19 June 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కోడెలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం:అంబటి

Written By news on Saturday, June 25, 2016 | 6/25/2016


నరసరావుపేట: గత ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ఎన్నికల కమిషన్ సుమోటోగా అతనిపై ఒకటీ రెండురోజుల్లో చర్యలు తీసుకోకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని వేచిచూస్తున్నాం. మరో రెండు రోజులు చూస్తాం. సుమోటోగా తీసుకొని విచారించకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటికీ చర్యలు చేపట్టకపోతే  న్యాయపరంగా వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టానన్న తర్వాత కూడా శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా పనికి వస్తారా అనే విషయం ప్రజలు గమనించాలన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

YS Jagan playing chess





జేబు సంస్థల కోసమే స్విస్ చాలెంజ్..


జేబు సంస్థల కోసమే స్విస్ చాలెంజ్..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి

 విజయవాడ (గాంధీనగర్): తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నారని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశంగా చంద్రబాబు భావించడం లేదు.

  కేవలం లక్షల కోట్లు దోచుకోవడం కోసం, తన మునిమనవడి వరకు కావల్సిన డబ్బు సమకూర్చుకోవడం, తన పార్టీ నేతలఅక్రమ సంపాదనే లక్ష్యంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు కనబడుతోంది’ అని పార్థసారథి విమర్శించారు. ఈ విధానంలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ తేల్చిచెప్పిందన్నారు, అయినా   ఎందుకు అనుసరిస్తున్నారో చెప్పాలన్నారు.

బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమేనా!


బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమేనా!
కేసీఆర్‌పై వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం   

 సాక్షి, హైదరాబాద్:బంగారు తెలంగాణ అంటే ఇష్టానుసారంగా విద్యుత్, బస్సు చార్జీలు పెంచడమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ అద్భుతాలే జరుగుతాయని కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కనుచూపు మేరలో ఏ ఎన్నికలూ లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. తండ్రి, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రోజుకో అంకె పెంచుతూ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందని చెబుతున్నారన్నారు. రెండేళ్ల పాలన విజయోత్సవాలు,పూర్తి కాని సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి రూ.300 కోట్లు ఖర్చు చేయటానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయన్నారు. ‘సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన చార్జీలు భారమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి’ అని కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.

 నేడు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా...
 ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ భారీ నిరసన ప్రదర్శన, ధర్నా చేపడుతున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

పోలీసులను టీడీపీ గూండా వ్యవస్థగా మార్చారు


వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి
ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి
దిశానిర్దేశం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
 రామచంద్రపురం: రాష్ట్రంలో పోలీసులను టీడీపీ గూండా వ్యవస్థగా మార్చేశారని, చంద్రబాబునాయుడు పాలనను అంతమొందించేందుకు ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో పార్టీ పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల వద్ద ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించి ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోసు మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచేశాడన్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. రాష్ట్రంలో దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. తాను పార్టీ మారిపోతున్నానంటూ అధికారపారీవారు దుష్ర్పచారం చేశారని రంపచోడవ రం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. తాను పార్టీ మారితే  పదవులు, రూ.కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్న తీరును ఇంటిటికీ వెళ్లి ప్రజలకు తెలిపి వారి మద్దతు కూడగట్టాలని మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ప్రసంగం కార్యకర్తలను ఉర్రూతలూగించింది. రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ సెల్, వైద్య విభాగం అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, యనమదల మురళీకృష్ణ, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ప్రసంగించారు.

రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా,  రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, మండపేట, రాజమండ్రి నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు  వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, ఆకుల వీర్రాజు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి మానే దొరబాబు, నాయకులు శిరిపురపు శ్రీనివాసరావు, సుంకర చిన్ని, కుడుపూడి బాబు, గిరిజాల బాబు, మైనార్టీ సెల్ నాయకులు నయీంభాయ్, యనమదల గీత తదితరులు పాల్గొన్నారు.

సగం ధరకే కొట్టేయడానికి పథకం

Written By news on Friday, June 24, 2016 | 6/24/2016


ఎంపీ గల్లా చౌక బేరంవేలం వేయబోతున్న ఇల్లు (ఇన్ సెట్) జయదేవ్
అద్దెకున్న భవనంపై కన్నేసిన జయదేవ్
సగం ధరకే కొట్టేయడానికి పథకం
ఎంపీకి సహకరించిన బ్యాంకు డీజీఎం?
రూ.7.5 కోట్ల భవనం ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయం
డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలూ బుట్టదాఖలు
నేడు 11-12 గంటల మధ్య వేలం
ఆసక్తి చూపిన వారికి ఎంపీ అనుచరుల బెదిరింపులు


సాక్షి ప్రతినిధి, అమరావతి: 50 శాతం డిస్కౌంట్ అని దుస్తుల దుకాణం ముందు బోర్డు పెడితేనే కొనడానికి క్యూ కట్టే కాలమిది. అలాంటి ప్రైమ్ ఏరియాలో భవనాన్ని సగానికి సగం ధరకే గుంటూరు నగరంలో బ్యాంకు వేలం వేస్తామంటే.. పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ అద్దెకున్న భవనాన్ని చౌకగా కొట్టేయడానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారు. బ్యాంకు అధికారుల సహకారంతో వేలానికి పోటీ లేకుండా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...

గుంటుపల్లి శ్రీనివాసరావు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో... బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనం వేలానికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈమేరకు.. ప్రస్తుతం రూ.7.5 కోట్లు మార్కెట్ విలువున్న భవనం ప్రారంభ ధర రూ. 2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది.

ఆసక్తి చూపినవారికి బెదిరింపులు
తన భవనాన్ని వేలం వేయడాన్ని శ్రీనివాసరావు ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తూ 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది.

వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు భవనాన్ని సందర్శించడానికి ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించింది. అయితే భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని... ‘అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?’ అని బెదిరించడంతో పోటీకి రాకుండా తప్పుకున్నారు. స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా.. గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్‌వర్డ్‌ను చెప్పలేదు. పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

యథేచ్ఛగా నిబంధల ఉల్లంఘన
రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ... భవనంలో నివాసం ఉంటున్న ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఖాళీ చేయలేదు. బ్యాంకుకు తనఖా పెట్టినట్లు ఎక్కడా రాయనూ లేదు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా... అవన్నీ ఇంటి యజమాని అడగాలి, మీరడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ప్రారంభ ధరపై సమాధానం దాటవేశారు. 
http://www.sakshi.com/news/district/galla-jayadev-eye-on-rent-building-in-guntur-city-355007

నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి


నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి
►  వాటాల కోసం అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిడి
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి


నెల్లూరు(సెంట్రల్):  నీరు-చెట్టు పథకంలో అధికార పార్టీ నాయకులు మితిమీరిన అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరు చెట్టు పథకం  టీడీపీ నాయకుల ఇళ్లలో అవినీతి చెట్టుగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి పనిలో టీడీపీ నేతలు వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి పనికీ అధికారులపై వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నారన్నారు. మామూళ్లు ఇవ్వని అధికారులను ఏసీబీకి పట్టిం చడం వంటి పనులకు కూడా టీడీపీ నాయకులు పూనుకునే స్థాయికి చేరుకున్నారన్నారు.

నీటి సంఘాల ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలకు పాల్పడి వైఎస్సార్‌సీపీ ఉన్న చోట కూడా బలవంతంగా టీడీపీ నాయకులనే నీటి సంఘాల అధ్యక్షులుగా నియమించారని ఆరోపించారు. వారిని అడ్డంపెట్టుకుని నీరు చెట్టు పథకంలోని ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి పాల్పడుతున్నారన్నారు. కండలేరు, నెల్లూరులోని భూగర్భడ్రెయినేజీ  తదితర పనులను సొంత కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు.

సంగం బ్యారేజీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల పరిశీలించినా ఏ మాత్రం మార్పు లేదన్నారు. ఈ పనుల విషయలో అంచనాలు పెంచి కమీషన్ల కో సం కక్కుర్తి పడుతున్నారన్నారు. కొన్ని శా ఖల అధికారుల వద్ద బలవంతంగా మా మూళ్లు తీసుకుంటూ వారిచేత అవినీతి చేయించడం నిజం కాదా అని ప్రశ్నిం చారు.  జిల్లా యువత విభాగం అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, బీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, శివప్రసాద్, చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి విష్టువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

పెదబాబు డైరెక్షన్‌లో చినబాబు యాక్షన్


సాగునీటిలో అవినీతి సునామీ!
అధికారులపై కీలకమంత్రి వత్తిళ్లు
అదనపు చెల్లింపులు.. అందులో వాటాలు..
నాలుగు ప్రాజెక్టుల్లో రూ. 748 కోట్ల లూటీ

ఏవో కుంటిసాకులు చూపించడం..  జరుగుతున్న పనులను ఆపేయడం..  కాంట్రాక్టులు రద్దు చేయడం..  ఆ తర్వాత అవే కాంట్రాక్టు పనుల అంచనా  వ్యయాన్ని అమాంతం పెంచేయడం..  ఆ కాంట్రాక్టులను సొంత మనుషులకు కట్టబెట్టడం..  యథేచ్ఛగా ప్రజా ధనాన్ని లూటీ చేయడం...  ఇదీ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి.

పెదబాబు డైరెక్షన్‌లో, చినబాబు నాయకత్వంలో... కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ ఎంపీలు, బినామీ కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వాటాలు పంచుకు తింటున్నారు. ఇరిగేషన్‌లో అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పెదబాబు, చినబాబు, వీరికి తోడైన మంత్రి అవినీతి లీలలకు సాగునీటి శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. అవినీతి కోసం వేసిన
 సరికొత్త బాటలు చూసి అవాక్కవుతున్నారు. ఇరిగేషన్‌లో ‘బాబు’ల అవినీతి వ్యవహారాలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రూ. 748 కోట్లు లూటీ చేసిన ఓ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిద్దాం..

 
‘ఘోర’కల్లులో రూ.350 కోట్లు
ఓ ప్రాజెక్టు పనులు  92 శాతం పూర్తయ్యాయి. బిల్లులూ చెల్లించేశారు. మిగిలిన 8 శాతం పనులకు ఎంత ఖర్చవుతుంది? ఖర్చులు పెరిగాయనుకున్నా ఎంత ఉండవచ్చు. మహా అయితే మిగిలిన బిల్లు రెట్టింపు.. కానీ 92 శాతం పనులకు ఎంత చెల్లించారో మిగిలిన 8 శాతం పనులకు అంత చెల్లించబోతున్నారు. ఆ మేరకు అంచనా వ్యయం పెంచేసి పంచుకోబోతున్నారు. ఆ కథేమిటో చూద్దామా...
 
 
ప్రాజెక్టు వివరాలివీ:  గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్‌ఆర్‌బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్‌ఆర్‌బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి.. రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్‌లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది.
 
అవినీతి స్కెచ్ ఇలా
గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ.350 కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్’ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్‌ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు.
 
పులిచింతలలో రూ. 300 కోట్లు
ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంట్రాక్టరే జాప్యం చేశాడు. ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా చెల్లించాలన్నాడు. జిల్లా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు చెప్పినదానికన్నా ఇంకా అదనంగా తనకు డబ్బురావాల్సి ఉందని కాంట్రాక్టరు వాదిస్తున్నాడు. పై న్యాయస్థానానికి వెళ్లి ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన రాష్ర్టప్రభుత్వం కాంట్రాక్టరుకు అదనంగా చెల్లించడానికి సిద్ధమౌతోంది.
 
ఇదీ ప్రాజెక్టు
కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన.. ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది.
 
భారీ దోపిడీకి స్కెచ్ ఇలా
పెదబాబు  వ్యూహం మేరకు .. 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున హైకోర్టును ఆశ్రయించాల్సిన మంత్రి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టరుకు మాత్రం అదనంగా చెల్లించడానికి ఉత్సాహపడుతోంది. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. పులిచింతల కాంట్రాక్టర్‌తో ఆది నుంచి ఉన్న సంబంధాలు.. పెదబాబు డెరైక్షన్‌లో వాటాలు పంచుకోవడానికి ఒప్పందం కుదరడం వల్లే మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో ధృవీకరించడం గమనార్హం.
 
హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు
నచ్చినవారి కోసం ‘జరుగుతున్న పనులు’ రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచి నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. మూడొంతుల పనులకు బిల్లులూ చెల్లించేశారు. ఈ దశలో ఆ కాంట్రాక్టరును తప్పించి మరో బినామీ కాంట్రాక్టరును తెరపైకి తెచ్చారు. ఒక వంతు పనికి గాను ప్రాజెక్టు వ్యయానికన్నా రెట్టింపునకు పెంచేశారు. పెంచిన మొత్తాన్ని పంచుకోవడానికి పథకమేశారు. అదేమిటో మీరే చూడండి...
 
ప్రాజెక్టు వివరాలివీ
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ కడపజిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఏకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత చేజిక్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ.. 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు.
 
దోపిడీకి స్కెచ్ ఇలా
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి.. నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా ‘నామినేషన్’పై అప్పగించేశారు.రూ.పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. అంటే.. సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారన్నమాట. ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను మాత్రమే చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ.16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్పగించి..దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట.
 
అవుకులో రూ.44 కోట్ల లూటీ
వాటాల వ్యవహారంలో తేడాలు రావడంతో రెండు ప్రాజెక్టులలో అదనపు దోపిడీ గురించి బైటపడింది. ఓ ఎంపీ, మంత్రి ఒకరి విషయం మరొకరు బైటపెట్టుకున్న ఉదంతమిది. ధరలేవీ పెరగకపోయినా కుంటిసాకులు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇద్దరికీ పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ అదనపు బిల్లులను ప్రభుత్వం చెల్లించేసింది. ఈ వివరాలేమిటో చూద్దామా..?
 
ప్రాజెక్టు వివరాలివీ
గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్‌సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది.
 
దోపిడీ పథకమిదీ
టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్‌మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్‌సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించనక్కరలేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు.

ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించేశారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ సమసిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది.

ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి: ఆర్కే

Written By news on Thursday, June 23, 2016 | 6/23/2016


గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు.

కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

సోషల్ మీడియాలో వై యస్ జగన్ ఫోటోల హల్ చల్

విదేశీ పర్యటనలో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోల హల్ చల్



విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి


చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: గట్టు
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని టీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మాట్లాడుతూ...ప్రజలపై భారం మోపే కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టడం దారుణమన్నారు.

ఇప్పటికే విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు, ఆర్టీసీలో 30 కి.మీ.పైన ఎంత దూరమైనా రూ.2 పెంచడంతో పాటు మిగతా బస్సుల్లో పది శాతం మేర చార్జీలు పెంచనుంది. దీనిపై గురువారం అధికారక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని


బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ కన్నుసన్నల్లోనే సదావర్తి సత్రం భూముల కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ...ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.

సదావర్తి సత్రం భూముల వేలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కాకాని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవడం సబబుకాదన్నారు. ఈ నెల 26న మరోసారి సదావర్తి సత్రం భూముల్లో కమిటీ పర్యటిస్తుందని ఆయన చెప్పారు.

విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు

Written By news on Wednesday, June 22, 2016 | 6/22/2016


విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు
ఎంపీ వైవీ  :దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
ఒంగోలు అర్బన్: నైతిక విలువలు లేని ప్రజాప్రతినిధులకు తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ సహకారంతో ఎంపీ లాడ్స్ ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లు, కృత్రిమ అవయవాలను స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో మంగళవారం అందించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలన్నారు. ఇప్పటికి రెండుసార్లు మెగా జాబ్‌మేళా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశామని చెప్పారు. ఎక్కువమంది నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి లేకుండా ఉపాధి పొందలేకపోతున్నారని అటువంటి వారి కోసం త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఫ్లోరోసిస్ ఉన్న ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నానో వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.1200 కోట్లతో పైపు లైన్ ద్వారా ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ మురళి మాట్లాడుతూ  కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులను రప్పించడంలో ఎంపీ తనదైన ముద్ర వేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత 25 ఏళ్లలో ఎంపీలు చేయలేని అభివృద్ధి వైవీ ఈ రెండేళ్లల్లో చేశారని చెప్పారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు మహంకాళి వెంకటశేషయ్య, గోపాల్‌రెడ్డి, సభ్యులు తిరుపతిస్వామి, హరికృష్ణ, బండారు లక్షయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి బుజ్జి, శింగరాజు వెంకట్రావు పాల్గొన్నారు.
 న్యాయ పోరాటం చేస్తాం
ఒంగోలు అర్బన్:  స్థానిక బండ్లమిట్టలో ఇటీవల షాపులను కూలదోసిన ప్రాంతాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరిశీలించారు. రంజాన్‌మాసంలో ఎమ్మేల్యే, అధికారులు కలిసి తమని రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింల షాపులను మాత్రమే తొలగించారని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్న వారిపై ఈ విధమైన చర్యలు తీసుకోవడం సహించరాని విషయమన్నారు.
ముందుస్తుగా నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా పోలీసుల సాయంతో గుడ్డిగా వ్యవహరించారని చెప్పారు. నగర అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని అయితే బాధితులకు ముందుగానే ప్రత్యామ్నాయం చూపి, చర్చలు జరిపి అందరి సహకారంతో పార్కులు, బోటింగ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శింగరాజు వెంకట్రావు బాధితులకు జరిగిన నష్టాన్ని ఎంపీకి వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, వాణిజ్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, కె.వి. ప్రసాద్, టి. సోమశేఖర్ పాల్గొన్నారు.

ఉండవల్లిపై ఉక్కుపాదం


ఉండవల్లిపై  ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు
అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు
పొమ్మనకుండా    పొగ పెడుతున్న వైనం
సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు

 
విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్‌గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్‌స్టేషన్‌లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ  భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని ప్రకటనకు ముందే  కోట్లు పలికిన భూములు...
రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
 
 
అటవీ భూముల బూచి...
అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్‌కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది.

సాక్షి టీవీ చానల్ లేకపోతే కనెక్షన్ వద్దు


సాలూరు: కేబుల్ ప్రసారాల్లో సాక్షి టీవీ లేకపోతే ఏకంగా కేబుల్ కనెక్షన్‌ను తొలగించుకుంటామని సిటీ కేబుల్ ఆపరేటర్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. పార్టీ పట్టణ అద్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు బోను అప్పారావు, కౌన్సిలర్ ప్రతినిధి జరజాపు శ్రీను, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పెదకోమటిపేటలోని సిటీ కేబుల్ కార్యాలయానికి వెళ్లారు.

సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని నినాదాలు చేసారు. అనంతరం కార్యాలయంలో సిటీ కేబుల్ యజమాని లేకపోవడంతో టెక్నీషియన్‌తో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సాక్షి చానెల్‌ను ప్రసారం చేయకపోతే ఏకంగా కేబుల్ కనెక్షన్‌నే తొలగిస్తామని, నెలవారీ రుసుమును కూడా చెల్లించేది లేదని స్పష్టం చేసారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ టీటీపీ ప్రభుత్వ కుట్రలో కేబుల్ ఆపరేటర్ల పావులుగా మారితే వారే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.

 కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ, పట్టణ, రాష్ట్ర యువజన విభాగం నాయకులు మద్దిల గోవింద, యశోదకృష్ణ, హరి ఈశ్వరరావు, జిల్లా బీసీ విభాగం నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు, మాజీ కౌన్సిలర్లు కొల్లి రమణ, పిరిడి రామకృష్ణ, పార్టీ నాయకులు యాశర్ల రాము, కొలకోటి శంకరరావు, సబ్బాన తిరుపతి, హరి స్వామినాయుడు పాల్గొన్నారు.
 

కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి


కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి
హైదరాబాద్: ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు  గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 'ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని కోడెల ఒప్పుకున్నారు. ఆయన చట్టప్రకారం ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు. కోడెల వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమెటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి.
ఆయన వ్యాఖ్యలపై మేం ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈసీ చర్యలు తీసుకోకముందే నైతిక బాధ్యతగా కోడెల శివప్రసాదరావు రాజీనామా చేయాలి. నేరం ఆయనే బహిరంగంగా అంగీకరించారు. రూ.11 కోట్లు ఖర్చు పెట్టామని రూ.1100 కోట్లు సంపాదనే లక్ష్యంగా కోడెల వ్యవహరిస్తున్నారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.
గిన్నీస్‌ బుక్కులో నమోదైనట్లుగా చెప్పుకుంటున్న మరుగుదొడ్లలో కూడా కమిషన్లు తీసుకున్న నీచమైన స్థాయికి దిగజారారు. శ్మశానాల నిర్మాణంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. శవాలపై బొగ్గులు ఏరుకున్నట్లుందని సినిమాల్లో డైలాగులున్నాయని, ఇపుడు శ్మశానాల్లో కూడా కమిషన్లు కాజేసే వాళ్లు బయలుదేరారు. రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు శాఖల్లో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. కోడెల కుమారుడైతే సివిల్, భూ తగాదాల్లో జోక్యం చేసుకుని పోలీసు బలగాలతో ఓ వర్గం కొమ్ముకాస్తూ కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూములను కాజేస్తున్నారు.' అని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని  కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది' అని తెలిపారు.

ఏరువాక రోజైనా నమ్మకం కలిగించండి

Written By news on Tuesday, June 21, 2016 | 6/21/2016


ఏరువాక రోజైనా నమ్మకం కలిగించండి
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి సూచన

 సాక్షి, హైదరాబాద్:వ్యవసాయమే దండగని మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈరోజు ఏరువాక చేయడం సంతోషించదగ్గ విషయమే గానీ ఇది ప్రచార ఆర్భాటంగా ముగించకుండా రైతులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వ చర్యలు కొనసాగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆకాంక్షించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఏరువాక కేవలం ఏదో టీవీల్లో ప్రచారం కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో రెండెద్దులను చక్కగా అలకరించి నాగలి పట్టుకోవడం కాదు. రైతు నాగలి కర్రు పొలంలో దించిన రోజు నుంచి పంట ఇంటికి వచ్చేదాకా అండగా ఉంటామని ప్రభుత్వం నమ్మకం కలిగించాలి.

అంతే తప్ప  ఏరువాక అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదు.షో కోసమో, పత్రికలకు, టీవీలకు ఫోజులిస్తే రైతులకు ఏమి ఉపయోగం?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ వ్యవసాయ విధానం ఒక దిక్చూచి లేకుండా సాగుతోందని విమర్శించారు. ‘‘ఎన్నికలప్పుడు గొప్పగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు. ఆ మాట నమ్మి ఓట్లేసినందుకు రెండేళ్ల నుంచి సరైన పెట్టుబడులు లభించక రైతులు అధిక వడ్డీల బారిన పడ్డారు. ఏరువాక ప్రారంభించే సమయంలోనైనా రుణాలన్నీ మాఫీ చేశామని శుభవార్త చెబితే అదే పదివేలు’’ అని అన్నారు.

కృష్ణాకాల్వలకు ఎప్పుడు నీళ్లు వదిలేదీ, ఏఏ ప్రాంతాలకు నీరిచ్చేది ప్రభుత్వం ముందుగానే ప్రకటించడం పరిపాటని పార్థసారధి చెప్పారు. ఈ ఏడాది ఆ దాఖాలాలు లేవన్నారు. పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, సబ్సిడీలు విడుదల చేయడంలో చూపుతున్న శ్రద్ధ, ఉత్సాహం రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ చెల్లించడంలో చూపడం లేదని పార్థసారధి అన్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేసి, కొత్తగా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.

మొన్న ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చయింది

Written By news on Monday, June 20, 2016 | 6/20/2016

స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

 గత ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. కోడెల ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్న ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చయింది' అని తెలిపారు.

'ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదించారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి సంపాదించుకోవాలని వారు అనుకుంటున్నారు' అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్ధి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. దానికి కొన్ని వందల రెట్లు అధికంగా డబ్బులు ఖర్చు చేశానని స్పీకర్ చెప్పటం అందరినీ విస్మయ పరిచింది.

ఎవ్వరికీ భయపడం.. వెనుకడుగు వేయం

Written By news on Sunday, June 19, 2016 | 6/19/2016


'ఎవ్వరికీ భయపడం.. వెనుకడుగు వేయం'
అమరావతి: ప్రజల తరుపున పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది విలువైన సదావర్తి సత్రం భూములను లక్షలకే అమ్మేశారని చెప్పారు. ఈ అమ్మకానికి సంబంధించిన మొత్తం వ్యవహారం తేల్చేందుకు తమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీ వేశారని తెలిపారు.

అందులో భాగంగానే తాము వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడి వచ్చామని చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడేందుకు పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీని నియమించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నాఉ. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కమిటీ అమరావతిని సందర్శించింది. ఈ సందర్భంగా వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్తులు వారికి అండగా నిలిచి సత్రం ప్రాంతాన్ని సందర్శించేలా చేశారు. ఈ సందర్భంగా ధర్మానా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి విలువైన సమాచారం సేకరించామని తెలిపారు. కోట్లాది విలువైన ఈ భూములను లక్షలకే అమ్మేయడం పెద్దలకు, పీఠాధిపతులకు విచారం కలిగించిందని అన్నారు. నిజనిజాలు ప్రజలకు దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. త్వరలోనే చెన్నై వెళతామని, అక్కడ భూముల రేట్లు కనుక్కుంటామని చెప్పారు. అసలు చట్టప్రకారం ఈ భూములు అమ్మకాలు చేశారా? కోర్టు పరిధికి లోబడి పనిచేశారా? ఈ కుట్రకు ప్రధాన కారకులు ఎవరనే విషయం త్వరలోనే తేల్చి ఐదుకోట్ల ప్రజానీకానికి తెలియజేస్తామని అన్నారు.

టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం!


హరారే: భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో వైఎస్ఆర్‌సీపీ జెండాలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమ టీ షర్ట్‌లపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, యువనేత జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రాలను ధరించి తమ మద్దతు ప్రకటించారు. టీ-20 క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా దేశాలు దాటిన అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హల్‌చల్ చేశారు. తాము విదేశాల్లో ఉన్నా.. తమకు వైఎస్‌ఆర్‌సీపీపై ఎనలేని అభిమానముందని చాటుకున్నారు.




Popular Posts

Topics :