విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. గురువారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ ను విమానాశ్రయం రన్ వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఆయన రన్ వేపై బైఠాయించారు. విమానాశ్రయంలోనే పోలీసులు వైఎస్ జగన్ ను నిర్బంధించారు. ఆయన వెంట పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.

0 comments:
Post a Comment