అధికారం అండగా పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు
బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని వ్యూహం
సాక్షి ప్రతినిధి, కడప/ తిరుపతి రూరల్ : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలు పొందడానికి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఇందుకు పోలీసులు సైతం బరితెగించి సహకరిస్తుండటం నివ్వెర పరు స్తోంది. వైఎస్‌ఆర్ జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బీఫాంపై గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 521 మంది, టీడీపీ బీఫాంపై గెలుపొందిన వారు 300 మంది, కాంగ్రెస్ బీఫాంపై గెలుపొందిన వారు 10 మంది ఉన్నారు. ఈ లెక్కన ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ పోటీ చేయడం కూడా దండగ. అలాంటిది ఇక్కడ ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాపుల పర్వానికి తెరలేపింది.
ఇందులో భాగంగా రామాపురం మండలం చిట్లూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవిని రెండు వారాల క్రితం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమెను ఫలానా వాళ్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, వారి చెర నుంచి విడిపించాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తన తల్లికి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేశారని, తను వెళ్లి చూడాల్సిందేనని పట్టు పట్టడంతో కిడ్నాపర్లు.. పోలీసు బందోబస్తు నడుమ ఆమెను తీసుకెళ్లారు. పోలీసు ఎస్కార్టు వాహనం ముందుండి కిడ్నాపర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సహకరించడం వింతల్లోకెల్లా వింత.
విషయం తెలియడంతో ఎంపీటీసీ సభ్యురాలిని విడిపించుకెళ్దామని ఆసుపత్రి వద్దకు వచ్చిన చంద్రగిరి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చి పక్కకు పడేశారు. అయినా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు వెనక్కు తగ్గక పోవడంతో ఎంపీటీసీ సభ్యురాలిని వైఎస్‌ఆర్ జిల్లా పోలీసులకు అప్పగిస్తామని తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మిదేవిని రాత్రి పొద్దుపోయాక సంబేపల్లి పోలీసుస్టేషన్‌లో బంధువులకు అప్పగించారు.

0 comments:
Post a Comment