వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు

వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు

Written By news on Thursday, January 19, 2017 | 1/19/2017


వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గ్రామాల్లో సాగుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడి మార్గంలో కురగల్లు వెళ్లేందుకు వైఎస్ జగన్ కాన్వాయ్‌ లో నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. జగన్ వెంట ఉన్న మిగతా వాహనాలను పెద్దపరిమి వైపు దారి మళ్లించారు.

టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తున్న బాధిత రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకునేందుకు జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. ప్రతిపక్ష పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Share this article :

0 comments: