► ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశం
► పలు పరామర్శలు.. వివాహాలకు హాజరు
► పైడిపాలెం ప్రాజెక్టు సందర్శన
పులివెందుల : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో రావాల్సి ఉండగా.. స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గాన నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు ఇడుపులపాయకు చేరుకుని అక్కడ పార్టీకి చెందిన నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం 8.30గంటలకు పాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు ఓబుళరెడ్డి కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం 8.45గంటలకు స్థానిక టీటీడీ కల్యాణ మండపానికి చేరుకొని వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొంటారు.
అక్కడ నుంచి ఉదయం 10.15గంటలకు దేవునికడపకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. 11.30గంటలకు కడపలోని జయరాజ్ ఫంక్షన్ హాల్‌లో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. 4వ తేదీ ఉదయం 9.00గంటలకు తొండూరు మండలం కోరవానిపల్లె గ్రామానికి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గొర్రెల కాపరులు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్, సుదర్శన్‌ల కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడ నుంచి పైడిపాలెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని గండికోట నుంచి వచ్చే కృష్ణజలాలను పరిశీలిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.

0 comments:
Post a Comment