6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల

6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల

Written By news on Monday, March 27, 2017 | 3/27/2017


6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల
గుంటూరు: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన్ను విడుదల చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డిని దాదాపు 6 గంటల పాటు పోలీసులు నిర్బంధించారు.

విడుదలైన తర్వాత చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలన కంటే దారుణంగా ఉందని విమర్శించారు. తనను అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమాలను అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు కూడా వేసేసి కనీసం ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు.

చెవిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని, దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో మైక్ ఇవ్వలేదని చెప్పారు. రవాణా శాఖ కమీషనర్‌పై దాడికి సంబంధించి అడిగితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? చట్టం తన పని తాను చేయకుండా సీఎం అడ్డుతగలడం భావ్యమేనా అని వైఎస్ జగన్ నిలదీశారు.
Share this article :

0 comments: