లోకేశ్‌ సత్తా నిరూపించుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోకేశ్‌ సత్తా నిరూపించుకోవాలి

లోకేశ్‌ సత్తా నిరూపించుకోవాలి

Written By news on Monday, February 27, 2017 | 2/27/2017


'లోకేశ్‌ సత్తా నిరూపించుకోవాలి'
గుంటూరు: ఏపీ అసెంబ్లీ నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నిర్మాణం వ్యయం రూ. 200 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు ఎలా చేరిందో చెప్పాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అందుకే అసెంబ్లీ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ప్రధాని రావడం లేదని ఆరోపించారు.

సన్ రైజ్ స్టేట్ అని చెబుతూ.. రాష్ట్రాన్ని సన్(కొడుకు) రైజ్ అయ్యేలా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం చంద్రబాబు, లోకేశ్ లకు పట్టుకుందన్నారు. లోకేశ్‌ కు దమ్ముధైర్యం ఉంటే దొడ్డిదారిన శాసనమండలికి వెళ్లొద్దని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
 
Share this article :

0 comments: