పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా?

పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా?

Written By news on Monday, February 6, 2017 | 2/06/2017


పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా?: వైఎస్‌ జగన్‌
అనంతపురం: ప్రైవేటు ఫ్యాకర్టీకి భూములు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రైతులను బలి చేస్తున్నదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అమ్మవారిపల్లెలో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. నిన్నమొన్నటివరకు ఈ ప్రాంతంలో నీళ్లులేక రైతులు నానా అవస్థలు పడేవారని, ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్‌ రావడంతో వ్యవసాయం చేసుకొని బాగుపడుదామనుకుంటున్న రైతుల కుటుంబాలకు చంద్రబాబు సర్కారు తీవ్ర అన్యాయం చేస్తున్నదని అన్నారు. రిజర్వాయర్‌ కింద ఉన్న పచ్చని పంటపొలాలను ప్రైవేటు ఫ్యాక్టరీలకు ఇవ్వడం ధర్మమా? అని ఆయన ప్రశ్నించారు.

సస్యశామలంగా ఉన్న పొలలాను స్మశానంగా
రైతుల నుంచి ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటున్నదని, 70, 80 సంవత్సరాల కిందట డీకేటి పట్టాగా ఈ భూములను ఇచ్చారని, ఇప్పుడు ఈ భూములు మీవి కావు.. ప్రభుత్వానివని బెదిరించి బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు చెప్పారు. ఈ భూములు లాక్కుంటే తాము ఇక్కడినుంచి వలసపోవాల్సి ఉంటుందని, తమ జీవితం అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ కింద ఉన్న సస్యశామలంగా ఉన్న భూములను లాక్కొని స్మశానంగా మారుస్తున్నారని మహిళా రైతు ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో చేసిందే ఇక్కడా చేస్తాం!
తాతల కాలం నుంచి రైతులు సాగుచేసుకుంటున్న పొలాలను ప్రైవేటు ఫ్యాక్టరీకి ధారాదత్తం చేయడం న్యాయం కాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతుల నుంచి రాష్ట్ర సర్కారు బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భూముల విషయంలో బాధిత రైతులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ధర్నాలు చేస్తుందని, కోర్టులకు కూడా వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. రెండేళ్లు ఓపిక పడితే ఎన్నికలు వస్తాయని, ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు. అప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసినవిధంగానే బలవంతంగా రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి వారికి ఇచ్చేస్తామని చెప్పారు. భూముల విషయంలో ఎవరూ అధైర్య పడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

బాలునాయక్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
ఇటీవల పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో గుండెపోటుతో మరణించిన రైతు బాలు నాయక్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. భూములు కోల్పోతున్నామన్న బాధతో భూసేకరణ సమావేశంలోనే బాలు నాయక్‌ కుప్పకూలారు. మాక్కాజీపల్లిలోని ఆయన కుటుంబసభ్యులను కలిసి.. వైఎస్‌ జగన్‌ వారికి ధైర్యం ఇచ్చారు.
 
Share this article :

0 comments: