చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు

చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు

Written By news on Friday, February 3, 2017 | 2/03/2017


చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు
కడప: టీడీపీ అధికారమదంతో అనైతిక రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లో పలుచనైపోతున్నాడనని తెలిసి, ఆయన అనైతికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అసమర్థ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరల్లోనే ఉందని అన్నారు.

కడపలో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 14 రీళ్ల సినిమాలో 13 రీళ్లలో అన్యాయానిదే పైచేయిగా కనిపిస్తుందని, 14వ రీలు క్లైమాక్స్ లో న్యాయం గెలిచి కథ అడ్డం తిరుగుతుందని వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు.వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. తన వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వర్గీయులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో అక్కడి భక్తులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు.
 
అనంతరం బాలిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్‌ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరించారు. అదే విధంగా స్ధానిక టీటీడీ కల్యాణమండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి కూడా వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు.
Share this article :

0 comments: