06 November 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సుబ్బారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

Written By news on Saturday, November 12, 2016 | 11/12/2016

హైదరాబాద్ : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన 35 ఏళ్ల పెల్లేటి సుబ్బారెడ్డి గత అక్టోబర్ 2న రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణం స్థానిక నారాయణ ఆస్పత్రిలో చేర్పించగా తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు.  చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుబ్బారెడ్డి మరణం ఆ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. రేపటి నుంచి కుటుంబం ఎలా గడవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఔదార్యం ప్రదర్శించి అవయవదానం చేయడానికి సిద్ధపడ్డారు. 
4వ తేదీ అవయవ దానం చేశారు. సుబ్బారెడ్డి ఊపిరితిత్తులను చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, అలాగే గుండెను గుంటూరు ఆస్పత్రిలో ఉన్న రోగి కోసం, కాలేయం విజయవాడ ఆస్పత్రికి, కిడ్నీలు, కళ్లు నెల్లూరు, తిరుపతిలలో ఉన్న ఆస్పత్రులకు తరలించి మరణించిన సుబ్బారెడ్డి తన అవయవదానంలో మరో అయిదుగురికి ప్రాణం పోశారు.
 
చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 సంవత్సరాలు), జశ్వంత్ (7 సంవత్సరాలు) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం నుంచిగానీ ఇతరుల నుంచి గానీ ఎలాంటి సహాయం అందకపోవడంతో వారు దిక్కులేని వాళ్లయ్యారు. 
 
ఆ విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా, స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రవాసాంధ్రులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కుటుంబంలోని పిల్లలు ఇద్దరి పేరిట చెరో లక్ష రూపాయలు, తల్లి పేరిట మరో 60 వేల రూపాయలు మొత్తంగా 2,60,000 ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రవాసాంధ్రులు ఆపన‍్నహస్తం అందించారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి ఆ ఇద్దరు పిల్లలు చదువుకున్నంత కాలం వారికయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాదరెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికయ్యే ఇంటి ఖర్చును భరిస్తానని ప్రకటించారు.
 
వీధిన పడిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రకంగా పలువురు ముందుకు రాగా, శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో దాతలు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పుట్టపర్తి వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. డాక్టర్ హరికృష్ణ ఆ కుటుంబ పరిస్థితిని వైఎస్‌ జగన్ కు వివరించగా, అదే సందర్భంగా ఎంపీ మేకపాటి ఆ కుటుంబానికి మరో 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ కుటుంబానికి తన వంతు కూడా చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
అవయవదానం చేసి నలుగురికి ప్రాణం పోసిన సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన సహాయం ప్రకటించిన వారందరినీ ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపి హైదరాబాద్ వరకు రప్పించి సహాయాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

వైఎస్ జగన్ ను కలిసిన సంధ్యారాణి పేరెంట్స్


హైదరాబాద్ : వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమార్తె చావుకు కారణం అయిన ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలని సంధ్యారాణి తల్లిదండ్రులు కోరారు. వైఎస్ఆర్ సీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కాగా గుంటూరు జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డా.లక్ష్మి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మరోవైపు రాజకీయ జోక్యంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాయగా, ఈ ఘటనపై ఏర్పాటు అయిన కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే  సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయినా లక్ష్మిని అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి


పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి
న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి మరోసారి నామినేట్ అయ్యారు. లైబ్రరీ కమిటీ సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు వినోద్ చావ్డా, ఆర్ గోపాలకృష్ణన్, విజయ్ కుమార్ హాండ్సక్, అభిజిత్ ముఖర్జీ, భగీరథ్ ప్రసాద్, రాజ్యసభ సభ్యులు ఝర్నాదాస్ బైద్య, ప్రభాత్ ఝా, డి.పి.త్రిపాఠి నామినేట్ ఆయ్యారని శుక్రవారం లోక్‌సభ కార్యాలయం తెలిపింది.

తాగండి.. ఊగండి అంటూ ఉత్తర్వులా?


బీచ్ ఫెస్టివల్.. బీరు ఫెస్టివల్..!
తాగండి.. ఊగండి అంటూ ఉత్తర్వులా?
470 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: నిన్న బీచ్ ఫెస్టివల్, లవ్ ఫెస్టివల్ అరుుపోరుు.. నేడు బీర్ ఫెస్టివల్‌ను చంద్రబాబు సర్కారు నిర్వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిస్తూ జారీ చేసిన జీవో 470 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో  మాట్లాడారు. చంద్రబాబు లిక్కర్ ఏజెంట్‌లా మారి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తూ.. రెండున్నర కోట్ల మహిళల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దోచుకునేందుకు కుట్ర..
 తెలుగుజాతిని మద్యం మత్తులో ఉంచి రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని పద్మ ఆరోపించారు.ఇప్పటికే రాష్ట్రం నేరాల్లో టాప్ అవ్వడానికి మద్యం అమ్మకాలే కారణమని గుర్తుంచుకోవాలని సూచించారు.తాగండి.. తాగి ఊగండి.. అన్న చందాన 420 సర్కారు.. 470 జీవోను అమలుపర్చడం సిగ్గుచేటన్నారు.

 మత్తుగా తూలితే చాలు..
 రాష్ట్రం ఎలా పోరుునా పర్వాలేదు.. జనాలు మత్తుగా తూలితే చాలు.. ఖజానా గలగలలాడాలని కోరుకుంటున్నారని పద్మ మండిపడ్డారు. మొన్నటి దాకా నీరు-మీరు అన్న చంద్రబాబు ఇప్పడు బీరు-బారు అంటూ బహిరంగ నినాదాలిస్తున్నారని చెప్పారు. జాతీయ రహదారుల ప్రక్కన 100 మీటర్ల లోపు మద్యం అమ్మకాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు నిర్దేశాలను పట్టించుకోకుండా, లెసైన్‌‌సలు ఇవ్వటానికి సిద్ధపడిందని ఆరోపించారు. మహిళల కన్నీళ్ల మీద నారా వారి సామ్రాజ్యాన్ని కట్టడానికి, అందులో లోకేష్‌ను కూర్చోబెట్టడానికియ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు

Written By news on Friday, November 11, 2016 | 11/11/2016


వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ నేతలు మచ్చా గంగాధర్‌, రవికిరణ్‌ వర్మతో పాటు.. టీడీపీ నేతలు కొల్లి శివ, ప్రసాద్‌, సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది

Written By news on Thursday, November 10, 2016 | 11/10/2016


‘బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది’
హైదరాబాద్ : ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తుంటే కన్యాశుల్యంలో మధురవాణి పాత్ర గుర్తుకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధికి  వైఎస్ఆర్ సీపీ ఆటంకాలు సృష్టిస్తోందని చంద్రబాబు, లోకేశ్, మంత్రులు ఒకటే భజన చేస్తున్నారన్నారు. తాము ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు అడ్డుపడతామే తప్ప... అభివృద్ధికి కాదన్నారు.
 
అభివృద్ధికి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు నోరు పారేసుకోవడం తగదని అంబటి సూచించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని, అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేవని ఆయన అన్నారు.  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేశ్ కు  లేదని అంబటి అన్నారు. పిచ్చి మాటలు వద్దని... కాకిపిల్ల కాకే అవుతుంది కానీ...కోకిల ఎప్పటికీ కాలేదని ఆయన ధ్వజమెత్తారు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందరు పోర్టు కోసం 1200 ఎకరాలు చాలన్న చంద్రబాబు ఇప్పుడు 33వేల ఎకరాల భూమిని తీసుకోవడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని అంబటి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు పోలీసు బందోబస్తు లేకుండా ప్రజల వద్దకు వెళితే ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆయన అన్నారు.
 
రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి ఏ రాజకీయ పార్టీకి ఉందో అందరికి తెలుసని, అధికారం కోసం తాపత్రాయపడేది నారా వంశస్తులేనని అంబటి వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర జరిగి తీరుతుందన్నారు. దానికి ఆటంకాలు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అంబటి హెచ్చరించారు. 

ఓర్వలేకే జగన్‌పై విమర్శలు

Written By news on Tuesday, November 8, 2016 | 11/08/2016

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలనే ప్రగాఢ కాంక్షను జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా రాష్ట్ర ప్రజలు చాటి చెప్పడంతో బెంబేలెత్తిన రాష్ట్ర మంత్రులు అక్కసుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను విఫలం చేయాలని టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, అడ్డంకులెన్ని సృష్టించినా చరిత్రాత్మకంగా విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విశాఖ సముద్రపు భాష అభ్యుదయానికి సంకేతమైతే, జై ఆంధ్రప్రదేశ్ సభలో జనసముద్ర ఘోష ప్రత్యేకహోదా మహోదయమని అభివర్ణించారు. ప్రత్యేకహోదా రాకుండా చిదిమేస్తున్న శక్తుల కుట్రను జగన్ బయట పెడితే, దానికి సమాధానం చెప్పకుండా రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యక్తిగత విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభ నిర్వహణకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయనే చౌకబారు విమర్శలు చేయడాన్ని ఆక్షేపించారు.

 ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలి
 ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలావరకు నెరవేర్చేశామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భూమన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 1.3 లక్షల ప్రభుత్వోద్యోగాలను, ప్రైవేటు రంగంలో 2,23,385 ఉద్యోగాలను ఇచ్చినట్లు సుజాత, అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారని... అది నిజమైతే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో పేర్లతో సహా ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డులో వెల్లడించగలరా? అని సవాలు విసిరారు. లేదంటే తాము పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మంత్రులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కావాలా... వద్దా...? అనే విషయం చెప్పకుండా మరో మంత్రి తెల్లారకముందే పాచినోట జగన్‌పై విమర్శలు చేశారని, సాక్షాత్తూ ఈ మంత్రే మహిళలపై దురాగతం చేసిన వారిలో ఒకరని ఏడీఆర్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించిందని చెప్పారు.

 హోదాపై మోసగించిన దుష్టద్వయం
 ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మేలని చెబుతూ సన్మానాలు చేరుుంచుకుంటూ తిరుగుతున్న దుష్ట ద్వయం వెనుక ప్రజలెవ్వరూ లేరని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు అనుభవజ్ఞులని, కృష్ణార్జునుల మాదిరిగా రాష్ట్రాన్ని కాపాడుతారని ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ రాష్ట్రానికి రాహు కేతువుల్లాగా దాపురించారని దుయ్యబట్టారు.   ఇప్పటికై నా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుని ప్రత్యేక హోదా సాధించలేక పోతున్నందుకు ప్రజలకు క్షమాపణ, జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకాలు

Written By news on Sunday, November 6, 2016 | 11/06/2016


‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకాలు
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నింది. జనం సభకు రాకుండా చేసేందుకు అడ్డంకులు సృష్టించింది. సభ జరిగిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియత్రించారు. స్టేడియం గేట్లు మూసివేసి సభకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. దీంతో వేలాది ప్రజలు స్టేడియం వెలుపలే ఉండిపోయారు. సభ జరుగుతున్నంతసేపు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు బయటే ఉండిపోయారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభా ప్రాంగణంలోకి వస్తున్న సమయంలోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కార్యకర్తలను విచక్షణారహితంగా తోసేశారు. స్టేడియం గేట్లు అన్ని తెరిచి ప్రజలను లోపలికి అనుమతించాలని వేదికపై నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు పదేపదే విజ్ఞప్తి చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడతారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి మైకులో హెచ్చరించారు. ప్రజలను లోపలికి రానివ్వాలని కోరారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు.

లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి


బాబు పాలన ఏడ్చినట్టు ఉంది: వైఎస్‌ జగన్‌
విశాఖపట్నం:చంద్రబాబునాయుడు గత రెండున్నరేళ్ల పరిపాలనలో ఎక్కడా ప్రజలు సంతోషంగా లేరని, ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’  బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. ఒకప్పుడు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్యమానికి విశాఖ గడ్డ స్ఫూర్తినిచ్చిందని, ఈరోజు ఇదే గడ్డ మీద ప్రత్యేక హోదా ఉద్యమబాట పట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
  • 2014 ఎన్నికల సమయంలో ఇదే వేదికపై నిలబడి చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. 
  • ఇదే వేదిక మీద ఐదేళ్లు కాదు, పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చారు.
  • ఈ రోజు అబద్ధాలు చెప్పి, మోసం చేసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తివిధంగా ‘జై ఆంధ్రప్రదేశ్‌’ అంటూ నినదించాలి. ( చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవిధంగా నినదించాలని వైఎస్‌ జగన్‌ కోరడంతో సభాప్రాంగణం ఒక్కసారిగా ‘జై ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలతో మార్మోగింది).
  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమానికి నేటితో 50 ఏళ్లు నిండింది.
  • ఈ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు.. స్టీల్‌ ఫ్యాక్టరీని సాధించుకున్న గడ్డ విశాఖపట్నం.
  • మన ప్రభుత్వమే మన కంట్లో వేలు పొడిచేలా చేస్తుండటంతో విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాన్ని చేపడుతున్నాం.
కొన్ని ప్రశ్నలతో వచ్చా: వైఎస్‌ జగన్‌
  • ప్రసంగాలతో ఊదరగొట్టడానికి ఈ సభకు రాలేదు.. నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఇక్కడికి కొన్ని ప్రశ్నలతో వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. మిమ్మల్ని కూడా ఆలోచింపజేయడానికి వచ్చా.
  • రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి.
  • మనకు లాభం జరుగుతుందని చెప్పి విభజన చేశారు.
  • ఈ రెండున్నర సంవత్సరాల్లో విభజన వల్ల మన రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందా? లేక నష్టపోయామా?  అన్నది ఆలోచన చేయాలి.
  • ఈ రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు తోడుగా నిలబడిందా? విభజనతో మనకు మంచి జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి.
  • రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబమైనా కోరుకునేది తమ పిల్లల్ని చదువించుకోవాలని, వారికి మంచి కొలువులు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, జబ్బులు వస్తే ఆస్తులు అమ్మకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వ అండదండలు అందాలని, ఆదాయం తగ్గకూడదని కోరుకుంటారు. విభజన అనంతరం ఈ కనీస విషయాల్లో భరోసా ఇచ్చేవిధంగా ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పరిపాలన అందించిందా? అంటే లేదని ప్రజల నుంచి వినిపిస్తోంది.
  • గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం? మన గ్రామాలు సంతోషంగా ఉన్నాయా? మన రైతులు, కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరు. మన డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? మన యువత, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేరు.
  • మన రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్ల సంవత్సరాల్లో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి?
  • మన రైతులు తమ భూమిని ప్రభుత్వం లాక్కోకుండా ఉంటుందని భరోసాగా ఉన్నారా? అంటే అదీ లేదు. 
  • అందరికీ పక్కా ఇళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అప్పులు కాకుండా మన పిల్లలు చదువులు పూర్తిచేసుకునే పరిస్థితి ఉందా? లేదు.
  • ఎక్కడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
  • ఈ ప్రభుత్వం కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలైనా నెరవేర్చిందా?
  • బేషరతుగా పూర్తిగా రైతులకు రుణమాఫీ చేశారా? బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ అమలైందా? అంటే అదీ లేదు.
  • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికీ రెండువేల భృతి ఇస్తానన్నారు? ఈ 30 నెలల బాబు పాలనలో మీ ఇంటికి రూ. 60వేల నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే రాలేదన్న సమాధానమే ప్రజల నుంచి వినిపిస్తోంది.
  • బెల్టు షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాల్లో బెల్టు షాపులు తగ్గాయా? లేదు
  • ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు
  • ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. చంద్రబాబు పాలన ఏడ్చినట్టు ఉంది.
  • వైఎస్సార్ ప్రభుత్వం ఇళ్లు కట్టడంలో రికార్డుగా నిలిచింది
  • ఇవాళ పేదలు ఇళ్ల కోసం నిరీక్షిస్తూ వెతికినా ఒక్క ఇల్లు కనబడని పరిస్థితి
  • వైఎస్సార్ పాలనలో అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ ఇచ్చారు
  • మనం రాష్ట్రంలో గ్యాస్ ఇచ్చిన తర్వాతే తీసుకెళ్లాలని వైఎస్సార్ పోరాడారు

రెండో విప్లవం రావాలి
  • కేంద్రం బెదిరించక ముందు మన సీఎం చేతులెత్తేసి వారి కాళ్ల మీద పడే పరిస్థితి ఇవాళ ఉంది
  • ప్రతి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్న, సామాజికంగా ఎదగాలన్నా ఉద్యోగాల విప్లవం, రెండో విప్లవం రావాలి
  • చదువుల విప్లవం వస్తే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుంది
  • ముందుండి పోరాటం చేయాల్సిన సీఎం చదువుల విప్లవంను నీరు గార్చారు
  • చంద్రబాబు పాలనలో అవినీతి విప్లవం వచ్చింది
  • కేసుల నుంచి బటయపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చేయని కుట్ర లేదు
  • ఒక సీఎం అవినీతి సొమ్మును సూట్ కేసులో పెట్టుకుని నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అరెస్ట్ కాలేదు
  • చంద్రబాబు కాబట్టే మన ఖర్మ కొద్ది ఇదంతా చూడాల్సి వస్తోంది
  • ప్రజలకు మేలు చేయడం కోసం సీఎం వెనుకడుగు వేయకుండా పరితపించాలి
  • అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకు పుడతాం, నేను, వెంకయ్య అమెరికా పుట్టేవాళ్లం అంటాడు
  • ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని ప్రశ్నిస్తున్నా
  • ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ బ్రహ్మండంగా ఉందని అంటున్నాడు
  • హోదా కోసం పోరాటం చేయాల్సిన సీఎం వెన్నుపోటు పొడుస్తున్నాడు
  • మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి సొంత లాభం కోసం వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు రాష్ట్రం నివ్వెరపోతోంది
  • వెంకయ్య, చంద్రబాబు కలిసి చీకటి ఒప్పందాల కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు
  • తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు టీడీపీ పార్టీ ఆవిర్భవించింది
  • ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారు
  • తెలుగువాడి ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుకుంటున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలి
  • ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు
  • ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి
  • ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర రాష్టాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరకు రావడమే ప్రత్యక హోదా అంటే
  • హోదా తేవాలని సీఎంకు, ఇవ్వాలని కేంద్రానికి లేదు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకుని కూచోవాలా
  • చేతుల కట్టుకునే జాతేనా మనది. చేతులు కట్టుకునివుంటే స్వాతంత్ర్యం వచ్చేదా, మద్రాసులో రెండో శ్రేణి పౌరులుగానే ఉండేపోయేవాళ్లం
  • ఉద్యమాలు అంటే వెరపు లేదు, జైళ్లు అంటే భయం లేదు
  • అన్ని ప్రాంతాల్లో సభలు, యువభేరీలు పెడతాం.. ధర్నాలు చేస్తాం, పోరాటం కొనసాగిస్తాం..
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శీతాకాల సమావేశాలకు వరకు వేచి చూస్తాం
  • అప్పటికీ హోదా ఇవ్వకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి, మనక జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తాం
  • ప్రత్యేక హోదా అంశాన్ని 2019 ఎన్నికల్లో రెఫెండంగా మార్చే ప్రయత్నం చేస్తాం
  • ప్రత్యేక హోదా డిమాండ్ ఎవరైనా చేస్తే పీడీ యాక్టు పెడతానని చంద్రబాబు బెదిరిస్తాడు
  • హోదా కోసం బంద్ లు చేస్తే దగ్గరుండీ ఆర్టీసీ బస్సులను ఆయనే తిప్పిస్తాడు
  • ఇటువంటి వ్యక్తి మీద టాడా కేసు పెట్టినా తప్పులేదు
  • ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది, ప్రత్యేక హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
  • అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు కలిసి హోదా రాకుండా కుట్ర చేస్తున్నారు

కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కామెడీ విలన్ తక్కువ


లోకేశ్ పై ఎమ్మెల్యే రోజా సెటైర్
విశాఖపట్నం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రత్యేక హోదాను ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళుతున్న బాబును ప్రజలు చొక్కపట్టుకుని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్‌ సీపీ నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

దగా పడ్డ తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పేందుకే ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టామన్నారు. శ్రీశ్రీ, గురజాడ, తెన్నేటి నడయాడిన ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో జై ఆంధ్రప్రదేశ్ సభలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అధికార మదంతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారని.. ధర్నాలు, బంద్ చేపట్టారని తెలిపారు. ప్రాణాలు లెక్కచేయకుండా ఆమరణ దీక్షలు చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు. 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చాలా గొప్పగా చెప్పి 11 నెలలు దాటినా ఒక్క ఉద్యోగం రాలేదని విమర్శించారు.

జై ఆంధ్రప్రదేశ్ సభతో అధికార పార్టీ నేతలు వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదని వ్యాఖ్యానించిన నారా లోకేశ్... కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కామెడీ విలన్ తక్కువ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారని, టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కనీసం వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం ఉందా నిలదీశారు. వెన్నుపోటు బ్రదర్స్ గా మారిన వెంకయ్య, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటే ప్రతి ఒక్కరు జగనన్న వెంట నడవాలని కోరారు.

ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?


ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలందరి హక్కు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలందరు సాధించుకున్న హక్కు అయిన హోదాను కాదని, ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రజలందరి ఆకాంక్షలను తెలియజేయడానికే వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్రప్రదేశ్‌’ సభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సమర్థించిన అప్పటి ప్రతిపక్షం బీజేపీ పదేళ్లు హోదా కావాలని కోరింది’ అని గుర్తుచేశారు. విభజనతో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు, విభజన ఇష్టం లేని ప్రజలందరినీ సముదాయించేందుకు  ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. 
 
ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను వదిలేసుకుంటున్నట్టు చంద్రబాబు చల్లగా చెప్పారని విమర్శించారు. దీంతో అర్ధరాత్రి ప్యాకేజీ ఇస్తే చాలన్నట్టుగా అరుణ్‌ జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారని, ఒక ప్రాంతం ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎలా వదిలేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలతో, ప్రతిపక్షంతో ఏమాత్రం సంప్రదించకుండా గుట్టుచప్పుడు కాకుండా హోదా అంశాన్ని పక్కనపెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది


‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెలోనూ మార్మోగుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అరకు ఎమ్మెల్యే  గిడ్డీ ఈశ్వరీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైఎస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తానన్న అరుణ్‌జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి స్వాగతించిన మహాఘనుడు చంద్రబాబు అని ఆమె మండిపడ్డారు. 

‘చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఆ రోజు ఏపీకి ఐదేళ్ల కాదు పదేళ్లు ఇవ్వాలని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు హోదా వద్దు, ఆర్థిక ప్యాకేజీ చాలు అని ద్రోహం చేస్తున్నారు. హోదా విషయంలో రాత్రికి రాత్రే చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. తనకు, తన కొడుకుకు దోచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్యాకేజీని స్వాగతిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన ఓ అబద్ధాల పుట్ట. ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న గిరిజనులకు ఉచితంగా కందిపప్పు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా కిలో  రూ. 40 చొప్పున నాసిరకం కందిపప్పు అందిస్తున్నారు’ అని ఆమె అన్నారు.
 
‘ చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి కులరాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప.. ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు. హోదా ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేస్తున్న నేత వైఎస్‌ జగన్‌కు ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. లోకేశ్‌కు మంత్రి హోదా కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రత్యేక హోదా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. 

గుడివాడలో టీడీపీ జెండా ఎగరదు


'గుడివాడలో టీడీపీ జెండా ఎగరదు'
గుడివాడ: చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గుడివాడలో టీడీపీ జెండా ఎగరదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను ప్రజలను నమ్ముతానని, నాయకులను కాదని పేర్కొన్నారు.

ప్రజలే తనకు దేవుళ్లని, తన ప్రాణం ఉన్నంతవరకు గుడివాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.

11 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్


ఉక్కు నగరంలో ‘హోదా’ పోరు
నేడు విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ సభ
పూర్తయిన ఏర్పాట్లు.. సన్నద్ధమైన నగరం
తరలి రానున్న ఉత్తరాంధ్ర జనం
11 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్
3 గంటలకు సభ ప్రారంభం
 
 సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: దారులన్నీ విశాఖ వైపునకు పరుగులు తీస్తున్నాయి. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఉద్యమ కెరటాలై దూసుకొస్తున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ రణన్నినాదం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు విశాఖపట్నం సర్వసన్నద్ధమైంది. సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎన్నికల్లోఈస్టేడియం వేదికగానే బీజేపీ, టీడీపీ నేత లు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు,  చంద్రబాబు నాయుడు ఇదే వేదికపై నమ్మబలికారు.

వీరితో జతకట్టిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా ఏపీకి హోదా వస్తుంది, బీజేపీ-టీడీపీలకు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏపీకి హోదా ఇవ్వలేమని గద్దెనెక్కిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఏపీకి హోదా పొందే అర్హతే లేదని వెంకయ్య.. హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అంటూ చంద్రబాబు ప్రజలను దగా చేశారు. ఎక్కడైతే వీరంతా హోదాపై హామీల వర్షం గుప్పించారో అదే వేదికపై ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ఆదివారం ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట మలిదశ పోరుకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడుతోంది. హోదా వచ్చే వరకూ పోరు ఆగదంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే వేదికగా సమర శంఖారావం పూరించనున్నారు. ఈ మహోద్యమంలో భాగస్వాములయ్యేందుకు విశాఖతోపాటు ఉత్తరాంధ్ర వాసులు సన్నద్ధమయ్యారు.
 ఏర్పాట్లను పర్యవేక్షించిన విజయసాయిరెడ్డి
 ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ కోసం తెన్నేటి విశ్వనాథం ప్రాంగణంగా నామకరణం చేసిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు నేతలు ప్రసంగించేందుకు వీలుగా గురజాడ అప్పారావు పేరిట ఏర్పాటు చేసిన సభావేదిక ముస్తాబైంది. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఓపక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే, మరోపక్క సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నేతలకు సూచిస్తున్నారు.
 
 నేడు ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు జగన్
 ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కోసం జగన్ రెండున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘యువభేరి’ సభలు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆవశ్యతకను విద్యార్థులు, యువతకు వివరించారు. విశాఖపట్నంలో జరగనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెప్పనున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు జగన్ ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. తొలుత నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో విడిది చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభాస్థలికి చేరుకుంటారు. సభ పూర్తయిన అనంతరం విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

Popular Posts

Topics :