31 July 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

Written By news on Saturday, August 6, 2016 | 8/06/2016


వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామయ్యతో పాటు పలువురు నేతలు కూడా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.  వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ... జనమంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్సార్ సీపీలో చేరారని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా జనం మత్రం జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గౌరు వెంకటరెడ్డి అన్నారు. రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ సీపీదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

సాక్షాత్తూ ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యం పరిహాసం కాదా?


‘హోదా’తోనే ప్రజలకు సంతృప్తి
ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యం పరిహాసమే
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
రెండున్నర గంటలపాటు వెల్‌లో నినాదాలు
ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్

 సాక్షాత్తూ ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యం పరిహాసం కాదా? అని వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో నినదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ప్రకటన తప్ప మరేదీ సంతృప్తిని ఇవ్వబోదని స్పష్టం చేసింది.  

హోదా కోసం పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. ఉదయం 10.30కు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం లోక్‌సభ సమావేశం కాగానే ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు తాను ప్రత్యేక హోదా అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అయినప్పటికీ సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.  ‘ప్రధాని  వాగ్దానాన్ని నెరవేర్చాలి, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని దాదాపు రెండున్నర గంటలపాటు బిగ్గరగా  నినదించారు.
 
హామీలకు కట్టుబడి ఉన్నాం

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ లేచి ‘అధ్యక్షా! నేను మీ ద్వారా ఆందోళన చేస్తున్న ఏపీ ఎంపీలకు చెబుతున్నా.. ఇదివరకే మేం హామీ ఇచ్చాం. ఆర్థిక మంత్రి కూడా హామీ ఇచ్చారు. మేం ఏపీ ముఖ్యమంత్రితో సంప్రదిస్తూనే ఉన్నాం. ఏపీకి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. మేం ఆ అంశాన్ని పరిష్కరిస్తున్నాం. అందువల్ల సభ్యులు వారి స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగేలా చూడాలి’ అని కోరారు.

ఈ నేపథ్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక వెల్‌లో నుంచి నినాదాలు చేస్తూ ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ప్రకటన తప్ప మరే పరిష్కారం అక్కర్లేదని వాగ్వాదానికి దిగారు. అయితే పక్కనే ఉన్న ఆర్థిక మంత్రి స్పందించలేదు. ఎంపీల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ స్పందిస్తూ... ‘ఇది మీకు న్యాయం కాదు. మీరు మీ సీట్లలో కూర్చొండి’ అని కోరారు. మరోసారి మంత్రి అనంత్‌కుమార్ లేచి ‘ఆర్థిక మంత్రి నిన్న హామీ ఇచ్చారు.  

అందువల్ల ఎంపీలు వారివారి స్థానాల్లో కూర్చోవాలి’ అని పేర్కొన్నారు. అయినప్పటి కీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు మధ్యాహ్నం 1.30కు సభ వాయిదా పడేంతవరకు తమ ఆందోళన కొనసాగించారు.  
 
ఆంధ్రప్రదేశ్‌లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, రోడ్డు రవాణ వ్యవస్థ, రైల్వే, విమాన సౌకర్యాలు ఉండడంతో.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. హోదా వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. అందు వల్లే వైఎస్సార్‌సీపీ హోదా కోసం ముందు నుంచి పోరాడుతోందన్నారు. ఎంపీలు వరప్రసాదరావు, బుట్టా రేణుకలతో కలిసి శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

కక్షలను ప్రేరేపిస్తున్న పరిటాల వర్గం


కనగానపల్లి: వర్గ విభేదాలతో ఫ్యాక్షన్‌ కక్షలను ప్రేరేపించేందుకు పరిటాల వర్గం ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తన సొంత రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పరిటాల సునీత ఎలాంటి కృషి చేయలేదని అన్నారు.  ఆగస్టు నాటికి హంద్రీనీవా జలాలను ఈ ప్రాంతంలోని 1,160 చెరువులకు అందిస్తామంటూ హామీలు గుప్పించిన మంత్రి... తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు.


ఈ విషయం పక్కదారి పట్టించేందుకు మంత్రి తనయుడు శ్రీరాం, అనుచరులు పథకం ప్రకారం నియోజకవర్గం లో వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం మాదిరి గానే నియోజకవర్గాన్ని మొత్తం సమస్యాత్మక ప్రాంతంగా మార్చి తమ పబ్బం గడుపుకునేందుకు పథకం వేశారని ఆరోపించారు. అధికార టీడీపీ వైఫల్యాలపై ప్రజలు చైతన్యవంతులై ఎక్కడికక్కడ నిలుదీస్తుంటే సహించలేక ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, ఇందుకు ధర్మవరం డివిజన్‌లోని పోలీస్‌ అధికారులు అండగా నిలవడం శోచనీయమని అన్నారు. పరిటాల వర్గీయుల దురాగతాలకు చెక్‌ పెట్టేందుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

పుష్కరాలను బాబే తెచ్చారా?

పుష్కరాలను బాబే తెచ్చారా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, కృష్ణా పుష్కరాలను తానే తీసుకొస్తున్నట్లు అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చంద్రబాబుకు ప్రచార యావ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోందని విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాలలో 30 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా పుష్కరాలలో కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు. గుడుల కూల్చివేత, పుష్కరాలలో దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 23 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో  చెప్పాలని అన్నారు. 

ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి

పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారంటూ చంద్రబాబు పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌సీఏఈఆర్ సర్వేలో అవినీతిలో ఏపీ నంబర్ 1గా నిలిచిందేంటని బాబును ప్రణబ్ ప్రశ్నించి ఉంటారని చెప్పారు. దేన్నయినా ట్విస్ట్ చేసి చెప్పడం, ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు అంతటి ఘనాపాఠి ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.

మరిగిన రక్తాన్ని ఏం చేశారు?

ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును చూసి తన రక్తం మరిగిపోతోందంటూ ప్రెస్‌మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తన మరిగిన రక్తాన్ని ఏం చేశారో చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీరును చూసి కేంద్రం ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్

Written By news on Thursday, August 4, 2016 | 8/04/2016


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై లోక్‌ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు వరుసగా నాలుగో రోజూ ఆందోళన కొనసాగించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తగా జీరో అవర్ మాట్లాడాలని స్పీకర్ సుమిత్రా మహాజన సూచించారు.

ప్రత్యేక హోదా తక్షణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 26 నెలలు గడిచిందని, ఇంకా కాలయాపన చేయొద్దన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎంపీలు లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.

అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం


అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం
నెల్లూరు :
భారతదేశానికి స్వాతంత్ర్య సాధన కోసం పోరాటం జరిగినప్పుడు అప్పటికి చంద్రబాబు నాయుడు పుట్టకపోవడం మనం చేసుకున్న అదృష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నెల్లూరు శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటం నాటికి ఈయన పుట్టి ఉంటే.. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం, తొందర ఏముంది, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అనేవారని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం ఒక్కటి వస్తే సరిపోతుందా.. ఇంక ఏమీ అవసరం లేదా అనేవారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమని, ఇప్పుడు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న ఖర్మ అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 
 
  • ప్రత్యేక హోదాకు సంబంధించి చర్చ జరుగుతున్న కార్యక్రమంలో నాకన్నా ముందు దాదాపు 40 మంది విద్యార్థులు, యువత.. అందరూ మాట్లాడారు
  • నేను వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి ప్రొఫెసర్ మాల్యాద్రి, శ్రీనివాస్, రామిరెడ్డి, విద్యార్థి నాయకులు విశ్వరూప ఆచారి, శ్రావణ్ కుమార్, సుధీర్ గౌడ్, రూప, సలామ్, జక్కంపూడి రాజా.. అందరూ హోదా గురించి మాట్లాడారు
  • ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు.. అందరినోటా వచ్చే మాట ఒక్కటే. అందరం చదువుకుంటున్నాం.. కొందరి చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు
  • చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలని ఎవరు అనుకుంటున్నారు.. దాదాపు ప్రతి చెయ్యీ పైకి ఎత్తారు
  • చదువులు అయిపోయాక ఉద్యోగం కావాలన్న నినాదం ప్రతిస్వరం చేస్తోంది
  • మనకు ఉద్యోగాలు కావాలంటే.. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటి?
  • ఎన్నికలకు ముందు ఏ గోడ చూసినా, ఏటీవీలో ప్రకటన చూసినా.. ఆయన ఏం మాట మాట్లాడినా ప్రతి నోటా ప్రతిరోజూ వినిపించింది.. జాబు కావాలంటే బాబు సీఎం కావాలన్నారు
  • బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబులు మనకు వచ్చాయా.. 
  • రాష్ట్రంలో బాబు సీఎం అయ్యేసరికి లెక్కలు కట్టి 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలుకట్టారు
  • ప్రతి ఇంటికీ ఉద్యోగం, అది ఇవ్వకపోతే ఇంటికి 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు
  • ఆ ఉద్యోగాల కోసం నెలల తరబడి సిటీలలో ఏపీపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు
  • రెండు, మూడు రూపాయల వడ్డీకి దానికోసం తల్లిదండ్రులు అప్పులు తీసుకుని పిల్లలకు డబ్బు పంపుతున్నారు
  • రెండేళ్ల నుంచి పిల్లలు చదువుతున్నా, ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టిన పాపాన పోలేదీ పెద్దమనిషి
  • కనీసం ఎప్పుడు పెడతామో ఆ తేదీ కూడా ప్రకటించలేదు
  • చంద్రబాబు రెండేళ్లలో చేసిందేంటి అంటే.. డీఎస్సీ పరీక్షలు పెట్టారుగానీ ఫలితాలు రాలేదు
  • మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే ఉద్యోగాలు రావడం సాధ్యమవుతుంది. ఆ హోదాను కూడా నీరుగారుస్తున్నారు
  • హైదరాబాద్ లాంటి నగరాన్ని రాష్ట్రం నుంచి విడగొట్టేటప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే కాంగ్రెస్,  ఇదే బీజేపీ పార్లమెంటు సాక్షిగా అందరూ ఒకే మాట అన్నారు
  • హైదరాబాద్ లాంటి నగరం పోతోంది, కాబట్టి హైదరాబాద్‌లోనే 95 శాతం ఐటీ పరిశ్రమలున్నాయి, 70 శాతం ఉత్పాదక రంగం కూడా అక్కడే ఉంది, అలాంటి నగరం కట్టడానికి 60 ఏళ్లు పట్టింది.
  • చదివిన ప్రతి పిల్లాడూ ఉద్యోగం కోసం నేరుగా హైదరాబాద్‌కే వెళ్తాడు
  • ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై కలిసికట్టుగా చెప్పాయి. 
  • పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఇద్దరూ ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టారు
  • ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ వాళ్లు ఐదేళ్లు చాలదు.. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు
  • చివరకు రాష్ట్రాన్ని విడగొట్టారు.. తర్వాత ఎన్నికలు జరిగాయి
  • ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబు ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించారు
  • తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని అందులో తెలిపారు
  • ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఇదే పార్లమెంటులో నిస్సిగ్గుగా చెబుతున్నారు
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు
  • ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మన రాష్ట్రానికి జరిగే మేలు ఏంటో తెలుసా అని అడుగుతున్నా
  • ప్రత్యేక హోదా వల్ల ప్రధానంగా రెండు మేళ్లు జరుగుతాయి
  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటు, 10 శాతమే రుణం అవుతుంది
  • అంటే ఆ 90 శాతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు
  • ఆ హోదా లేకపోతే గ్రాంటు నిధులు కేవలం 30 శాతం, రుణం 70 శాతం అవుతుంది
  • రెండోమేలు మనందరికీ సంబంధించినది
  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పారిశ్రామిక అభివృద్ధికి ఇన్సెంటివ్స్ ఇస్తారు.
  • వందశాతం ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, కరెంటు 50 శాతం సబ్సిడీతో దొరుకుతుంది
  • వాళ్లు ఉత్పత్తి చేసే వస్తువులకు రవాణా ఖర్చు కూడా తిరిగి వెనక్కి ఇస్తారు
  • ఈ రాయితీలన్నీ కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే ఉంటాయి
  • ఈ రాయితీలుంటే చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను తేవడానికి ఎక్కడెక్కడికో వెళ్లక్కర్లేదు
  • చైనా, సింగపూర్, దావోస్, రష్యా వెళ్లాల్సిన అవసరం ఉండదు
  • ఇలాంటి పారిశ్రామిక ఇన్సెంటివ్‌లు ఉంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి క్యూకడతారు
  • లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, వేలసంఖ్యలో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేపరిస్థితి ఏర్పడుతుంది
  • మనకు ప్రత్యేక హోదా వస్తే, నో వేకెన్సీ బోర్డులు కాదు.. వాంటెడ్ బోర్డులు కనిపిస్తాయి
  • ఇలాంటి రాయితీలుంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది
  • ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు దీన్ని నీరుగారుస్తున్నారు
  • ఎన్నికలు అయిపోయాక మోదీ, చంద్రబాబు కలిసి ప్రజలకు టోపీ పెడుతున్నారు
  • చంద్రబాబు తెలంగాణలో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించేందుకు డబ్బులిస్తూ ఎప్పుడు ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారో.. ఆరోజే ప్రత్యేక హోదాకు తెరపడింది
  • ఇక ఆయన మోదీని ప్రశ్నించే పరిస్థితి లేదు
  • ఇదే చంద్రబాబు మోదీని గట్టిగా ప్రశ్నిస్తే.. ఆయన సీబీఐని రంగంలోకి దింపుతారేమోనని భయం
  • నీకు చిత్తశుద్ధి ఉందా అని చంద్రబాబును అడుగుతున్నా
  • అది ఉంటే.. మోదీకి ఒక టైం ఇచ్చి, ఆ సమయంలోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేరని అడుగుతున్నా
  • ఇవ్వకపోగా.. ప్రత్యేక హోదాను చంద్రబాబు దగ్గరుండి నీరుగారుస్తారు
  • ఇదేమైనా సంజీవనా, అది వస్తే అన్నీ జరిగిపోతాయా అంటారు
  • కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని కూడా ఆయన అన్నారు
  • ఈ తీరు చూసి చంద్రబాబే ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, మోదీగారికి ధైర్యం పెరిగిపోయింది
  • అందుకే వాళ్లు పార్లమెంటులోనే హోదా ఇవ్వం పో అని చెప్పారు
  • ఎన్నికలకు ముందు అదే పార్లమెంటు సాక్షిగా ఇస్తామన్న హోదాను.. ఇప్పుడు మళ్లీ అదే పార్లమెంటులో ఇచ్చేది లేదని చెప్పినా, చంద్రబాబుకు సిగ్గురాలేదు.
  • జైట్లీ పార్లమెంటులో అలా మాట్లాడాక చంద్రబాబు బయట ప్రెస్ మీట్ పెట్టారు
  • అప్పుడైనా చంద్రబాబులో పౌరుషం వస్తుందని ఎదురు చూశాం
  • కానీ చంద్రబాబు ఏమన్నారో చూస్తే బాధ కలిగింది
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతామని చెప్పారు
  • మీరెవ్వరూ మోదీని తిట్టకండి, బీజేపీని ఏమీ అనకండి, పార్లమెంటులో గొడవ చేయకండని ఎంపీలకు ఉద్బోధ చేశారు
  • ఇలాంటి సీఎం పరిపాలన చేస్తే ఇక మనకు ప్రత్యేక హోదా వస్తుందా అని అడుగుతున్నా
  • స్వాతంత్ర్యం కోసం పోరాడేటప్పుడు ఆ సమయంలో చంద్రబాబు పుట్టకపోవడం మన అదృష్టం
  • అప్పుడు ఈయన పుట్టి ఉంటే.. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం, తొందర ఏముంది, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అనేవారు
  • స్వాతంత్ర్యం ఒక్కటి వస్తే సరిపోతుందా.. ఇంక ఏమీ అవసరం లేదా అనేవాడు
  • ఆరోజు చంద్రబాబు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం
  • ఇప్పుడు ఆయన సీఎంగా ఉండటం మనం చేసుకున్న ఖర్మ
  • ప్రత్యేక హోదాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు, పార్లమెంటులో అబద్ధాలు చెబుతున్నారు
  • 14వ ఆర్థికసంఘం ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదని జైట్లీ చెప్పారు
  • కానీ జైరాం రమేష్‌కు 14వ ఆర్థికసంఘం సభ్యుడు రాసిన లేఖలో.. అసలు తాము ప్రత్యేక హోదా ఇవ్వద్దని అననే అనలేదని చెప్పారు
  • ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారా లేదా అని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటును అడిగారు
  • దానికి వచ్చిన లిఖిత సమాధానంలో.. ఆ హోదాను ఉపసంహరించుకునే ఆలోచన ఏమీ లేదని తెలిపారు
  • ఒకవైపు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ, మరోవైపు మీరే 14వ ఆర్థికసంఘం ఇవ్వద్దని చెప్పిందంటారు
  • ఇలా పొంతన లేకుండా మాట్లాడుతుంటే.. ఇంతమంది కుట్రపన్ని ఒక రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా చూస్తుంటే పార్లమెంటరీ వ్యవస్థను చూసి తలదించుకోవాలనిపిస్తోంది
  • ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి
  • ఎన్నికల సమయంలో ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఒక మాట చెబితే.. దానిమీద నిలబడే కార్యక్రమం జరగాలి
  • ఎన్నికల సమయంలో గోడల మీద రాసిన రాతలేంటి.. రైతుల బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నారు.
  • డ్వాక్రారుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు
  • ఇంటింటికీ జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
  • ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
  • ఇలా మోసాలు చేస్తున్నవాళ్లు, అబద్ధాలు చెప్పేవాళ్లు రేపు ఏం చెబుతారంటే.. ఇంటికి మూడు కిలోల బంగారం కావాలంటే, ఇంటింటికీ విమానం కావాలంటే, కారు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటారు
  • ఇలా అబద్ధాలు చెప్పేవాళ్లను నిలదీసే పరిస్థితి రావాలి
  • ఈ పోరాటం ఆగదు.. రాబోయే రోజుల్లో కూడా కొనసాగిద్దాం, మరింత గట్టిగా కొనసాగిద్దాం
  • అలా ముందుకు తీసుకెళ్తేనే ప్రత్యేక హోదా ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది
  • పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరుతున్నా
  • మీ అందరి అభిమానాలకు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. 

రేపు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన

Written By news on Wednesday, August 3, 2016 | 8/03/2016

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి జరగనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు.

విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు హాజరు కావాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు.

ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016


ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ .. ఐఐటీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. ఒక్కో ఐఐటీకి ఒక డైరెక్టర్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఐఐటీకి రూ. 1,750 కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం రూ. 60 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు.

ప్రస్తుతం తిరుపతి ఐఐటీలో నాలుగు కోర్సులు మాత్రమే ఉన్నాయని విజయ సాయిరెడ్డి అన్నారు. కోర్సులు, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుపతి ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను కూడా ప్రారంభించాలని  ఆయన  కోరారు.

ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే లోకేష్ మింగేస్తాడు


'చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలి'
 ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష
 పోలీసు బలగాలతో హోదాను అడ్డుకోలేరు
 ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే లోకేష్ మింగేస్తాడు
దద్దమ్మ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారు
 గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని


గుడివాడ(కృష్ణా జిల్లా) : ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, ఇప్పటికైనా చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హితవు పలికారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి హోదా కావాలని తమ వాణిని బంద్ ద్వారా వినిపించారన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి దద్దమ్మ చంద్రబాబు తన డ్రామాలు మానుకోవాలని సూచించారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి మోదీ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు.

హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికే..
పోలీసులతో నాలుగు బస్సులు బలవంతంగా నడిపించి రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికి చంద్రబాబు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నాడని నాని మండిపడ్డారు. రాజకీయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు రాష్ట్ర ప్రజలకు తన స్వప్రయోజనాలకోసం వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా అవసరంలేదు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని అడిగిన చంద్రబాబు.. ఆ డబ్బు వస్తే తండ్రీ కొడుకులు దోచుకోవచ్చని అనుకున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను పాల్గొన్నారు.

చంద్రబాబుపై ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముడిపడి ఉన్నందున ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రజలు బంద్ ను విజయవంతం చేయడం ద్వారా స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మహిళలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉదయం నుంచే ప్రజలు గుంపులుగా వీధుల్లోకి వచ్చి బంద్ లో పాల్గొన్నారు. ప్రతి పట్టణంలోనూ తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేశారు.

బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ఉపయోగించి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. ఇళ్లల్లోంచి బయటకు వస్తూనే కొందరు నేతలను అరెస్టులు చేసి సాయంత్రం వరకు వదిలిపెట్టలేదు. బస్సు డిపోల వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించి బస్సులు నడపడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. రోడ్లపై యువకులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిర్వహించే భారీ ర్యాలీలను పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేయగా దాన్ని సాధించుకోవాలన్న డిమాండ్ కోసం బంద్ పాటిస్తుండగా, ఆ బంద్ ను నీరుగార్చాలని అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం పట్ల అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉండటంతో పోలీసుల మాత్రం పలు చోట్ల మహిళలని కూడా చూడకుండా చితకబాదారు. వేలాది మందిని అరెస్టులు చేసి నిర్భంధించారు.

ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు పెద్దఎత్తున స్పంధించి బంద్ ను విజయవంతం చేసిన పరిణామం అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్ కోసం ఒకరు పోరాటం చేస్తుంటే దానికి మద్దతునివ్వకపోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి తప్పు చేశామని పలువురు నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. టీడీపీ చర్యల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు బంద్ ను విజయవంతం చేయడం పట్ల రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని నొక్కి చెప్పారు.

ఈరోజు ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల రాత్రి అయ్యే వరకు కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే రోడ్లపైకి పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. కార్యకర్తలను చెదరగొట్టడానికి  అనేక చోట్ల లాఠీ ఛార్జీలు చేశారు.

బంద్ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ అవసరమైన మేరకు అధికారులకు ఆదేశారు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్పచ్చంధంగా ముందుకొచ్చి బంద్ ను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి అధికారులపై మండిపడినట్టు తెలిసింది. బంద్ జరగకుండా నిరోధించే విషయంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయాలంటూ ఎమ్మెల్యేలను పురమాయించారు. దాంతో చేసేది లేక ప్రత్యేక హోదా కల్పించాలని తామూ కోరుతున్నామని చెప్పడానికి టీడీపీ నేతలు పలు చోట్ల చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అక్కడక్కడ కనిపించాయి.

Popular Posts

Topics :