రేపటి నుంచి రైతు భరోసా యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి నుంచి రైతు భరోసా యాత్ర

రేపటి నుంచి రైతు భరోసా యాత్ర

Written By news on Wednesday, January 4, 2017 | 1/04/2017


రేపటి నుంచి రైతు భరోసా యాత్ర
కర్నూలు జిల్లాలో వారం రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 5(గురువారం) నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ వారం పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 5న హైదరాబాద్‌ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత 6వ తేదీన శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: