18 September 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Jagan to tour Guntur on Sept 26, 27

Written By news on Saturday, September 24, 2016 | 9/24/2016


Hyderabad, Sept 24: Leader of Opposition YS Jagan Mohan Reddy will visit the flood affected areas in Guntur district on September 26 and 27.

Party senior leader Botsa Satyanarayana told reporters here on Saturday that the state failed to rise to the occasion in tackling the situation arising out of the heavy rains that battered the coastal districts.

‘Our Party president YS Jagan Mohan Reddy will visit Guntur district which bore the brunt of the fury of rains and talk to the affected people.

We also appeal to the government to take all measures and provide relief to the affected people in all the coastal districts. Severe drinking water shortage and the possibility of any outbreak of epidemic should be curtailed by setting up relief and health camps, he said.

The district administration should be alerted in taking effective steps arising out of the heavy downpour which has inundated the coastal region damaging highways and water sources.

While the state was in such disarray, Chief Minister and his cabinet colleagues failed to react in the proper measure and were busy in luring Opposition MLCs in to the party fold, he said.

Government figures show that 1.18 lakh acres were affected but the actual figure could be over 3 lakh acres going by the magnitude of the rains, he said and demanded that proper compensation should be paid to the farmers for crop loss.

25న ఎన్ ఆర్ ఐలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

Written By news on Friday, September 23, 2016 | 9/23/2016


25న ఎన్ ఆర్ ఐలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ఎన్ ఆర్ ఐలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడనున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచించినందున వైఎస్ జగన్ రాష్ట్రానికి హోదాపై పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే.. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడంపై ఏలూరులో జరిగిన యువభేరిలోనూ ఈ అంశంపై సీఎంను ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని యువభేరిలో నిలదీసిన వైఎస్ జగన్.. ప్రత్యేక హోదాపై పోరాటంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వీడియో  లింక్ https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ  ద్వారా వీక్షించవచ్చు.

గుంటూరు, ప్రకాశంలో వర్షాలపై వైఎస్ జగన్ ఆరా

Written By news on Thursday, September 22, 2016 | 9/22/2016

వైఎస్ఆర్ కాం‍గ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ఉధృతిపై ఆరా తీశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఆయన గురువారం ఫోన్ లో మాట్లాడారు. స్థానికంగా వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరదల్లో బాధితలును ఆదుకోవాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వాలని ఈ సందర్భంగా వారికిసూచించారు. కాగా గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

వాస్తవాలు ఇవి....


పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెడతారు: వైఎస్ జగన్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటిసాకులు చెబుతున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో జరిగిన యువభేరిలో ఆయన ప్రసంగించారు.

ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మార్చారని దుయ్యబట్టారు. హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటిస్తే స్వాగతిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణమని అన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోనాలను వైఎస్ జగన్ సవివరంగా వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
  • యువభేరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, కింద ఫ్లోర్‌లో కూడా విద్యార్థులు టీవీలలో చూస్తున్నారు.. అక్కడున్న విద్యార్థులందరికీ పేరుపేరునా ఇక్కడికి వచ్చినందుకు, తోడుగా నిలుస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
  • ఇక్కడ ఆదరణ చూసిన తర్వాత.. ఇంతకన్నా పెద్ద కళ్యాణమండపం ఏలూరులో లేదా అని నానిని అడిగాను.. ఇదే పెద్దదని ఆయన చెప్పారు
  • ఏలూరులో పోరాటం కొనసాగిస్తూ ముందడుగు వేద్దాం
  • ప్రతిచోటా యువభేరి ద్వారా ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలేంటో చెబుతున్నాం
  • ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం
  • బీజేపీ, టీడీపీలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, పోరాడుతున్నాం
  • ఢిల్లీ వరకు అందరం వెళ్లి ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు, ధర్నాలు, బంద్‌లు అన్నీ చేస్తున్నాం
  • ప్రత్యేక హోదా మనకు ఎందుకింత అవసరం.. దానివల్ల జరిగే మేలేంటో పలుదఫాలుగా చెబుతున్నాం
  • ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు మన ప్రమేయం ఏమీ లేకపోయినా ఇష్టారాజ్యంగా విడగొట్టారు
  • అప్పుడు మనం ఒప్పుకోకపోయినా మన ఎంపీలందరినీ లోక్‌సభ నుంచి బయటకు పంపి, సస్పెండ్ చేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు
  • ఆరోజు లోక్‌సభ నుంచి రాజ్యసభకు బిల్లును తీసుకెళ్లారు
  • అక్కడ... రాష్ట్రాన్ని విడగొడుతున్నందుకు అన్యాయం జరుగుతోందని, హైదరాబాద్ లేకపోవడం వల్ల చదువుకున్న పిల్లలు హైదరాబాద్‌కే వెళ్తారని తెలుసని చెప్పారు.
  • హైదరాబాద్‌లోనే 95 శాతం ఐటీ పరిశ్రమలున్నాయి, హైదరాబాద్, దాని చుట్టుపక్కలే ఉత్పాదక పరిశ్రమల్లో 70 శాతం ఉన్నాయని తెలుసని అన్నారు
  • అందుకే దానికి బదులు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు
  • అధికార, ప్రతిపక్షాలు ఏకమై.. రాష్ట్రాన్ని విడగొడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు
  • ఎన్నికలు అయిపోయాయి.. పార్లమెంటులో ఆరోజు ఓటు వేశామన్న సంగతి మర్చిపోయారు
  • కాంగ్రెస్ వాళ్లు ఐదేళ్లు హోదా ఇస్తామంటే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అన్నారు
  • ఇదే బీజేపీ.. ఇదే అరుణ్ జైట్లీ ఆరోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేత. ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలన్నారు
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సభలో పదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని ఊదరగొట్టారు
  • ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల్లో చెప్పారు
  • ఓట్లు వేయించుకున్న తర్వాత నాయకులు ప్లేట్లు మారుస్తున్నారు
  • జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది
  • అప్పుడు హోదా వల్లనే ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టిన వీళ్లే ప్లేట్లు మారుస్తున్న తీరుచూసి బాధనిపిస్తుంది
  • రెండున్నరేళ్ల తర్వాత.. మొన్న జైట్లీ సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టారు
  • చంద్రబాబుకు సంబంధించిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు కూడా ఆయనతో ఉన్నారు
  • ప్రెస్‌మీట్ జరుగుతోందని ఏడోతేదీ పొద్దున్న నుంచి తెగ హడావుడి, డ్రామా చేశారు
  • చివరకు జైట్లీ మాత్రం దమ్మిడీ ఇస్తామని చెప్పలేదు గానీ, హోదా ఇవ్వబోమని చెప్పారు.. జరిగింది అది!
  • అదేరోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు వెంటనే పిక్చర్ లోకి వచ్చారు.. నేను స్వాగతిస్తున్నాను అంటాడు
  • నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబితే.. ఈ మనిషికి కాస్తో కూస్తో ఇంగ్లీషు వస్తుందా అని కూడా అనిపిస్తుంది
  • అంతటితో చంద్రబాబు ఆగలేదు.. తర్వాత అసెంబ్లీలో మేం నిలదీశం.. స్వాగతించడానికి నువ్వెవడివని అడిగాం
  • ప్రత్యేక హోదా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా అని ప్రశ్నించాం
  • ఐదున్నర కోట్ల మంది జీవితాలు దానిమీద ఆధారపడ్డాయి
  • మాకెవరికీ ఇష్టం లేకపోయినా నువ్వెవడివయ్యా స్వాగతించడానికని నిలదీశాం
  • అందుకని ఇక్కడ మాట్లాడే ధైర్యం లేక శాసనమండలికి వెళ్లాడు
  • అక్కడ ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు
  • ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయని అడుగుతున్నాడు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు ఏం మేలు జరిగిందన్నాడు
  • ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు 15 ఏళ్లు కావాలంటాడు.. ఈయనే అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం కూడా చేసి పంపాడు
  • తర్వాత ఇదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత ప్లేటు మార్చి.. ఏం ఒరుగుతుందని పట్టపగలు అబద్ధాలు ఆడతాడు
  • ప్రధానమంత్రికి ఫోన్ చేసి థాంక్యూ చెప్పాడు
  • చంద్రబాబు చేస్తున్న మోసం ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం సమంజసమా
  • వెంకయ్య నాయుడు.. మొన్నటివరకు తనవల్లే ప్రత్యేక హోదా వస్తోందని ఊదరగొట్టాడు.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని చెప్పాడు
  • అలాంటి వెంకయ్య నాయుడు.. ప్లేటు మార్చాడు. ఈయనే బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఫేస్ అని తెలిసి, ఆయనకు చంద్రబాబు నాయుడు తన మంత్రులతో విజయవాడలో సన్మానం చేయించాడు
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజి ఇచ్చారంటాడు
  • ఇదే చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి, జైట్లీకి శాలువా కప్పి, థాంక్యూ అని చెప్పి వచ్చాడు
  • ఎన్నికలకు ముందు సంజీవనిగా కనిపించిన హోదా.. వీళ్లు ఇప్పుడు దానివల్ల ఏం మేలు జరుగుతుందని అంటారు
  • వెంకయ్య నాయుడైతే.. ఆరోజు ఏదో వేడిమీద అడిగానంటారు. ఆరోజు సాయంత్రానికే మిగిలిన రాష్ట్రాల ఎంపీలు తన వద్దకు వచ్చారని, నీకేమైనా బుద్ధుందా అని అడిగారని చెబుతున్నారు
  • వెంకయ్య వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని చాలా బాధపడ్డారట
  • ఆ మాట రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు చెబుతున్నారు
  • ఆరోజు హోదా సంజీవని అని చెప్పిన వెంకయ్య.. మేకకు వేలాడేవే హోదా అని అంటారు.
  • ఎన్నికల తర్వాత ప్రజలతో పని అయిపోయిందని.. పార్లమెంటులో ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు
  • ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు..
  • ఇలాంటివాళ్లు నాయకులని చెప్పుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా
  • రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి
  • ప్రత్యేక హోదాను ఢిల్లీ వాళ్లు ఇవ్వరు.. చంద్రబాబు అడగలేని, అడగని పరిస్థితి ఉంది
  • చంద్రబాబు ఏ స్థాయిలో రాజీ పడిపోయారంటే.. ఢిల్లీ వాళ్లు ఏమిచ్చినా, ఏం ఇవ్వకపోయినా తాను మాత్రం వాళ్ల కాళ్లు వదలనంటారు
  • వ్యక్తిత్వాన్ని అమ్మేసి.. ఈ స్థాయిలో దిగజారిపోడానికి చంద్రబాబు  ఈరెండున్నరేళ్లలో ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కోవడమే కారణం
  • ముఖ్యమంత్రి నల్లధనాన్ని సూట్ కేసుల్లో ఇస్తూ ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయినా ఆయన అరెస్టు కాలేదంటే, ఆయన రాజీనామా చేయలేదంటే.. మన దేశంలో, అదికూడా చంద్రబాబు విషయంలో మాత్రమే జరుగుతుందేమో
  • ఆయన అంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేయడలడు, తన స్వార్థం కోసం రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడుస్తాడు
  • అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచినట్లు, ప్రజలంటే చంద్రబాబుకు లెక్కలేదు
  • ఇదే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు
  • 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కావడంలేదని టీడీపీ, బీజేపీ వాళ్లు చెప్పారు
  • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు వ్యత్యాసం చూపించడం మానేసిందని, వాళ్లు ఇవ్వద్దన్నారని చెబుతున్నారు
  • అసలు ఆ సంఘం పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడంపైనే నిర్ణయం తీసుకుంటుంది
  • ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు
  • రాష్ట్రాలు రుణాలు, నాన్ ప్లాన్ గ్రాంటు తీసుకోవాలంటే దానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే చూస్తారు
  • ఇంతకుముందు 32.5 శాతం పన్నులు రాష్ట్రాలకు ఇచ్చేవారు.. అందులో మన రాష్ట్రానికి 4.31 శాతం వస్తుంది
  • పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని.. తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఉంటే, దాన్ని పూడ్చాలని.. హోదా ఉన్నా, లేకపోయినా తాము పూడుస్తామని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. వాళ్లు చెప్పింది ఇంతే తప్ప, ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికీ ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు
  • ఆంధ్రరాష్ట్రంతో పాటు మరో 11 రాష్ట్రాలు దీనిద్వారా లబ్ధిపొందుతాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌లకు కూడా రెవెన్యూలోటు పూడుస్తున్నారు
  • ప్రత్యేక హోదాను రద్దుచేయాలని తాము చెప్పలేదని అభిజిత్ సేన్ కూడా చెప్పారు
  • మరి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నా
  • అనవసరంగా 14వ ఆర్థిక సంఘం మీద అబద్ధాలు చెప్పడం న్యాయమేనా
  • ప్రణాళికా సంఘం రద్దయింది, నీతి ఆయోగ్ రావడం వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో అబద్ధం చెబుతున్నారు
  • ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉన్నది కేవలం నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కే. దాని అధ్యక్షుడు ప్రధాని.
  • ప్లానింగ్ కమిషన్‌కు, నీతి ఆయోగ్‌కు, ఎన్‌డీసీకి కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రే
  • అన్నింటికీ ఆయనే అయినప్పుడు.. ఆయన ఒక సంతకంతో చేసే నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం అంటారా.. వేరే ఏమైనా అంటారా
  • ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు. ఉత్తరాఖండ్‌కు కేవలం వాజ్‌పేయి సంతకంతో ప్రత్యేక హోదా ఇచ్చారు
  • అదే మాదిరిగా మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని ప్రణాళికా సంఘానికి ఆదేశాలిచ్చారు
  • 2014 మార్చి 2న కేబినెట్ సమావేశమైంది.. అప్పుడే ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది
  • ప్లానింగ్ కమిషన్‌లో మనకు హోదా ఇవ్వాలన్న ఆదేశాలు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు
  • కేబినెట్ ఆమోదించినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరా?
  • ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ లో 490 శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయి
  • ఉత్తరాఖండ్ లో 2 లక్షల 45 వేల మంది, హిమచలప్రదేశ్ లో లక్షా 30 వేల మందికి ఉపాధి లభించింది
  • ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు 100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు వస్తుంది
  • 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కూడా వస్తుంది
  • 50 శాతం రేటుకే పరిశ్రమలకు కరెంట్ ఇస్తారు
  • ఇలా బెనిఫిట్స్ వస్తే వేలాదిగా పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి లభించదా?
  • పారిశ్రామిక రాయితీలతో పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెట్టరా?
  • వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు

ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు


‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వేలం పాట మాదిరిగా చేశాయని ఆంధ్రయూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం శ్రీ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని డబ్బుతో కొలవడానికి వీల్లేదని అదోరకమైన భావన అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజల నోళ్లు మూయించలేరని అన్నారు.

ప్రత్యేక ప్యాకేజీతో ఎటువంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ కలిపి ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలతో చెలగాటం ఆడడం నిప్పుతో చెలగాటమేనని అన్నారు. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. హోదా గోదాలో మిగిలిన ఏకైక యోధుడు వైఎస్ జగనేనని, ఆయన నాయకత్వంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రొఫెసర్ సాంబిరెడ్డి కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని డాక్టర్ కృష్ణభగవాన్ అన్నారు.

4, 5 వారాల్లోనే చర్య తీసుకోవాలి


4, 5 వారాల్లోనే చర్య తీసుకోవాలి : వైఎస్సార్‌సీపీ
హైకోర్టు సూచనలను స్వాగతిస్తున్నాం
  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 90 రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు హైకోర్టు చేసిన  సూచనలను స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ తెలిపింది. స్పీకర్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం ప్రోదిగొలిపేలా కోర్టు సూచించినట్లు 90 రోజుల వ్యవధి కాకుండా, 4, 5 వారాల్లోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము 5, 6 పర్యాయాలు స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించినా ఇంతవరకు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై తాము కూడా పార్టీపరంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయాలని కోరారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రకారం ఎమ్మెల్యేలు విలీనమైనంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదని చెప్పారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగానే, స్పీకర్ కార్యాలయం ఆగమేఘాలపై శాసనసభాపక్షం విలీనమైనట్లు బులిటెన్ ఇవ్వడం సరికాదన్నారు. కేవలం ఎమ్మెల్యేలు కాకుండా పార్టీలు విలీనమైతేనే అది విలీనంగా గుర్తింపు పొందుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవించేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు.

నేడు ఏలూరులో యువభేరి


నేడు ఏలూరులో యువభేరి
హాజరుకానున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రత్యేక హోదా కోసం పోరు
 
 సాక్షి, హైదరాబాద్/ ఏలూరు: విభజనకు గురై దారుణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకు పైగా సాగిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘యువభేరి’ సదస్సుజరుగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే ఈ సభకు పెద్ద ఎత్తున యువతీయువకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా అడ్డగోలుగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఒక సంజీవనిలాగా పని చేస్తుందని జగన్ తొలి నుంచీ అభిప్రాయపడుతున్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను, ఎక్సైజు, విద్యుత్ చార్జీలు, రవాణా ఖర్చుల్లో రాయితీలు వస్తాయి.

రాయితీలొస్తే వేల సంఖ్యలో పరిశ్రమలొస్తాయి. పరిశ్రమలొస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల కోసం మన యువకులు, విద్యార్థులు మరో వైపు చూడాల్సిన అవసరం ఉండద’ని తొలి నుంచీ గట్టిగా వాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోరాటం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకుంటూ వస్తున్నారు. కేంద్రంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతున్న ఫలితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం గానీ అందుకు సమానమైన ప్రత్యేక సహాయాన్ని ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కల్లబొల్లి ప్రకటనలు చేయడం, దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించడం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్రంపైనా, చంద్రబాబు వైఖరిపైనా ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిల ప్రకటనలను జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినంత మాత్రాన తాము పోరాటం ఆపబోమని ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా వచ్చే దాకా చేస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పటికి ఐదు నగరాల్లో యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెప్పారు. ఏలూరులో గురువారం ఆరవ యువభేరిని నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఏలూరు వస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు వద్ద సత్రంపాడులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే యువభేరిలో పాల్గొని ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవసరమో, దాని ప్రాధాన్యత ఏమిటో వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతోపాటు యువత, నిరుద్యోగులు, మేధావులు సైతం హాజరవుతారని వివరించారు.

రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి

Written By news on Wednesday, September 21, 2016 | 9/21/2016


రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాకు నీళ్లొదిలి ప్యాకేజీకి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్‌ను నాశనం చేసిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం భేరి మోగించేందుకు జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఏలూరులోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆళ్ల నాని ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది యువతేనని.. ఆ విషయాల్ని యువతకు వివరించి పోరాటంలో భాగస్వాములను చేయడం కోసమే యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను విద్యార్థులకు, యువతకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
పారిశ్రామిక అభివృద్ధి ఏదీ
చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని స్పష్టంగా చెప్పారని ఆళ్ల నాని గుర్తు చేశారు. ఇప్పటికీ జిల్లా అంతటికీ ఉపయోగపడే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, కనీసం శంకస్థాపన కూడా చేయకపోవడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 13 జిల్లాల్లో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మాట తప్పారని, భృతి ఇవ్వకపోయినా ప్రత్యేక హోదా ఇస్తే ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించారన్నారు. జిల్లా నుంచి ఏటా వేలాదిమంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని బయటకు వస్తుంటే.. ఉద్యోగాలు పదుల సంఖ్యలో కూడా లేవన్నారు. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

హోదావల్ల ప్రయోజనాలెన్నో..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కొత్తగా పరిశ్రమలు రావడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నిర్మాణ పనుల వల్ల బాగా చదువుకున్న వారికే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుందన్నారు. చత్తీస్‌గఢ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో 60 వేల పరిశ్రమలు వచ్చాయని, అంతకుముందు ఒక్క పరిశ్రమ కూడా లేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా గురించి మాట్లాడుతూ మోదీ ప్రధాని అయిన వెంటనే రాష్ట్రానికి ఈ హోదా ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తరువాత కేంద్రం పూర్తిగా దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించిందని, రూ.60 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్‌కు వంద కోట్లు కేటాయిస్తే, ఎన్ని సంవత్సరాలకు నిర్మాణం పూర్తవుతుందని ప్రశ్నిం చారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబుకు ప్రేమ కలగడానికి కారణం నిర్మాణ పనులను అతని బినామీకి కేటాయించడమేనని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఆ కేసునుంచి బయట పడేందుకే ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేశారని నాని విమర్శించారు. ఏపీకి హోదా ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్లు అడుగుతారం టున్న బీజేపీకి ఎన్నికల్లో హామీ ఇచ్చినపుడు ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్ల హోదా సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని పార్లమెంట్‌లో అడిగిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాటమార్చడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఈ మోసాలను ప్రజలకు తెలియజెప్పేం దుకు నిర్వహిస్తున్న యువభేరిని విజ యవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా


27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా
- హాజరుకానున్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
- జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ


పెనుకొండ: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి  రైతాంగం తరపున జిల్లా కేంద్రంలో  ఈనెల 27న భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల  మండలం కొండాపురం గ్రామంలో ఆయన మంగళవారం  విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా కరువు బారిన పడిందని, మునుపెన్నడూ లేని విధంగా  కరువు కరాళ నత్యం చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ ప్రారంభంలో కరువు పారద్రోలడానికి జిల్లా రైతాంగానికి ప్రాణాధారమైన వేరుశనగను కాపాడడానికి రెయిన్‌ గన్‌లతో రక్షక తడులు అందించి పంటను కాపాడుతామని మీడియా ద్వారా  మభ్యపెట్టిందన్నారు. వర్షాభావం ఏర్పడిన సందర్భంలో జిల్లా మంత్రులు కాని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని కరువును పూర్తీగా పట్టించుకోకుండా గాలికొదిలేసారన్నారు. వాస్తవ పరిస్థితులను గుడ్డి ప్రభుత్వానికి తెలియజేయడానికి 27న పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ధర్నా చేపడతామన్నారు.

ఈ ధర్నాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు  వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరై  ధర్నాలో  ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. జిల్లా రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు తరలిరావాలని శంకరనారాయణ కోరారు.  నాయకులు కన్వీనర్‌ ఫక్రోద్దిన్,  సుదర్శనశర్మ, గంపల వెంకటరమణారెడ్డి, ధనుంజయరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

తప్పు చేయలేదు, ఎలాంటి భయంలేదు

Written By news on Tuesday, September 20, 2016 | 9/20/2016


‘తప్పు చేయలేదు, ఎలాంటి భయంలేదు’
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. విచారణ పూర్తయిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావడానికి తాను సిద్ధమన్నారు. కాపు ఉద‍్యమానికి తాను నైతిక మద్దతు మాత్రమే ఇచ్చానని, తుని ఘటనతో తనకు రవ్వంత కూడా సంబంధం లేదన్నారు.

ఇక ఈ కేసులో ముందుగా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చి, ఆయన్ని విచారణ జరపాలన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తనను విచారణకు పిలిచారని భూమన వ్యాఖ్యానించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తుని కేసులో వైఎస్ఆర్ సీపీ నేతలను ఇరికించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్, జడల నాగరాజు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. పరిటాల రవి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కూడా చంద్రబాబుకు సంబంధం ఉందన్నారు. కాగా  తుని ఘటనపై ఇప్పటికే భూమన మూడుసార్లు విచారణకు హాజరయ్యారు.

విచారణ పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది


'విచారణ పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది'- చెవిరెడ్డి భాస్కరరెడ్డి
గుంటూరు: విచారణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం తమపై ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని  హెచ్చరించారు.

ఇప్పటికే 6, 7 తేదీల్లో భూమనను విచారించిన సీఐడీ.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి భూమనను విచారిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా పలువురు నేతలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు సీఐడీ కార్యాలయ ప్రాంగణం వద్ద 144 సెక్షన్ విధించారు.

వైఎస్సార్ సీపీ నేతల బైఠాయింపు


వైఎస్సార్ సీపీ నేతల బైఠాయింపు
గుంటూరు : గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డ గురజాల డీఎస్పీ నాగేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అధికారుల తీరుపై నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, బీసీ సంఘాలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబులాంటి అరాచక శక్తి మరొకటి లేదు


'నన్ను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా దిగుతా'
గుంటూరు: వెన్నుపోటుపొడవడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తుని ఘటనపై ఏపీ సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఆయన చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలన బకాసురుడి పాలనా మాదిరిగా ఉందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు కూనీ రాగం తీసినంత సులువని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

తుని ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ ఈ ఘటన పేరుతో తనను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా కాపు ఉద్యమంలో పాల్గొంటానని భూమన స్పష్టం చేశారు. ఎవరో దుండగులు రైలును దగ్దం చేస్తే ఆ ఘటనను వైఎస్ఆర్ సీపీకి రుద్దుతున్నారని, ముద్రగడ పోరాటానికి తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక మద్దతు ఇచ్చినందుకే అది భరించలేక తమను, తమ పార్టీని వేధించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబులాంటి అరాచక శక్తి మరొకటి లేదన్నారు. ఇచ్చిన వాగ్దానం మరిచిపోవడం, వాగ్దానం అంటే నిన్నటి పలుకులా మార్చడం చంద్రబాబు తేలికగా చేసే పని అని విమర్శించారు. భారత రాజకీయాల్లోనే చంద్రబాబులాంటి రాక్షస పౌరుడు లేడని, అలాంటి రాజకీయ రాక్షసుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ పాలన కొనసాగడం ఏపీ ప్రజల దురదృష్టం అని మండిపడ్డారు.

27న అనంత , 28న కర్నూలు

Written By news on Monday, September 19, 2016 | 9/19/2016


రైతు సమస్యలపై వైఎస్ జగన్ పోరుబాట
- 27న అనంత కలెక్టరేట్ ఎదుట ధర్నా
- 28న కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో రైతులు కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, కరువు నివారణ కోసం కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలకు సన్నద్ధమయ్యారు.

రైతు సమస్యలపై స్పందించేలా సర్కారు మెడలు వంచేందుకు వైఎస్ జగన్.. ఈ నెల 27 న అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు. అనంతరం 28న కర్నూలులో రైతు భరోసా యాత్రను నిర్వహించనున్నారు. కరువు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు.

కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో


కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చినా, కామినేని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆరోగ్య శాఖమంత్రి కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో అని, ఆయనకు బీపీ చూడటం కూడా రాదని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆలోచనంతా కమీషన్లు, వాటాలు, కేసులేనని ఆయన ఎద్దేవా చేశారు. వస్తువులకు లోకల్ ట్యాక్స్ ల్లా, ఏపీలో లోకేశ్ ట్యాక్స్ ల పేరుతో వసూలు చేస్తున్నారంటూ మేరుగ మండిపడ్డారు.

వైఎస్సార్ సీపీ పదవుల నియామకం


వైఎస్సార్ సీపీ పదవుల నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేతల నియాయకాలు చేపట్టినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

నియామకాల వివరాలు... వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కృష్ణాజిల్లాకు చెందిన డా.మొండితోక అరుణకుమార్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వలవల మల్లికార్జునరావు(బాబ్జి)తో పాటు విజయవాడ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ మొహిద్దీన్ ను నియమించింది.

Popular Posts

Topics :