బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?

బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?

Written By news on Saturday, February 11, 2017 | 2/11/2017


బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?
గుంటూరు: జాతీయ మహిళా సదస్సుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి.. మరీ నిర్బంధించిన ఏపీ ప్రభుత్వం తీరును ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర తప్పబట్టారు. రోజాను ఆహ్వానించి మరీ అవమానించారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో మహిళా సదస్సులో మాట్లాడించి.. ఎమ్మెల్యే అయిన రోజాను ఎందుకు నిర్బంధించారని ఆయన ప్రశ్నించారు.

ఈ సదస్సు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడేది కాదని ఈ చర్యతో తేలిపోయిందన్నారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. వెంకయ్యనాయుడు డోలు నాయుడుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, మోదీ గురించి డోలు కొట్టడమే వెంకయ్య పని అని పేర్కొన్నారు.
Share this article :

0 comments: