03 July 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నేటి నుండి గడప గడపకు

Written By news on Friday, July 8, 2016 | 7/08/2016


గడపగడపకూ వైఎస్సార్
వైఎస్ జయంతి సందర్భంగా నేటి నుంచి ప్రారంభం.. ప్రజల్లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు
♦ డిసెంబర్ 31వ తేదీ వరకూ 5 నెలల పాటు కార్యక్రమం
♦ ఇంటింటికీ నాలుగు పేజీల కరపత్రం పంపిణీ
♦ చంద్రబాబు పాలనపై వంద ప్రశ్నలతో బ్యాలట్
♦ రోజు వారీగా నివేదికలు... పర్యవేక్షణకు యంత్రాంగం
♦ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి శ్రీకారం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్...’ కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానున్నది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు క్రియాశీకలంగా పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నాయి.

తెలుగు ప్రజల హృదయాల్లో సంక్షేమ పథకాల ప్రదాతగా నిలిచి పోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన మొత్తం 13 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు వీలుగా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 14వ తేదీన విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విసృ్తత సమావేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిన దరిమిలా ఈ నెల 4న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.

పార్టీ జనాదరణను పొందడానికి, ప్రజా మద్దతు పొందడానికి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమైనదో జగన్ ఈ సమావేశంలో వివరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి కుగ్రామానికి, ప్రతి గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు. ‘గడప గడపలో ఒకే నినాదం-వైఎస్సార్ కాంగ్రెస్, ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం’ అనే శీర్షికన ముద్రించిన నాలుగు పేజీల కరపత్రాన్ని ఈ సందర్భంగా ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ఈ కరపత్రంలో ఎన్నికలపుడు (2014) చంద్రబాబు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చలేకపోయిన వైనం వివరించారు. అంతే కాదు, చంద్రబాబు పాలన పాసా? ఫెయిలా? ప్రజలే నిర్ణయించాలని కోరుతూ ఇదే కరపత్రంలో వంద ప్రశ్నలతో ఒక బ్యాలట్‌ను కూడా పొందుపర్చారు.

ఐదు నెలలు గడప గడపకూ...

నేటినుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ 31వ తేదీ వరకూ 5 నెలల పాటు జరగాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. తానిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోగా ఈ రెండేళ్లలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డం, రాజధాని పేరుతో భూదందాను నిర్వహించడం వంటి అంశాలను పార్టీ నేతలు గడప గడపకూ వెళ్లి వివరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ రెండేళ్లలో ఏదైనా మేలు జరిగిందా అనే విషయాలపై కూడా ఆరా తీస్తారు.

ప్రజల్లోకి వెళ్లడం మొదలు పెట్టిన తరువాత మూడు రోజుల కన్నా ఎక్కువ విరామం ఉండకూడదని, వివిధ కారణాల వల్ల మూడు రోజులు ఆపివేసినా నాలుగో రోజు నుంచి మళ్లీ మొదలు పెట్టాలని పార్టీ సూచించింది. రాజధాని నిర్మాణం మొదలు, సదావర్తి భూముల అమ్మకం కుంభకోణం వరకూ భారీగా అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో డబ్బును కుమ్మరించే వ్యూహంతో ముందుకు వస్తారని దీనిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలంటే  నిరంతరం ప్రజలతో మమేకమై వారి ఆదరణ చూరగొనడం ఒక్కటే పరిష్కారమని పార్టీ దృఢంగా విశ్వసిస్తోంది.

ఈ అంశాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో గడప గడపకూ... కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి రోజు వారీగా నివేదికలు తెప్పించుకునే ఏర్పాట్లను కూడా చేసుకుంది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిల్లోనూ కార్యక్రమ పర్యవేక్షణకు యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటైంది. గడప గడపకూ పంపిణీ చేయాల్సిన కరపత్రాలు కూడా అన్ని జిల్లాలకూ పార్టీ ఇప్పటికే చేరవేసింది. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగుర వేసిన అనంతరం గడప గడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పార్టీ నిర్దేశించింది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు

 మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్ పాండ్)లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు

ఒక పథకాన్ని మూడుసార్ల ప్రారంభిస్తారా?

Written By news on Wednesday, July 6, 2016 | 7/06/2016

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ పథకాన్ని చంద్రబాబు ముచ్చటగా మూడోసారి ప్రారంభించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక పథకాన్ని ఇన్నిసార్లు ఎక్కడైనా ప్రారంభించారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ముఖ్యమంత్రి మోటర్లు ఆన్ చేయగానే  మరోవైపు ఇంజినీర్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు.
60 కిలోమీటర్లు దాటితే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఇంజినీర్లు వెంటనే ఆపేశారని ఆమె పేర్కొన్నారు. ఇదే చిత్తశుద్ధి పోలవరంపై చూపితే ప్రాజెక్ట్ సగం పూర్తయ్యేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని సీఎం రాయలసీమకు ఎక్కడ నుంచి ఇస్తారన్నారు. ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

సింగపూర్‌కు దాసోహమంటోంది ఎందుకు?


సింగపూర్‌కు దాసోహమంటోంది ఎందుకు?
చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు ధ్వజం

 సాక్షి, హైదరాబాద్ :రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు ఎందుకు దాసోహమంటోందని, అసలు సింగపూర్ అంటే అంత మోజెందుకని వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రజల రాజధానిని స్వదేశీ సంస్థలు, నిపుణులతో కాకుండా సింగపూర్‌తో నిర్మించడమంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే 170 జీవోతోపాటుగా అన్ని ఒప్పందాల్ని సమీక్షించి తీరతామన్నారు.

ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ కన్సార్టియంకు రాజధానిని ధారాదత్తం చేయడం చారిత్రక తప్పిదమన్నారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దని ఎన్టీఆర్ ఆరాటపడితే బాబు మాత్రం సింగపూర్‌కు తాకట్టు పెట్టడం దారుణమన్నారు.

పేద బ్రాహ్మణులు లేరా?


సత్రం భూములపై చంద్రబాబు నోరు విప్పాలి
వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ధర్మాన డిమాండ్

 సాక్షి, హైదరాబాద్ :సదావర్తి సత్రం భూముల అమ్మకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా మౌనంగా ఉండటానికి వీల్లేదని, ఆయన నోరు విప్పాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. సత్రం భూముల అమ్మకంలో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గుతేల్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని ఈ కమిటీ భూముల అమ్మకంపై లోతుగా అధ్యయనం చేసి, వైఎస్ జగన్‌కు సోమవారం నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో ధర్మాన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సదావర్తి సత్రం భూముల విక్రయంలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను, ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సైతం పక్కన పెట్టారని తెలిపారు.

 చంద్రబాబు ఆదేశాలతోనే...
 సదావర్తి సత్రం భూములను విక్రయించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సీఎం బాబుకు రాసిన లేఖతో కథ ప్రారంభమైందని ధర్మాన పేర్కొన్నారు. ఆ లేఖ అంది న వెంటనే చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతోనే సత్రం భూములను అమ్మాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం.. భూముల అమ్మకంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అన్నారు. ఇందులో అదేమీ జరగలేదని, అందరినీ అంధకారంలో ఉంచి వ్యవహారం నడిపించారని ఆరోపించారు. హిందూ ధర్మ సంస్థల ఆస్తుల  పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బ తీసిందని విమర్శించారు.

 పేద బ్రాహ్మణులు లేరా?
 పేద బ్రాహ్మణుల విద్యకు ఉపయోగపడాల్సి సదావర్తి సత్రం భూములను ఎందుకు అమ్మేశారు? రాష్ట్రంలో పేద  బ్రాహ్మణులు లేరని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాన ప్రశ్నిం చారు. హిందూ సంస్థల భూములను దొంగల పాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. చెన్నై సమీపంలోని తాలంబూర్ వద్ద ఉన్న విలువైన సత్రం భూముల అమ్మకం జరుగుతున్నపుడు పరి శీలనకు రాష్ట్ర ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అధికారులు వెళ్లాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదన్నారు. భూముల అమ్మకానికి సంబంధించి 2005లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 424 జీవో ప్రకారం.. ఈ-టెండర్, బహిరంగ వేలం రెండూ నిర్వహించాలని చెప్పారు. సత్రం భూముల విషయంలో ప్రభుత్వం ఈ జీవోకే వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు.

ఈ-టెండర్ నిర్వహిస్తే అందరూ పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు తమ కుమ్మక్కు వ్యవహారానికి ఇబ్బం ది లేకుండా బహిరంగ వేలం నిర్వహించారని దుయ్యబట్టారు. వేలంలో పాల్గొన్న 8 మంది వ్యక్తులు  బంధువులు, మిత్రులేనన్నారు. ఈ వేలాన్ని రద్దు చేసి, అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ కోరుతూంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. ఈ వ్యవహారంపై సత్రం భూములను కొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి మాట్లాడడం సరికాదని, సీఎం చంద్రబాబు, ప్రభుత్వం స్పందించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వైఎస్ రుణం తీర్చుకున్న తీరు


పెద్ద మనసున్న ప్రజల మనిషి
వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా ఆమె ఆయనపట్ల అక్కసుతో వ్యవహరించిన తీరు సన్నిహితులకే తెలుసు. పార్టీ పట్ల, నాయకత్వంపట్ల ఆయన చూపిన విధేయత వల్ల అది బయటకు రాలేదు. ప్రజ లలో ఆయనకున్న ఆకర్షణ, ఆదరణ వల్లనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేకపోతే ఏపీలో మరోసారి ముఖ్యమంత్రుల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం.

 మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఎట్లా పని చేస్తున్నది? ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చడానికి నిజాయితీగా కృషి చేస్తున్నదా? మనం సరైన ప్రభుత్వాన్నే ఎన్నుకున్నామా లేక పొరపాటు జరిగిందా? అని ప్రజలు తీరికగా సమీక్షించుకునే అవకాశం కనుక కలిగినట్టయితే చాలా ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం ఖాయం. ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని కోరుకోవడం సహజమే. కానీ ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా పని చేయడం ద్వారానే మళ్లీ అధికారంలోకి రావా లని తపనపడేవారు అరుదు. అటువంటి అరుదైన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎల్లుండి జూలై ఎనిమిది ఆయన జయంతి.

 జనం నాడి ఎరిగిన విజయ సారధి
 2004లో, పదేళ్ల విరామం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన వాడాయన. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర జరిపి ప్రజల కష్టాలను తెలుసుకుని, సమస్యలను అధ్యయనం చేసి పార్టీ గెలుపునకు వ్యూహం కూడా రచించు కున్నారు. కాబట్టే 2004 ఎన్నికల ఫలితాన్ని ముందుగానే అంత కచ్చితంగా చెప్పగలిగారు. ఒక్కటి కూడా తగ్గకుండా ఆయన చెప్పినన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో గెలిచింది.

 2004లో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన రాజశేఖరరెడ్డి 2009 ఫలితాలను ఆత్మవిమర్శగా స్వీకరించారు. ఆ ఆత్మవిమర్శ ఆయన మౌనంగా, ఒంటరిగా, నాలుగు గోడల మధ్య చేసుకున్నది కాదు. బాహాటంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష సమా వేశంలో చేసిన ప్రసంగంలోనే ఆయన... ప్రజలు మనకు ఈసారి పాస్ మార్కులు మాత్రమే వేశారు, ఈ ఐదేళ్లూ కష్టపడి ప్రజల మన్నన పొంది మంచి మార్కులు తెచ్చుకుని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసు కోవాలి అన్నారు.

 కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికీ మంచి పేరు రావడం ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు. ఐదేళ్లపాటూ కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించి, దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆయన మరణించాక కాంగ్రెస్, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనపట్ల ఎంత అవమానకరంగా ప్రవర్తించిందీ మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఆయన జీవిత చరిత్ర ‘హాఫ్ లయన్’ తెలుగులో ‘నరసింహుడు’ పేరిట వెలువడిన సందర్భంగా మరొక్కసారి ఆ విషయంపై చర్చ జరిగింది. అందరం విన్నాం. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత్రికి  ఇంతకుముందే చెప్పుకున్నట్టు తమ కుటుంబానికి తప్ప మరెవరి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడం ఇష్టం ఉండదు. రెండుసార్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడయిన రాజ శేఖరరెడ్డిని సైతం సోనియా గాంధీ, ఆమె కుటుంబం గౌరవంగా చూడలేదు.

 కాంగ్రెస్ వైఎస్ రుణం తీర్చుకున్న తీరు
 2009లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఉండకపోతే యూపీఏ 2 అధికారంలోకి రావడం అంత సులభం అయ్యేదే కాదు. యూపీఏ 1 సమయంలో తోడున్న వామపక్షాలు లేక పోవడమే గాక, కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట కొంత మసకబారుతున్న సమయంలో... ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలన్నీ మహా కూటమి పేరుతో ఏకమయినా రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో రాష్ట్రంలో పార్టీ ప్రచారాన్ని నిర్వ హించారు. అక్కడా, ఇక్కడా మళ్లీ అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 2009 గెలుపునకు ఏ నాయకుడైనా మరే కారణమైనా చెబితే అది ఆత్మ ద్రోహం అవుతుంది.

 ఇంత చేసిన రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ దాని అధినేత్రి ఎట్లా వ్యవ హరించారో అందరికీ తెలుసు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చ దలచిన రాజశేఖరరెడ్డి కుమారుడు, అప్పటి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టే వరకూ, ఆ తరువాత కేసులు పెట్టి వేధించే వరకూ ఏం జరిగిందో చూస్తే... తమకు తప్ప మరెవరికి కీర్తి ప్రతిష్టలు రావడాన్నీ సహించలేని గాంధీ-నెహ్రూ కుటుంబం ధోరణి ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాదు జీవించిలేని రాజశేఖరరెడ్డి పేరును నిందితునిగా చార్జిషీట్‌లో చేర్చి మరీ కాంగ్రెస్ ఆయన రుణాన్ని తీర్చుకుంది.

 క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి కావడానికి డాక్టర్ రాజశేఖరరెడ్డి 26 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1978లో మొదటిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయిన దగ్గరి నుంచి  2004 వరకూ ఆయన కాంగ్రెస్‌లోని అంతర్గత విరోధులతో తలపడుతూనే, నిత్య అసమ్మతివాది అనే విమర్శను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోగలిగారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తేవడా నికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా కాంగ్రెస్ అధినాయకురాలు రాజశేఖరరెడ్డితో వ్యవహరించిన పద్ధతి చాలా కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. అసమ్మతివాది అనే ముద్ర ఉన్నా ఆయన పార్టీపట్ల, నాయకత్వంపట్ల ఎప్పుడూ విధేయుడిగా ఉండటమే అందుకు కారణం. రాజశేఖరరెడ్డి సీఎం కావడం లేదా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు దక్కడం సోనియాకి, కాంగ్రెస్ పెద్దలకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఆయనకున్న ప్రజాకర్షణ, సీఎంగా ప్రజల్లో ఆయనపట్ల పెరిగిన ఆద రణా చూసి, ఏమీ చేయలేని స్థితిలోనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేక పోతే మళ్లీ ఒకసారి ఏపీలో సీఎంల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం.

 దట్ ఈజ్ వైఎస్
 కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం వైఎస్ పాదయాత్ర చేస్తున్న రోజులు అవి. తెలంగాణ జిల్లాల పాదయాత్రను ముగించుకుని, ఆంధ్ర ప్రాంతంలోకి అడుగు పెట్టాక ఆయన రాజమండ్రి దగ్గర అనారోగ్యం పాల య్యారు. దీంతో ఆయన అక్కడే ఓ ఊరి బయట విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా మరెక్కడికో వెళుతూ విశాఖపట్నం విమానాశ్రయంలో కాసేపు ఆగారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి కఠోర యాత్ర చేస్తూ రాజశేఖరరెడ్డి అస్వస్తులయ్యారు, ఎలాగూ మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి స్వయంగా వెళ్లి ఆయనను పలకరిస్తే బాగుంటుంది, ఆయనకే కాదు పార్టీ శ్రేణులకు కూడా కొత్త ఉత్సాహం కలుగుతుంది అని కొందరు సూచించారు.

 దానికి సోనియా ఇచ్చిన జవాబుకు ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘‘దట్ ఈజ్ హిజ్ హెడ్ ఏక్’’ (అది ఆయన తలనొప్పి) నేనెందుకు పలకరించాలి అన్న అర్థం వచ్చేట్టు మాట్లాడి, ఆ సూచనను నిరాకరించారు. రాజశేఖరరెడ్డి వంటి సీనియర్ నాయకుడి పట్లనే అధినేత్రి వైఖరి ఇట్లా ఉంటే ఏమనుకోవాలి? ఆ తరువాత రాజ శేఖరరెడ్డి ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించుకుని నేరుగా తిరుపతి వెళ్లి తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని పార్టీ అధ్యక్షురాలిని కలుసుకోడానికి అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అయినంత సులభంగా ఆయనకు పార్టీ అధ్యక్షురాలి దర్శనం కాలే దనేది అప్పుడు ఆయన వెంట ఉన్న వారికి తెలుసు.

90కి పైగా శాసనసభా స్థానాలుగల బలమైన ప్రతిపక్షనేత, ప్రజాకర్షణగల నాయకుడు, పైగా కొన్ని వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి వచ్చినా అధినేత్రి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం అయింది. ఇదీ కాంగ్రెస్ అధిష్టానం తన నాయకులను గౌరవించే తీరు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కాంగ్రెస్ పార్టీనే మరిపించే తీరున పరిపాలన సాగించి ప్రజా హృదయాలపై తన సొంత ముద్రను బలంగా వేశారు. అయినా ఆయన పార్టీ విధేయతను మరచి పోలేదు. కాబట్టే ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానికి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడం జరిగింది. దట్ ఈజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!
 జూలై 8 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

Popular Posts

Topics :