జగన్‌పై ఎదో కుట్ర జరుగుతున్నట్టు అర్థమవుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై ఎదో కుట్ర జరుగుతున్నట్టు అర్థమవుతోంది

జగన్‌పై ఎదో కుట్ర జరుగుతున్నట్టు అర్థమవుతోంది

Written By news on Tuesday, January 3, 2017 | 1/03/2017


‘రాష్ట్రంలో దళితులకు గౌరవం లేదు’
గుంటూరు: రాష్ట్రంలో దళితులకు గౌరవం లేదని వైఎస్‌ఆర్సీపీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మేరుగ నాగార్జున అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే దళిత ఎమ్మెల్యే ఐజయ్యను అవమానించారన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యే గొంతు నొక్కారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతను అంతం చేస్తానంటూ మంత్రి రావెల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. దీనిబట్టి వైఎస్‌ జగన్‌పై ఎదో కుట్ర జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు. చంద్రబాబు చెప్తేనే రావెల అలా వ్యాఖ్యలు చేసినట్లుందని.. వెంటనే రావెల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనను రాష్ట్రంలో ఎక్కడా తీరగనీయమని నాగార్జున హెచ్చరించారు
Share this article :

0 comments: