10 July 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

18న విశాఖ జిల్లా పర్యటనకు వైఎస్ జగన్

Written By news on Saturday, July 16, 2016 | 7/16/2016


హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖపట్నం జిల్లా పాల్మన్ పేటకు వెళ్లి మత్స్యకారులను పరామర్శించనున్నారు. ఇటీవల దాడులకు గురైన మత్స్యకారులతో వైఎస్ జగన్ మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు.

పాల్మన్ పేటలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరడం లేదన్న కారణంతో తమపై దాడి చేశారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ ఇదివరకే పాల్మన్ పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది.

రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Written By news on Friday, July 15, 2016 | 7/15/2016


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించ వలసిన వ్యూహంపై వీరు చర్చిస్తారు.

పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ దృష్టి

Written By news on Thursday, July 14, 2016 | 7/14/2016


పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ దృష్టి
-16 నుంచి 20 వరకు జిల్లాల వారీగా సమీక్ష
- పార్టీ నిర్మాణంపై చర్చ: కొండా రాఘవరెడ్డి

 సాక్షి, హైదరాబాద్ :రాష్ట్రంలో పార్టీ పటిష్టత, సంస్థాగత బలోపేతంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం,  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టడంపై కార్యాచరణ రూపొందించుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, కమిటీల నియామకాన్ని చేపట్టగా, మండల స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తిచేయనున్నారు.  ఈ నెల 16 నుంచి 20 వరకు లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలను నిర్వహించనున్నారు.

 16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్లి జిల్లాల సమావేశాలు..
 ఈ నెల 16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. 18న నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు, 19న గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు, 20న మెదక్, ఖమ్మం జిల్లాల సమావేశాలు ఉంటాయి.  ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పార్టీ పరిశీలకులు, పార్టీ సహ పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరుకావాలన్నారు.

జులై 16 నుంచి టీ వైఎస్ఆర్ సీపీ జిల్లా సమీక్షా సమావేశాలు

Written By news on Wednesday, July 13, 2016 | 7/13/2016


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు జులై 16 నుంచి ప్రారంభమవుతాయని టీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డితో కలసి గట్టు శ్రీకాంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే 18వ తేదీన నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 19వ తేదీన గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల సమీక్షా సమావేశం ఉంటుందని వివరించారు. 20వ తేదీన మెదక్, ఖమ్మం జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వారు వివరించారు.

పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా?


► పరిహారం విషయంలో ఎందుకు తేడా
►ముందుగా భూములు ఇచ్చినవాళ్లను అ‍న్యాయం చేస్తున్నారు
►వాళ్లకు పరిహారం పెంచాల్సిన అవసరం లేదా
►అన్యాయం జరుగుతోందని చెబితే బురద జల్లుతున్నారు
►ముంపు మండలాల వాసుల స్థానికతను ఏం చేశారు
►ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
►పోలవరం నిర్వాసితులకు అండగా బహిరంగ సభ
 
కుకునూరుపల్లి: 
పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆ ర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
  • మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంటే.. జరిగేది అన్యాయం అని చెబితే పాలకపక్షం వాళ్లు మన గోడు వినడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా గోడు వినండి, మా పరిస్థితిని చూడండి.. మేం అన్యాయంగా ఏమీ చెప్పడం లేదు, మేం అడిగేది పూర్తిగా న్యాయబద్ధమైన కోరికలే. వాటిని నెరవేర్చడానికి మనసు రాకపోవడం దారుణమని అంటున్నాం
  • ఇక్కడికి వచ్చినపుడు భూములు కోల్పోయినవారు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసినవారిని ఆదుకునే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేయండి, తోడుగా నిలబడండి అని అడిగితే చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. ‘పోలవరం ప్రాజెక్టు రావడం జగన్ కు ఇష్టం లేదు’ అంటారు
  • చంద్రబాబు అన్యాయం చేశారంటే నా మీద బురద వేయడం మామూలైపోయింది
  • రాజధాని విషయంలో అన్యాయంగా భూములు లాక్కుని, సింగపూర్ కంపెనీలకు ఇష్టం వచ్చిన రేట్లకు ఇస్తున్నారు
  • లంచాలు తీసుకుని వాళ్లు, మీరు వ్యాపారాలు చేస్తున్నారంటే.. అమరావతిలో రాజధాని రావడం జగన్ కు ఇష్టం లేదంటున్నారు
  • అన్యాయం జరుగుతోంది, సరిదిద్దాలని అడిడితే బురద జల్లుతున్నారు
  • పోలవరం రావాలన్నది రాష్ట్ర ప్రజలందరి కోరిక. అది వస్తేనే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
  • ఆ ప్రాజెక్టు కోసం 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశా
  • ఎవరూ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు.. పోలవరం రావాలని చెప్పేవాళ్లలో అందరం ఇక్కడే ఉన్నాం
  • పోలవరం కోసం త్యాగాలు చేసిన వీళ్లకు సరైన న్యాయం చేస్తున్నామో లేదో పాలకులు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి
  • వీళ్లు అడిగే ఏ కోరిక అన్యాయం అనిపించడం లేదు
  • పట్టిసీమలో 20 లక్షలిస్తున్నారు.. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు
  • అదే తమకు కూడా వర్తింపజేయాలని అడగడంలో తప్పేముంది
  • చంద్రబాబును గట్టిగా అడుగుతున్నాం.. ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులు ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నా
  • భూముల రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేలా వర్తింపజేయాలి
  • ఇక్కడ అన్నీ 1/70 భూములు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ విలువ తక్కువ చూపిస్తారు
  • సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఎకరాకు 7 లక్షల మార్కెట్ రేటుఉంది.. పట్టిసీమలో 20 లక్షలు మీరే ఇస్తున్నారు
  • ఇక్కడ మాత్రం భూముల విలువ ఎందుకు తగ్గిస్తున్నారు
  • చింతలపూడి నుంచి పట్టిసీమ, పోలవరం అన్నీ పక్కపక్కనే ఉన్నాయి
  • పట్టిసీమకు అమలుచేసిన ప్యాకేజిని అందరికీ వర్తింపజేయాలి
  • వీళ్ల భూములు 8, 9 ఏళ్ల క్రితం ఎకరాకు 1.15 లక్షల చొప్పున ఇచ్చి అప్పట్లో తీసుకున్నారు
  • ఇది అప్పటి రేటు.. ఇప్పుడు 20 లక్షల వరకు చేరింది. ఎక్కడైనా కొనాలంటే ఆ 20 లక్షలు పెడితే తప్ప ఎకరా భూమి కూడా దొరకట్లేదు
  • మా పరిస్థితి ఏంటి.. కాస్తో కూస్తో మాకు కూడా పరిహారం పెంచి ఇవ్వక్కర్లేదా అని అడుగుతున్నారు
  • ఈ ప్రాజెక్టు కోసం మొదటి వరుసలో నిలబడి భూములు ఇచ్చినవాళ్లు ఉన్నారు
  • 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు ఎటువంటి వినియోగం చేయకపోతే భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలి.
  • అలా కూడా అక్కర్లేదు.. తమకు పరిహారం పెంచాలని మాత్రమే వీళ్లు అడుగుతున్నారు
  • పట్టిసీమలాగ ఎకరానికి 20 లక్షలు కూడా అడగడం లేదు, అప్పుడిచ్చిన దానికి 5 లక్షలు పెంచి ఎక్స్ గ్రేషియా ఇ‍స్తే చాలని చాలా న్యాయంగా అడుగుతున్నారు
  • పోలవరం ప్రాజెక్టు అంచనా 32 వేల కోట్లు అంటున్నారు. ఇలా భూములు ఇచ్చినవాళ్లకు కాస్తో కూస్తో ఇస్తే ప్రాజెక్టు మొత్తం విలువలో  అది 5 శాతం కూడా ఉండదు కదా
  • భూములు ఇచ్చినవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండాలి, వీళ్ల త్యాగాలు మర్చిపోకూడదు
  • భూములన్నీ కోల్పోయినా పోలవరానికి వీళ్లు అండగా నిలబడుతున్నారు
  • పోడు భూములు, అసైన్డ్ భూములు, ఏ పేరైనా సరే.. ప్రభుత్వం మాకు ఆ భూములు ఇచ్చిన తర్వాత అవి మావే కాబట్టి ప్రైవేటు భూములకు ఇచ్చిన రేటు, పరిహారం మాకు కూడా ఇవ్వాలి కదా అని కోరుతున్నారు
  • వాళ్లు నిరుపేదలు కాబట్టే ఆ భూములు ఇచ్చారు. అలాంటి పేదలకు కాస్తో కూస్తో ఎక్కువ ఇవ్వాలి గానీ తగ్గిస్తే ఎలా
  • వీళ్లకు ఇస్తున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేవలం 2, 3 లక్షలు దాటడం లేదు.. దాంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు
  • కొత్త ఇల్లు కట్టుకోవాలంటే 5 సెంట్ల స్థలానికి కూడా సరిపడ మొత్తం రావట్లేదు. కనీసం 10 లక్షల ప్యాకేజి ఇవ్వాలని వాళ్లు అడిగేది న్యాయబద్ధంగానే ఉంది
  • ముంపు మండలాలు ఏపీలో చేరి రెండేళ్లయింది. ఇప్పటికీ వాళ్లకు సంబంధించిన స్థానికత సమస్య తేలలేదంటే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి
  • స్థానికత ఇవ్వకపోవడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు
  • పిల్లలు డీఎస్సీ రాయాలన్నా, ఇంకేం రాయాలన్నా ఏ రాష్ట్రం వాళ్లో తెలియడం లేదు
  • ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలూ వీళ్లను కాదంటున్నాయి
  • ప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగిన పనులు కూడా చేయడం లేదు
  • ఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి బాబూ?
  • 20 మంది ఎమ్మెల్యేలకు 30 కోట్ల చొప్పున కొన్నావు.. అంటే 600 కోట్లు ఖర్చుపెట్టావు
  • ఎక్కడికి వెళ్లినా ప్రైవేటు విమానం తప్ప మామూలు విమానం ఎక్కడం లేదు
  • బాబు పాలనలో ఏది చూసినా టెంపరరీ బిల్డింగులే. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసం..
  • చివరకు చంద్రబాబు ఇళ్లకు, ఆఫీసులకు చేసిన మరమ్మతల ఖర్చు లెక్క వేసుకుంటే 100 కోట్లు అవుతుంది
  • కన్సల్టెన్సీలకు ఇంత, నాకింత అని చెప్పి ఈ రెండేళ్లలో 300 కోట్లు ఇచ్చారు
  • ఈ డబ్బు కాస్త ఇటువైపు మళ్లిస్తే పోలవరం ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వచ్చేవాళ్లు
  • పోలవరం ప్రాజెక్టును కూడా బాబు అడ్డగోలుగా నాశనం చేస్తున్నారు
  • దీని గురించి కేంద్రం లేఖలు రాస్తోంది.. కాంట్రాక్టరు పనులు సరిగా చేయడంలేదని, మార్చాలని చెప్పింది
  • చంద్రబాబు మాత్రం ఆ కాంట్రాక్టరు తన బినామీ కాబట్టి మార్చే ప్రసక్తి లేదంటున్నారు
  • కేంద్రాన్ని మోసం చేస్తూ.. పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం సబ్ కాంట్రాక్టరును కూడా తెచ్చుకుంటున్నారు
  • వాళ్ల ద్వారా కోట్లకు కోట్లు దండుకుంటున్నారు
  • చివరకు కేంద్రం కూడా ఈ దోపిడీని చూసి పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ విషయంలో నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారు
  • దేశంలోనే ఇంత దారుణమైన సీఎం ఎవరూ ఉండి ఉండరు
  • ఈ రెండేళ్లలో బాబు చేసింది సున్నా
  • మీరు అడుగుతున్నవన్నీ చదివాను.. అవన్నీ సమంజసమైనవే
  • పొరపాటున ఏదైనా మీకు అందకపోతే నిరాశ పడక్కర్లేదు
  • మీరు ప్రాజెక్టుకు తోడుగా ఉండండి.. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదు
  • మరో రెండేళ్లకో, సంవత్సరానికో మన ప్రభుత్వం వస్తుంది
  • ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పూలలో పెట్టి మీకు అందించి మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తా
  • పోలవరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం
  • చంద్రబాబు మీద పోరాటం మాత్రం కొనసాగిస్తాం
  • దానికి దేవుడి దయ కావాలి.. మీరంతా చంద్రబాబు ప్రభుత్వం పోవాలని కోరుకోవాలి
  • కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు

న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం


'న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం'
ఏలూరు : చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ పక్క డబ్బులు లేవంటూనే సీఎం మరోవైపు విమానాల్లో విదేశాలకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాల్లో విదేశాలకు వెళ్లడం కాదని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విస్మరించారన్నారు.

రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావటం లేదని, మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలపై బ్యాంకులు రూపాయిన్నర నుంచి రెండు రూపాయిలు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాయని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకూ పొగాకు కొనుగోళ్లు చేపట్టలేదని వైఎస్ జగన్ అన్నారు. జులై వచ్చినా సగం పొగాకు కూడా కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు. జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. ఒక్క పొగాకు రైతులే కాదని, వరి నుంచి పామాయిల్ రైతుల వరకూ అందరి పరిస్థితి ఇదేనన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులందరూ అవస్థలు పడుతున్నారన్నారు.

ఎన్నికలు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్నారో చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడితే తాను రూ.5వేల కోట్లతో పెడతానని చంద్రబాబు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయారని ధ్వజమెత్తారు.  రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కొత్త రుణాలు రాక, పాత రుణాలు రెన్యువల్ కాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. పొగాకుకు రూ.20 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.70 లక్షలు ముష్టి వేశారని వైఎస్ జగన్ అన్నారు. పొగాకు ఉత్పత్తిని 65 మిలియన్ క్వింటాళ్ల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు. పొగాకు కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధిని తీసుకొచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. అప్పుడైనా పొగాకు బోర్డు స్పందించి, రైతులకు న్యాయం చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పొగాకకు కనీసం రూ.165 మద్దతు ధర లభిస్తే...చంద్రబాబు గత ఏడాది 114 రూపాయలే ఇచ్చారన్నారు. అలాగే పామాయిల్ విషయానికి వస్తే వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. ఉత్పత్తి ధర పెరుగుతు ఉంటే, మద్దతు ధర మాత్రం తగ్గుతోందన్నారు. నాయకులు మాట మీద నిలబడాలని, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. లేకుంటే చంద్రబాబు ప్రతి ఒక్కరికీ విమానం లేదా కారు కొనిస్తానంటారని ఎద్దేవా చేశారు.
మాట నిలబెట్టుకోకపోతే నిలదీసే పరిస్థితి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులకు పరిహారం విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ కింద ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే, చింతలపూడి కింద రూ.12 లోలే ఇస్తున్నారన్నారు. రైతులు కొట్టుకోవాలి, ఉద్యమాలు రావాలి...ప్రాజెక్టులు కట్టకుండా కాలయాపన చేయాలనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ చంద్రబాబు వదిలిపెట్టమని, రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రయివేట్ బిల్లు


న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. కాగా ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ 17న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా?


పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట ధ్వజం
-  సీఎం పర్యటనలపై కేంద్రం దర్యాప్తు జరపాలి

 సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేశారు? అక్కడి నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? పర్యటనలకు ఎంత ఖర్చయింది? వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విలువైన భూములను చంద్రబాబు విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లి కళ్లు, తెల్ల జుట్టు, తెల్ల తోలు ఉన్న వారొచ్చి ఏమడిగినా చంద్రబాబు ఇచ్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే బదులు విదేశీ కంపెనీలపైనే ఆసక్తి చూపుతున్నారని దుయ్యబట్టా రు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. బాబు ఎక్కడెక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏం తెస్తున్నారు? అనేదానిపై కేం ద్రం దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్నారు.

 ‘హోదా’ ఉంటే పరిశ్రమలు వద్దన్నా వస్తాయి
 ‘‘చంద్రబాబు ఏ దేశానికి వెళితే ఆ దేశం ఆచారాల ప్రకారం ఫొటోలు తీయించుకొని అందరూ తన గురించే చర్చించుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించడం చాలదన్నట్లు చైనాకు వెళ్లి ఏపీలోని 972 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్రతీరంలో ఎక్కడైనా పోర్టు నిర్మించుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. రష్యాకు వెళ్లి తమ వద్ద 15 లక్షల ఎకరాల భూ బ్యాంకు ఉందని చెబుతూ వారితో ఏదో ఒక హోటల్‌లో కూర్చొని టిష్యూ పేపర్‌పై ప్రణాళికలు గీసి, పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.

విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 48 గంటల్లోనే రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయంటూ చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒక్క శాతమైనా రాష్ట్రానికి వచ్చాయా? ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడితే పరిశ్రమలు వద్దన్నా రాష్ట్రానికి వస్తాయి. ఆ పని చేయకుండా ప్రత్యేక హోదాను నీరుగార్చి విదేశాల వెంటపడడం ఏమిటి? హోదా కోసం పోరాడటానికి అందరినీ పిలిచి చర్చిస్తే మేము హృదయపూర్వకంగా సహకరిస్తాం’’ అని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  పారిశ్రామిక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోం దన్నారు. చంద్రబాబుకు పరిశ్రమలు పెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ఉన్న వేలాది ఎకరాల భూమిని ఇవ్వొచ్చని, ఇలా చేస్తే అక్కడ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు

ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమాని


ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమానిచంద్రబాబుతో వెంకటేశ్వర్లు (ఫైల్)
ఫేస్‌బుక్‌తో వెలుగులోకి..

నెల్లూరు(టాస్క్‌ఫోర్సు): నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో హడలెత్తించిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వీరాభిమాని అని వెల్లడైంది. నెల్లూరు జిల్లాలోని యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన ఈ కరుడు గట్టిన నేరస్తుడు ఇళ్లలోకి చొరబడి మహిళల్ని, వృద్ధులను సుత్తితో మోది క్రూరంగా హత్యలకు పాల్పడడం తెలిసిందే.

తాజాగా నెల్లూరు చిల్డ్రన్స్‌పార్కు సమీపంలో ప్రభావతి అనే మహిళ ఇంట్లో చొరబడి సుత్తితో ఆమెపైన, ఆమె బంధులిద్దరిపైన దాడిచేసి.. బంగారు నగలను అపహరించుకొని వెళుతూ పట్టుబడ్డాడు. దీంతో అతని వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీలో చురుగ్గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబునాయుడుతో కలసి పాదయాత్రలో సైతం వెంకటేశ్వర్లు పాల్గొన్నాడు. పాదయాత్రలో చంద్రబాబుతో కలసి నడుముకు పచ్చకండువా కట్టుకొని నడిచాడు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.

వెంకటేశ్వర్లు అరెస్ట్ అనంతరం నెల్లూరు పోలీసులు అతని ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించారు. దాన్ని చూడగా టీడీపీ పట్ల అతనికెంత అభిమానముందో అవగతమైంది. దీం తో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇది జరిగిన గంట వ్యవధిలోనే వెంకటేశ్వర్లు ఫేస్‌బుక్ అకౌంట్ అంతర్జాలంలో మాయమైంది. ఇప్పుడీ విషయం అందరికీ తెలియడంతో చర్చనీయాంశంగా మారింది.

http://www.sakshi.com/news/district/serial-killer-kukkapalli-venkateswarlu-tdp-fan-361069?pfrom=home-top-story

వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి


ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి..
అప్పుడే నాయకులు ఆచితూచి హామీలు ఇస్తారు..
టీడీపీ ప్రజాకంటక పాలనపై చైతన్యం తెచ్చేందుకే గడపగడపకూ వైఎస్సార్
-  ‘పశ్చిమ’లో ప్రజలతో వైఎస్ జగన్

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే రోడ్డుపైనే నిలదీస్తారనే భయం రాజకీయ నాయకులకు కలగాలి. ఆ మేరకు ప్రజలు చైతన్యవంతం కావాలి’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే నాయకులు ఆచితూచి హామీలిస్తారన్నారు. లేదంటే చంద్రబాబులాంటి నాయకుడు ప్రతి ఇంటికీ ఒక కారు లేదా విమానమే కొనిస్తాననే వాగ్దానాలు చేస్తాడని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాత్రి నల్లజర్ల మండలం పోతవరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.  వంద మార్కులకు వంద ప్రశ్నలు ఇచ్చి చంద్రబాబు హామీలు అమలు చేశాడా లేదా మీరే తేల్చుకోండని ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పారు.

 ఉండవల్లికి వైఎస్ జగన్ పరామర్శ



 సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మంగళవారం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఉండవల్లి తల్లి లక్ష్మి(99) చనిపోయారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దివంగత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.  జగన్ వెంట ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్లనాని, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.

Popular Posts

Topics :