విశాఖలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి హాజరు అవుతాను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశాఖలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి హాజరు అవుతాను

విశాఖలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి హాజరు అవుతాను

Written By news on Wednesday, January 25, 2017 | 1/25/2017

ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీ కి తాను స్వయంగా హాజరు అవుతానని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఇందులో పాల్గొనాలని ఆయన అన్నారు.ఒకవేళ అరెస్టు చేయదలిస్తే దానికి కూడా సిద్దమని ఆయన స్పష్టం చేశారు. జూన్ వరకు చూస్తామని, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్.పిలు రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు.తమిళనాడులో జల్లికట్టు కోసం ముఖ్యమంత్రి స్వయంగా అన్ని పార్టీలను కలుపుకుని డిల్లీ వెళ్లి సుప్రింకోర్టు వద్దన్నదానినే సాదించుకున్నారని ఆయన అన్నారు. ఒక ఆట కోసమే తమిళనాడు అంతా ఒకటైతే , మనకు జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. డిల్లీకి చంద్రబాబు అఖిలపక్షాన్ని తీసుకు వెళితే తాము కూడా ఆ బృందంలో ఉంటామని జగన్ తెలిపారు.ఎన్నికల సమయంలో పదిహేను ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: