హోదా కోసం ఏ పోరాటమైనా స్వాగతిస్తాం: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదా కోసం ఏ పోరాటమైనా స్వాగతిస్తాం: వైఎస్‌ జగన్‌

హోదా కోసం ఏ పోరాటమైనా స్వాగతిస్తాం: వైఎస్‌ జగన్‌

Written By news on Monday, January 23, 2017 | 1/23/2017

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఏ కార్యక్రమాన్ని, సభను నిర్వహించినా తాము స్వాగతిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ ముఖ్యంగా యువత ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు అనుకూలంగా చేపట్టే కార్యక్రమాలకు మద్దతు తెలపాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం  చేయాలని ఆయన ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.

తమిళుల జల్లికట్టు ఉద్యమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నజననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజా ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు.
Any program or event demanding  is welcome.Request all supporters esp youth to come forward, support & make these events a big success

Share this article :

0 comments: