భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి-జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి-జగన్

భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి-జగన్

Written By news on Tuesday, March 28, 2017 | 3/28/2017


ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనల్లో తాము అధికారిపై దౌర్జన్యం చేసినట్లు ఎలాంటి దృశ్యపరమైన ఆధారాలు లేక పోయినా తననూ, ఎంపీని ఎందుకు అరెస్టు చేశారు? ఇపుడు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేసినట్లు, అధికారులను దుర్భాషలాడినట్లు టీవీల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎందుకు వారిని అరెస్టు చేయరు? వారికో న్యాయం? మాకో న్యాయమా? అని ప్రశ్నించినందుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు.

నందిగామ వద్ద బస్సు ప్రమాదం జరిగిన ఘటనలో పరామర్శ కోసం నేను వెళ్లింది ప్రజలకు సంబంధించిన సమస్యమీద. నేనక్కడకు వెళ్లి పోస్టుమార్టం చేశారా అని ప్రశ్నించినందుకు వైద్యాధికారి తడబడుతూ  చేయలేదన్నారు. అలాంటపుడు తరలించేయడానికి కొన్ని మృతదేహాలను ఎలా ప్యాక్‌ చేసి పెట్టారని గట్టిగా అడిగాను. అక్కడ ఆయన చూపించిన కాగితాన్ని నేను తీసుకున్నాను. నేనే మాత్రం లాక్కోలేదు.

ఈ విషయం టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ నా మీద రివర్స్‌ కేసు పెట్టారు. నేను ఆసుపత్రిలోకి ఆరోజు వెళ్లినపుడు ఏం జరిగిందీ మీడియా మొత్తం కవర్‌ చేసింది. నేనెక్కడా ఎవరినీ టచ్‌ చేయలేదనేది టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ రవాణా శాఖ కమిషనర్‌ విషయంలో జరిగిన సంఘటనకు, ఆసుపత్రి సంఘటనకూ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.

మనస్సాక్షిని అమ్ముకుంటే ఎలా...
ప్రతిపక్షం గాని, మీడియా గాని అధికారపక్షానికి తమ మనస్సాక్షికి అమ్ముకుంటే ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. ఈ అన్యాయాలను మీడియా కూడా ప్రశ్నించాలి. ఇలాంటి అన్యాయాలను కనుక మనం ప్రశ్నించక పోతే ఇక ప్రజల తరపున మాట్లాడ్డానికి ఎవరూ ముందుకు రారు. రేపు జర్నలిస్టులకు అన్యాయం జరిగినా ఎవరూ అడగడానికి ముందుకు రాలేరు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
Share this article :

0 comments: