున్నా. ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి? నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహార దీక్ష చేస్తే ఆ వ్యక్తిని ఇలా శిక్షించడం సరైందేనా? తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగ కేసులు పెట్టాల్సిందేననే నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు.  పోలీస్ టైజాన్ని చూస్తున్నాం. పోలీసువారూ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇవాళ అధికారం చంద్రబాబుది కావచ్చు. కానీ అది ఎల్లకాలం ఉండదు. జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదు. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించండి. అధికారం ఎల్లకాలం ఒకరిది కాదు. మనం ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నాం. వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నా.

 మోదీకి అల్టిమేటమ్ ఇవ్వలేరు...కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేరు...
 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన ప్రత్యేకహోదా కోసం ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు గట్టిగా అడగలేరు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తన పార్టీకి చెందిన మంత్రులను కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటానని అల్టిమేటమ్ ఇవ్వలేరు. అందుకు కారణం తన రెండేళ్ల పాలనలో ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి, 1,45,549 కోట్లు’ పుస్తకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని చూపుతూ... ఈ పుస్తకం ప్రధాని మోదీకి అందించాం. చంద్రబాబు ఏదైనా  మాట్లాడితే కేంద్రం సీబీఐ ద్వారా విచారణకు ఆదేశిస్తే తన అవినీతి బండారమంతా బట్టబయలై కటకటాల పాలవుతామనే భయం చంద్రబాబుకు ఉంది. అందువల్లే చంద్రబాబు ప్రధాని వద్ద ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగేలా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నా కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పలేకపోతున్నారు. ఇందుకు ఓటుకు కోట్లు కేసు కారణం. ఒకవేళ మాట్లాడితే ఆ కేసు ద్వారా కటకటాల్లోకి పంపుతారనే భయం ఉంది.

 వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంజాద్ బాషా, పి.రాజన్నదొర, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ప్రసంగించారు. గడప గడపకు వైఎస్సార్‌సీపీ అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాదరావు, ప్రత్యేక హోదాపై ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, రాజధాని భూ కుంభకోణంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ ఫిరాయింపులపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజ్యంగ వ్యతిరేక చర్యలపై ఉప్పులేటి కల్పన, అవినితిపై అంబటి రాంబాబు, నదీ జలాలపై పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొలుసు పార్థసారథి, వ్యవసాయ రంగంపై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.

 13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే

 ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్దాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తిని విలన్ అంటాం. విలన్ క్యారెక్టర్ వేసే రాజనాల వంటివారిని చూస్తే చంద్రబాబే గుర్తుకొస్తారు. సినిమాల్లో సాధారణంగా 14 రీళ్లు ఉంటాయి. 13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయిగా ఉంటుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా, అబద్దాలు ఆడినా ఎంత అన్యాయం చేసినా ఆయనదే పైచేయిగా కనిపిస్తుంది. కానీ 14వ రీల్‌కు వచ్చే సరికి కథ క్లైమాక్స్‌లో హీరో తిరగబడతారు. ప్రజలు తోడుగా నిలుస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. హీరో విలన్‌ను వీరబాదుడు బాదుతాడు. చివరకు విలన్ శిక్ష అనుభవిస్తాడు. ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది. జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుంది. చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఈ వ్యవస్థ బాగుపడుతుందా అని అడుగుతున్నా...

 మాట తప్పితే ఎవరికైనా చెప్పులు.. చీపుర్లే.. గతి
 రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుంది. నాయకులు మోసగిస్తే ప్రజలు చెప్పులు, చీపుర్లు చూపిస్తామనే స్థాయికి రావాలి. ఇది రాజకీయ నాయకులందరికీ వర్తించాలి. అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండి.  ఈ చాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది. ఫలానావాడు మా నాయకుడని కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలి. మనమంతా కలసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యమవుతుంది.

దీక్షకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు


కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లండి
వైఎస్ జగన్‌కు కాపు సంఘం నేతల విజ్ఞప్తి

 సాక్షి, విజయవాడ: ‘కాపు ఉద్యమాన్ని మీకున్న విస్తృత రాజకీయ పరిచయాలతో జాతీయ స్థాయికి తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించండి..’ అని కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, కాపు సంఘం నేతలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కొద్దిసేపు సమస్యలపై చర్చించారు. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆరు రోజులుగా ముద్రగడ కుటుంబం ఆమరణదీక్ష చేస్తున్న క్రమంలో ఉద్యమం ఉద్ధృతమైందని, దీనికి రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీలతో పాటు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను సమాయత్తం చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ కాపులకు ఇప్పటికే మద్దతు తెలిపి సహకరించానని చెప్పారు. కాపునాడు నేత గోళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటికే కాపు ఉద్యమం తీవ్రమైందని, కాపుల కోసం జగన్ ఒకరోజు దీక్ష చేసి సంఘీభావం ప్రకటించాలని కోరారు.

విజయవాడలో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురుతూ ఉంటుంది

Written By news on Tuesday, June 14, 2016 | 6/14/2016


నువ్వు సీఎంవా.. సిగ్గు, శరం ఉన్నాయా?
విజయవాడ :
తన తండ్రి వంగవీటి మోహన రంగా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఫొటోలతో కట్టించిన బ్యానర్లను కూడా ముఖ్యమంత్రి తీయించేశారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. నువ్వొక నాయకుడివి, నువ్వొక ముఖ్యమంత్రివా.. సిగ్గు, శరం ఉన్నాయా అని నిలదీశారు. విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము బతికినంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతామన్నారు. ముఖ్యమంత్రి ఎంత బెదిరించినా లొంగేది మాత్రం లేదన్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. డివైడర్లు పగలగొడతారు, మళ్లీ కట్టిస్తారని.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియదని అన్నారు.

తన తండ్రిని చంపించినవాళ్లతో బ్యానర్లు కట్టించుకుంటున్నారని విమర్శించారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురుతూ ఉంటుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎవరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తామని చెప్పారు. ఒకవైపు కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే, పనికిమాలిన వాళ్లతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. సాక్షి టీవీ చానల్ ఆపారు గానీ సోషల్ మీడియాను ఆపగలరా, ఎదురుతిరిగితే మీ పరిస్థితి ఏంటని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. తమది నిజంగా ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.

ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన


నాయకులు కావాలంటే ఇదే సీక్రెట్
► నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లండి
► వారి యోగక్షేమాలు కనుక్కోండి
► చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో చూడండి
► పనిలో పనిగా బూత్ కమిటీలు కూడా నియమించండి
► ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన
► ఐదేళ్లుగా అలుపులేని పోరాటం
► అడుగడుగునా అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు
► చంద్రబాబుకు, మనకు ఓట్ల తేడా 5 లక్షలే
► 13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి గానీ.. 14వ రీల్‌లో హీరో రివర్స్ అవుతాడు
► నాయకులు మోసాలు చేస్తే చెప్పులు, చీపుర్లు చూపించండి
► వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదు
► ముద్రగడ పద్మనాభం దీక్షకు పూర్తి సంఘీభావం
► విజయవాడలో ఘనంగా ముగిసిన వైఎస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
విజయవాడ
నాయకులు కావాలంటే తండ్రులో.. తాతలో ఎమ్మెల్యేలు కావాల్సి అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాయకులు కావాలంటే తాను ఒక సీక్రెట్ చెబుతానన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికీ వెళ్లాలని.. 'గడప గడపకూ వైఎస్ఆర్' అనే ఈ కార్యక్రమాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి అయిన
జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఈరోజు వివిధ జిల్లాల నుంచి విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు అందరికీ..  ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ.. అడుగులో అడుగు వేసి తోడుగా ఉన్నామని చెప్పినందుకు అందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాం
  • మన పార్టీ స్థాపించి ఐదు సంవత్సరాలు అయింది
  • ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే వస్తున్నాం
  • ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అధ్యక్షుడిగా నేను స్పందిస్తూనే ఉన్నా
  • పార్టీపరంగా కూడా ఎవరూ వెనకడుగు వేయకుండా ప్రజలకు అండగా ఉన్నా
  • ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆయన పోయాడో పోలేదో గానీ, ఎవరికి ఏసమస్య వచ్చినా జగన్ వారికి అండగా ఉన్నాడు
  • ఐదేళ్లు ఇదే పోరాటం చేశాం, అంచెలంచెలుగా పార్టీ ఎదిగింది
  • తొలుత అమ్మ, నేను ఇద్దరమే గెలిచాం. తర్వాత 18 మందికి వెళ్లాం, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో బలోపేతం అయ్యాం.
  • రాష్ట్రంలో 1.30కోట్ల మంది మనకు అండగా నిలిచారు.
  • మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చినవి 1.35 కోట్లయితే, మనకు వచ్చినవి 1.30 కోట్ల ఓట్లు.. వారికి, మనకు మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే
  • ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి, ఆయన తినని గడ్డి లేదు, చేయని మోసం లేదు, చెప్పని అబద్ధం లేదు
  • చంద్రబాబు సీఎం అయితే అయ్యారు గానీ, అందుకు ఆయన చెప్పిన అబద్ధాలే సహకరించాయి
  • ఏ మీటింగులోనూ ఆయన రైతులను వదిలిపెట్టలేదు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను మోసం చేశారు
  • ఫ్లెక్సీలకు లైట్లు పెట్టించి మరీ చదువుకునే పిల్లలనూ మోసం చేశారు
  • ఖాళీ గోడలు కనపడితే చాలు.. వాటిమీద రాతలు రాశారు
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
  • ఇంటికి వెళ్లి టీవీ చూస్తే.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, లేకపోతే ఇంటింటికీ 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
  • సీఎం అయిన నెలలోనే రైతు రుణాలన్నీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానన్నారు
  • డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీకావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు మన చెవుల్లో ఈనాటికీ రింగురింగున మోగుతూనే ఉన్నాయి
  • బాబు సీఎం అయ్యాడు.. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రజలకు మాత్రం వెన్నుపోటు పొడిచాడు
  • బాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87 వేల కోట్లు ఉండేవి
  • అంతవరకు లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పావలా వడ్డీకే వచ్చేది
  • అవి కట్టొద్దని ఆయన చెప్పిన పాపానికి.. ఈవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14-18 శాతం వడ్డీ కడుతున్నారు
  • ఈ రెండేళ్లలో 87 వేల కోట్ల రైతు రుణాల మీద వడ్డీ రూపేణా 25వేల కోట్లు చెల్లించారు
  • చంద్రబాబు రుణమాఫీ చేసింది వడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదు
  • అదే రుణమాఫీ అని, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తున్నారు
  • డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అంతకుముందు వడ్డీలేని రుణం వచ్చేది
  • వాళ్లు రుణాలు కట్టని కారణంగా బ్యాంకులకు పోతే 2- 2.50 చొప్పున వడ్డీలు వసూలు చేస్తున్నారు
  • చదువుకున్న పిల్లల పరిస్థితి మరీ దారుణం
  • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనేవారు
  • ఉన్న ఉద్యోగాలు రేపు పొద్దున్న ఉంటాయో లేవో తెలియని దుస్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులున్నారు
  • రోజుకో ఉద్యోగం ఊడుతోంది. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే వెళ్లిపోయారు
  • గోపాలమిత్రలు ధర్నాలు చేస్తున్నారు
  • 2 వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే.. నేనెప్పుడు చెప్పానంటున్నారు

13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి కానీ...
  • ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తిని విలన్ అంటాం
  • ఆ రోజుల్లో అయితే రాజనాల లాంటి వాళ్లు, చంద్రబాబు వయసుకు తగ్గవాళ్లు కనిపిస్తే ఈయనే గుర్తుకొస్తారు
  • సినిమా 14 రీళ్లుంటే 13 రీళ్లు విలన్‌దే పైచేయిగా కనిపిస్తుంది ఆయన ఎన్ని మోసాలు చేసినా, అబద్ధాలు ఆడినా, ఎంత అన్యాయం చేసినా ఆయనదే పైచేయిగా కనిపిస్తుంది
  • కానీ 14వ రీలు వచ్చేసరికి కథ క్లైమాక్స్‌కు వస్తుంది
  • అక్కడ హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు
  • హీరో విలన్‌ను వీరబాదుడు బాదుతాడు
  • 14వ రీలు అయ్యేసరికి విలన్‌కు తగిన శిక్ష పడుతుంది
  • ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది, జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుంది
  • చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్నవ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే.. ప్రజలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా అని అడుగుతున్నా
చెప్పులు, చీపుర్లు చూపించండి
  • రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుంది
  • నాయకులు మోసాలు చెబితే, అబద్ధాలు చెబితే చెప్పులు, చీపుర్లు చూపిస్తామని గట్టిగా నిలదీస్తే ఈ వ్యవస్థ మారుతుంది
  • ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే.. రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది
  • అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండి..
  • ఫలానా వాడు మా నాయకుడని కార్యకర్తుల కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలి
  • మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యం
  • రేపు ఇదే చంద్రబాబు ఈసారికి రైతుల రుణాల మాఫీ మాత్రమే చెప్పాడు, బ్యాంకుల్లో బంగారం మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు
  • రేపు ఎన్నికలకు చంద్రబాబు ఏమంటాడో తెలుసా.. ప్రతి ఇంటికీ కారు కొనిస్తానంటాడు, ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానంటాడు
  • వ్యవస్థలో మార్పు రావాలంటే, రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి
  • అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది
  • ఇన్ని రోజులూ రాజకీయాలు చూశాం. ప్రతి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఉంటాయి
  • మన రాష్ట్రంలోనూ అది కొత్తేమీ కాదు. కాంగ్రెస్, టీడీపీ ఉండేవి
  • ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల డబ్బు, మంత్రి పదవి ఎర, కాంట్రాక్టుల మోజు చూపించి పశువుల్లా కొనే పరిస్థితి ఎక్కడైనా ఉందా
  • ఇది నిజంగా ఆశ్చర్చమే
  • పట్టపగలు ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా.. 20 మందికి ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున దాదాపు 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారు
  • ఇంత డబ్బు నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే వ్యవస్థను చూసి బాధ అనిపిస్తుంది.
  • పట్టపగలు, అడ్డగోలుగా తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తూ అక్కడ సూట్ కేసుల్లో డబ్బులిస్తూ. .. డబ్బుతో సహా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అనడానికి సిగ్గుపడాలి
  • ఒక ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలి
  • ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు
  • ప్రజలతో పనిలేదు, ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు, అవినీతి విచ్చలవిడిగా చేస్తా, ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలుచేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారు
చంద్రబాబుకు ఓ సలహా ఇస్తున్నా..
  • చంద్రబాబు కు ఓ సలహా.. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు
  • 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్ఆర్ వచ్చారు.. పాదయాత్ర చేశారు.
  • నాడు 2004లో ఎన్నికలు అయ్యేనాటికి టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలాచోట్ల ఆ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు
  • ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చుచేస్తే నువ్వు గెలవవు అని సలహా ఇస్తున్నా
  • చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు ఎంతటి దారుణంగా ఉన్నాయో మనమంతా చూస్తున్నాం
ముద్రగడ చేసిన తప్పేంటి..
  • కొద్దిరోజుల క్రితం చూశాం.. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే, ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశాం
  • ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి
  • నువ్వు  ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహార దీక్ష చేస్తే.. ఆ వ్యక్తిని ఇలా శిక్షించడం సరైనదేనా
  • తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగకేసులు పెట్టాల్సిందే
  • నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు
  • పోలీస్ టెర్రరిజాన్ని చూస్తున్నాం
  • పోలీసువారూ, ఈవాళ అధికారం చంద్రబాబుది కావచ్చు కానీ అది ఎల్లకాలం ఉండదు
  • జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదు
  • మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించండి
  • అధికారం ఎల్లకాలం ఒకరిది కాదు
  • మనం ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నాం.. వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నా



గడప గడపకూ వైఎస్ఆర్
  • గడపగడపకూ వైఎస్ఆర్ అన్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం పలుకుతున్నా
  • రాజకీయాలలో చాలాచోట్ల ఎమ్మెల్యేలు కావాలని, పైకి రావాలని చాలామంది అనుకుంటారు
  • ఉత్సాహవంతులుంటారు... ఆ ఉత్సాహాన్ని నేను సపోర్ట్ చేస్తా
  • రాజకీయాలలో గెలవడానికి ఒక సీక్రెట్ చెబుతా
  • వాళ్ల వెనక పెద్దపెద్ద ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు, వారసత్వం అసలే అక్కర్లేదు
  • గెలవాలంటే గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టాలి
  • ఈ కరపత్రం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశావహులకు, సమన్వయకర్తలకు ఇస్తాం
  • చంద్రబాబు చేసిన అన్యాయాలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఏం చెప్పాడో ఇందులో కోట్ చేశాం
  • రాజకీయ వ్యవస్థ మార్పులకు నాంది పలకాలన్న నా మాటలున్నాయి
  • వంద ప్రశ్నలు ఇచ్చి, చంద్రబాబుకు మార్కులు వేయాలని కోరుతున్నాం
  • మీరు ప్రజల వద్దకు వెళ్లి.. ప్రతి ఇంటికీ వెళ్లి మన ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ప్రతి ఇంటికీ వెళ్లండి
  • ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లూ తిరగండి
  • ఈ పాంప్లెట్ పంచి, ప్రజలచేత చంద్రబాబుకు మార్కులు వేయించండి
  • వాళ్లు మార్కులు వేయడం మొదలుపెడితే వందకు ఆయనకు వచ్చే మార్కులు సున్నా అని తెలిస్తే ప్రజలే ఆయనను బంగాళాఖాతంలో కలుపుతారు
  • సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు నిమిషాలు గడపండి
  • వాళ్ల ఆశీస్సులు తీసుకోండి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి
  • ప్రతి కోఆర్డినేటర్ ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు గ్రామంలో ప్రతి ఇల్లూ తిరిగితే గ్రామం మీద అవగాహన వస్తుంది
  • ఎవరు మన పార్టీతో పాటు నడుస్తున్నారు, ఎవరు ఉత్సాహంగా మనతో ఉన్నారన్నది అర్థం అవుతుంది
  • అప్పుడు ఆ గ్రామం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి బూత్ కమిటీ నియమించండి
  • మీతోపాటు ఉత్సాహంగా నడిచిన వ్యక్తులను ఆ కమిటీలలో నియమించండి
  • రోజుకు చేయవలసింది కేవలం ఒక పంచాయతీ.. నాలుగు గంటలు కష్టపడండి
  • సాయంత్రం పూట ప్రజలంతా ఇళ్లలో ఉన్నారనుకున్నప్పుడు వెళ్లండి
  • ఐదు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు మీరు తిరిగినట్లు అవుతుంది
  • మీ వెనక ఎవరూ ఉండాల్సిన పనిలేదు.. ఈ ఐదు నెలల తర్వాత మీరే లీడర్ అవ్వకపోతే నన్నడగండి
  • రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడూ ఓడలేదు
  • ఇప్పటికే ఆయన రెండుసార్లు తిరిగేశారు.. ఇలా ప్రజలతో మమేకం అయిపోతే ఏ ఎమ్మెల్యే ఎప్పటికీ ఓడిపోరు
  • ఈ కార్యక్రమం నిజంగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు
  • తమకు మేలు చేస్తారని నమ్మకం ఉన్న నాయకులకే ప్రజలు ఓట్లు వేస్తారు
  • ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పడతాయి
  • పాంప్లెట్‌లో కో-ఆర్డినేటర్ ఫొటో పెట్టుకునేదానికి కూడా స్థలం ఉంది
  • నియోజకవర్గ సమస్యలపై మీరు ఏమైనా పాంప్లెట్ వేస్తే అది కూడా వేసి తీసుకెళ్లండి
  • జూలై 8న వైఎస్ఆర్ జయంతి.. ఆరోజునే గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి
  • తిరిగామంటే తిరిగాం అన్నది కాదు.. ప్రతి ఇంటికీ క్వాలిటీ టైమ్ ఇవ్వాలి
  • గ్రామంలో అందరినీ ఒక చోటుకు రప్పించి మాట్లాడి వెళ్లిపోతే జరిగేది నష్టమే
  • ఇళ్లకు వెళ్తే వాళ్ల ఆశీస్సులు మనకు లభిస్తాయి
  • ఆ ఊళ్లో, ఆ సందులో ఏ సమస్య ఉందన్న విషయం కూడా పూర్తిగా అవగాహన అవుతుంది
  • రెండేళ్లలో చంద్రబాబు చేసిన దోపిడీ ఎంత దారుణంగా ఉందో పుస్తకాలు వేశాం
  • ఈ పుస్తకంలో ప్రతి అంశం కార్యకర్తలందరికీ తెలియాలి
  • ఇంతకుముందు నాయకులు పలు అంశాలమీద మాట్లాడారు, తీర్మానాలు చేశారు
  • బాధ కలిగించే అంశాలు రెండు మూడున్నాయి
  • రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను మంటగలిపారు
  • తన మంత్రులు కేంద్రంలో ఉన్నా.. వాళ్లను ఉపసంహరించే పరిస్థితి లేదు
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వారిని ఉపసంహరించుకుంటా అనే దమ్ము, ధైర్యం లేవు
  • ఎందుకంటే కారణం.. ఈ పుస్తకం. ఇందులోని అంశాలన్నింటిపై సీబీఐ విచారణ వేసి, మోదీ గారు జైల్లో పెడతారేమోనని భయం
  • కృష్ణా, గోదావరి నదుల మీద కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే పరిస్థితి లేదు
  • దానికి కారణం కూడా మళ్లీ ఈ పుస్తకమే
  • మన పోరాటంలో చంద్రబాబు చేతకానితనం, మోసాలు అన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలి
  • ప్రజలకు అండగా ఉండాలని సవినయంగా అందరినీ కోరుకుంటున్నా
  • దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
ముద్రగడ దీక్షకు సంఘీభావంగానే...
  • కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం
  • నా పోలవరం పర్యటన ఆ కార్యక్రమాన్ని డీవియేట్ చేయకూడదని వాయిదా వేస్తున్నాం
  • జూలై మొదటివారంలో అక్కడకు తప్పనిసరిగా వస్తానని చెబుతున్నా
  • ఇప్పుడు రాలేకపోతున్నందుకు హృదయపూర్వకంగా క్షమించాలని కోరుతున్నాం

Popular Posts

Topics :