04 September 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ దయవల్ల చంద్రబాబు మంత్రయ్యారు

Written By news on Saturday, September 10, 2016 | 9/10/2016


వైఎస్ఆర్ దయవల్ల చంద్రబాబు మంత్రయ్యారు
తిరుపతి: దివంగత మహానేత వైఎస్ఆర్ దయవల్లే నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తొలిసారి మంత్రి అయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 23 ఏళ్లకే శాసనమండలి సభ్యత్వం కోసం ప్రయత్నించానని చెబుతున్న చంద్రబాబు.. ఈ పదవికి 30 ఏళ్లు నిండితేనే అర్హుడనే విషయం మరిచిపోయారని భూమన ఎద్దేవా చేశారు.

ఎవరైతే ప్రత్యేక హోదా కోసం నాడు రాజ్యసభలో హామీ ఇచ్చారో, వాళ్లు అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా అందని ద్రాక్షలా అయిపోయిందని అన్నారు.  చంద్రబాబు ప్రత్యేక హోదా ఆశాదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేంద్రం ఇస్తుందని, నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కాంట్రాక్టు పనుల కోసం, లంచాలు బాగా మేయొచ్చని చంద్రబాబు కేంద్రానికి తల ఊపి 5 కోట్ల ప్రజల ఆశలను చంపేశారని అన్నారు. చంద్రబాబు తేనెపూసిన కత్తి అని, ఆయన పాలనలో అవినీతి ఏరులై పారుతోందని భూమన ఆరోపించారు. ఈ రోజు బంద్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఉదయం 4 గంటలకే విపక్షనేతలను అరెస్ట్ చేయించారని, ప్రత్యేక హోదా నినాదం వినిపించకుండా చేయాలని చూశారని మండిపడ్డారు.

అవసరమైతే చంద్రబాబు కాలర్ పట్టుకుంటాం

అవసరమైతే చంద్రబాబు కాలర్ పట్టుకుంటాం
హైదరాబాద్ :
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో బెంచీలు ఎక్కడమే కాదు.. అవసరమైతే చంద్రబాబు కాలర్ కూడా పట్టుకుంటామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లో నిర్వహించిన బంద్ విజయవంతం అయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా, ఎన్ని నిషేధాజ్ఞలతో కట్టడి చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, బలవంతంగా ఎన్ని బస్సులు తిప్పినా, ఎన్ని కాలేజీలు తెరిపించాలని ప్రయత్నం చేసినా కూడా.. ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడిని, ఆయన చేస్తున్న పనులను, ఆయన నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ బంద్‌ను విజయవంతం చేసినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి అవ్వా, తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు, ప్రతి సంఘానికి పేరుపేరునా ధన్యావాదాలు తెలుపుతున్నా
  • రాష్ట్రవ్యాప్తంగా ఈ బంద్ పిలుపు ఎందుకు ఇచ్చామంటే.. ప్రజలు స్వచ్ఛందంగా దీన్ని విజయవంతం చేయడానికి ఇన్ని అడుగులు ముందుకేసి చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఎందుకు తోడుగా వచ్చారంటే.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తరఫున అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడానికే.
  • హోదా ఇవ్వట్లేదని అరుణ్ జైట్లీ చెప్పినా, చంద్రబాబు అర్ధరాత్రి దాన్ని స్వాగతించడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపి బంద్‌ను విజయవంతం చేశారు
  • సీఎంగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవాలని తాపత్రయపడాల్సిన వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఓటు కోసం కోట్లు ఇస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆ కేసుల నుంచి బయట పడేందుకు ఐదు కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రత్యేకహోదాకు పూర్తిగా మంగళం పాడించే కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించారు
  • ప్రజలు బంద్‌ను విజయవంతం చేస్తే, చంద్రబాబు సిగ్గులేకుండా మళ్లీ ఈరోజు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసి మండలిలోకి వెళ్లి ఆయన మాట్లాడిన మాటలు బాధాకరం
  • మళ్లీ ఆయనవి పాత మాటలే.. హోదా వల్ల ఏం ప్రయోజనం, ఈశాన్య రాష్ట్రాలకు ఏం మేలు జరిగిందని సిగ్గులేకుండా మాట్లాడారంటే, ఈయన మనిషేనా అని అడుగుతున్నా
  • రాష్ట్రాన్ని విడగట్టేటప్పుడు వీళ్లే కదా.. హైదరాబాద్ పోతోంది కాబట్టి ఇంత నష్టం జరుగుతోందని, కాబట్టే ప్రత్యేక హోదా కావాలన్నారు. ఆ హామీ ఇస్తూనే రాష్ట్రాన్ని విడగట్టారు
  • తర్వాత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడమే కాక, తాము అధికారంలోకి వస్తే 15 ఏళ్లు హోదా తెస్తామని చెప్పి, ఎన్నికలు అయిపోయాక మాట మారుస్తూ హోదా వల్ల ఏం ప్రయోజనమని మండలిలో మాట్లాడుతున్నారు
  • ఈ మనిషి నిజంగా పాలించడానికి అర్హుడా? నోరు తెరిస్తే మోసాలు, అబద్ధాలు
  • ఈయన నిన్న సాయంత్రం నుంచే బంద్ విజయవంతం కాకూడదని ఎంతగా ఆరాటపడ్డాడో
  • బంద్‌ను విఫలం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే.. అసలు ఈ మనిషే ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతున్నాడని అనిపిస్తుంది.
  • కేంద్రం ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని అల్టిమేటం ఇస్తే కేంద్రం ఇవ్వకపోతుందా?
  • అది ఇవ్వకపోగా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనడమే కాక, బలవంతంగా ఆర్టీసీ బస్సులు తిప్పడం, అరెస్టులు చేయించడం, బలవంతంగా కాలేజీలు తెరిపించడం.. ఇలా చేస్తుంటే ఈ మనిషి మనిషి కాదు
  • చంద్రబాబు ఎన్ని అడ్డంకులు పెట్టినా, బీజేపీ వాళ్లు ఇవ్వబోమని చెప్పిన సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని పోరాటపటిమ చూపించిన రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.
  • అవసరమైతే ఈ పోరాటం ఎన్నిరోజులైనా చేస్తాం. పాలకుల్లో మార్పు వచ్చేవరకు చేస్తాం
  • అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నవారి నుంచి స్ఫూర్తి తీసుకుంటాం
  • ఇదైతే అసాధ్యం కాదు.. పార్లమెంటు సాక్షిగా మాకిస్తామని చెప్పిన మా హక్కు ఉంది
  • ఇది సాధించేవరకు పోరాటం చేస్తాం.. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి పోరాటానికి మీ అందరి సహకారం కావాలి
  • ఇది ఒక్క జగన్ వల్ల అయ్యే పని కాదు.. జగన్‌కు మీ అందరి మద్దతు, అండదండలు కావాలి
  • బంద్‌ను సఫలీకృతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు

హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు


హోదాకు ప్రత్యామ్నాయం లేదు
► వేల పరిశ్రమలు..  లక్షల ఉద్యోగాలు వస్తాయి
► లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయి..
► హోదాతో దేనినీ పోల్చలేమంటున్న ఆర్థిక నిపుణులు
 ► హోదాకు తగ్గ సాయం అనేది బూటకపు ప్రచారం
 ► జైట్లీ చెప్పినవన్నీ విభజన చట్టంలోని హామీలే

 
సాక్షి, హైదరాబాద్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దానితో సమానంగా నిధులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎల్లోమీడియాలో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. కానీ ప్రత్యేక హోదాకు సమానమైనదేదీ లేదని, ఆంధ్రప్రదేశ్ వంటి పుష్కల వనరులున్న రాష్ట్రానికి అది సంజీవని వంటిదని ఆర్ధిక రంగ నిపుణులంటున్నారు. హోదా ఉన్న రాష్ట్రాలలో అనేక రాయితీలు ఉంటాయి కాబట్టి వందలాది పరిశ్రమలు క్యూ కడతాయని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయో ఊహకు కూడా అందదని ఉత్తరాఖండ్ అనుభవం చెబుతోంది. కానీ ప్రత్యేక హోదాకు పాతరేసి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా చేసి.. విభజన చట్టంలో తప్పని సరిగా అమలు చేయాల్సిన హామీలనే అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వల్లెవేస్తున్నారు.

వాటినే చంద్రబాబు స్వాగతిస్తున్నారు. విభజనతో అన్నీ కోల్పోయి కనీసం రాజధాని కూడా లేకుండా, పరిశ్రమలు లేకుండా, కేంద్ర సంస్థలు లేకుండా నడివీధిలో నిలబడిపోయాం కనుక పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీకే నేడు దిక్కులేకుండా పోయింది.  నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఉండాలని డిమాండ్ చేశారు. పదేళ్లు సరిపోవు.. పదిహేనేళ్లు ప్రత్యేకహోదా సాధిస్తామని ఎన్నికల సభల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. ఎన్నికలు ముగిసాక.. రెండున్నరేళ్లు గడచిపోయాక.. ఇపుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని, సాంకేతిక కారణాలున్నాయని.. ఆర్ధిక సంఘం చెప్పకపోయినా అడ్డుచెబుతోందని..ఇలా పలు సాకులు చెబుతున్నారు.

హోదాతో వేలల్లో పరిశ్రమలు.. లక్షల్లో ఉద్యోగాలు..
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీల వల్ల వేల సంఖ్యలో పరిశ్రమలు తరలి వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉన్నంత కాలం పరిశ్రమలకు ఆదాయపు పన్నులో వంద శాతం రాయితీ ఉంటుంది. వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.

పరిశ్రమలు స్థాపించేందుకు పెట్టిన పెట్టుబడిలో 30 శాతాన్ని ప్రోత్సాహకంగా కేంద్రం ఇస్తుంది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం మరింత పెరిగింది. రాష్ట్రాలు సేల్స్ ట్యాక్స్‌ను విధించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే జీఎస్టీలో కేంద్రం భారీ రాయితీలు ఇస్తుంది.

 బీమా, రవాణా రంగాల్లో భారీ ఎత్తున రాయితీలు ఇస్తుంది. పరిశ్రమలు స్థాపించే వారికి వర్కింగ్ కేపిటల్ కోసం తీసుకున్న రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ, 20 ఏళ్లపాటూ విద్యుత్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. దీని వల్ల పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రానికి బారులు తీరుతారు. ఉద్యోగాలకు కొదువ ఉండదు.

కానీ.. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో పారిశ్రామిక రాయితీల ఊసే లేదు. ఇప్పటికే  అడిషినల్ యాక్సిలరేట్ డిప్రిసియేషన్ 15 శాతం, అడిషనల్ క్యాపిటల్ అలవెన్సు 15 శాతం నిధులు ఇప్పటికే విడుదల చేసామని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆ నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలకు మాత్రమే విడుదల చేస్తామని షరతు విధించడం గమనార్హం.

సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం లోపే ఉంటాయి. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరించాలి. కానీ.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 90 శాతం లభిస్తుంది. మిగతా 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఆ 10 శాతం నిధులను కూడా రాష్ట్రం సమకూర్చుకోలేకపోతే కేంద్రం రుణం ఇస్తుంది. గ్రాంట్‌గా లభించిన 90 శాతంను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసవరం ఉండదు. దీని వల్ల నిధుల సమస్యే ఉండదు. తద్వారా సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయవచ్చు.

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), జైకా(జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) వంటి విదేశీ సంస్థలు, విదేశాల నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టులు చేపడితే.. ఆ రుణంలో 90 శాతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 10 శాతం రాష్ట్రం చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్రం విదేశీ ప్రాజెక్టులను తెచ్చుకునే తాహతును బట్టి కేంద్రం చెల్లించే మొత్తం ఆధారపడి ఉంటుంది.

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి.. తద్వారా రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి ప్రత్యేక హోదా మార్గం సుగమం చేస్తుంది.

విజయవంతంగా బంద్


రాష్ట్రంలో మిన్నంటిన నిరసనలు...
నడవని బస్సులు...తెరుచుకోని వ్యాపార,వాణిజ్య సంస్థలు
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేవలం ప్యాకేజీ ప్రకటించినందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్‌ బంద్ విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపుకు వామపక్షాలు మద్దతు పలకడం, ప్రజలు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో అన్ని పట్టణాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. అయితే బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ముఖ్య నేతలను శుక్రవారం రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. మిగిలిన నేతలను శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల నిర్బంధం ఉన్నా ప్రజలు బంద్ పాటిస్తున్నారు. అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అర్ధరాత్రి ప్రకటన చేశారంటేనే అర్థమవుతోంది

Written By news on Friday, September 9, 2016 | 9/09/2016


చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాల్సిందే
హైదరాబాద్ :
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా చెప్పినా.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడిన తర్వాత ఆయన అసెంబ్లీ కమిటీహాల్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
  • మొన్న అర్ధరాత్రి నుంచి ఈ డ్రామా జరుగుతోంది
  • ఎక్కడైనా రాష్ట్రానికి లేదా ఒక ప్రాంతానికి మేలు జరిగేదో.. అలాంటి ప్రకటన చేస్తే పగటిపూట చేయాలి
  • అలా అయితే ఎక్కువమందికి తెలుస్తుందని అనుకుంటారు
  • ప్యాకేజి గురించి అర్ధరాత్రి వేళ ప్రకటన చేశారంటేనే.. వీళ్లలో నిజాయితీ లేదని అర్థమవుతోంది
  • అదే అర్ధరాత్రి దాటిన తర్వాత అదే ప్రకటనను మన చంద్రబాబు నాయుడు స్వాగతిస్తే.. ఈ పెద్దమనిషికి ఎక్కడ నిజాయితీ ఉందని అడుగుతున్నా
  • నిజంగా ఆరోజు ఎంత బిల్డప్ ఇచ్చారంటే.. పగలంతా కూడా చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ప్యాకేజి వివరాలను పంపారని, ఆయన 17 సార్లు దాన్ని చదివారని, ఆయన ఆమోదం చెప్పిన తర్వాత విదేశాల్లో ఉన్న ప్రధాని దగ్గరకు వెళ్లింది, ఆయన మళ్లీ చంద్రబాబుకు పంపితే ఈయన ఆమోదం తెలిపారని, అరుణ్ జైట్లీ అరగంటలో ప్రకటన చేస్తారని పొద్దుట నుంచి హడావుడి
  • మామూలుగా నేను రాత్రం 9.30 కే పడుకుంటా. ఆరోజు రాత్రి మాత్రం చాలాసేపు మెలకువగా ఉన్నా
  • చివరకు చూస్తే.. ఆయన కొత్తగా ఫలానాది ఇస్తున్నానని ఏమీ చెప్పలేదు.
  • ప్రత్యేకహోదా ఇవ్వబోమని మాత్రం స్పష్టంగా నొక్కి వక్కాణించి చెప్పారు.. అది ఇవ్వకపోవడానికి అబద్ధాలు, కుంటిసాకులు వెతుక్కున్నారు
  • ఇదంతా చంద్రబాబుకు సంబంధించిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు ఇద్దరినీ కూర్చోబెట్టుకుని చెప్పారు
  • బాబుగారేమో అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నానన్నారు
  • కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేమని, ఏదీ తీసుకోకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన అన్నారు
  • చంద్రబాబు కూడా ప్రత్యేకహోదా ఇవ్వట్లేదన్నప్పుడు సీఎంగా ఉన్నవాళ్లు ఏం చేయాలి.. కేంద్రానికి బుద్ధి వచ్చేలా తన మంత్రులను ఉపసంహరించుకుని పోరాడాలి
  • రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఫలానాది చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు కుంటిసాకులు వెతుక్కుని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను ఇవ్వడంలేదని ఎలా చెబుతారని పోరాడాల్సింది పోయి... అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాగతిస్తాడా?
  • 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనం అవుతుంటే.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక తిరుగుతుంటే వాళ్ల భవితను నాశనం చేయడానికి ఈయనెవడు?
  • చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నాడు.. కారణం ఓటుకు కోట్ల కేసు
  • ఏసీబీ కోర్టు ఈయన పాత్రమీద విచారణ చేసి రిపోర్టు దాఖలుచేయాలని ఎప్పుడు ఆదేశించిందో అప్పటినుంచి డ్రామా మొదలైంది
  • వెంటనే చంద్రబాబు కేంద్రంతో బేరసారాలు మొదలుపెట్టారు
  • వాళ్ల కాళ్లు పట్టుకునైనా కేసు కొట్టేయించుకోవాలని అనుకుంటున్నారు
  • ఆయన ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్ల రూపాయల నల్లధనం వెచ్చిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు
  • ఆ కేసు నుంచి బయట పడేందుకు 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. యువతను వెన్నుపోటు పొడిచారు
  • తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
  • అసెంబ్లీలో చంద్రబాబును గట్టిగా నిలదీస్తుంటే.. కనీవినీ ఎరుగని పద్ధతిలో టీడీపీ వాళ్లు, స్పీకర్ ఇద్దరూ కలిసి చంద్రబాబు ప్రకటన చేస్తారని చెప్పారు.. ఎన్నిసార్లు ప్రకటన చేస్తారు?
  • రాష్ట్రానికి నష్టం జరిగే అంశంపై చర్చ జరగాల్సింది పోయి.. ప్రతిపక్షం చెబుతున్న మాటలను కూడా తీసుకుని అరుణ్ జైట్లీ గారికి అర్థమయ్యేలా చేయాల్సింది పోయి చివరకు ప్రతిపక్షం చెప్పే విషయాలను కూడా వినే పరిస్థితి లేదు
  • మొదటిసారిగా ఏ ఎమ్మెల్యే సస్పెండ్ కాకపోయినా అసెంబ్లీలో మార్షల్స్‌ను చూడటం మొదటిసారి
  • చంద్రబాబు ఇంత కంటే దారుణంగా స్పీకర్‌ను వాడుకున్నారు
  • తనకు నచ్చని వారి విషయంలో ఆయన దారుణాతి దారుణంగా ప్రవర్తించారు
  • 1989-94 మధ్య ఆలపాటి ధర్మారావు స్పీకర్‌గా ఉన్నప్పుడు కుర్చీ లాగేశారు, మెడపట్టుకుని తోసేశారు
  • 2004-09లో స్పీకర్‌గా ఉన్న దళిత మహిళ కుతూహలమ్మ కన్నీరు పెట్టుకున్నారు
  • 2009-14 గవర్నర్ ప్రసంగిస్తుంటే చంద్రబాబు చేతులు ఊపుతూ గవర్నర్ మీద దాడి చేయించారు
  • రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు
  • మా రాష్ట్రానికి మీరేమైనా ఫేవర్ చేస్తున్నారా.. ఇది జాతీయ విధానం
  • కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఐఐటీ ఉంది, ఐఐఎం ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ ఉన్నాయి
  • ఇవేమైనా లేకుండా ఎక్కడైనా ఉన్నాయంటే.. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలే
  • దేశంలో 20 ఐఐటీలు, 20 ఐఐఎంలు, 31 ఎన్ఐటీలు ఉన్నాయి 47 సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి
  • ఫీజిబులిటీ ఉంటే దుగరాజపట్నంలో పీపీపీ పద్ధతిలో పోర్టు ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందన్నారు
  • ప్రభుత్వరంగ సంస్థలైన సెయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సుల ఏర్పాటుకు పరిశీలిస్తామని చెప్పారు.. అందులో చేసే ఫేవర్ ఏముంది
  • ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్ఆర్‌ జిల్లా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తోంది
  • దీనికోసం అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం, దాన్ని ఈ పెద్దమనిషి స్వాగతించడం
  • ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు.. వనరుల లోటు ఎవరికి ఉన్నా కూడా దాన్ని భర్తీ చేయడం తన విధానం అని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది
  • దీని ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. 11 రాష్ట్రాలకు వనరుల లోటును భర్తీ చేస్తోంది
  • 22,500 కోట్లు మనకివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టే ఇవ్వట్లేదని జైట్లీ అన్నారు
  • 14వ ఆర్థికసంఘం కమిటీ నివేదికలో ఒక్క పేరాలోనైనా అది ప్రత్యేకహోదా వద్దందని మీరు చూపించగలరా?
  • వాళ్లు కేవలం ప్రత్యేక హోదా ఉన్నా, లేకపోయినా ఎవరికైనా రెవెన్యూలోటును భర్తీ చేయడానికి తేడా చూపించబోమన్నారు తప్ప.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా తీసేయమని ఎప్పుడూ చెప్పలేదని ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ స్వయంగా చెప్పారు
  • పోనీ అసలు వేరే రాష్ట్రానికి దేనికీ ఇవ్వట్లేదా అంటే.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా తీసేసే ఆలోచన ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా మంత్రి సమాధానం ఇచ్చారు
  • పోనీ ఈ ఆర్థికసంఘం చెప్పినది తప్పనిసరిగా పాటించి తీరాలన్న నిబంధన కూడా ఏమీ లేదు
  • దాని ప్రతిపాదనలను ఆమోదించాలా.. వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు
  • ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు ఎందుకంత గట్టిగా అడిగారు, ఇస్తామన్న హామీతోనే రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారు.. అదంత ముఖ్యమని ఎందుకు అందరికీ అనిపించింది
  • మన నుంచి హైదరాబాద్ నగరం వెళ్లిపోయింది. ఉత్పాదక రంగంలో 70 శాతం, ఐటీలో 98 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ నగరం లేకపోతే దానికి కాంపన్సేట్ చేయాలి.
  • అందుకే ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
  • ఆ హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఉంటాయి
  • పన్నుల్లో నూరుశాతం రాయితీ, రవాణా చార్జీల రీయింబర్స్‌మెంట్, వడ్డీరేటు 3 శాతం, కరెంటు చార్జీలు సగం రాష్ట్రానికే ఇవ్వడం.. ఇవన్నీ హోదా లేని రాష్ట్రాలకు లేవు
  • అందుకే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఈ హోదా కోసం అంత గట్టిగా పట్టుబట్టారు
  • ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారు, వేలల్లో ఉద్యోగాలు వస్తాయి
  • చివరకు ఈవాళ జీఎస్టీ ఆమోదం పొందిన పరిస్థితుల్లో చూస్తే, జీఎస్టీలో కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును నూరుశాతం ఇస్తామని ఇప్పుడేదో కొత్తగా చెప్పినట్లుగా చూపించారు
  • అసలు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఎప్పుడో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రటించారు
  • పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడుతుందని, అందులో ఎవరూ అనుమానించక్కర్లేదని మన్మోహన్ అప్పట్లో చెప్పారు
  • పోలవరం ప్రాజెక్టు ఖర్చులో రాష్ట్రం ఇంత, కేంద్రం ఇంత పెట్టాలని ఎప్పుడూ చర్చ రాలేదు
  • కేంద్రాన్ని వీళ్లు ఇప్పుడే ఒత్తిడి చేసినట్లు, ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంటోందని అన్నట్టుగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు చెబుతున్నారు
  • ఏపీలో వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు ఇస్తున్నారట. అది ఏ మూలకు సరిపోతుంది? ఏదో ముష్టి వేసినట్లు వేస్తున్నారు
  • రెవెన్యూలోటును భర్తీ చేస్తామని అన్నారు.. ఇది పునర్విభజన చట్టంలో ముందే లేదా.. అది కాక కొత్తగా ఏం చేస్తున్నారు
  • అంతర్జాతీయ విమానాశ్రయాల అంశం 13వ షెడ్యూలులో లేదా
  • కొత్తగా స్పెషల్ ప్యాకేజి అని మీరు ఏం చెబుతున్నారో.. అవన్నీ ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నవి కావా, దాని ప్రకారం మాకు రావల్సినవి కావా
  • మాకు రావల్సినవే ఇస్తూ .. ఏదో కొత్తగా ఇస్తున్నట్లు పోజులు కొట్టడం ఎంతవరకు ధర్మం
  • ఇలాంటి సీఎం ఉండే ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగదా
  • చరిత్ర హీనుడిగా మిగిలిపోతావన్న విషయం మర్చిపోవద్దని చంద్రబాబుకు చెబుతున్నా
  • రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.. ఇది మన పోరాటం, మన హక్కు. వదిలేస్తే ఎవరూ పట్టించుకోరు
  • చంద్రబాబు స్వాగతించినా, ఎవరు స్వాగతించినా దీన్ని వదిలే పరిస్థితిలేదు. దీని కోసం పోరాటం చేయాలి
  • కేసీఆర్ వదిలేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు
  • ఎవరూ సాధ్యం కాదనుకున్న రాష్ట్రమే వచ్చినపుడు.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట కోసం పోరాడితే రాదని అనుకోవక్కర్లేదు
  • చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నంతకాలం ఆలస్యం కావచ్చేమో.. మనం పోరాటం చేసి ఇప్పించుకోవచ్చు
  • ఈవాళో, రేపో, ఒక నెలలోనో వస్తుందని చెప్పను.. పోరాటం ఆపేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు
  • పోరాటంలో ఒక అడుగు ముందుకు వేస్తూ.. బంద్‌కు పిలుపునిచ్చాం
  • చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తి చూపించేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నాం
  • రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లాలి
  • ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇది యువతకు సంబంధించిన అంశం
  • ప్రత్యేక హోదా వస్తేనే జీఎస్టీ మినహాయింపులు, ఆదాయపన్ను మినహాయింపు వస్తాయి
  • ఇవి ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి
  • ఈ పోరాటం మన పిల్లల కోసం చేస్తున్నామని మర్చిపోకూడదు
  • రేపు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్‌ను విజయవంతం చేయండి
  • ఈ బంద్‌ను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తారు
  • నేను నిరాహార దీక్ష చేస్తుంటే.. మోదీ రావడానికి రెండు రోజుల ముందు నన్ను ఎత్తేశారు
  • కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క అక్కా చెల్లెలు, అన్నాతమ్ముడు అందరినీ కోరుతున్నా
  • రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘం దీనికి మద్దతివ్వాలని కోరుతున్నా

కేంద్రం ముష్టి వేస్తే చంద్రబాబు స్వాగతిస్తారా


హైదరాబాద్‌: కేంద్రం ముష్టి వేస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తారా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై యువకులు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. యువకులు, ఏపీ ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడుతున్నామని రఘుపతి తెలిపారు. అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.

మార్షల్స్ ను పెట్టి ప్రతిపక్షాన్ని బుల్డోజ్‌ చేస్తారా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అధికారపక్షం ఎన్నికుట్రలు చేసినా ప్రత్యేక హోదా పై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు.

మార్షల్స్‌ ను ముందే మోహరించడంలో అంతరార్ధమేమిటని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఏదో ఒకరకంగా సభను అడ్డుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని తెలిపారు.

మార్షల్స్‌ మాపై దాడి చేస్తారా..?


మార్షల్స్‌ మాపై దాడి చేస్తారా..?
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రకటన చేసి తర్వాత.. విపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి మండిపడ్డారు. పోడియం వద్ద తాము శాంతియుతంగానే ఆందోళన చేశామని ఆయన తెలిపారు. మార్షల్సే తమపై దాడి చేశారన్నారు. మార్షల్స్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

అబద్ధాలు, అవాస్తవాలతో పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. మార్షల్స్‌ తమపై దాడి చేస్తారా..అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసే అధికారం మార్షల్స్‌కు ఎక్కడిదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ నిరంతర పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి మేలు జరిగేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామని చెవిరెడ్డి అన్నారు.


మార్షల్స్‌ పై దాడి చేశారనడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. విభజన హామీలపై చర్చ అంటే ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ముందు చర్చ జరగాలని సూచించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు గమనించాలన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తామేమైనా దొంగలమా, లేక రౌడీలమా అంటూ.. ఎందుకు మార్షల్స్ ను పెట్టారని ధ్వజమెత్తారు. తాము చేసే పోరాటం ప్రత్యేక హోదా కోసమే అన్నారు.

ప్రత్యేక హోదా వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ఓటుకు కోట్లు కేసు వల్లే బాబు హోదాను తాకట్టు పెట్టారు: ఎమ్మెల్యే సునీల్‌

చంద్రబాబుకు పదవులపైనే ఎక్కువ ఆశ:ఎమ్మెల్యే నారాయణ స్వామి

ఇద్దరు కాంట్రాక్టర్లను కేంద్రం వద్దకు పంపించి, ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. కేంద్రం ప్రకటనను బాబు ఎలా స్వాగతిస్తారు: ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా

రెండోరోజు కూడా ...


హోదా అంశంపై అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది.  ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో హోరెత్తింది. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. ప్రజలందరూ కోరుకొంటున్నట్లుగా ఈ అంశంపై చర్చించాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ముందు ప్రకటన చేస్తామని ఆ తర్వాతే చర్చ చేపట్టాలని  అధికార పక్షం స్పష్టం చేసింది. విపక్షం మాత్రం ప్రభుత్వ ప్రకటనకు తాము ఒప్పుకునేది లేదని,  ముందు చర్చ చేపట్టాలని తెలిపింది. ప్రశాంతంగా ప్రారంభమైన సభలో అధికార పక్షం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారించింది.

చర్చకు పట్టుబట్టిన విపక్షానికి సర్దిచెప్పాల్సిన అధికార పక్షం అనవసర వ్యాఖ్యలు చేసింది. లోటస్‌ పాండ్‌ రూల్స్‌ సభలో నడవవంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. సభను 15 నిమిషాలు కూడా నడవకుండా విపక్ష సభ్యులు వ్యవహారిస్తున్నారన్న చీఫ్‌ విప్‌ వ్యాఖ్యలు సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి.
దీంతో ఆగ్రహించిన విపక్ష సభ్యులంతా స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ గట్టిగా నినదించారు. పోడియం దగ్గర మార్షల్స్‌ విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  కొంత మంది ఎమ్మెల్యేలతో మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

రేపు రాష్ట్ర బంద్


రేపు రాష్ట్ర బంద్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగానే...
జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు?
ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బాబు సీఎంగా ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాల్సిందే

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా తేల్చి చెప్పినందుకు, ఆయన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినందుకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ అరుణ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేక హోదా అనే ది చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనను ఆహ్వానించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
హోదా పోరును ఉధృతం చేయాలి

ప్రజలంతా కలిసికట్టుగా బంద్‌ను విజయవంతం చేసి, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ కోరారు. గురువారం అసెంబ్లీకి రావడానికి ముందు తాను కమ్యూనిస్టు పార్టీల నేతలతో మాట్లాడానని, హోదా పోరాటంలో వారి సహకారం కోరానని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేయాలని అన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు గురువారం వైఎస్ జగన్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ ప్రాంగణంలోకి పాదయాత్రగా వెళ్లారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా పాదయాత్రకు సంఘీభావంగా వెంట నడిచారు. అంతకుముందు అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జైట్లీ, బాబు కలిసి రాష్ట్ర ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించి రాత్రిపూట అరుణ్ జైట్లీ ప్రకటన చేయడం, చంద్రబాబు అర్ధరా త్రి తరువాత మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
 
యువత ఆశలను ఖూనీ చేశారు
‘‘అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటనలు చేసే పరిస్థితి చూస్తుంటే ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదనే విషయం స్పష్టమవుతోంది. నిజాయితీ ఉంటే, తాము తప్పు చేయడం లేదని భావిస్తే పట్టపగలే ప్రకటనలు చేసే వాళ్లు కానీ ఇలా అర్ధరాత్రి పూట చేయరు. వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు. విభజన వల్ల నష్టపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మరింత సుస్పష్టంగా చెప్పినట్లు అర్థమవుతుంది.

ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుందని బుధవారం ఉదయం నుంచీ చంద్రబాబు మీడియాకు లీకులిస్తూ ఊదరగొట్టారు. అది చూసి ప్రత్యేక హోదాతో కూడిన ప్యాకేజీ వస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. చివరకు ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ కాదు కదా... ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతూ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి ప్రజల చెవుల్లో క్యాబేజీ ఎలా పెట్టాలో చెప్పి మరీ ఆ కార్యక్రమం చేయించారు. ప్రత్యేక హోదా అంటే అదేదో డబ్బుల రూపంలో ఇచ్చి పుచ్చుకునేదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగించారు. కానీ, వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కాదు.

హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకు లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడి యువత ఆశలను ఖూనీ చేసే విధంగా ఉంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం.
 
మనం స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి
చంద్రబాబును ప్రశ్నిస్తున్నా... అసలు జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి ఆయనెవరు? ఇదేమైనా చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తా? ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అందరమూ ఒక్కటవుదాం. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటప్పుడు మనం వెంటనే స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటున్నాను, మీకు మద్దతు కొనసాగించను అని ఏరోజైతే చంద్రబాబు చెబుతారో ఆరోజే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

చంద్రబాబుపై ఒత్తిడి పెరగాలన్నా... ఆయన మనసు మారాలన్నా... రాష్ట్ర ప్రజలంతా కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఒప్పుకోబోమని బంద్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. రాష్ట్రానికి హోదా కోసం అసెంబ్లీలో కూడా మేము గట్టిగా పట్టుపడతాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్రం చేసిన ప్రకటనకు నిరసనగా ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
 
బాబు ఆమోదం తర్వాతే కేంద్రం ప్రకటన
‘‘చంద్రబాబులో నిజాయితీ, విశ్వసనీయత, విలువలు లేవు. ఆయన తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒకసారి చెప్పారు. ప్రజలు తిరగబడేసరికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. గతంలో జైట్లీ చేసిన ప్రకటనతో తన రక్తం మరిగిపోయిందని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ఆ రక్తం మురిగిపోయిందా? కుళ్లిపోయిందా? చంద్రబాబు స్వయంగా రూపొందించిన డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని తన మంత్రులకు పంపించి జైట్లీ చేత చదివించారు. దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రాఫ్టుకు ఆమోదం తెలిపిన తరువాతే కేంద్రం ప్రకటన చేసిందని నేను మీడియాలో విన్నాను. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకే జైట్లీ ప్రకటనను ఆహ్వానించారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
 
5 కోట్ల మందిని అమ్మేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో రాజీపడి, తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అమ్మేశారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తొలి నుంచీ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారని జగన్ దుయ్యబట్టారు. నిన్న టీవీలు చూసిన వారంతా చంద్రబాబు సీఎంగా ఉండటం ఖర్మగా భావించారని చెప్పారు.
 
విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టు
‘‘నిజంగా బుధవారం చంద్రబాబు డ్రామాను బాగా రక్తి కట్టించారు. ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టడం తగదు. విభజన చట్టంలోని అంశాలనే ప్యాకేజీ అంటూ కేంద్రంతో చెప్పించారు. ప్రత్యేక హోదాకు కత్తెర వేశారు. రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలి. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మిగిలిన కారిడార్‌లు కూడా విభజన చట్టంలోనే ఉన్నాయి. చట్టంలోని అంశాల విలువలన్నీ కలిపేసి అదే కొత్తగా ప్యాకేజీ అంటున్నారు. హక్కుగా రావాల్సిన వాటికి, ప్రత్యేక హోదాకు కేంద్రం కత్తెర వేస్తుంటే చంద్రబాబు ఆనందించడానికి ఓటుకు కోట్లు కేసే కారణం. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు.

నాడు మరిగిన రక్తం.. నేడు మురిగిపోయిందా?

Written By news on Thursday, September 8, 2016 | 9/08/2016


నాడు మరిగిన రక్తం.. నేడు మురిగిపోయిందా?
హైదరాబాద్ :
అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని, ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడేందుకు 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని జగన్ మండిపడ్డారు.

తన మంత్రులను పక్కన కూర్చోబెట్టి జైట్లీతో ప్రకటన ఇప్పించారని, గతంలో జైట్లీ ప్రకటన చూసి రక్తం మరిగిందన్న చంద్రబాబుకు.. ఇప్పుడు రక్తం మురిగిపోయిందా అని ప్రశ్నించారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చారని, చంద్రబాబు లాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అని విమర్శించారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అమ్మేశారని, ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ మాట‍్లాడుతుండగానే మైక్ కట్


వైఎస్ జగన్ మాట‍్లాడుతుండగానే మైక్ కట్
హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గొంతును అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వం మరోసారి నొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. హోదాపై చర్చ చేపట్టాలంటూ సర్కారును నిలదీస్తున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మైక్‌ను స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పదే పదే కట్‌ చేశారు. పైగా మైక్‌ను మిస్‌యూజ్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ సీపీ సభను స్తంభింపచేసిన విషయం తెలిసిందే.

మేం ఆహ్వానిస్తున్నామంటారా?


ప్రెస్ మీట్ పెట్టి...మేం ఆహ్వానిస్తున్నామంటారా?
హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించామనడంపై  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం ప్రెస్ మీట్ ...మేం ఆహ్వానిస్తున్నామని అంటారా అని ఆయన ప్రశ్నించారు.
గురువారం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ రెండుసార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తామని, ప్రకటన అనంతరం ప్రతిపక్షం తమ అభ్యంతరాలు చెప్పవచ్చని అన్నారు. అయితే తక్షణమే ఈ అంశంపై చర్చను ప్రారంభించాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది.

కాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే సంతోషమని, ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే దానికి సమానంగా నిధులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన  ప్రకటనపై బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్


ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఎల్లుండి(శనివారం) రాష్ట్ర బంద్ కు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తెలిపారన్నారు. జైట్లీ, చంద్రబాబు కలిసి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారని అన్నారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ తో ఆట లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా శనివారం ఏపీ బంద్ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో మాట్లాడామని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు


న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చింది. అందుకు ఎప్పుడూ చెబుతున్న కారణాన్నే తిరిగి వల్లె వేసింది. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వజాలమని స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీపై గడిచిన రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా, తాజాగా బుధవారం న్యూఢిల్లీలో బీజేపీ, టీడీపీ నేతలు హైడ్రామా నడిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబోతున్నారంటూ ఉదయం నుంచి రాత్రి వరకు నానా హడావిడి చేసింది. టీడీపీ మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరపడం, మధ్య మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ.... ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉందన్న రీతిలో హైడ్రామా నడిపించారు.

చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దానికి ప్రతిగా ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఆ ప్యాకేజీలో ఏముందన్న విషయాన్ని కూడా మంత్రి వివరించకుండా గురువారం ఉదయం అందుకు సంబంధించి ఒక నోట్ విడుదల చేస్తామన్నారు. అయితే అందులో ప్రకటించిన అంశాలు కూడా ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుందని మెలిక పెట్టారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒకవైపు చెబుతూనే రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన, వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ - చైన్నై కారిడార్ వంటి కీలకమైన హామీలపై ఆయా మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకుంటాయని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 3979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చామని, మరో 2500 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి అందించామని, అలాగే వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1050 కోట్లు అందజేశామని మంత్రి తెలిపారు. వీటితో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని చెప్పారు. 14 వ ఆర్థిక సంఘం చేసిన కొన్ని సిఫారసుల మేరకు ఆర్థిక లోటును పూడ్చడానికి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల నిధులను మంజూరు చేశామని, 2015-2020 ఐదేళ్ల కాలంలో ఆ లోటు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును 1-4-2014 తేదీ నుంచి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, అప్పటి నుంచి ఆ ప్రాజెక్టుకయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎంతకేటాయించిందన్న వివరాలను వెల్లడించలేదు. పైగా ఆ ప్రాజెక్టు కోసం నాబార్డు నుంచో లేదా మరో రూపంలోనో రుణం రూపేణా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పినందున దాన్ని రాష్ట్రానికే అప్పగించినట్టు తెలిపారు.

రాష్ట్ర విభజన చేసిన సందర్భంలో అయిదు అంశాలను చట్టంలో చేర్చారని, వాటన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని చెబుతూ ఆరవ అంశమైన ప్రత్యేక హోదా కల్పించే విషయం చట్టంలో చేర్చలేదని మంత్రి వివరిస్తూ, దానికి తోడు 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు.

రైల్వే జోన్ ఎక్కడ
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుతాయా అంటే కూడా కేంద్ర మంత్రులు స్పష్టత నివ్వలేకపోయారు. ప్రతి అంశంలోనూ ఫీజిబిలిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చట్టంలో చెప్పినందున వాటిని పరిశీలిస్తున్నామని దాటవేశారు. రైల్వే జోన్ ను విశాఖలో కాకుండా విజయవాడను ప్రకటించనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లాల్లో పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి. అదే విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా, ఆ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి చూసుకుంటారని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

నోట్ లో ఏముంటాయి
ఇకపోతే, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా కేంద్రం ప్రకటించబోయే వరాల్లో కొత్తగా ఏముంటాయన్న చర్చ మొదలైంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఇక గురువారం విడుదల చేయబోయే నోట్ లో కొత్తగా ఏముంటాయి... పైగా ఆ నోట్ లో పేర్కొన్న అన్ని విషయాలను ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది కూడా. పైపెచ్చు వీటన్నింటినీ వచ్చే అయిదేళ్ల కాలంలో మాత్రమే చేపడుతారట. గతంలో బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి ప్రకటించినట్టుగానే విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ గంపగుత్తగా ఒకచోట చేర్చి ప్యాకేజీగా ప్రకటించబోతున్నారని మాత్రం అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి

Written By news on Wednesday, September 7, 2016 | 9/07/2016


ఆయనవి ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి
గుంటూరు :
తుని మంటలతో చలికాచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అమాయకులను శలభాలుగా మార్చాలని చూడటం అన్యాయం, ఆటవికం, అనాగరికమని.. ఈ ఆటవిక పద్ధతులను చంద్రబాబు మానుకోవాలని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ పోలీసులు రెండోరోజు ఆయనను దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు. బయటకు వచ్చిన తర్వాత భూమన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ''చంద్రబాబు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వంచన. వీటితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెరిగారు. అమాయకులను వేధించడంలో ఆయన దిట్ట. తనను అధిక్షేపించేవాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించే వాళ్లను ఆయన సహించలేరు. విరుద్ధ అభిప్రాయాల పట్ల ఆయనకు గౌరవం లేదు.

తనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారిని సహించలేక.. వాళ్లను అరాచకవాదులుగా చిత్రించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే నామీద కక్షతో నన్ను తుని కేసులో విచారణకు పిలిపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడమే కాపు ఉద్యమం. తమను బీసీలలో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కడం వల్లే వాళ్లు ఉద్యమించారు. ఆ సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని నన్ను విచారణకు పిలిపించడం వల్ల కాపుజాతి యువకుల గుండెలు రగులుతున్నాయి. వాళ్లందరూ నాకు పరిపూర్ణమైన మద్దతును తెలియజేసినందుకు వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని సంఘ విద్రోహశక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు మొదటి రోజు నుంచి చేస్తున్నారు. తుని ఘటన వెనక జగన్ ఉన్నారని చంద్రబాబు, హోం మంత్రి మొదటిరోజు నుంచే చెబుతుంటే దాని ప్రభావం విచారణ సంస్థపై ఉండక తప్పదు.

ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేం చేయించామనే కుట్రపూరితమైన ఆలోచనతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. తునిలో ఆరోజు జరిగిన బహిరంగ సభ తర్వాత చోటుచేసుకున్న విధ్వంసాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు. స్వయంగా ముద్రగడ సహా అందరూ దాన్ని ఖండించారు. కానీ దానికి అమాయకులను బలిచేయడం అంతకంటే పెద్ద నేరం. అలాంటి నేరం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారు. ఈ రోజు, నిన్న దానిపై నన్ను విచారించారు.

విచారణాధికారులు హరికృష్ణ, భాస్కర్ చాలా సంస్కారవంతంగా, సభ్యతతో ఆ ఘటన గురించి తెలిసిన విషయాలు మాట్లాడమని అడిగారు. ఏమాత్రం నొప్పించలేదు. వాళ్లను కూడా అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్న కుత్సితమైన ప్రేరకం చంద్రబాబుదే. నన్ను పిలిపించడానికి ఆరోజు చంద్రబాబు చేసిన ప్రకటనే కారణం. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. ఈ రోజుకు నన్ను పంపించారు, మళ్లీ ఎప్పుడు రమ్మంటారో తెలియదు. విచారణలో భాగంగా పిలిపించినట్లు నాకు చెప్పారు. నేను నేరస్థుడినని సీఐడీ వాళ్లు ఏమీ చెప్పలేదు. నేను ఏ ప్రభావాలకూ భయపడే వ్యక్తిని కాను. కాపుల న్యాయమైన కోరిక అయిన బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకరోజు, దానికంటే ఎక్కువ ప్యాకేజి ఇస్తున్నారంటూ ఈరోజు వాజమ్మ ప్రకటనలు చేయడం తగదు. తుని ఘటనపై సీబీఐ విచారణ లేదా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయి. విచారణాధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు'' అని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.

ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?


ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?
హైదరాబాద్ :
గతంలో ఓటుకు కోట్ల కేసు తెరమీదకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తన మంత్రులను ఢిల్లీకి పంపించి అమిత్‌ షా నుంచి అరుణ్ జైట్లీ వరకు అందరితో చర్చించమని చెప్పారని, దానివల్లే ఆయన ఆ కేసు నుంచి కొంత కాలం బయటపడ్డారని.. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి డ్రామాలే చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. అప్పుడుకూడా కేంద్ర నేతలతో తాము చర్చించినది ప్రత్యేక హోదా కోసమేనని టీడీపీ ఎంపీలు కలరింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఓటుకు కోట్లు కేసు తెరమీదకు వచ్చిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబు మెడలో ఉరితాడు అలాగే ఉంది తప్ప ఆ తాడు ముడి ఊడిపోలేదని కాకాణి అన్నారు. అందుకోసమే ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా, ప్యాకేజి అంటూ టీడీపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

అసలు ప్రత్యేక హోదా గురించి గానీ, ప్యాకేజి గురించి గానీ తనకు ఏమీ తెలియదని, జరుగుతున్నట్లు చెబుతున్న విషయాలేవీ తన దృష్టికి రాలేదని చంద్రబాబు అంటున్నారని చెబుతూ.. ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆమోదయోగ్యమైన ప్యాకేజి వస్తే తప్ప ఢిల్లీ వెళ్లేది లేదంటున్నారని.. మరోవైపు ఎంత వస్తే అంత రాబడదామని చంద్రబాబు అంటున్నట్లుగా మీడియాలో కథనం వచ్చిందని, ఈ డ్రామాలు ఎందుకని నిలదీశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు దానికి అయ్యే వ్యయంలో కేంద్రం వాటను 90 శాతానికి ఒప్పించామని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దక్కేది హోదానా, ప్యాకేజినా అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు డ్రామాలు ఆడటం ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడమా కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజితో డబ్బులొస్తే వాటిని ఎలా లూటీ చేయాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు.

హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తే ప్రజలు లాభపడతారు తప్ప చంద్రబాబుకు వ్యక్తిగతంగా లాభం ఉండదు కాబట్టి ప్యాకేజితో దోచుకుందామని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రయో జనాల కో సం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని గోవర్ధనరెడ్డి అన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా.. చంద్రబాబు గట్టిగా కృషిచేసి ఈ మాత్రమైనా ప్యాకేజి రాబట్టారని కలరింగ్ ఇవ్వడానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం జరగడం లేదని తెలిపారు. నీతి నిజాయితీలతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని, అంతేతప్ప టీడీపీ - బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు రాకూడదనే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి హోదా సాధించాల్సిందేనని.. అంతవరకు కావాలంటే ఢిల్లీకి వెళ్లనని మొరాయించాలని, ఇంకా కావాలంటే మీ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి పోరాటం చేయాలని చంద్రబాబుకు కాకాణి సూచించారు.

రక్షకతడి లెక్కలన్నీబూటకం

)
రక్షకతడి లెక్కలన్నీబూటకం
= దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
=  బీమా విషయంలో ప్రభుత్వం, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలను కోర్టుకీడుస్తాం
= రైతులు, జిల్లా ప్రజల సంక్షేమాన్ని సమాధి చేసేలా ప్రభుత్వ చర్యలు
= రక్షకతడి, ప్రభుత్వ మోసంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
= వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి


(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : చంద్రబాబు ప్రభుత్వం సత్యదూరమైన చర్యలతో  రైతులకు అంతులేని మోసం చేస్తోందని, రక్షకతడి లెక్కలన్నీ బూటకమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో కరువొచ్చినప్పుడు రైతులకు ఇన్‌పుట్‌æసబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇచ్చిన ప్రభుత్వాలను చూశా. కానీ వాటిని ఎగ్గొట్టేందుకు ‘రక్షకతడి’పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఇప్పుడే చూస్తున్నా. 2014–15, 15–16 లోనూ జిల్లాకు కరువొచ్చినా రూపాయి కూడా ఇన్‌ఫుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌ ఇవ్వలేదు.


ఈ ఏడాదీ ఎగ్గొట్టేందుకు చూస్తున్నారు. రెయిన్‌గన్‌లను తెచ్చి రాజకీయంగా, రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. ‘అనంత’లో 2.25 లక్షలు, ‘సీమ’లో 4 లక్షల ఎకరాల వేరుశనగకు ఒక తడి ఇచ్చామని, వా రంలో రెండోతడి ఇస్తామని చెబుతున్నారు. ‘సీమ’ లో 22 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. ఇందులో జూన్‌లో 50శాతం పంట వేశారు. వర్షంలేక 40 రోజులు  బెట్టకట్టింది.  తల్లివేరు పూర్తిగా దెబ్బతింది. ఎక్కడా కాయలు లేవు.  రక్షకతడి ద్వారా పంటను కాపాడామంటున్నారు.  4లక్షల ఎకరాలకు  8–10 టీఎంసీల నీరు అవసరం. ఆరు రోజుల్లో ట్యాంకర్లు, బోర్ల ద్వారా ఇన్ని నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా?ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండని సీఎం అనడం...ఐఏఎస్, గ్రూపు–1అధికారులు కూడా జీహుజూర్‌ అన్నట్లుగా ‘రక్షకతడి’ వ్యవహారాన్ని నడిపించారు. 


మీ లెక్కల ప్రకారం ఆలోచించినా పదివేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు వాడితే 28 లక్షల ట్రిప్పుల ద్వారా ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వొచ్చు. రోజుకు ఒక వాహనం 10 ట్రిప్పులు తోలినా 2.80 లక్షల వాహనాలు కావాలి. ఇన్ని తెచ్చారా?   ఏ గ్రామంలో, ఏ సర్వే నెంబర్‌లో, ఏ రైతుకు నీళ్లిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. జూలై 21న రెయిన్‌గన్‌లు జిల్లాకు చేరినా ఆగస్టు 28వరకూ ఉపయోగించకపోవడం నేరం కాదా? డ్యాష్‌బోర్డు ద్వారా అన్నీ తెలుసుకుంటానని చెప్పే సీఎంకు వర్షం సంగతి, పంట ఎండిన విషయం తెలీదా? పైగా ఏదోసాధించినట్లు విక్టరీ సింబల్‌ చూపించి వెళ్లారు.

ఇది జిల్లా వినాశనానికి నాంది. చంద్రబాబు  2004కుముందు భయంకర కరువులోనూ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేదు.  ఇప్పుడూ ఎగ్గొట్టేందుకు సిద్ధమయ్యారు.  ఇన్సూరెన్స్‌లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. పంట కాలాన్ని మూడు విడతలుగా చేశారు. మొదటివిడత వర్షాలు లేకపోతే బులెటిన్‌ విడుదల చేసి వారంలోపు బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రెండో విడతలోనూ ఇలాగే చేయాలి. మూడో విడతలో దిగుబడిని లెక్కించి ఇవ్వాలి. తక్కువగా బీమా కంపెనీ ఇస్తే ఆ మొత్తాన్ని ఇన్‌పుట్‌సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఇవ్వాలి. బీమా భిక్షకాదు..రైతుల హక్కు.


ఈ ఏడాది బీమా ఇవ్వకపోతే బ్యాంకులు, ప్రభుత్వం, బీమా సంస్థలను కోర్టుకీడుస్తాం. మానహక్కుల వేదికకు వెళ్తాం. అన్ని రాష్ట్రాలలో  ప్రధానపంటను ఫసల్‌బీమాలో చేరిస్తే,  ఇక్కడ మాత్రం వేరుశనగను చేర్చలేదు. ‘సీమ’లో 39.50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. బ్యాంకర్లు దాదాపు అన్ని పంటల రుణాలు, ప్రీమియానికి వేరుశనగ అని రాశారు. వేరుశనగకు బీమా రాదు. మరి కంది, పత్తి, ఆముదం, జొన్నతో పాటు వేరే పంటలు వేసిన రైతుల పరిస్థితేంటి? టీడీపీలో  ఏడుసార్లు గెలిచి మంత్రులుగా చేసి, గుంతకు కాళ్లు ఈడ్చుకున్నవారు ఉన్నారు. వీరి స్వార్థం కోసం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు. ఈక్రమంలో రైతు, ప్రజాసంఘాలు, మేధావులు కలిసి ప్రశ్నించాల్సిన అవసరముంద’ని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, పార్టీ నేత ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా?


జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా?
► జాతీయ రహదారుల మృతులు మీ రాష్ట్రంలోనే ఎక్కువ
► ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులెందుకు పెరిగారు?
► సీఎం బావమరిది కొడుకే మృతిచెందారు కదా.. చర్యలు తీసుకున్నారా?
► ఏపీ రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులపై ‘సుప్రీం’కమిటీ ఆగ్రహం
► 9లోగా అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌
‘‘రాష్ట్రంలో జాతీయ రహదారులన్నీ మృత్యుకుహరాలుగా మారాయి. రోడ్డెక్కితే భద్రత లేకుండా పోయింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మీ రాష్ట్రంలో జాతీయ రహదారులపై మృతి చెందినంత మంది దేశంలో మరే రాష్ట్రంలోనూ చనిపోలేదు. ఇంత జరుగుతున్నా నిద్రపోతున్నారా?’’ అంటూ సుప్రీంకోర్టు కమిటీ రాష్ట్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాల నేపథ్యంలో నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 9లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారులమీద జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు గతంలోనే రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ ఈనెల 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు, రవాణా, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారిపై తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కేవలం జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 432 మంది మృతిచెందారని కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశానికి వెళ్లిన అధికారుల్లో ఒకరు తెలిపారు.

దేశంలోనే రోడ్డు ప్రమాద మృతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదని కమిటీ ఆక్షేపించింది. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర అధికారులు పేర్కొనగా.. మరి మృతులు ఎక్కువ ఎందుకున్నారని ప్రశ్నించింది. దీంతో వారినుంచి జవాబు కరువైంది. గత రెండేళ్లుగా వరుసగా ఏపీనే ప్రమాద మృతుల్లో తొలిస్థానంలో ఉందంటూ.. స్వయానా రాష్ట్ర సీఎం చంద్రబాబు బావమరిది కుమారుడే తెలంగాణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని కమిటీ గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాలపై చర్చిద్దామంటే సీఎం బిజీగా ఉన్నారని అధికారులు జవాబివ్వగా కమిటీ స్పందిస్తూ.. సీఎం బిజీగా ఉంటే చీఫ్‌ సెక్రటరీ ఉన్నారు లేదా సంబంధిత మంత్రి ఉన్నారు కదా వాళ్లనెందుకు భాగస్వాముల్ని చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం.

ఇంత ఘోరంగా ఉన్నా పట్టించుకోవట్లేదు
రాష్ట్ర రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారుల బృందంపై పలు అంశాల్లో కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఏ పనైనా పత్రాల్లో చూపిస్తున్నారు తప్పితే అమలు కావట్లేదని తప్పుపట్టింది. సమావేశంలో రాష్ట్ర అధికారుల్ని కమిటీ నిలదీసిన అంశాలివీ..

⇒ ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల నివారణకు నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయలేదు.
⇒ దీనికోసం ప్రత్యేక నిధి(స్పెషల్‌ ఫండ్‌)ని  కేటాయించలేదు.
 ఓవర్‌లోడ్‌తో లారీలు వెళుతున్నా పట్టించుకోవట్లేదు. దీనివల్ల రోడ్లు పాడవుతున్నాయి.
 ఒక్కో ఆటోలో 20 మంది వెళుతున్నా పట్టించుకోవట్లేదు.
 ఇసుక లోడ్‌లతో వెళుతున్న ట్రాక్టర్లపై 20 మందిదాకా వెళుతున్నా మీకు కనపడట్లేదు.
 ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులు పెరగడానికి కారణం తెలుసుకోలేదు.
 రహదారుల్లో బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించామంటున్నారు. మరి దీనివల్ల ప్రమాదాలు తగ్గలేదేం..
 ప్రమాద బాధితులకు వైద్యమందడానికి ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటు ఇప్పటికీ
సరిగా లేదు.
 20 ఆస్పత్రుల్ని ఉన్నతీకరించమంటే ఇప్పటికీ ఏడు ఆస్పత్రులను సరిగా చేయలేదు.

ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు

Written By news on Tuesday, September 6, 2016 | 9/06/2016


ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
గుంటూరు :
తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో తమ జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన తమ జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చాం, ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుకు, కాపులకుమధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు.

తమను బెదిరించినా, ఎంత అప్రజాస్వామ్య పద్ధతులు పాటించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, తాను ఒత్తిళ్లు, భయాలకు లొంగే మనిషిని కానని.. తన జీవితంలో భయమంటే ఏంటో తెలియదని ఆయన కుండ బద్దలుకొట్టారు. కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని.. అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. రేపు ఉదయం మళ్లీ రమ్మని పిలిచారని, విచారణకు హాజరవుతానని భూమన తెలిపారు.

రైలు కాలుతుండగానే ఎలా తెలుసు?


రైలు కాలుతుండగానే ఎలా తెలుసు?
గుంటూరు :
తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహిస్తుండగా విధ్వంసకాండ జరిగినప్పుడు ఒకవైపు రైలు తగలబడుతుండగానే అదే సమయంలో ఆ ఘటన వెనక ఎవరున్నారో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎలా తెలుసని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అప్పుడు రైలు కాలుతుండగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ ఘటన వెనుక కాపులు లేరని.. కడప నుంచి వచ్చిన గూండాలు ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఎవరికీ అంత వెంటనే తెలియదని, విచారణ తర్వాత చెప్పాల్సి ఉందని.. కానీ రాజకీయ కక్షతో మొదటి రోజు నుంచి తమ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకే టీడీపీ సర్కారు ప్రయత్నించిందని మండిపడ్డారు. తుని ఘటనకు, వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని అందరికీ తెలుసని.. కానీ మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి, వైసీపీ నేతృత్వంలో జరిగిందని అపవాదు తెచ్చి రాజకీయ కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. భూమన కాల్‌డేటాలో ముద్రగడ నెంబరు ఉందన్న విషయమై అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇందులో రహస్యం ఏమీ లేదని, భూమన స్వయంగా ముద్రగడను కలిసి.. ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు. ఆయనతో పాటు తాను కూడా అదే విషయం చెప్పానని, ముద్రగడ ఆశయాలను బలపరిచేవాళ్లు చాలామందే ఉన్నారని రాంబాబు తెలిపారు. సాక్షాత్తు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డే కాపులను బీసీలలో చేర్చాలన్న ఉద్యమానికి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు.  

తునిలో జరిగిన విధ్వంసం జరగకూడని విషయమేనని, దానిపై వెంటనే న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రాంబాబు అన్నారు. ఇక గుంటూరు సీఐడీ కార్యాలయం బయట రోడ్డుమీద ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం కాలేదన్నారు. వాస్తవానికి భూమన కరుణాకరరెడ్డి విచారణ మధ్యాహ్నం 3 గంటలకే అయిపోయినట్లు తమకు తెలిసిందని, కేవలం మానసిక ఒత్తిడి పెంచడానికే ఇలా ఎక్కువసేపు కూర్చోబెడుతున్నారని సమాచారం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం పోలీసు రాజ్యంగానే సాగుతోందని.. కరుణాకరరెడ్డి మీద ఎలాంటి చర్య తీసుకున్నా మేం చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందరూ ఇలా కక్షసాధింపు ధోరణితో కొనసాగితే ఇక తమిళనాడుకు, మనకు తేడా ఏముంటుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

తుని ఘటనతో నాకెలాంటి సంబంధంలేదు


గుంటూరు: దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణ నిమిత్తం ఇవాళ గుంటూరు వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని,  చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చినట్లు భూమన తెలిపారు. కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చాలని ఆయన అన్నారు.

కాగా ఈ ఏడాది జనవరి 31న కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి భూమనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Popular Posts

Topics :