25 September 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

టీడీపీ అధికార ప్రతినిధిగా వెంకయ్య!

Written By news on Thursday, September 29, 2016 | 9/29/2016


టీడీపీ అధికార ప్రతినిధిగా వెంకయ్య!
వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శి భూమన ఎద్దేవా

 సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజ్యోతి వంటి ప్రత్యేక హోదాను సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య తెలుగు జాతి ద్రోహులుగా మిగిలి పోతారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హోదా కోసం ప్రజలంతా పోరాడుతూ ఉంటే ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ వల్లనే లాభాలెక్కువ అని వీరిద్దరూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి  వెంకయ్య బీజేపీలో ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నా టీడీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్నారు.

వెంకయ్య, చంద్రబాబు ఇద్దరూ అవిభక్త కవలలని, వారి శరీరాలు వేరైనా వారు ఆడే అబద్ధాలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ప్రతిభావంతుడైన వెంకయ్య పదేళ్లు ప్రత్యేక హోదాను పట్టుబట్టి తెస్తారని ఎన్నికల్లో నరేంద్రమోదీ చెప్పలేదా! అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తుందని చంద్రబాబు ఆనాడు చెప్పలేదా? ఇపుడెందుకు ప్రయోజనం లేదంటున్నారని మండిపడ్డారు

వ్యవసాయంపై బాబు అభిప్రాయం మారలేదు


'వ్యవసాయంపై బాబు అభిప్రాయం మారలేదు'
గుంటూరు : వ్యవసాయం దండగన్న అభిప్రాయం నుంచి సీఎం చంద్రబాబు ఇంకా బయటకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.
 
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను, కూలిన ఇళ్లను పరిశీలించిన బొత్స బాధితులను పరామర్శించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వరద నష్టం గురించి చంద్రబాబు కనీసం చర్చించకపోవడం బాధాకరమన్నారు.  

పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం


పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం
మచిలీపట్నం: ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. టీడీపీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ పీఠం వైఎస్ఆర్ సీపీకి దక్కింది. పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు.
ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతి చెందారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్ సీపీకే దక్కింది. ఇక్కడ వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు.

వరద ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తే ప్రజల ఇబ్బందులు తెలిసేవి

Written By news on Tuesday, September 27, 2016 | 9/27/2016


చంద్రబాబు ఏమైనా మంచి చేశారా?
గుంటూరు : ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు హెలికాప్టర్లలో తిరగడమే సరిపోయింది కానీ, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా రెడ్డిగూడెంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వరద ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల ఇబ్బందులు తెలిసేవన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాప్టర్ లో తిరిగారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇక గ్రామాల్లో ఒక్క అధికారి కూడా రాలేదని, దమ్మిడి సాయం చేయలేదని అన్నారు. గుంటూరు జిల్లాలో మూడు లక్షల ఎకరాల పత్తి, లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిరప వేశారని, అందులో ముప్పావు వంతు పంటలు నీట మునిగాయన్నారు. గత సంవత్సరం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాట తప్పారని, ఇప్పుడు బంగారంపై రుణాలివ్వద్దని చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామనే కాదని, ఓట్లు వేసిన వారినీ కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని, బాధితులకు ఏమాత్రం సాయం అందకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రంతో పాటు, దేశం మొత్తానికి తెలియచేస్తామని ఆయన అన్నారు. ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ సూచించారు.

స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు

Written By news on Sunday, September 25, 2016 | 9/25/2016


‘స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రవాసాంధ్రులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నందుకు జననేతను ఎన్నారైలు అభినందించారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి తూర్పారబట్టారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఏవిధంగా ఉండబోతుందని వైఎస్ జగన్ ను అడిగారు. ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు.

రమేష్(వాషింగ్టన్ డీసీ)
రమేష్: ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో చెప్పారు కానీ హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు.?

జగన్: పోరాటం చేయకపోతే ఈ అంశం కోల్ట్ స్టోరేజ్ లోకి ఈ విషయం వెళ్తుంది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే పోరాటం చేసాం. ప్రత్యేక హోదా ఎన్నిరోజుల్లో వస్తుందో చెప్పలేను. అసాధ్యం అనుకున్న తెలంగాణను వారు సాధించుకున్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను మనం తెచ్చుకోలేమా. హోదా ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. హోదాపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 7న ప్రకటన తర్వాత స్వాగతిస్తున్నానని చంద్రబాబు స్వయంగా స్వాగతించారు. హోదా తో ఏం వస్తుందని శాసనమండలిలో ప్రశ్నించారు. మండలిలో ఏకంగా హోదా వల్ల ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇంగ్లీష్ వచ్చి ఉంటే జైట్లీ గారు చెప్పింది అర్థమై ఉండాలి.


వాసుదేవరెడ్డి(అమెరికా)
వాసుదేవరెడ్డి: ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు కదా.. మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసినట్లుగా మీరు ఏదైనా ప్రత్యేక పోరాటం చేయనున్నారా?

జగన్: అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ చూస్తే.. ఆయనకు ఎవరూ థ్యాంక్స్ చెప్పరు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా మన హక్కు ప్రకారం రావాల్సినది ఏదీ ఇవ్వకున్నా.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన సాధారణ ప్యాకేజీలు ఇచ్చారు. మనకు ప్రత్యేకంగా వారు చెప్పినట్లు ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించకుండా కేంద్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారు. మేం ఏదైనా దీక్ష చేపడితే.. మోదీ వస్తారు.. లేక మరెవరో వస్తారని సాకులు చెప్పి కుట్ర పన్ని దీక్ష భగ్నం చేస్తారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. చంద్రబాబులో, కేంద్రంలో గానీ మార్పులు రాకపోతే.. మా పోరాటం ఉధృతం చేస్తాం. కొన్ని దశలుగా పోరాటం కొనసాగిస్తాం.. మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.

వెంకట్(శాన్ ఫ్రాన్సిస్కో)
వెంకట్: ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాలు, హోదా లాంటివి నెరవేర్చలేదు. అమెరికాలో ఉన్నట్లుగా నేతను రీకాల్ చేయవచ్చా?

జగన్: అమెరికాలో ఉన్నట్లుగా ఇక్కడ అవకాశం లేదు. అబద్దాలు చెప్పే నేతలున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మ్యాండెట్ అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యం.

రమేశ్ (వాషింగ్టన్ డీసీ)
రమేశ్: స్టేలు తెచ్చుకోడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రత్యేక హోదా కోసం భవిష్యత్ లో ఎలా పోరాడతారు?

జగన్: ప్రత్యేక హోదా కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాం. భవిష్యత్ లో పోరాటం మరింత ఉధృతం చేస్తాం.

అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్


అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో ఆదివారం రాత్రి లైవ్ షో ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు.

ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు. హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.


రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే


ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే
ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై చర్చ
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రవాసాంధ్రులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉధృతంగా పోరు సాగుతున్న నేపథ్యంలో జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఐదు చోట్ల నుంచి ఎన్నారైలు జగన్‌తో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే డిజిటల్ మాధ్యమంలో సాక్షి యూట్యూబ్ చానల్ https://youtu.be/k4kM4PVNt8I ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఎన్నారైలు ఏర్పాటుచేసుకున్నhttp://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ/liveలింకులో కూడా ప్రత్యక్షప్రసారాలు లభిస్తాయి.

Popular Posts

Topics :