2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ సీపీలోకి దొమ్మేటి

Written By news on Thursday, November 23, 2017 | 11/23/2017

Dommeti venkateswarlu joins ysr congress party - Sakshi - Sakshi - Sakshi - Sakshi
సాక్షి, క‌ర్నూలు : తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ఆధ్వ‌ర్యంలో దొమ్మేటితో పాటు ఆయన అనుచరులు ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిశారు.  వైఎస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దొమ్మేటి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ..వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌కు విశేష స్పంద‌న వస్తుందన్నారు. ప్ర‌జ‌లు ఆయన‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెప్పారు. వైఎస్ జ‌గ‌న్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. చంద్ర‌బాబు ఈ నాలుగేళ్ల‌లో రాష్ట్రాన్ని అవినీతిలో నంబ‌ర్ వ‌న్ చేశార‌ని విమ‌ర్శించారు. రాజ‌న్న రాజ్యం జ‌గ‌న్తోనే సాధ్య‌మ‌ని
అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో దొమ్మేటి కూడా పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి

Written By news on Saturday, November 18, 2017 | 11/18/2017

కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరగా, వారందరినీ జగన్‌... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నడిపెన్న, మహేష్ తో పాటు పలువురు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది: వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, November 8, 2017 | 11/08/2017


 వీఎన్‌పల్లి: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కనుమరుగైపోయిందని, రాజకీయాల్లో ఒక మాట అంటూ ఇస్తే.. ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నాలుగేళ్ల చంద్రబాబు పాలన నిదర్శనంగా నిలిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు ఫలానాది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ సర్కారు ఉందని ఆయన విమర్శించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’ చేపడుతున్న వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం మూడోరోజు పాదయాత్ర సందర్భంగా వీఎన్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ప్రజల్లోంచి చైతన్యం రావాలని, ఎన్నికల్లో ప్రజలకు ఒక మాట ఇస్తే.. దానిని అమలుచేయలేకపోయినప్పుడు ఆ నాయకుడు రాజీనామా చేసి పక్కకు తప్పుకొనే పరిస్థితి రావాలని, అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.
భవిష్యత్తులో మంచి కలుగుతుందనే భరోసా ఇచ్చేందుకు..
‘రాబోవుకాలంలో మంచి రోజులు వస్తున్నాయి.. భవిష్యత్తులో మంచి జరగబోతుందన్న ఆశ కల్పించేందుకు.. ప్రతి రైతుకు, రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ తోడుగా ఉండేందుకు నేను ఈ పాదయాత్ర చేస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తామని,  వారు చెప్పినవన్నీ విని.. ప్రజలందరి సలహాలు తీసుకుంటామని తెలిపారు. నవరత్నాలు పథకాలతో ప్రతి ఇంట్లో చిరునవ్వులు విరబూయాలని కోరుకుంటున్నామని, నవరత్నాల విషయంలో ప్రజలు ఇంకా ఏమైనా సలహాలు ఇస్తే తీసుకుంటామని, దారిపొడవునా ప్రజలు చెప్పే ప్రతి సలహాను స్వీకరిస్తామని చెప్పారు. చంద్రబాబు మాదిరి ఇంతింత బుక్కులు మ్యానిఫెస్టోగా పెట్టి మోసం చేయబోమని, ప్రజల చేత దిద్దబడిన మ్యానిఫెస్టో మాత్రమే రెండు, మూడు పేజీల్లో ఉంటుందని చెప్పారు. తమ ప్రణాళికలో చెప్పిన ప్రతి పనిని చేస్తామని, చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చేసి చూపించి.. 2024 ఎన్నికలు వచ్చినప్పుడు.. ఇవి చేశామని చెప్పి.. మళ్లీ ఆశీర్వదించమని ప్రజలను కోరుతామని అన్నారు. తన పాదయాత్ర కార్యక్రమానికి ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలని, దేవుడి దయ కావాలని ఆయన కోరారు.
 


వైఎస్‌ జగన్‌ ఇంకా తన ప్రసంగంలో ఏమన్నారంటే..
  • నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
  • రైతుల రుణాలన్నింటీని బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు
  • నాలుగేళ్లు అయినా మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? కాలేదు
  • బాబు పుణ్యాన రైతులే కాదు డ్వాక్రా మహిళలు కూడా మోసపోయారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీకే రుణాలు పూర్తిగా పక్కనబెట్టారు
  • చంద్రబాబు సీఎం అయ్యాక పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ అయ్యాయా? కాలేదు
  • జాబు రావాలంటే.. బాబు రావాలని, ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు

రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం

Written By news on Tuesday, November 7, 2017 | 11/07/2017


వేంపల్లి :  దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన రెండోరోజు వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు... ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదు.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు
అయితే వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం.

వృద్ధులకు రూ.2వేలు పెన్షన్‌
అలాగే అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.1000 ఉన్న పెన్షన్‌..మేం అధికారంలోకి రాగానే రూ.2.వేలు చేస్తాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు రూ.2వేల పెన్షన్‌ ఇస్తే... నేను రూ.3వేలు చేస్తా. అలాగే ఎవరూ లేని ఒంటరి వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మండలంలో ఓ వృద్దాశ్రమయం ఏర్పాటు చేస్తా. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటా.
లక్షా 42వేల ఉద్యోగులు భర్తీ
అలాగే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడదాం. ప్రస్తుతం రాష్ట్రంలో కౌరవ పాలన నడుస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు మోసం చేశారు.
విద్యార్థుల ఖర్చులకు రూ.20వేలు
 విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. .’ అని హామీ ఇచ్చారు.

తొలిరోజు ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర

సాక్షి, ఇడుపులపాయ :  ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు ముగిసింది.  ఆయన మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకూ 8.9 కిలోమీటర్లు మేర పాదయాత్ర పూర్తి చేశారు. కాగా సోమవారం ఉదయం  తొమ్మిది గంటల నలభైయేడు నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి తొలి అడుగు వేసిన వైఎస్‌ జగన్‌.. మారుతీనగర్‌, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేశారు. వీరన్నగట్టుపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇక రెండోరోజు ప్రజా సంకల్ప యాత్ర వేంపల్లి రోడ్డు నుంచి ప్రారంభం కానుంది.
మరోవైపు దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు.  కోట్లాది జన హృదయాలను కలుస్తూ సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర.. నిర్ధిష్ట లక్ష్యాలతో కొనసాగనుంది. మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయాలతో వర్థిల్లుతున్న వారికి ఈ యాత్ర ముచ్చెమటలు పట్టిస్తూ జరుగుతుంది. ఇక ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది.  తెలుగు రాష్ట్రాల నుంచే కాకా..పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ వెంట..పలువురు వైఎస్ఆర్‌ సీపీ  నేతలు  కూడా కలిసి నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్ర 180 రోజులు  125 నియోజకవర్గాల్లో 3వేల కిలో మీటర్లు సాగనుంది.  

YS Jagan speech

Written By news on Monday, November 6, 2017 | 11/06/2017

ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని ఉద్యోగ వర్గాలపై హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగికి స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఇడుపులపాయలో 'ప్రజాసంకల్ప యాత్ర'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన  బహిరంగ సభలో ప్రసంగించారు.
బాబు రావాలంటే జాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందేనని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఈ మేరకు జరిగిన ప్రొసీడింగ్స్‌ను 'సాక్షి' దినపత్రిక బయటపెట్టడంతో అబ్బే అలాంటిదేం లేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈ ప్రొసీండిగ్స్‌ బయటకు వచ్చేసరికి.. వీటిని వెల్లడించారనే సాకుతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని, ఇలా ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

నేటి పాదయాత్ర ఇలా..

ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.  జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం


సాక్షి, పులివెందుల: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన 'ప్రజాసంకల్ప యాత్ర'కు సిద్ధమయ్యారు. పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.
జనంతో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ..!
వైఎస్‌ జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర'కు వేదికైన ఇడుపులపాయలో అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు ఇక్కడకు చేరుకోవడంతో ఇడుపులపాయ కోలహలంగా మారింది. మరికాసేపట్లో ఇక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించి.. అనంతరం వైఎస్‌ జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.

నేటి పాదయాత్ర ఇలా..
ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.  జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నా : వైఎస్‌ జగన్‌

Written By news on Sunday, November 5, 2017 | 11/05/2017


పులివెందుల: ప్రజా సంకల్పయాత్రపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ప్రజాసంకల్పయాత్రకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. తొలి రోజు షెడ్యుల్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు.

సోమవారం ఉదయం 8:30 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9.42 గంటలకు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. తొలి రోజు మొత్తం 8.9 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రి 7.30 గంటలకు వేంపల్లి సమీపంలో తొలిరోజు ప్రజా సంకల్పయాత్ర ముగియనుంది.

ప్రజా సంకల్పయాత్ర తొలి రోజు పూర్తి షెడ్యుల్‌ :

జగన్‌ స్పీక్స్‌' : వీడియో సిరీస్ ప్రారంభం


 పులివెందుల:  ప్రజాసంకల్పయాత్ర చేయబోతున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లతో మమేకమయ్యేందుకు కొత్తగా 'జగన్‌ స్పీక్స్‌' పేరుతో వీడియో సిరీస్‌ ప్రారంభించారు. పాదయాత్రలోని అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా నెటిజన్లతో పంచుకోనున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన 'జగన్‌ స్పీక్స్‌' తొలి వీడియోకు విశేషమైన స్పందన వచ్చింది. పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు.
ఈ వీడియోలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
తెలుగు ప్రజలకు నమస్కారం. ఇది వరకు ప్రకటించిన విధంగా  ప్రజా సంకల్పయాత్ర సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్‌ఆర్‌ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో భాగమయ్యారు. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్పూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 6 నుంచి 7 నెలలపాటూ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్ని వింటాను. మీ కష్టాలను నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాల్లోనూ కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. చివరకు ఈ పాదయాత్రలో నా ప్రయత్నం ఏమిటంటే .. మనం  ఎన్నికల సమయాని విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా ఈ పాదయాత్ర సాగుతుంది. దాదాపు 6 నుంచి 7 నెలలపాటూ సాగే ఈ పాదయాత్రలో డిజిటల్‌ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గరకావడానికి ప్రయత్నం చేస్తాను. మీమ్మల్ని అందర్ని కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. జగన్‌ స్పీక్స్‌ వీడియో సిరీస్‌ ద్వారా మీ అందరికి అందుబాటులో ఉంటా..

పులివెందులకు వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan reddy at Pulivendula, offers prayers - Sakshi
కడప ఎయిర్‌పోర్టులో అభిమానులకు అభివాదం చేస్తూ పులివెందులకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌.
కడప దర్గాలో ప్రార్థనలు.. రాత్రికి ఇడుపులపాయకు
రేపటి నుంచే ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో కడపకు చేరుకున్న వైఎస్ జగన్.. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక పార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి సాయంత్రం తిరిగి కడప వెళ్లనున్న ఆయన.. అక్కడి ప్రఖ్యాత పెద్ద దర్గాలోనూ ప్రార్థనలు చేస్తారు. రాత్రి 8:30 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రేపటి(సోమవారం) నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న జగన్‌కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.
రేపటి నుంచే ప్రజా సంకల్ప యాత్ర : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలగుండా 3వేల కిలోమీటర్ల మేర సాగనున్న వైఎస్‌ జగన్‌ ‘ప్రజా సంకల్ప యాత్ర’ సోమవారం ఉదయం నుంచి ప్రారంభకానుంది. ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. తొలిగా వైఎస్సార్‌ జిల్లాలో ఏడు రోజులపాటు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది.
కడపలో వైఎస్ జగన్‌‍కు ఘనస్వాగతం  

పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్ర

Written By news on Saturday, November 4, 2017 | 11/04/2017


వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్రలను వేగవంతం చేసింది. అనుమతుల పేరుతో మెలిక పెట్టేందుకు యత్నిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఏపీ పోలీస్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఫోన్‌ చేసి, పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకి తెలిపారు.
పాదయాత్రకు అనుమతులేంటి? : పోలీస్‌ అధికారి ప్రశ్నకు బదులిస్తూ వైవీ సుబ్బారెడ్డి.. ‘‘పాదయాత్రలకు సంబంధించి గతంలోనూ అనుమతుల ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా ఆ అంశం ఉత్పన్నం కాబోదు. అయినా, పాదయాత్ర సమాచారాన్ని ఇదివరకే డీజీపీకి తెలియజేశాం’’ అని స్పష్టం చేశారు.

రెండో సారీ అదే మాట : సదరు అధికారి ఫోన్‌లో రెండోసారి కూడా ‘అనుమతులు తీసుకోవాలి కదా’ అని అనడంతో వైవీ సుబ్బారెడ్డి సహనంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ‘‘అసలు అనుమతి అంశమే తలెత్తబోదు. పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు రేపు(శనివారం) మా పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు వచ్చి వివరాలు ఇస్తారు’’ అని బదులిచ్చారు.
బహిరంగ సభలకు కూడా అంతే : వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తే అప్పుడైనా అనుమతి కావాలికదా అని పోలీసు అధికారి అనగా, ‘ఆ విషయం మా స్థానిక నేతలు అక్కడి అధికారులతో మాట్లాడతారు’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు

Written By news on Friday, November 3, 2017 | 11/03/2017


 ఓ మహా సంకల్పంతోనే  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ కీలక నేత తలశిల రఘురామ్‌ తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర విశేషాలను ఆయన వివరించారు. 
నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని రఘురామ్‌ చెప్పారు. కడప జిల్లాలో 7 రోజులపాటు  మొత్తం వంద కిలోమీటర్లు యాత్ర కొనసాతుందన్నారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు.. ఇలా ఐదు నియోజకవర్గాల కొనసాగే యాత్ర ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారని.. ప్రజలందరినీ ఆయన కలుస్తారని రఘురామ్‌ తెలిపారు. 

గతంలో వైఎస్సాఆర్‌సీపీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని.. అన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని, ఇప్పడు కూడా శాంతియుత వాతారణంలోనే కొనసాగుతుందన్న నమ్మకం ఆయన వ్యక్తంచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం యాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తోందని రఘురామ్‌ చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం అయితే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడట్లేనన్న భయంతో తెలుగుదేశం నేతలు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. పాదయాత్ర ప్రాధాన్యత తగ్గించేలా ప్రయత్నాలు ఏస్తున్నారని.. వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.  
ప్రజా స్వామ్య దేశంలో పాదయాత్రలు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభం యాత్రతో ప్రజా సంకల్ప యాత్రకు సంబంధం లేదని. ముద్రగడ చేపట్టింది కాపు హక్కుల పోరాటం అని, కానీ, ప్రతిపక్ష నేతగా, వైఎస్ జగన్  ప్రజా హక్కుల కోసం.. వారి సమస్యలు వినిపించేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని.. జన నేతకి ఆహ్వానం పలికేందుకు 13 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘురామ్‌ చెప్పారు.  చంద్రబాబు పాలనలో జాబులు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.  ఏపీని అభివృద్ధిలో ముందుంచాలన్నదే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని.. దివంగత నేత వైఎస్‌ఆర్‌ పాలనలోని స్వర్ణయగం కోసమే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని రఘురామ్‌ స్పష్టం చేశారు.

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌

తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి  తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు.  రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో...  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు

జగన్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి


సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయనకు, పార్టీ నేతలకు అవసరమైన రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావును ఆ పార్టీ కోరింది. ఈ మేరకు డీజీపీకి గురువారం లేఖ రాసింది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మొదలయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆ లేఖలో పేర్కొంది. జగన్‌ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారని పేర్కొంది. పాదయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలను వైఎస్‌ జగన్‌ కలుస్తారని, వారితో సంభాషిస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో ‘జెడ్‌’ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్‌ జగన్‌కు అవసరమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా పోలీసులకు అందజేస్తామని లేఖలో వైఎస్సార్‌సీపీ తెలిపింది.

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి  తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు.  రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో...  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు.

నవంబర్‌ 6 నుంచి వైఎస్‌ జగన్‌ ‘ప్రజా సంకల్పం’

Written By news on Thursday, October 26, 2017 | 10/26/2017

హైదరాబాద్‌ : నవంబర్‌ 6 నుంచి ఆరు నెలలపాటు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు...ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక,  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాలు, జరగని ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనే అంశాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. 
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకూ కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌....ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. అలాగే మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టనున్నారు. అంతేకాకుండా ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక మిగిలిన 58 నియోజకవర్గాల్లో పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలందరినీ ఆయన కలుస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి

Written By news on Friday, October 20, 2017 | 10/20/2017

సాక్షి, హైదరాబాద్‌ : యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్సార్‌సీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా వి. విజయసాయిరెడ్డి(రాజ్యసభ ఎంపీ) నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఇకపై జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ప్రకటనలో పేర్కొన్నారు. సాయిరెడ్డి నియామకంపై పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

జన గర్జనలో బీసీ డిక్లరేషన్‌: వైఎస్‌ జగన్‌

Written By news on Monday, October 16, 2017 | 10/16/2017

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం అమలు చేయలేదన్నారు.  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బందర్‌రోడ్‌ లోని వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం  బీసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.
 ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అని చెప్పి... చంద్రబాబు మాట తప్పారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు పర్యటించాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికీ వివరించాలి. బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాలి. నేను పాదయాత్ర చేస్తున్న ఆరు నెలల్లో బీసీ నేతలు గ్రామాలకు వెళ్లి అన్యాయాలను ప్రజలకు వివరించాలి. పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిద్దాం. ప్రతి కులానికి న్యాయం జరిగేలా బీసీ డిక్లరేషన్‌ ఉంటుంది. ప్రతి పేదవాడికి వైఎస్‌ఆర్‌ పాలనను గుర్తు చేయాలి. అన్న వస్తున్నాడు.. రాజన్న రాజ్యం వస్తుందని చెప్పండి.’ అని సూచించారు.

విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటయ్యాక తొలిసారిగా విస్తృతస్థాయిలో జరుగుతున్న ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అనే దానిపై  వైఎస్‌ జగన్‌ నేతలందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటున్నారు.
ఆయా జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, బీసీల విషయంలో పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో నేతలు వ్యక్తపరిచే అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మరిన్ని దఫాలు సంప్రదింపులు జరిపి.. సమగ్రంగా రూపకల్పన చేశాక తగిన సమయంలో పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్‌’ను చేస్తారు.
బీసీ డిక్లరేషన్‌‌పై వైఎస్ జగన్ ఏమన్నాడో చూడండి 

రేపు విజయవాడకు వైఎస్ జగన్

Written By news on Sunday, October 15, 2017 | 10/15/2017


 విజయవాడ : రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ సీపీ బీసీ సెల్‌ సమావేశం సోమవారం విజయవాడలో జరగనుంది. దీంతోపాటు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకు పైగా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ మంగళవారం ధర్మవరం వెళ్లనున్నారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, దృఢసంకల్పంతో రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేలా చూసేందుకు వైఎస్ జగన్ పోరాటం కొనసాగించనున్నారు.
తాను అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానంటూ ఇచ్చిన హామీని తుంగలోతొక్కి సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ బీసీ విభాగం నేతలు మండిపడుతున్నారు. ఏపీలో బీసీలను టీడీపీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే వాడుకుంటుంది తప్ప, వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. దీనికి వైఎస్‌ జగన్‌ అధ్యక్షత వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌ సీపీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై జరగనున్న ఈ సమావేశానికి ఏపీ వైఎస్ఆర్‌సీపీ బీసీ విభాగం నేతలు హాజరు కానున్నారు.

ఏమరపాటు వద్దు, బీ అలర్ట్‌ : వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, October 11, 2017 | 10/11/2017

సాక్షి, అమరావతి :  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలు సిన్సియర్‌గా నిర్వహించాలని ఆయన సూచించారు. ఏ మాత్రం ఏమరపాటు తగదని ప్రతి ఒక్క సమన్వయకర్త పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించడంతో పాటు అన్ని శక్తియుక్తుల్నీ కూడదీసుకుని చంద్రబాబు పార్టీ పునాదుల్ని కదిపేలా ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రతి క్షణం ఎంతో విలువైందని, ప్రజాస్వామిక యుద్ధానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పేర్కొన్నారు. అంతా ఒక్కటై ముందుకు నడవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులతో వైఎస్‌ జగన్‌ బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటలసేపు ఈ సమావేశం కొనసాగింది. వైఎస్‌ జగన్‌ నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.  పాదయాత్ర సమయంలోఒక జిల్లాలో యాత్ర చేపడుతున్న సమయంలో మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా  ఆయన ఈ సందర్భంగా నేతలను కోరారు. దాదాపు 50మందికి పైగా తమ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి వెల్లడించారు. వారి సలహాలు, సూచనలను వైఎస్‌ జగన్‌ నోట్‌ చేసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు పాదయాత్ర సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
జగన్‌ అన్నా నువ్వొస్తే తొలిసంతకం దానిమీదే పెట్టాలి?

Written By news on Tuesday, October 10, 2017 | 10/10/2017


 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన 'యువభేరి' సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన ప్రసంగం చేశారు.

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు చంద్రబాబు పరిపాలన తీరుపై, చేస్తున్న మోసాలపై నిప్పులు చెరిగారు. తాము ఇక చంద్రబాబును ముఖ్యమంత్రిగా భరించలేమని, ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించి తమ కలలను నెరవేర్చుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ముమ్మాటికీ వైఎస్‌ జగన్‌ వెంట నడుస్తామని, ఏ శక్తి తమను ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నలు, సందేహాల రూపంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం ఎలా జరిగిందంటే..
అంజు, ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీ : ప్రజాస్వామ్య దేశం మనది మన నేతలను మనం ఎన్నుకుంటాం. వారిపై నమ్మకంతో ఉంటాం. ఒకసారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోతారు? ప్రత్యేక హోదా 15ఏళ్లపాటు కావాలని అడిగిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మర్చిపోయారు? ప్రభుత్వాన్ని వెనక్కి పిలిచే అవకాశం ఉందా అన్న? తప్పుడు హామీలు ఇచ్చిన వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉండాలి? మీలాంటి యంగ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు ప్రత్యేక హోదా సాధించి తీరుతాం.  వైఎస్‌ జగన్‌ : 'విశ్వసనీయత అంటే ఏమిటో నీ ప్రశ్న చూసిన తర్వాతనైనా చంద్రబాబు తెలుసుకోవాలి. మీకున్న అవగాహన కూడా చంద్రబాబుకు లేదు. ఇలాంటి వారిని దింపాలంటే మళ్లీ ఎన్నికలు రావాల్సిందే. మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు'
ప్రియాంక, ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీ : ప్రత్యేక హోదా కోసం 10 నుంచి 15 ఏళ్లు అడిగిన చంద్రబాబు ఇప్పుడెందుకు వృధా అన్నారు. అప్పుడు ఈ ఆలోచన ఏమైంది. మనం ఏమన్నా పిచ్చోళ్లమా.. మీరే మాకు న్యాయం చేయాలి.
వైఎస్‌ జగన్‌ : 'కచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు చంద్రబాబు, జగన్‌ మొఖం చూసి పెట్టరు. వారికి కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు పెడతారు. ప్రత్యేక హోదా ఉందనే కారణంతో పలువురు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు, భూములు కొన్నారు.
విజయ్‌ భాస్కర్‌, ప్రొగ్రెసివ్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ : అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు ఎన్నో దొంగ హామీలు ఇచ్చారు. కాపులను బీసీలు చేస్తానని అన్నారు, కురుమ, కురుబలను, వాల్మీకిలను ఎస్టీలను చేస్తానని చెప్పారు. 30 ఏళ్ల అనుభవం అని చెప్పిన దొంగబాబు అందరినీ మోసం చేశారు. దివ్యాంగులను మోసం చేశాడు. మాకోసం చంద్రబాబు ఏం చేయలేదు. నీకోసం ప్రాణాలు ఇచ్చయినా ప్రత్యేక హోదా కోసం మీతోపాటు సాగుతాను.
వైఎస్‌ జగన్‌ : 'భాస్కర్‌ చెప్పింది ముమ్మాటికి నిజమే. ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మోసం చేయడం తప్పనే విషయం భాస్కర్‌ ప్రశ్నతోనైనా తెలుస్తుందని ఆశిద్దాం

శిరీష, బీఫార్మసీ థర్డ్‌ ఇయర్‌: మహిళలకు రక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలోని ఓ ఎమ్మెల్యే ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన వనజాక్షిని నడిరోడ్డుపై జుట్టుపట్టుకొని కొడితే ఎలాంటి శిక్షను వేయలేదు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కోడలిని చిత్రహింసలు పెడితే ఏం చర్యలు తీసుకోలేదు. కానీ, వైఎస్‌ఆర్‌ హయాంలో ఒకమ్మాయిపై వరంగల్‌ యాసిడ్‌ దాడి చేస్తే కుక్కల్ని కాల్చినట్లే కాల్చేశారు. అలాంటి భద్రత మీరు మాకు ఇవ్వాలి. భద్రత కావాలంటే బాబు రావాలన్నారు. బాబొచ్చాక భద్రత పోయింది.. మీరు వస్తేనే భద్రత వస్తుంది.. మీరు మాకు భద్రతను ఇవ్వాలి.

వైఎస్‌ జగన్‌ : 'నేను వచ్చాక తప్పకుండా మీకు భద్రత ఉండి తీరుతుంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా వనజాక్షిపై మీడియా చూస్తుండగా దాడి జరిగినా చంద్రబాబు చర్చలు తీసుకోలేదు. రిషితేశ్వరిపై జరిగినా చర్యలు లేవు. ఏ ఆడపడుచుకు ఇబ్బంది వచ్చినా ఫోన్‌ కొట్టండి చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కనీసం యాక్షన్‌ తీసుకోని పరిస్థితి ఉంది. త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుదాం.

ప్రీతి, ఇంజినీరింగ్‌ : అరుణ్‌ జైట్లీ ప్రత్యేక హోదావల్ల లాభం లేదన్నప్పుడు బాధపడ్డాను. విద్యార్థులు, నిరుద్యోగులు నష్టం జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు అర్థరాత్రి ప్యాకేజీని ఎలా స్వాగతించారు?

వైఎస్‌ జగన్‌: వాస్తవానికి ప్యాకేజీ రాకపోయినా వచ్చినట్లు భ్రమలు కల్పిస్తూ చంద్రబాబు ఆరోజు అర్థరాత్రి మీటింగ్‌ పెట్టి చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం చెప్పిన ప్యాకేజీ ఏదీ కూడా ఇవ్వలేదని మరో కొత్త డ్రామా ఆడుతున్నారు. ఆరోజు అవసరానికి ఏం కావాలో అదే చంద్రబాబు మాట్లాడతారు.. అవసరం తీరాక వదిలేస్తారు. మీ ప్రశ్నలు విన్నాకైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుంటారేమో చూద్దాం.

సంపత్‌, లాస్టూడెంట్‌ : ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ గజదొంగ చంద్రబాబు పక్క రాష్ట్రంలో నల్లడబ్బును లంచం ఇచ్చి దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?

వైఎస్‌ జగన్‌ : ఒక ఎమ్మెల్సీని అక్రమంగా కొనేందుకు ప్రయత్నించి నల్లడబ్బును ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికినా కూడా ఆ మనిషిపై ఏ కేసు లేదు.. యాక్షన్‌ లేదు. నిజంగా చిన్నా చితక ఉద్యోగి అయితే ఈపాటికే సస్పెండ్‌ చేసి జైలుకు పంపేవారు. దేశంలో ఈ ప్రశ్నను ప్రతి పౌరుడు ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అనేది అందరికీ సమానంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. నేను కూడా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనే బలంగా కోరుతున్నాను.

 రవళి ఎస్‌ఆర్‌ఐటీ : ప్రత్యేక హోదావల్ల మనకు ఇండస్ట్రీలు వచ్చేవి.. కానీ, కోట్లు వృధా చేసి విదేశాలకు చంద్రబాబు ఎందుకు వెళ్తున్నారు? పెట్టుబడులు తీసుకురావడానికా లేక ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడానికా?

వైఎస్‌ జగన్‌ : చంద్రబాబు టూర్‌లు చేస్తేనో లేక జగన్‌ ముఖం చూసో పెట్టుబడులు రావు. ప్రత్యేక హోదాలాంటి వాటి వల్ల వారికి వచ్చే ప్రయోజనాలు చూసి వస్తాయి. వ్యక్తులను చూసి పెట్టుబడులు రావు. ఆ విషయం చంద్రబాబుకు అర్ధం అయ్యే ఉండాలి. చంద్రబాబు ఎక్కడికైనా వెళితే సాధారణంగా వెళ్లరు. ఆయనకు ప్రత్యేక విమానాలు కావాలి.. పైగా కోట్లు వృధా చేస్తారు. ఆ ప్రయత్నమేదో ప్రత్యేక హోదా కోసం చేసినా ఈ పాటికి వచ్చి ఉండేది. ఇక ఆయన పెట్టుబడులు తేవడానికి వెళుతున్నారో దోచుకుంది దాచుకోవడానికి వెళ్తున్నారో ఆయన మనస్సాక్షికే తెలియాలి.

హనీషా, ఎస్‌ఆర్‌ఐటీ : మన రాష్ట్రంలో ఎంతోమంది ఎంతోమంది గొప్ప ఆర్కిటెక్ట్స్‌ను, ఇంజినీర్లు కాదని చంద్రబాబు సింగపూర్‌కు ఎందుకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడేమో రాజమౌళి అంటున్నారు. ఈ రాజధాని ఉంటుందా సినిమా సెట్టింగుల్లాగానే పోతుందా. నాకు భయం వేస్తుంది.  

వైఎస్‌ జగన్‌ : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా చంద్రబాబు ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. అసెంబ్లీ, సెక్రటేరియల్‌ ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడొస్తుందో తెలియదు. మన కర్మేంటంటే కేంద్రం నుంచి రూ.2వేల 500కోట్లు తీసుకున్నారు. కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాలంటే ఈయన బిల్లులు చూపించాలి. ఈయన బిల్లులు ఇవ్వరు వారు నిధులు ఇవ్వరు. సినిమాలు చూసి సినిమా సెట్లు బాగున్నాయని డైరెక్టర్‌లకు కాంట్రాక్టు ఇచ్చే ముఖ్యమంత్రులను మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి చివర వరకైనా ఆయన ఏ బిల్డింగ్‌ కట్టడు ఒక సినిమా మాత్రం చూపిస్తాడు

అంజి, విద్యార్థి : ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు వివిధ పేర్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకుండా చంద్రబాబు చేస్తున్నారు. నాకు ఎంబీఏ చేయాలన్న కోరిక. కానీ, చంద్రబాబు రూ.35 వేలే ఇస్తున్నారు. మా అమ్మ కూలి చేస్తే వచ్చేది రూ.200 మాత్రమే. నేను ఆ కూలి పైసలతో ఎలా చదువుకోవాలి.

వైఎస్‌ జగన్‌ : ఫీజులు చూస్తేనేమో ఏడాదికి ఇంజినీరింగ్‌ రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50వేలు, ఇలా ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. చంద్రబాబు మాత్రం ఇస్తుంది 35వేలు మాత్రమే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందో రాదో అని విద్యార్థులు భయపడుతున్నారు. దేవుడు దయతో మన ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంతోపాటు రూ.20వేలు బోర్డింగ్‌ ఖర్చులు కూడా ఇచ్చుకుందాం.

రేఖ, ఎస్‌ఆర్‌ఐటీ కాలేజ్‌ : ఒక పంట పోతేనే రైతులు ఆగమవుతారు. అలాంటిది వారి భూములు లాక్కుంటున్నారు. వారు ఎలా బతకాలి? అమరావతిలో ఎందుకు అన్ని భూములు లాక్కుంటున్నారు? రియల్‌ ఎస్టేట్‌ చేయాలనుకుంటున్నారా? రాజధాని కట్టాలని అనుకుంటున్నారా?

వైఎస్‌ జగన్‌ : మూడు నుంచి నాలుగు పంటలు పండే భూములను రైతులను బెదిరించి ప్రలోభాలుపెట్టి వేల ఎకరాలు తీసుకోవడం దారుణం. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుంది అని చెప్పి చివరకు అందరినీ మోసం చేసి పంటలు పండే ప్రాంతంలో రాజధాని అని ప్లాన్‌ చేశారు. రైతులను దారుణంగా దెబ్బకొట్టారు.

గుర్రప్ప, ఆంగ్ల బోధకుడు : వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు 104, 108 సర్వీసులు గొప్పగా సాగేవి. 2019లో మీరు పదవిలోకి రాగానే వైఎస్‌ఆర్‌ పథకాలన్నింటిపై తిరిగి సంతకం చేయాలి.

వైఎస్‌ జగన్‌ : నిజంగానే ఆరోగ్య శ్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్పత్రికి వెళితే ఇంటికి తిరిగొస్తామా అని నమ్మకం లేని పరిస్థితి. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరిపిస్తాం. పేదవాడికి ఉచిత వైద్యం ఉంటుంది. మందుల ఖర్చు, విశ్రాంతి సమయంలో ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాం. ప్రత్యేక హోదా సాధించేందుకు అందరం కలిసి కట్టుగా సాగుదాం.

Popular Posts

Topics :