
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్ సీపీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ మోహన్ రాజుతో పాటు ముఖ్య నాయకులు, అనుచరులు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. కాగా జగన్ మోహన్ రాజు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలే తనకు స్ఫూర్తి అన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని జగన్ మోహన్ రాజు తెలిపారు.
0 comments:
Post a Comment