విద్యార్థినికి సమాధానం చెప్పలేకపోయిన బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థినికి సమాధానం చెప్పలేకపోయిన బాబు

విద్యార్థినికి సమాధానం చెప్పలేకపోయిన బాబు

Written By news on Saturday, February 11, 2017 | 2/11/2017


మీ పథకాలేవీ అమలవట్లేదు
ప్రశ్నించిన ఓ విద్యార్థిని.. సమాధానం దాటేసిన చంద్రబాబు

సాక్షి, అమరావతి : ఎన్నికలప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీ ఇచ్చే నేతలు ఎన్నికలయ్యాక వాటి గురించి పట్టించుకోరంటూ ఒక విద్యార్థిని నేరుగా సీఎం చంద్రబాబును ప్రశ్నించడం జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో కలకలం రేపింది. ఇలాంటి విషయాలు చర్చించడానికి ఇది వేదిక కాదంటూ బాబు ఆ విద్యార్థిని  ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటవేశారు. జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో శుక్రవారం సాయంత్రం  9 రకాల అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ  సదస్సుకు హాజరైన విద్యార్థినులు, ప్రతినిధులు వంద మంది ఒక బృందంగా ఏర్పడి తమకు కేటాయించిన అంశంపై గంట పాటు చర్చించారు.

ఆ సమయంలో సీఎం ఒక బృందం వద్దకు వచ్చి చర్చ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తమ గ్రామ పాఠశాలలో, తమ ప్రాంతంలోని కాలేజీలో అనేక సమస్యలున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెబుతున్నా, అవేవీ అమలు కావడం లేదన్నారు.ఈ ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. మహిళల సాధికారతకు రాష్ట్రంలో ఒక పెద్ద సదస్సును ప్రభుత్వ పరంగా  ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినులు, మహిళలు తమ సమస్యలపై గట్టిగా ప్రశ్నించేందుకు ఉపయోగించుకునే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు అడిగిన ప్రశ్నలను ఇంకొక వేదికపై చర్చిద్దామని  జవాబు దాటవేశారు.
Share this article :

0 comments: