భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు

భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు

Written By news on Sunday, January 29, 2017 | 1/29/2017


ద్వారకా తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతి, అసమర్థత, అసత్యం, అప్రజాస్వామికంతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ 1గా ఉందని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని,  అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
 
  • వైఎస్ఆర్ సీపీలోకి కోటగిరి శ్రీధర్ ను ఆహ్వానిస్తున్నాను
  • యువకుడు, ఉత్సాహవంతుడు అయిన శ్రీధర్ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు
  • మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది
  • రాష్ట్రం వైపు ఓ సారి తిరిగి చూస్తే చంద్రబాబు పరిపాలన కనిపిస్తుంది
  • మనం ఎవరికైనా ఎందుకు ఓటు వేస్తాం అభివృద్ధి కోసం. నిన్నటి కన్నా ఈ వాళ, ఈ రోజు కన్నా రేపు బాగుంటే అభివృద్ధి జరుగుతోందని చెబుతాం
  • చంద్రబాబు పాలనలో అవినీతి, అసమర్థ పాలన జరుగుతోంది
  • ఇవాళ అసత్యాల, అప్రజాస్వామిక పాలన జరుగుతోంది
  • దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1గా ఉంది.
  • చంద్రబాబు వ్యవస్థలను, మనుషుల్ని, మీడియాను మేనేజ్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు
  • దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నారు. రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా?
  • సూట్‌ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకువెళ్లి ఎమ్మెల్యేలను కొంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా సీఎం రాజీనామా చేయకపోవడం, జైలుకు వెళ్లకపోవడం ఎక్కడైనా చూశామా..? ఒక్క చంద్రబాబు విషయంలోనే జరుగుతోంది
  • రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసినా ఎక్కడో వస్తుందని చెప్పారు
  • రాజధాని ప్రాంతంలో మంత్రులు, చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేస్తారు
  • భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు
  • దీనివల్ల రైతులు నష్టపోతారు, చంద్రబాబు ఆయన బినామీలు లాభపడతారు
  • రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుని, తనకు ఇష్టమైన వారికి కమీషన్లు తీసుకుని ఇస్తున్నారు
  • ఇవాళ ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో నీళ్లు రావడం లేదు, చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది
  • కాంట్రాక్టర్లతో కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవారికి చెక్ లు ఇచ్చేస్తున్నారు
  • పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేశారు
  • అవినీతి జరిగిందని తెలిసినా కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారు
  • మద‍్యం షాపులు, బొగ్గు కొనుగోళ్లు అన్నింటా అవినీతి కనిపిస్తోంది
  • చివరకు దేవుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు
  • రెండున్నరేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతిమయం
  • రెండున్నరేళ్లు కావస్తున్నా చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయలేదు
  • ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కమిటీ వేస్తే  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉంటారని వేయలేదు. పేదలకు అన్యాయం చేస్తున్నాడు
  • చంద్రబాబు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నాడు, పంచాయతీ సర్పంచ్ లకు విలువ లేదు
  • పేద ప్రజల నుంచి భూములు ఎలా లాక్కోవాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు
  • చింతలపూడి ప్రాజెక్టును చూస్తే ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో గ్రామానికి ఒక్కో ధర ఇస్తున్నారు
  • గిరిజనులం కాబట్టి అడగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • చంద్రబాబు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చేర్చుకుంటున్నారు
  • వాళ్లతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు
  • గాంధేయ పద్ధతిలో రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన చేయకుండా అడ్డుకున్నాడు
  • చంద్రబాబు అప్రజాస్వామిక పాలన పోవాలి. మేధావులు, యువకులు కదలాలి. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రావాలి
Share this article :

0 comments: