ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్

ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్

Written By news on Friday, February 10, 2017 | 2/10/2017


మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!
తిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీని కోరారు.

టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. 'ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు' అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/complaint-against-minister-bojjala-gopalakrishna-son-sudhir-reddy-448768?pfrom=home-top-story
Share this article :

0 comments: