11 December 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన

Written By news on Friday, December 16, 2016 | 12/16/2016


‘బాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయం’
నరసరావు పేట: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపే రోజు వచ్చిందనీ ఆయన హెచ్చరించారు. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. గురజాల ఎమ్మెల్యే  చేస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావని, రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన ఉందని, అది చూసి బాబు కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని తెలిపారు.

శుక్రవారం నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జన సందోహం మధ్య కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మహేష్ రెడ్డిని పార్టీలో చేర్పించుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మషేష్ రెడ్డికి అన్ని వేళల్లో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పరిపాలనపై నిప్పులు చెరిగారు.

జగన్ ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ప్రజలతో కిక్కిరిసిన రెడ్డి కాలేజీ మైదానం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఆ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు ప్రజల నుంచి చప్పట్లు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయకపోవడంపై పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఉటంకించగా అవును... అమలు చేయలేదంటూ ప్రజల నుంచి పెద్దపెట్టిన ప్రతిస్పందనలు వినిపించాయి.

నిజానికి ఈ సభ సాయంత్రం 4 గంటలకే జరగాల్సి ఉండగా, జిల్లాలో అడుగుపెట్టింది మొదలు మార్గమధ్యంలో అన్ని చోట్ల ప్రజలు జగన్ కలవడానికి పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనను నిలువరించి స్వాగతం పలకడం, ఆయనతో కరచాలనం చేయడానికి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఎగబడటంతో ఆయన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సభ 8 గంటల సమయంలో మొదలైంది. జగన్ అక్కడికి చేరుకోవడం గంటల కొద్దీ ఆలస్యమైనప్పటికీ జనంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా యువకులు పెద్దఎత్తున హాజరు కావడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు అడుగడుగునా చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతూ ఊత్సాహం ప్రదర్శించడం గమనార్హం.

ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జనం విశేషంగా స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టుగా... ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది నాయకుడికి ముఖ్యమని జగన్ గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునేలా నాయకుడు ఉండాలన్నారు.

అయితే చంద్రబాబు నాయుడును చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. నిత్యం అబద్దాలు ఆడటం... మోసాలు చేయడం... ఇదే ఆయన నాయకత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు, అబద్దాలకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. అవినీతిలో ఏపీని నెంబర్‌ 1 చేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు... చివరికి ఏమైంది... రైతులను నిలువునా మోసం చేశారు... అవునా... కాదా.. మీరేమంటారు? అని సభికులను ప్రశ్నించినప్పుడు అవును.. అవును అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. అనంతరం వారినుద్దేశించి చంద్రబాబు పాలన బంగాళా ఖాతంలో పడేందుకు ఇక రెండేళ్ల గడువుందని, కాలం కలిసొస్తే ఏడాదిలోనే పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు.

అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తామన్నారు. మరి ఆయన ఇప్పుడేం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు... మీరేమంటారని మళ్లీ ప్రశ్నించగా అవునంటూ దద్దరిల్లే సమాధానం సభ నుంచి వచ్చింది. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించడానికి సంబంధించి,  ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలను ప్రస్తావించి అధికారం చెపట్టిన తర్వాత ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ రకంగా చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు... నోరు తెరిస్తే మోసం చేయడం మామూలైపోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఇలా అబద్ధాలు చెప్పే... ఈ రకంగా మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసులకు భయపడి...
చంద్రబాబు తనపైన కేసులు ఎక్కడ వచ్చి పడుతాయోననీ, ఇప్పటికే ఇరుక్కున్న కేసుల్లో ఎక్కడ తెరమీదకు వస్తాయోనన్న భయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా అటు కేంద్రంపైన గానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంపైన గానీ నోరు మెదపడం లేదని జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి బ్లాక్ మనీని తీసుకెళ్లి సూట్ కేసుల్లో పెట్టి ఇస్తుంటే... ఆ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు.

ఆ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఆ కేసులకు, అవన్నీ బయట పడుతాయని భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఆనాటి ఘటనలను గుర్తూచేస్తూ, ఆ హామీతోనే ఆరోజు రాష్ట్రాన్ని విడదీశారని విడమరిచి చెప్పారు. అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితి లేరని పేర్కొంటూ అందుకు కారణాలను విశ్లేషించారు. గడిచిన రెండున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి పాల్పడ్డారని, కేంద్రాన్ని ఏమనడిగినా తన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని భయపడి అడగటం లేదని చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజలను విస్మరించిన చంద్రబాబు, ఆయన పాలన అంతం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే తీర్పుతో నాయకులు ఇక అబద్దాలు చెప్పాలంటే... మోసం చేయాలంటే... భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాబు మోసాలకు, అబద్దాలకు ఫలితంగా ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు తప్పదని చెప్పారు. ఈరోజు పార్టీలో చేరిన మహేష్ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని జగన్ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు.

రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతల వ్యాపారాలు


మైనింగ్‌ ఆపకుంటే దీక్షకు దిగుతా: వైఎస్‌ జగన్‌
గుంటూరు: రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్‌ జగన్‌ అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలకు వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఎమ్మేల్యే నరేంద్ర వ్యాపారానికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకింత నీకింత అంటూ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. చెరువులో మైనింగ్‌ వెంటనే ఆపేయాలని లేదంటే తానే దీక్ష చేస్తానని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.  

వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి


వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి
నరసరావు పేట: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని అప్పటి వరకు వరకు వైఎస్‌ జగన్‌ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్‌ రెడ్డి.  ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జేజేల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

గుంటూరు జిల్లా నరసరావు పేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలల్లో వచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'పౌరుషాలకు, ప్రతాపాలకు మారు పేరు పల్నాడు. ఏపీలో దుర్మార్గపు పాలన జరగుతోంది. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ను శ్మశానం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చా. జగన్‌ ను సీఎం చేసి ఈ ప్రాంతానికి పట్టిన శని వదిలిద్దాం' అన్నారు.

ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్


ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ : గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ జెడ్పీటీసీ ప్రమీలారాణిని వైఎస్ స్సార్ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్, ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రమీలారాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె రమేష్ ఆస్పత్రిలో చేరారు.
 
ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి బయలుదేరారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చేందుకు ఆయన నుద్దపల్లికి వెళ్లారు. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. 
 
 
 
 

చంద్రబాబు ముందే సర్దేసుకున్నారు


'చంద్రబాబు ముందే సర్దేసుకున్నారు'
విజయవాడ :
పెద్దనోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను క్రెడిట్ తీసుకుందామని ఆయన మోదీకి ముందుగా లేఖ రాశారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ప్రక్రియ అంతా సాఫీగా జరిగి ఉంటే చంద్రబాబు దాని క్రెడిట్ తీసుకునేవారని, కానీ ఇప్పుడు బాగా జరగలేదు కాబట్టి మోదీ బ్యాడ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన అనుయాయులు అన్నీ ముందే చక్కబెట్టేసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుకు సరిగ్గా రెండు రోజుల ముందే హెరిటేజ్ షేర్లను ఆయన ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారని, ఇది ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో పెద్దపెద్దోళ్ల ఇళ్లల్లో కోట్లకు కోట్ల కొత్తనోట్లు దొరుకుతున్నాయనని.. బీదవాళ్లు మాత్రం క్యూలో నిలబడి గట్టిగా రెండు వేలు తెచ్చుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఇది బ్లాక్‌మనీ మీద పోరాటమా లేక పేదలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ఆరాటమా అని ప్రశ్నించారు. 
 
పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదని, పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకురావాలన్న దృక్పథంతోనే ఇది జరుగుతోందని అన్నారు. మొత్తం రద్దయిన 14.5 లక్షల కోట్లలో ఇప్పటికే 13 లక్షల కోట్లు వచ్చేశాయని, నెలాఖరులోగా మిగిలిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. మన దేశంలో 90 శాతం నగదు ఆధార ఆర్థిక వ్యవస్థేనని తెలిపారు. వ్యవసాయ రంగం మొత్తం నగదు లావాదేవీల మీదే ఆధారపడి ఉందన్నారు.

అర్ధరాత్రి దౌర్జన్యం చేసినా పట్టదా?


ఒక సర్పంచి.. తనకు నచ్చిన పని చేసినందుకు అతడిని భయభ్రాంతులకు గురిచేసేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు దౌర్జన్యం చేసినా రాజధాని ప్రాంతంలో ఉన్న పోలీసులకు పట్టదా అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణాజిల్లా విజయవాడ శివారులోని నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును కొంతమంది గుర్తుతెలియని దుండగులు తగలబెట్టడమే కాక.. ఆయన కార్యాలయానికి తాళం వేసి, పంచాయతీ ఆఫీసులోకి సర్పంచిని వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. తగలబడిన కారును పరిశీలించిన అనంతరం సర్పంచ్ కోటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌


నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌ లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.

9న విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి

Written By news on Thursday, December 15, 2016 | 12/15/2016

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న విజయనగరంలో యువభేరీ జరగనుంది. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాసులు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.

అనంతరం ఇటీవల హైదరాబాద్ లోని నానక్ రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బాధితుల  కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ మేరకు చిలకపల్లి, సుభద్ర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ కలుసుకుంటారని వీదభద్రస్వామి, ధర్మాన కృష్ణ ప్రసాద్  తెలిపారు

రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌


రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి రేపు వైఎస్‌ జగన్‌ సమక్షంలో కాసు మహేష్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌ లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం

Written By news on Wednesday, December 14, 2016 | 12/14/2016


గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు.

గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్ కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు బుధవారం వారిని అడ్డుకోవడానికి యత్నించగా రైతులపై నేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది


'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'
అనంతపురం :
చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందని వైఎస్ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థ మీద తాము నమ్మకం ఉంచి.. ఇక్కడ ఏదో జరుగుతోందన్న విషయాన్ని డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్‌కు ముందుగానే చెప్పామని ఆయన అన్నారు. కానీ అసలు ఎన్నిక అన్నది జరగకుండానే ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని.. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంపీపీ ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని.. వాళ్లు తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యం చేశారని అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
 
తమ తరఫున ఉన్న బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ కొట్టారని చెప్పారు. సాక్షాత్తు సీఐ కూడా లోపలే ఉండి దౌర్జన్యం చేశారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తమ జీపు ఎక్కేందుకు వస్తున్నా కూడా పోలీసులు వాళ్లను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌సీపీ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతిచ్చిందని, కానీ మంత్రి పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టి, బలవంతంగా నెరవేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 
 

పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు


'పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు'
నరసాపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. పేదలను రోడ్డుపాలు చేసి పెద్దలకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులను రోడ్డున పడేసిన ఘనత కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకే దక్కిందన్నారు. ప్రధాని మోదీ తన తల్లి దగ్గరున్న బంగారానికి రశీదులు తేగలరా ? అని ప్రశ్నించారు.
 
కేంద్రం నుంచి అందిన లీకులతోనే నోట్ల రద్దు విషయంలో ముందే జాగ్రత్తపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ అంశంపై పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టారన్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే చంద్రబాబు హెరిటేజ్ వాటాలను అమ్మేసుకున్న విషయం వాస్తవం కాదా? అని  రోజా నిలదీశారు. అంతకు కొద్దిరోజుల ముందు పెద్దనోట్లు రద్దుచేయమని లేఖ రాయడం, ఇప్పుడు నగదురహిత లావాదేవీలు, డిజిటల్ ఏపీ అంటూ ప్రచారాలు చేయడం అంతా డ్రామా అంటూ దుయ్యబెట్టారు. దేశంలో వంద శాతం అక్షరాస్యులే లేనప్పుడు, వంద శాతం నగదురహిత లావాదేవీలు ఎలా సాధ్యమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Written By news on Tuesday, December 13, 2016 | 12/13/2016


హైదరాబాద్‌: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ మంగళవారం వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పాల్గొన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేత కందుల దుర్గేష్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేశ్‌ రెడ్డి ఇటీవల వైఎస్‌ జగన్‌ ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.

వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

Written By news on Monday, December 12, 2016 | 12/12/2016


వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. దుర్గేష్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ పోరాటాల వల్లే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైఎ‍స్ జగన్ ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. అందుకే జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నాబాబు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో దుర్గేష్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.

 

Popular Posts

Topics :