పీసీ పల్లి: ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.910కోట్లు కావాలని సంబంధిత శాఖ కోరితే రూ.568 కోట్లు మాత్రమే ఇచ్చారని, అందులో రూ.368కోట్లు బకాయిలకే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రకాశంలో జిల్లాలోని పీసీ పల్లిలో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులతో ఆయన ముఖాముఖి అయ్యారు.
ఈ సందర్భంగా కిడ్నీ బాధితులు వైఎస్ జగన్ ముందు కిడ్నీ బాధితులు మొరపెట్టుకున్నారు. డయాలసిస్‌కు తమకు రూ.20 వేలు అవుతుందని వాపోయారు. ఆర్థిక స్తోమత లేక పేదలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. వెలుగొండ జలాలకోసం పోరాటం చేయాలని ఆయనను కోరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కుంటికాలుతో నడుస్తోందని అలా నడిచేందుకు కూడా దాదాపు రూ.400 కోట్లు పైగా కావాలని అభిప్రాయపడ్డారు.
తాను అధికారంలోకి రాగానే వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులుపాలు కాకుండా చూసుకుంటానని, ఈ విషయం గతంలోనే చెప్పామని, ఒక వేళ వైద్యంలో భాగంగా ఇంటి వద్దే ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటుంటే అతడి కుటుంబం నడిచేందుకు కావాల్సిన సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని బతికించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కిడ్నీలు బాగోలేకుంటే మాస్టర్ స్థాయి నుంచి చికిత్స ప్రారంభిస్తారని పరీక్షలకు నెలకు దాదాపు రూ.4వేలు అవుతాయని, ఆ తర్వాత డయాలసిస్ మొదలవుతుందని, అది కూడా వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుందని డయాలసిస్ ఒక్కసారి చేయాలంటే రెండు నుంచి మూడు వేల రూపాయలు అవసరం అవుతుందని చెప్పారు.

ఇలా ప్రతి 16 నుంచి 24 వేలు అవుతాయని ఈ లెక్కన ఏడాదికి ఎన్ని లక్షలు అవసరం అవుతాయో ఊహించుకోవచ్చని తెలిపారు. వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యం అందిందని చెప్పారు. ఏ రోగికైనా క్యాన్సర్ వస్తే రూ.8లక్షలు అవసరం అవుతాయని, అది ప్రభుత్వం చేయాలని, కానీ ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
చిన్నపిల్లలకు ఎలాంటి సమస్య వచ్చిన నాటి వైఎస్ సర్కార్ ఆదుకునేదని, కానీ ఈ ప్రభుత్వం వారికి రెండేళ్ల గడువు పెట్టి ఆరోగ్యాన్ని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 108కి ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వస్తుందో లేదో తెలియడం లేదని, గత ఐదు నెలల నుంచి ఆశా వర్కర్లకు జీతాలే రావడం లేదని వైఎస్ జగన్ చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు వస్తేనే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోతుందని స్పష్టం చేశారు.

ఇంకా ఏం చెప్పారంటే..
- ప్రస్తుతం ఆరోగ్యం శ్రీకి రూ.1460 కోట్లు ఇవ్వాలి
- అంబులెన్సుల్లో టెస్టు పరికరాలు లేవు
- ఆరోగ్యశ్రీని దారుణంగా నడిపిస్తున్నారు
- ప్రకాశం జిల్లాలో కిడ్నీ సమస్యతో రెండేళ్లలో 424మంది బలయ్యారు.
- ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ లేదు
- ఒక్క ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధితో చనిపోతే సర్కార్ పట్టించుకోవడం లేదు
- జిల్లాలోని 56 మండలాలకు 48 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్యతో తాగడానికి నీళ్లు లేకుండా పోయాయి
- వెలుగొండ పూర్తి చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది
- వెలుగొండకు వైఎస్ఆర్ రూ.4700 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసింది.
- ఒక డయాలసిస్ యూనిట్‌కు కేవలం రూ.పది లక్షలు మాత్రమే అవుతుంది
- నేను వచ్చే వరకు కూడా చంద్రబాబు జీవోలు ఇవ్వడం లేదు
- ఇలా చేస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి
- వైవీ సుబ్బారెడ్డి కనిగిరి నియోజకవర్గం కోసం 2016లో ఎంపీ గ్రాంటు నుంచి రూ.12 లక్షలు ఇచ్చారు
- ఎంపీ గ్రాంటు ఉన్నా ఇప్పటి వరకు డయాలసిస్ యూనిట్ రాలేదు
- కానీ, కిడ్నీ బాధితులకోసం వస్తున్నానని తెలిసి చంద్రబాబు రెండు రోజుల కిందట మూడు డయాలసిస్ సెంటర్ల కోసం జీవోలు జారీ చేశాడు
- కిడ్నీ సమస్యతో చనిపోయినవారికి రూ.10లక్షలు ఇవ్వాలి
- నెలకు మందుల కోసం రూ.10 వేలు ఇవ్వాలి
- గత రెండేళ్లుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పది లేఖలు రాసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు
- ఇప్పటికైనా చంద్రబాబునాయుడికి బుద్ధి జ్ఞానం దేవుడు ప్రసాధించాలి
- కిడ్నీ సమస్యపై చంద్రబాబు ఇప్పటికైనా స్పందించకుంటే చాలా ఉధృతంగా పోరాటం చేసి తీరుతాం.
0 comments:
Post a Comment