20 November 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

Written By news on Wednesday, November 23, 2016 | 11/23/2016


ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
హైదరాబాద్ :
దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
 

పరిశ్రమలకు వైఎసార్‌సీపీ ఎప్పుడూ అడ్డం రాదని, అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు కప్పం కట్టలేకనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని పార్థసారథి అన్నారు. దివీస్‌ సంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడే పేదల భూములను వాళ్లకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపించారు. మంత్రి ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడకూడదని పార్థసారథి అన్నారు.

కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్


కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్
రాజమహేంద్రవరం: 'పెద్ద నోట్ల రద్దువంటి పెద్ద అంశాలపై అధికార ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం, సామాన్యులను సంప్రదించడం చేస్తుంది. ఆ నిర్ణయం తర్వాత ఏర్పడే ప్రభావం నుంచి బయటపడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతు విప్పుతుందని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద నోట్లను రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారని, అంతవేగంగా ఆయనెలా స్పందించగలిగారని ప్రశ్నించారు. కేంద్రం సెలక్టివ్ పీపుల్స్ కు ముందే లీకులిచ్చిందని, అందులో చంద్రబాబు కూడా ఉన్నారని, అందులో భాగంగానే అక్టోబర్ 12న చంద్రబాబు రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారని వైఎస్ జగన్ చెప్పారు. కేంద్రం నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు తన పరిస్థితులు చక్కబెట్టుకొని సామాన్యులను మాత్రం గాలికొదిలేశారని అన్నారు. చంద్రబాబు చర్యలు చూశాక కూడా ఎవరికీ తెలియకుండానే తాము నిర్ణయం వెలువరించామని కేంద్రం చెప్పే మాటలు తాము ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

నల్లడబ్బును అరికట్టేందుకే అని కేంద్రం చెప్పినా ఊహించని విధంగా నిర్ణయం వెలువరించారన్నారు. నల్లడబ్బును అరికట్టడాన్ని తాము స్వాగతిస్తామని, సరైన విధంగా అమలు చేయకపోవడం మూలంగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రణాళికలు కూడా సరైన విధంగా అమలు చేయకుంటే విఫలమవుతాయని అన్నారు. యూఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న గోర్బచావ్ సోషల్ ఎకనామిక్ నుంచి లిబరల్ ఎకానమిగా మార్చే పెద్ద నిర్ణయం తీసుకున్నారని, కానీ, దాని అమలుకోసం సరైన చర్యలు తీసుకోకపోవడంతో విఫలమైందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అమలులో పారదర్శకత లోపించిందన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • పాత పెద్ద నోట్ల రద్దుతో చిన్న, సన్నకారు రైతులు కష్టాలు పడుతున్నారు
  • ఇవాళ రైతులు తమ పంటను అమ్ముకోలేని, కొత్త పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో సగం కూడా రాని పరిస్థితి నెలకొంది
  • వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు, ఇదంతా నల్లధనం ఎలా అవుంది?
  • మనదేశంలో ఉన్న 6 లక్షల 38 వేళ్ల  గ్రామాలు క్యాష్ ఎకానమీతో నడుస్తున్నాయి
  • గ్రామాల్లో 75 శాతం మంది క్యాష్ ఎకానమీతో బతికే పరిస్థితి ఉంది
  • 92 శాతం గ్రామాలకు బ్యాంకులు లేవు
  • 53 శాతం జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి
  • దేశంలో ఉన్న ఏటీఏంలలో పదిశాతం కూడా గ్రామాల్లో లేవు
  • 2 వేల నోటు తీసుకెళితే ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు
  • 2 వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారో ఎవరికీ తెలియడం లేదు
  • పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి

ఉద్దేశాలు మంచివే.. అమలులో విఫలం
  • దేశంలో 50 లక్షల మందికి 2 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్ని 120 కోట్ల మంది జనాభాకు ఏవిధంగా సరిపోతాయి?
  • పాత పెద్ద నోట్లు నిర్ణయం మంచిదే కానీ దీన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు
  • ముందస్తు సన్నాహాలు చేయకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమజసం కాదు
  • ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి, దీనికి కొంత సమయం పడుతుంది
  • 1975లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చెలామణిలో వాటి భాగం 0.6 శాతం మాత్రమే
  • ఇప్పుడు 86 శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసినప్పుడు ఎంత ప్రిపరేషన్‌ ఉండాలి?
  • ముందు ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించడం దారుణం
  • మొదట ఒక మాట, తర్వాత ప్లేటు ఫిరాయించి మరొక మాట మాట్లాడారు
  • నోట్ల కష్టాలు తీరేవరకు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి
  • రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల ఎటువంటి నష్టం జరగదు, వారు అనుకున్న ఉద్దేశాలు నెరవేతాయి
  • బాగుంటే నా నిర్ణయం.. బాగా లేకుంటే మోదీ నిర్ణయం అన్నట్టుగా చంద్రబాబు స్పందన ఉంది
తెలుసు కాబట్టే హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారు
  • పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసు
  • అందుకే మూడు రోజుల ముందే హెరిటేజ్‌ షేర్లు అమ్ముకున్నారు
  • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి హెరిటేజ్ షేర్ విలువ రూ.199
  • ఈ రెండున్నరేళ్లలో హెరిటేజ్ షేర్ విలువ రూ.909కి పెరిగింది.
  • అంటే సుమారు 450శాతం విలువ పెరిగింది

వాయిస్ ఆఫ్ పీపుల్
  • పెద్ద నిర్ణయాలను తీసుకునే ముందు కాస్తంత ఆలోచన చేయండి
  • నల్ల డబ్బు అంతం చేయడాన్ని మేం కూడా స్వాగతిస్తాం
  • ఏటీఎంల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలి
  • ప్రతిపక్షం అంటే వాయిస్ ఆఫ్ పీపుల్
  • ప్రజలు ఒక నిర్ణయం బాగుందంటే మేం బాగుందంటాం.. వారు బాగలేదంటే బాగ లేదని చెప్తాం
  • ప్రతిపక్షాలు అడ్డగోలుగా స్పందించకూడదు. ప్రజల స్పందన చూశాకే స్పందించాలి
  • అనూహ్య నిర్ణయాలపై ఎలా స్పందించాలి
  • ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు, వారి బాధలు తెలుసుకున్న తర్వాతే మేం మాట్లాడుతున్నాం
  • మేం చెప్పే ప్రతి మాట ఇప్పుడు చాలా నిర్మాణాత్మకమైనది
  • అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత నిర్ణయం వెలువరించాలి
  • ప్రతి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడే చెప్పనక్కర్లేదు.. పార్టీలో అధికార ప్రతినిధులు చెప్పేవి కూడా పార్టీవే
  • చంద్రబాబునాయుడు మాదిరిగా పని పాట లేకుండా మేం లేము
  • ప్రజలకే బాబు ముఖం చూసి చూసి చిరాకొచ్చేస్తుంది
  • పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రతి అంశంపై అవగాహన ఉండాలి

రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు

Written By news on Tuesday, November 22, 2016 | 11/22/2016


రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు
దానవాయిపేట :
దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడినందుకు తమ మీద అర్థం పర్థం లేని కేసులన్నీ పెట్టారని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామస్తులు చెప్పారు. చివరకు గ్రామస్తులు కొందరు కలిసి రోడ్డు రోలర్ ఒకదాన్ని బద్దలు కొట్టారని కూడా కేసు పెట్టారని వాపోయారు. అసలు దాన్ని బద్దలుకొట్టడం సాధ్యమేనా అన్న చిన్న విషయాన్ని కూడా గమనించకుండా చేతికి వచ్చిన కేసులన్నీ పెట్టారన్న విషయాన్ని బాధితులు కుండ బద్దలుకొట్టి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అండగా నిర్వహించిన సభలో ఈ విషయాలు వెల్లడించారు. 
 
రోడ్డుమీద మట్టి ఎత్తుకెళ్లామట
ఇక్కడంతా చిన్న, సన్నకారు రైతులే. మత్స్యకార కుటుంబాలు 36 ఉన్నాయి. మండలంలో 50 ఊళ్లు ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు మీద మంచినీటి పథకం అని ముందు మోసం చేశారు. కానీ బోర్డులు పెట్టాక అసలు విషయం తెలిసింది. దివీస్ అనగానే ఏంటా అని విచారించాం. మండువేసవిలో కూడా ఇక్కడి వాతావరణం సహజమైన ఏసీలా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ వస్తే పిల్లలు పుట్టరని, పుట్టిన పిల్లలు యవ్వనంలో ఉండరని చెబుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లాడితో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు, రోడ్డు మీద మట్టి ఎత్తుకెళ్లిపోయామని కేసు పెట్టారు. రోడ్డు రోలర్‌ను బద్దలుకొట్టామని అన్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా పిఠాపురం సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. 
-ముసలయ్య
 
వాళ్లను రానిచ్చేది లేదు
గత 82 రోజులుగా మేం పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెట్టి మావాళ్లను జైళ్లలో పెట్టారు. మాకు మూడెకరాల భూమి ఉంది. దాన్ని బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను రానిచ్చేది లేదు
-సుశీల
 
పిల్లలు లేకపోతే బతకడం ఎందుకు
మమ్మల్ని భయపెట్టి, బలవంతంగా రెండెకరాలు లాక్కోవాలనుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తామంటున్నారు. మా పిల్లలను ఎలా బతికించుకోవాలి? భూమి లేకపోతే అడుక్కుని తింటాం కానీ, పిల్లలే లేకపోతే ఎలా బతకాలి, ఎందుకోసం బతకాలి? ఏడాదికి 2 లక్షల ఆదాయం ఇచ్చే సర్వి తోటను బలవంతంగా నరికించేశారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ.. భూములు మాత్రం ఇవ్వం. కాకినాడ ఆస్పత్రిలో ఇక్కడివాళ్లు ఎంతమంది బాధలు పడుతున్నారో లెక్కలేదు. 
-కృష్ణవేణి
 
సీపీఎం మధును కర్కశంగా కొట్టారు
నేను ఒక ఎకరం రైతును. మా ఇంటి మీద మూడు జీపులతో పోలీసులు దాడి చేశారు. మీటింగులు పెడుతున్నావట, ఇల్లు కూల్చేస్తాం, జైల్లో పారేస్తాం అన్నారు. అయినా భయపడలేదు. మాజీ ఎంపీ మధును పోలీసులు కర్కశంగా కొడుతుంటే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధం. రాజశేఖరరెడ్డి మా భూములు లాక్కున్నారని బాబు చెప్పారు, కానీ ఇప్పుడు ఈయనే లాక్కుంటున్నారు
-బుజ్జిబాబు
 
మా ఉద్యోగాలు పీకేస్తున్నారు
హేచరీలో ఉద్యోగం చేస్తున్నాను. ఏడోతరగతి చదివి, నెలకు 8వేల రూపాయలు సంపాదిస్తున్నాను. అక్షరం ముక్క లేకపోయినా అనుభవం పెరిగే కొద్దీ 20 వేల వరకు వస్తుంది. మా హేచరీలో వందమంది పనిచేస్తారు. భూములు అమ్మకపోయినా లాగేసుకుంటాం అంటూ మామీద కేసులు పెడుతున్నారు. 144 సెక్షన్ అంటే దారుణంగా ఉంది. యనమల రామకృష్ణుడు ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోలేదు. దివీస్ వస్తే ఆ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడి వాళ్లకో ఉద్యోగాలు వస్తాయేమో గానీ, మా ఉద్యోగాలన్నీ పోతాయి. అందుకే అది వద్దనే కోరుకుంటున్నాం
-యనమల శ్రీను
 
ఆడవాళ్లని కూడా చూడకుండా...
పోలీసులు ఒక్కసారిగా వచ్చి, సీఐని తిడుతున్నావంటూ దుస్తులు చించేసి జీపు దగ్గరకు లాక్కెళ్లారు. అసలు సీఐ మొఖమే నాకు తెలియదని చెప్పాను. మా అమ్మాయిని స్కూలు నుంచి తీసుకొద్దామని బయటకు వెళ్తే.. పోలీసులు ఒంటిమామిడి స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. అప్పటికే మా ఆయనను అన్నవరం స్టేషన్‌లో పెట్టారు. కనీసం పిల్లలకు కడుపునిండా తిండిపెట్టే అవకాశం కూడా లేకుండా చేశారు. యనమల రామకృష్ణుడి తమ్ముడు పదవిలో లేకపోయినా ఆగడాలు చేస్తున్నాడు. బయటి నుంచి పదిమందిని తీసుకొచ్చి, దివీస్ కంపెనీ లేకపోతే చచ్చిపోతామని వాళ్లతో చెప్పించారు. అసలు వాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు. ఇదంతా యనమల రామకృష్ణుడు చేసిన పని. 
-మంగ
 
ఏం చేస్తారో తెలీదు.. ఫ్యాక్టరీ వద్దు
మేం ఈ ఊరు వదిలి వెళ్లలేం, ఈ భూములు వదిలి వెళ్లలేం. మీరేం చేస్తారో తెలీదు, ఆ ఫ్యాక్టరీని మాత్రం రానివ్వద్దు. బలవంతంగా భూములు లాక్కుని, పోలీసులతో కొట్టిస్తున్నారు. మేం భూములు ఇచ్చేది లేదని చెప్పినా,  భూములు లాక్కుని చెట్లు నరికేశారు. ఫ్యాక్టరీ రాకుండా మీరే ఆపాలి (అంటూ ఆమె తీవ్రంగా విలపించారు)
-అమ్మాజీ

నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా


నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా
దానవాయిపేట :
అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివీస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మీద 22 కేసులు పెట్టారని, వాటిలో 7 హత్యాయత్నం కేసులని చెప్పారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పలకరించేందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
 
  • దానవాయిపేట, చుట్టుపక్కల బాధిత గ్రామాలు గత 82 రోజులుగా ఈ ఫ్యాక్టరీ వద్దని చెబుతూ గట్టిగా ఉద్యమబాట పట్టినా, ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలు ఇవీ అని చెప్పినా వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 
  • పైగా మీకు తోడుగా ఎవరైనా ఉంటే, మీరు పడుతున్న బాధలను ప్రభుత్వానికి అర్థం కావాలని గట్టిగా నిలదీస్తే.. పెట్టని కేసు లేదు. 
  • 82 రోజులుగా ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. 
  • మీకు అండగా నిలబడినందుకు ఎమ్మెల్యే రాజా మీద 22 కేసులు పెట్టారు. వాటిలో ఏడు హత్యాయత్నం కేసులట. 
  • అసలు హత్యాయత్నం అంటే ఏంటో కూడా వీళ్లకు తెలుసో లేదో తెలియట్లేదు
  • మీకు అండగా నిలబడేందుకు కమ్యూనిస్టు పార్టీ నేత మధు వచ్చారు. ఆయన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు
  • ఆయనను కొట్టుకుంటూ వ్యాన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడికొస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు అన్నట్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదు
  • ఆడవాళ్లని కూడా చూడకుండా కొట్టి, పైపెచ్చు కేసులు పెట్టారు
  • ఈ ఫ్యాక్టరీని ఎందుకు వీళ్లంతగా వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల కాలుష్యం వీళ్ల జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో రాష్ట్రం మొత్తానికి చెప్పాలి
  • చంద్రబాబుకు మనసు మారాలి, ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడినుంచి వెనక్కి వెళ్లాలి
  • చంద్రబాబు గూబ అదిరేలా.. ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలు ఆయనకు చెబుదాం
  • హేచరీలలో 20-25 వేల మంది పనిచేస్తున్నారు. వీళ్లంతా వాటిమీద ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. ఈవాళ ఒకే ప్రాంతంలో 250 హేచరీలు ఉన్నాయంటే.. ఇలాంటి ఆక్వాజోన్ బహుశా దేశంలోనే ఎక్కడైనా ఉందో లేదో. 
  • ఇంత పెద్ద ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. 
  • దేశం మొత్తానికి మత్స్య ఉత్పత్తుల ఎగుమతి వల్ల 33వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తుంటే, అందులో రొయ్యల ద్వారా వచ్చే ఆదాయం 23వేల కోట్లు. 
  • ఇలాంటి చోట్ల ఉన్న హేచరీలలో తయారైన రొయ్య పిల్లలే అంత మొత్తాన్ని సంపాదిస్తున్నాయి. మొత్తం సీడ్‌లో సగం ఒక్క ఈ ప్రాంతం నుంచే వస్తోంది. 
  • 14 వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందంటే.. ఇంత ప్రాధాన్యం గల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వీటిని కాపాడాలని చూడాలి. 
  • సముద్రపు నీరు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే హేచరీలు పెట్టగలరు. కానీ ఈ ఫ్యాక్టరీకి సముద్రం నీరు అవసరం లేకపోగా, సముద్రం లోకి కలుషిత నీళ్లను ఈ ఫ్యాక్టరీ పంపుతుంది
  • హేచరీలు బతకాలంటే, సముద్రపు నీరు కావాలి.. అదే ఈ ఫ్యాక్టరీకి మాత్రం తమ కలుషిత నీటిని పంపడానికి సముద్రపు నీరు కావాలి. 
  • ఇది సమంజసమేనా అని గత 82 రోజులుగా ఇక్కడివాళ్లంతా ధర్నాలు చేస్తున్నారు
  • ఫ్యాక్టరీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ, ఒక్క ఫ్యాక్టరీ వల్ల 20 వేల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందంటే దానివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా
  • ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఉంది. దివీస్ ఫ్యాక్టరీని అక్కడకు తీసుకెళ్లి పెట్టుకోవచ్చు
  • ఒక మునిసిపాలిటీకి తాగడానికి కావల్సిన 60 లక్షల లీటర్ల మంచి నీళ్లను ఈ ఫ్యాక్టరీ తీసుకుని, అందులో 55 లక్షల లీటర్ల కలుషిత నీళ్లను సముద్రంలోకి వదిలేస్తుంది
  • అదే జరిగితే మత్స్యకారులు వేటకు పోయే పరిస్థితి ఉండదు
  • ఇంతటి దారుణమైన పరిస్థితిలో మత్స్యకారుల బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయి
  • హేచరీల మీద దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఉన్నాయి. వాళ్లంతా ఏమైపోతారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు
  • ఇక్కడైతే దివీస్‌కు 5 లక్షలకే ఎకరా భూమిని ధారాదత్తం చేస్తున్నారు
  • రైతుల దగ్గర భూములు లాక్కుని దివీస్‌కు అప్పగిస్తున్నారు. దాదాపు 250 కోట్ల విలువైన భూములను 30 కోట్లకే ఇచ్చేస్తున్నారు. మిగిలిన 200 కోట్లను చంద్రబాబు, దివీస్ పంచుకుంటున్నారు
  • దివీస్ సంస్థ ఫార్మాసిటీకి వెళ్లి పెడితే, అక్కడ కాలుష్య నియంత్రణ ప్లాంటులు ఉన్నాయి. అక్కడైతే ఎకరా 50-70 లక్షలు కట్టాలి, ఈటీపీల మీద కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆలోచించి, ఇక్కడ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మన ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు
  • దీనిపై ప్రజలు, రైతులు పోరాటం చేసి, గట్టిగా అడుగుతున్నారు. 
  • ప్రభుత్వం ఉంది కదాని చంద్రబాబు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు
  • చంద్రబాబు ఇన్నేళ్లలో పెట్టిన పరిశ్రమలు కూడా ఏమీ లేవు
  • పూర్తిగా అమ్ముడుపోయి, ఎవరికి నష్టం జరిగినా తనకు పర్వాలేదు, తనకు వచ్చేది వస్తే చాలన్నట్లు ఉన్నారు
  • పరిశ్రమ వల్ల వేలాదిమందికి నష్టం జరుగుతున్నా, వందల కొద్దీ హేచరీలు మూతపడుతున్నా.. ఆయన పట్టించుకోరు
  • చంద్రబాబుకు, దివీస్‌కు ఉన్న లావాదేవీలు ఏంటో మాకు తెలియదు గానీ, పరిశ్రమ ఇక్కడ పెడితే మాత్రం దానివల్ల అంతా నష్టమే
  • గ్రామాలు పరిశ్రమను ఆశీర్వదిస్తేనే అది దేదీప్యమానంగా నడుస్తుంది
  • చంద్రబాబుకు, మీకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. 
  • మీ పొల్యూషన్ అంతా పైపులైన్లతో సముద్రంలోకి విడిచిపెడితే హేచరీలు ఉండవు, మత్స్యకారులు ఉండరు
  • దేశం మొత్తానికి ఆక్వాహబ్‌గా 50 శాతం సీడ్‌ను అందిస్తున్న ఈ వ్యవస్థను నాశనం చేయొద్దని దివీస్ సంస్థను కోరుతున్నా
  • దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోయి ఫార్మాసిటీలో మీ పరిశ్రమ పెట్టండి, అలా పెడితే అందరం స్వాగతిస్తాం
  • దానివల్ల మీకు, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది
  • అయినా వినకుండా దివీస్ ఇక్కడే ఫ్యాక్టరీ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు
  • కచ్చితంగా పోరాడతాం, ఇక్కడున్న ప్రజలకు తోడుగా నిలబడతాం
  • చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. 
  • ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. మేం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇక్కడినుంచి తీసేస్తాం
  • పోలీసు సోదరులను కోరుతున్నాం.. మీరు వేసుకున్న యూనిఫాంను, నెత్తిమీద ఉన్న సింహాలను గౌరవించండి. వాటి వెనకాల ఉన్న గుంటనక్కలు చెప్పినట్లు నడుచుకోవద్దని కోరుతున్నాం
  • అవసరమైతే ఇంకో 22 కేసులు పెట్టించుకుంటాం... కావాలంటే రాజాతో పాటు నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటాం
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం మీకు అండగా ఉంటుంది.

30 నెలల్లో రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ వచ్చిందా, కొత్తగా ఏమైనా ఉద్యోగాలిచ్చావా?


నా తోక కోస్తానని చంద్రబాబు అన్నారట!
తుని: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో గత 85 రోజులుగా 144 సెక్షన్ అమలుచేస్తున్నారని, దానివల్ల పెళ్లిళ్లు, చావులతో సహా దేనికీ వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారని తుని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దివీస్‌ బాధితులను పరామర్శించేందుకు దానవాయిపేటకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో  బాధితులను ఉద్దేశించి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే..
  • గత 85 రోజులుగా ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ స్థానికులను ఇబ్బందులు పెడుతున్నారు
  • దొంగలు, దోపిడీదారులు, కుట్రదారుల మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారు. సుమారు 670 ఎకరాలను ప్రభుత్వం దోచుకుంటుంటే ఇవ్వబోమన్నందుకు నానా ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు చెప్పారు
  • ఈ భూమి తప్ప వేరే దారి లేదని ప్రజలు చెబుతుంటే వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు
  • పోలీసులు రెండు ఎకరాల భూమిని కాపాడుకోలేకపోతున్నారు గానీ, పేద ప్రజల భూములు లాక్కోడానికి ముందు ఉంటున్నారు
  • ఇక్కడకు దగ్గరలోనే ఒక శ్మశానం ఉందని.. చివరకు దాన్ని కూడా టీడీపీ నాయకులు ఆక్రమించేశారు  
  • అలాంటివాటి మీద చర్యలు తీసుకోకుండా.. అమాయక రైతుల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు
  • ఈ ప్రాంతవాసులు ఎంతో మనోధైర్యంతో పోరాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీస్ పరిశ్రమ వద్దని చెబుతున్నారు
  • చంద్రబాబు మాత్రం వైఎస్ఆర్‌సీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు
  • ఎకరం 35 లక్షల రూపాయల విలువతో ఈ భూమి మొత్తం 670 కోట్ల విలువ చేస్తుందని, దాన్ని 35-40 కోట్లకే చంద్రబాబు తనకు కావల్సిన వాళ్లకు కట్టబెడుతున్నారు
  • మీరు సీఎం అయిన తర్వాత ఈ 30 నెలల్లో రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ వచ్చిందా, కొత్తగా ఏమైనా ఉద్యోగాలిచ్చావా?
  • తుని ఎమ్మెల్యే తోక కోస్తానని ఇటీవల విజయవాడలో ఒక నాయకుడిని చేర్చుకునే సందర్భంలో చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవు

రద్దుకు ముందే బాబు షేర్లు అమ్మేశారు

Written By news on Sunday, November 20, 2016 | 11/20/2016


‘రద్దుకు ముందే బాబు షేర్లు అమ్మేశారు’
హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసని వైఎస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అందుకే తన వ్యవహారాలన్నింటని ముందే చక్కబెట్టుకున్నారని చెప్పారు. కానీ, పైకి మాత్రం తానే నోట్ల రద్దు సూచన చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు డబ్బులు ఎందుకని, కార్డులే ఉపయోగించాలని చంద్రబాబు అంటున్నారని, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లేమి తక్కువగా ఉన్న రాష్ట్రంలో పేద ప్రజలు ఎలా కార్డులు ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. నోట్ల రద్దుకు పది రోజుల ముందే చం‍ద్రబాబు తన షేర్లను అమ్ముకున్నారని, సామాన్యుల ఇబ్బందులు మాత్రం ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.199 ఉంటే ఆయన అధికారానికి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.999కి పెరిగిందని, అంటే సుమారు నాలుగున్నరరెట్లు పెరిగిందని తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి మాత్రం ఆ స్థాయిలో లేదని బుగ్గన మండిపడ్డారు.

Popular Posts

Topics :