హైదరాబాద్: అమెరికాలోని ఎన్నారైల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ లేదా సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం అమెరికా వెళ్లాలని, ప్రవాస భారతీయుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నారైల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్నిరకాలు మద్దతు ఇస్తామని లేఖలో జగన్ పేర్కొన్నారు.
గత బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్ లో జరిగిన జాత్యంహకార కాల్పులు తెలుగు ఇంజనీర్లు కూచిభొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా, అలోక్ రెడ్డి గాయడపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎన్నారైల భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

0 comments:
Post a Comment