ఆలయ భూములకు రక్షణ ఏదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆలయ భూములకు రక్షణ ఏదీ?

ఆలయ భూములకు రక్షణ ఏదీ?

Written By news on Wednesday, March 15, 2017 | 3/15/2017


ఆలయ భూములకు రక్షణ ఏదీ?
అమరావతి: రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బుధవారం ఉదయం ప్రశ్నోత‍్తరాల సమయంలో దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఆయన మాట్లాడారు. 
 
రాజకీయ నేతలు, ప్రైవేటు వ్యక్తులు దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటి పరిరక్షణకు బడ్జెట్‌లో నిధులు సరిగా కేటాయించడం లేదని, ఇలా అయితే వాటి పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గారికి దేవాదాయ ఆస్తులను కాపాడలనే చిత్తశుద్ధి ఉంటే వాటి పరిరక్షణకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
 
Share this article :

0 comments: