అలా మాట్లాడితే నాలుక కోస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అలా మాట్లాడితే నాలుక కోస్తాం

అలా మాట్లాడితే నాలుక కోస్తాం

Written By news on Tuesday, January 3, 2017 | 1/03/2017


అలా మాట్లాడితే నాలుక కోస్తాం
ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి  ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్‌: తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు పెగ్గులేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారని.. జేసీ దివాకర్‌ రెడ్డి కాదు జానీవాకర్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. కులం గురించి ఆయన నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జేసీ చరిత్ర అంతా దోచేకోవడమేనని ఆరోపించారు. చంద్రబాబు బూట్లునాకే జేసీకి కులాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రాజెక్టులకు వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకమని మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.

రాయలసీమ గురించి జేసీకి ఏం తెలుసని ప్రశ్నించారు. తక్షణమే జేసీ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కులమతాలకు అతీతంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు తన చెంబు గ్యాంగుతో తిట్టించడం మానుకోవాలని హితవు పలికారు. కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో జేసీ దివాకర్‌ రెడ్డి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
 
Share this article :

0 comments: