అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు

అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు

Written By news on Thursday, January 26, 2017 | 1/26/2017


‘అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు’
హైదరాబాద్: ప్రత్యేక హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అందుకే తమ పార్టీ నేతలు, విద్యార్థులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎప్పుడూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఉద్యమాలను అణచివేస్తే బ్రిటీష్‌ వారికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు.

బీచ్ లో బికినీ ప్రదర్శనలకు అనుమతిస్తారు కానీ, హోదా కోసం పోరాడే వారిని రానివ్వరా అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామని అఫిడవిట్ కూడా ఇచ్చామని, అయినా చంద్రబాబు సర్కారు రాజ్యాంగబద్దమైన హక్కుని కాలరాస్తోందని మండిపడ్డారు. ఎంత అణచివేస్తే ప్రత్యేక హోదా ఉద్యమం అంత ఉధృతం అవుతుందని.. మోదీ, చంద్రబాబు మెడలు వంచుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం అణచివేతకు భయపడం, పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వైఎస్‌ జగన్ విశాఖ వెళ్లి తీరుతారని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: