ఐదు నెలల్లో ఏకంగా 23 రెట్లకు పెరిగిన లోకేష్ ఆస్తులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు నెలల్లో ఏకంగా 23 రెట్లకు పెరిగిన లోకేష్ ఆస్తులు

ఐదు నెలల్లో ఏకంగా 23 రెట్లకు పెరిగిన లోకేష్ ఆస్తులు

Written By news on Wednesday, March 8, 2017 | 3/08/2017

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆస్తులు కళ్లు చెదిరే రేంజ్‌లో పెరిగిపోయాయి. అది కూడా ఒకటి రెండింతలు అనుకుంటే పొరపాటే. గతంలో ప్రకటించిన ఆస్తుల కంటే ఏకంగా 23 రెట్లకు ఎగబాకాయి. అది కూడా కేవలం ఐదు నెలల్లోనే.

ఈ విషయాన్ని లోకేష్‌ స్వయంగా తాను ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో. తాజాగా ఆయన పేర్కొన్న తన మొత్తం ఆస్తుల విలువ రూ.330కోట్లు. ఐదు నెలల కింద ఆయన అక్టోబర్‌ 19, 2016న ఆయనే ప్రకటించిన ఆస్తుల మొత్తం విలువ రూ.14.56కోట్లు మాత్రమే.

ఐదు నెలల్లోనే ఆస్తులు ఇంత భారీ స్థాయిలో పెరగడంపై ఇప్పుడు సామాన్య జనం విస్తుపోతున్నారు. ఇది ఎలా సాధ్యం అయిందని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏ కష్టం చేసి ఇంత భారీ మొత్తం కూడా బెట్టారని, ఏ వ్యాపారంలో ఆయనకు ఇంతపెద్ద మొత్తం కలిసి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.

ఆస్తుల విషయంలో బహిరంగంగా వివరాలు చెబుతూ పారదర్శకంగా ఉంటామని చెప్పే చంద్రబాబు కుటుంబం ఐదు నెలల్లో ఇంత పెద్ద ఆదాయం ఎలా పెరిగిందో చెబితే బాగుంటుందని అనుకుంటున్నారు. అక్టోబర్‌ 19, 2016, మార్చి 7, 2017 ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా ప్రకటించిన ఆస్తుల వివరాలు ఒకసారి పోల్చి చూస్తే..

అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

మొత్తం రూ.14.56కోట్లు                             మొత్తం ఆస్తి రూ.330కోట్లు
హెరిటేజ్‌ వాటా రూ.2.52 కోట్లు                      హెరిటేజ్‌ వాటా రూ.273.84కోట్లు
ఆయా కంపెనీల్లో షేర్‌ రూ.1.65 కోట్లు              స్థిరాస్తులు రూ.18 కోట్లు
కారు రూ.93లక్షలు                                    పూర్వీకుల ద్వారా వచ్చినవి రూ.38.52కోట్లు
బ్యాంకు లోన్లు రూ.6.35 కోట్లు                       బ్యాంకు లోన్లు రూ.6.27 కోట్లు

లోకేష్‌ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్‌ పేరిట ప్రకటించిన ఆస్తులు అప్పుడు ఇప్పుడు

అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

బ్రాహ్మణి మొత్తం ఆస్తులు రూ.5.38కోట్లు       బ్రాహ్మణి ఆస్తులు దాదాపు రూ.28 కోట్లు
దేవాంష్‌ మొత్తం ఆస్తులు రూ.11.70కోట్లు       దేవాంష్‌ ఆస్తులు దాదాపు గతంలో చెప్పినన్ని..

ఇవే కాదు.. లోకేష్‌ తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తల్లి భువనేశ్వరి ఆస్తుల మొత్తాన్ని కూడా ప్రకటించారు. చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.64లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పిన లోకేష్‌ తల్లి భువనేశ్వరీ పేరిట రూ.33.66కోట్లు ఉన్నట్లుగా ప్రకటించారు. అయితే, వాస్తవానికి హెరిటేజ్‌లోని దాదాపు మెజార్టీ వాటాను తన భాగస్వామి ఫ్యూచర్‌ రిటెయిల్‌ లిమిటెడ్‌కు గత ఏడాది నవంబర్‌ 8నే రూ.295కోట్లకే అమ్మేశారు. హెరిటేజ్‌ అమ్మకం జరపనప్పుడు లోకేష్‌ అందులో తన వాటాగా రూ.2.52కోట్లుగా పేర్కొని తీరా విక్రయించిన తర్వాత అందులో వాటా రూ.273.84కోట్ల ఉన్నట్లు ప్రకటించడం ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
Share this article :

0 comments: