ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు

ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు

Written By news on Wednesday, January 25, 2017 | 1/25/2017


హోదా ప్రస్తావన రాకుండా తొక్కేస్తున్నారు?: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతుండగా.. వారి ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రస్తావనకు రాకుండా సీఎం చంద్రబాబు తొక్కేస్తున్నారని, హోదా ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం బాధాకరమని అన్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు.

గతంలో చాలాసార్లు ప్రత్యేక హోదా అంశంపై తాము పోరాడామని, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామని, ఢిల్లీలోనూ ఆందోళనలు నిర్వహించామని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ప్రత్యేక హోదా సాధనకు మద్దతు నిలువాల్సింది పోయి సీఎం అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ విజభన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నిలుపుకోలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. హోదాలోని అన్ని అంశాలు కూడా ప్యాకేజీతోపాటు వచ్చాయని, అందుకే హోదా అడుగటం లేదని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. నిజంగా హోదాలో ఉన్న అన్ని అంశాలు మనకు అందాయా? అని వైస్‌ జగన్‌ ప్రశ్నించారు. హోదాలోని అంశాలు, రాయితీలు ఏవీ ఏపీకి రాలేదని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే 100 శాతం ఆదాయపన్ను మినహాయింపుతోపాటు, ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు, జీఎస్టీ నుంచి మినహాయింపు తదితర పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఈ రాయితీలు ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ విషయం సీఎం చంద్రబాబు తెలుసునని, అందుకే ఆనాడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారని, వెంకయ్యనాయుడు కూడా ఇదే డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు.



జగన్ ఇంకా ఏమన్నారంటే...
  • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, ఎన్నికల సమయంలో చెప్పిన ఒక్క హామీని అమలు చేయలేదు
  • ఆయన పోరాటం చేయాల్సిన అంశం మీద పోరాటం చేయడు, ఆంధ్రప్రదేశ్‌ ను తాకట్టు పెట్టారు.
  • పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకునేందుకు ఏమీ చేయడం లేదు
  • వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
  • కృష్ణా, గోదావరి జలాల విషయాల్లోనూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
  • ఏ దేశానికి పోయినా సీఎం సుందర ముఖారవిందాన్ని చూసి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు
  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు మాదిరిగా వంద శాతం పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే పెట్టుబడులు పెడతారు
  • ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తూ అబద్దాలతో మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు
  • ఏదైనా టెంపరరీ అంటారు, ఎక్కడి వెళ్లినా ప్రైవేటు విమానాల్లోనే వెళతారు
  • నామినేషన్ల పద్ధతిలో పనులు ఇవ్వడం, నచ్చినవారికి టెండర్లు కట్టబెట్టడం చేస్తున్నారు
  • అన్నింట్లోనూ కుంభకోణాలే, వీటి నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు
  • మూడేళ్లలో తాను చేసిన స్కాములపై విచారణ జరగకుండా జాగ్రత్త పడ్డారు
  • నల్లధనాన్ని సూట్ కేసుల్లో పెట్టి ఇస్తూ అడ్డుగోలుగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి జైలుకు వెళ్లని సీఎం చంద్రబాబు ఒక్కరే
  • ఓట్లు కోట్లు కేసులో అడ్డంగా దొరికినా పదవికి రాజీనామా చేయని పరిస్థితి ఏపీలోనే ఉంది
  • తన సొంత ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో రాజీ పడ్డారో అర్థమవుతుంది
  • పెట్టుబడులు విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే
  • సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2014-15, 2015-16లో ఏటా రూ. 4 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు
  • చంద్రబాబు మాత్రం రూ. 4 లక్షల 68 వేల కోట్ల ఎంవోయులు చేసుకున్నట్టు గొప్పగా చెబుతున్నారు
  • ఎలాంటి ఆహ్వానం లేకపోయినా దావోస్‌ వెళ్లి రూ. 7 కోట్లు ఖర్చు చేశారు
  • పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశీ యాత్రలు చేయక్కర్లేదు. ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరితే చాలు
  • ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సిన పోరాటమైనా  నిజాయితీగా చేయాలి
Share this article :

0 comments: