హైదరాబాద్: పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అంకెలతో గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి రికార్డును చంద్రబాబు బ్రేక్ చేశారని ఎద్దేవా చేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజులో రూ. 6.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేస్తే, చంద్రబాబు ఒక్కరోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేశారని తెలిపారు.
విద్యుత్ పై ఎంవోయూలు ఎందుకో అర్థం కాదని వాపోయారు. అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను అమ్మకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెప్పుకోవడాన్ని రాజేంద్రనాథ్ తప్పుబట్టారు.

0 comments:
Post a Comment